25, జనవరి 2022, మంగళవారం

సమస్య - 3973

26-1-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వలదనుచు కోరుదురు ప్రాజాస్వామ్యము నిట”
(లేదా...)
“వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్”

42 కామెంట్‌లు:

 1. బ్యాలెటును వాడుచుండగన్ ప్రస్తుతంబు

  నిచట లేదుపయోగము, నేరములను

  మాన్ప బులెటును‌‌ వాడిన‌ మంచి కలుగ

  వలదనుచు కోరెదరు ప్రజా స్వామ్యమిచట

  రిప్లయితొలగించండి
 2. పాత రోతని తాతల పద్ధతులను
  దినదినముపటాటోపమె దీనులందు
  చూపరేమాత్రము మదిదయ చోద్యముగను
  "వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యునిట" తే. గీ.

  రిప్లయితొలగించండి
 3. అందరికి గణతంత్రదినోత్సవశుభాకాంక్షలు
  మేడిపండుగకనిపించుమేలుఁజూచి
  కలలసౌధంబుగూలంగకనులనీరు
  పెట్టుచుండినపనివారుబిట్టునలిగి
  వలదనుచుకోరుదురుప్రాజాస్వామ్యమునిట

  రిప్లయితొలగించండి
 4. నీతి నియమాలు లేనట్టి నేత లగుచు
  చేత గానట్టి వారలై చెలగు చుండ
  వలదనుచు గోరుదురు ప్రజా స్వామ్య మునిట
  భార తమ్మున విసిగిన పౌరులెల్ల

  రిప్లయితొలగించండి
 5. నిలువన్ నీడను లేని పేదలు ,కడున్
  నేరంబులున్ హింసలున్
  కలలో గాంచని తీరు బాలికలపై గంభీర
  దుశ్చర్యలున్
  విలవల్ లేని ప్రభుత్వ చర్యలు వెసన్
  బెంపెక్కుచున్నన్ సదా
  వలదంచున్ జనులెల్ల గోరిరి ప్రజా
  స్వామ్యంబు దేశంబున్

  రిప్లయితొలగించండి
 6. రాష్ట్రమందు నియంతృత్వ రాగమింక
  వలదనుచు కోరుదురు :
  ప్రజాస్వామ్యము నిట
  నెలకొలుప సంతసింతురు నిశ్చయముగ
  నిదియె యీనాటి ప్రజ యొక్క యిచ్ఛ నరయ

  రిప్లయితొలగించండి
 7. కుట్రలు కుతంత్రములజేయు కుజనులైన
  వారె కదర నేడిల మనపాలకులయి
  ప్రజల సంతము దోచు వ్యవస్థ యంచు
  వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట.

  రిప్లయితొలగించండి

 8. ఛలకుండ్రే పరిపాలకుండ్రుగ ప్రజాస్వామ్యమ్ములో గెల్వగన్

  కలుషమ్మయ్యెను రాజకీయమని వక్కాణించుచున్ లోకులే

  హలకున్ డబ్బుకు లొంగఁగాంచి పరదాహమ్మందొకండిట్లనెన్

  వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్.

  రిప్లయితొలగించండి
 9. గురుదేవులకు కవిమిత్రులందరకూ రేపటిసగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో...

  కందం
  వెలసిన స్వాతంత్ర్యమ్మున
  బలమున పదవులు గడించి పడయఁగఁ గలిమిన్
  సులువన మార్పెప్పటికిన్
  వలదు ప్రజాస్వామ్యమునుచు వాంఛించుదురే!

  (కందంలో సమస్య నూహించి మొదటి మూడుపాదాలను వ్రాసుకుని, సమస్యాపాదం తేటగీతిగా గుర్తించి సమస్యను సవరించికుని చేసిన పూరణము. మన్నించి పరిశీలింప ప్రార్థన)

  తేటగీతి
  భరతదేశాన స్వాతంత్య్ర వారసత్వ
  విలువలకు చాటు దోపిడీ సులువటంచు
  గద్దెనెక్కెడి నేర్పులు గలుఁగ, మార్చ
  వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట!


  మత్తేభవిక్రీడితము
  వెలయన్ స్వేచ్ఛ మహామహుల్ రుధిరమర్పింపంగ దేశాన పె
  న్విలువల్ నిల్పెడు నేలికల్ బెనుపు సంప్రీతిన్ ప్రసాదింపఁగన్
  దెలివిన్ జూపుచు నెన్నగన్ బ్రజలు వర్ధిల్లంగ నన్యమ్ములున్
  వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్

  ✍ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

  రిప్లయితొలగించండి
 10. మత్తేభము:
  ఇలపాలించెడు వాడు విష్ణువనుచున్ ఇన్నాళ్ళు రాజ్యాధికా
  రులు రాజుల్, ప్రజ కన్నబిడ్డ లన కారుణ్యాన పాలించిరే
  కలకాలంబొకరీతినుండదుకదా గర్వాంధులౌ రాజులే
  “వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
  --కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనుచున్+ఇన్నాళ్ళు' అని విసంధిగా వ్రాయరాదు కదా? "విష్ణువని తా మిన్నాళ్ళు..." అనవచ్చు.

   తొలగించండి
 11. మత్తేభము:
  ఇలపాలించెడు వాడు విష్ణు వనుచున్నిన్నాళ్ళు రాజ్యాధికా
  రులు రాజుల్, ప్రజ కన్నబిడ్డ లన కారుణ్యాన పాలించిరే
  కలకాలంబొకరీతినుండదుకదా గర్వాంధులౌ రాజులే
  “వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
  --కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి
 12. తేటగీతి:
  భానుడు నడచు మార్గంపు భాగమంత
  పాలనను జేసిన బ్రిటిషు పాలకులను
  తరిమి కొట్టి, స్వతంత్రులై, దాస్యమింక
  వలదనుచు కోరుదురు ప్రజా స్వామ్యము నిట”
  --కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. నోరూరునట్లుగ నూతన పథకాలు చతురతతో వెదజల్ల వచ్చు
  ఓట్లు కొనదలంచి నోట్లనే వెచ్చించి సులభతరమ్ముగ గెలువ వచ్చు
  తానున్న పక్షపు తంత్రమే ఫలియింప నధికార పీఠమ్ము నందవచ్చు
  మంత్రి పదవితోడ మర్యాద పెంపొంద చురుకుగ నార్జించి మురియ వచ్చు

  కోరు కొన్నట్టి పక్షాన జేర వచ్చు
  క్రొత్త వయిన కేతనముల నెత్త వచ్చు
  ప్రియము గద యీవ్యవస్థ మరియొక విధము
  వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యము నిట

  రిప్లయితొలగించండి
 15. పలురీతుల్ పడినాము కష్టముల నబ్బా!పారతంత్య్రంబులో
  ఫలియించెంగద!మా తపస్సు ఘనమౌ స్వాతంత్య్రముంబొంద,చం
  చల చిత్తంబులవారి పాలనము మాసామ్రాజ్యమందెన్నడున్
  వలదంచున్, జనులెల్లఁగోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్.

  రాచరికపు వ్యవస్థలరాచకములు
  బానిసత్వపు బ్రతుకులు ,వర్ణ వర్గ
  భేదములు,భాగ్యవంతుల పెత్తనాలు
  వలదనుచు,కోరుదురు ప్రజాస్వామ్యమునిట.

  రిప్లయితొలగించండి
 16. విలువౌయాస్తుల నార్జనమ్మువిడుచున్ విజ్ఞానులౌయుత్తముల్
  కలనున్ నిల్చిరి గుండెనొడ్డి గతమున్ కాంక్షించి స్వాతంత్ర్యమున్
  విలువల్ వీడిన నాయకుల్ గెలుచుచున్ పీడింప దుర్నేతలే
  వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్

  రిప్లయితొలగించండి
 17. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పింది. "...యిడుము లెన్నేన్ భారతమ్మందునన్" అనవచ్చు.

  రిప్లయితొలగించండి
 18. విలువల్వీడి చరించు దుష్టజనులే పీడించు దుష్టాత్ములే
  కలికాలంబున ధర్మచింత విడుచున్ క్షాపాలులై ధూర్తులై
  ఖలులై సంస్కృతికెల్ల కీడు సలుపన్ కర్తవ్యతా దీక్షతో
  వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్

  రిప్లయితొలగించండి
 19. నీతి నియమాలు లేనట్టి నేతలుండు
  తావులందున నెవరైన దప్పకుండ
  వలదనుచు కోరుదురు ప్రాజాస్వామ్యమునిట
  సహజ మయ్యది పరికించ సబబె కూడ

  రిప్లయితొలగించండి
 20. అలకా నేతలె యుండుచున్మిగుల గయ్యాలన్బ్రవర్తించుచో
  వలదంచున్ జనులెల్ల గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్
  గలకాలంబును మంచి గోరుచును జక్కౌరీతి సాయంబునున్
  నలరంజేసెడు వానినే జనులు నాహ్వానింతురే యెయ్యెడన్

  రిప్లయితొలగించండి
 21. అరసినఁ గపటం బెన్నిక లందుఁ గరము
  పెరిగిన విభుల స్వార్థమ్ము ధరణి యందుఁ
  దఱిఁగిన నవకాశమ్ములు దద్ద యింక
  వలదనుచుఁ గోరుదురు ప్రజాస్వామ్యము నిట


  ఇలలో రాచరికమ్ము మున్వెలిఁగె దేవేంద్రాభ రాజన్యులే
  విలసిల్లంగను ధర్మ రక్షకులునై వీక్షింపఁగా నేఁడు రా
  వలె నంచున్ జను లెల్లఁ గోరిరి ప్రజా స్వామ్యమ్ము దేశమ్మునన్
  వలదంచున్ జను లెల్లఁ గోరిరి ప్ర జాస్వామ్యమ్ము దేశమ్మునన్

  రిప్లయితొలగించండి
 22. ఇలలోస్వేచ్ఛకుస్వర్గధామమనిసాహిత్యాదిస్వాతంత్ర్యమై
  కలిమిన్లేమినివర్గజాతిమతముల్కళ్యాణవృద్ధ్యర్థమై
  పలుసౌభాగ్యములిచ్చునించనగనెబ్భంగిన్నిరాశార్తినిన్
  *“వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్”*?

  రిప్లయితొలగించండి
 23. విలయంబీతని పాలనంబకట విద్వేషంబులేపారగా
  కలతల్ రేగెను రాజ్యమెల్లెడల దుష్కర్మంబులే హెచ్చెనే
  పలుకాడంగ నిజంబు నేరమగు వ్యధ్వంబీ నియంతృత్వమే
  వలదంచున్ జనులెల్లఁ గోరిరి ప్రజాస్వామ్యమ్ము దేశమ్మునన్

  రిప్లయితొలగించండి
 24. మంచియనుమాటకనరాకమచ్చుకైన
  ప్రజల సొమ్మును దోచుచు వాసిగా ను
  సంచరించెడి నేతల సందడి గని
  వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యమిలను

  రిప్లయితొలగించండి
 25. ధనమెసర్వస్వమనిమది తలచుకొనుచు
  నక్రమమ్ముగచేయుచునార్జనమ్ము
  తిరుగునేతలనుగనుచు తీరుగ నిటు
  వలదనుచు కోరుదురు ప్రజాస్వామ్యమిలను

  రిప్లయితొలగించండి