14-1-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ”(లేదా...)“చవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా”
కవితల నల్లుచు తిట్టుచుభువనమున నిననవరతము పూజించెడి యాకవులకు కోపము చూపించవటగదా నిను దలచిన శంకర పత్నీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందంఅవనిన్మానవులెప్పుడునవలక్షణమనఁ బరులకు నశుభమ్మెంచన్శివ! తత్కామన మన్నించవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ!
చంపకమాలఅవనిని సర్వజీవులకు నమ్మవునై శివకామినీ! సదాశివమును గూర్తువందురుగ శ్రీకరు నెంచఁగ భర్తగా మదిన్జవమున రుక్మిణిన్ గనుమ! నమ్మిన వారలపైని జాలి దాచవట గదా! నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా!
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
🙏భోగి పండుగ శుభాకాంక్షలతో గురుదవులకు ధన్యవాదములు.🙏కవిమిత్రులెల్లరకూ భోగిపర్వదిన శుభాకాంక్షలు 💐💐💐
'గురుదేవులకు' టైపాటు
భవుని గొలుచుట మానియు వివిధపు దుష్కర్మ ములను భీకర మతియై తవిలి యు జేయగ మన్నించవట గదా నిను దలచిన శంకర పత్నీ !
మొదటి పాదం లో భవునిన్ అని సవరణ జేయడ మైనది
,ధవుడగుశంభునివర్ణనకవులైననునిందజేయకావ్యములందున్వివరణనీయగనెదగాచవటగదానినుదలచినశంకరపత్నీ
ఎవరేమియొ తెలియని కవిచవట గదా ; నినుఁ దలఁచిన , శంకరపత్నీయవసరము లన్నియు దీరుటగవి యెరుగగ నీపయిననె కవితలు వ్రాయున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదంలో గణభంగం. "...లన్ని దీరుట" అనండి.
🙏🏽
భవసతి!సతి!నగసుత!స్తుతభువిజన!ఘనకేశి!గౌరి!పూర్ణేందుముఖీ!శివ!ఈశ్వరి!నేరములెంచవటగదా!నినుఁదలచిన శంకరపత్నీ!
అవిరళ చిత్త శుద్ధిమెయి యార్మిలితో గడు భక్తి శ్రద్ధతోసవినయమొప్ప సేవలను సన్మతిజేసిన నీవు తప్పకన్భువి కరుదెంచి భక్తులను బ్రోవగనిక్కము నీదు ప్రేమ దాచ వట గదా నినుందలప శంకరపత్ని, గణేశ్వరాంబికా
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...యర్మిలితో...సవినయబుద్ధి..నీవు నిచ్చలున్..." అనండి. (తప్పక ద్రుతాంతం కాదు)
భువనము లేలు జనని సాధువులను రక్షింపదలచి తుచ్ఛుల ఖలు ఫేరవులందున దయ జూపించవట గదా నినుఁ దలచిన శంకర పత్నీ.
భువనము నేలుతల్లి గిరిపుత్రి కరాళిక నందయంతి శాంభవి యవినీతితో చెలగు పాపులు బేలుతనంపు బుద్ధితో జవమున వచ్చి కావుమను సాటెన గొట్టుల మాట నాలకించవటగదా నినుందలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చంపకమాల:ప్రవరుని, ఫాలనేత్రుని, సురాసుర వందితు, శూలపాణినిన్భవ భయహారినిన్ కొనగ పత్ర విసర్జితవై కఠోర దీక్ష వడసి నట్టి కాళికవుగా! దరిజేరగ బాధలున్ తలంచవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా”--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములార్యా 🙏
శివ!శివవల్లభా!విజయ!శీతనగేంద్రకుమారి!గౌరి!హైమవతి!భవాని!మంగళ!ఉమా!జగదంబ!అపర్ణ!దుర్గ!శాంభవి!పురుహూతి!ఈశ్వరి!శుభంబులొసంగుము,తప్పులెంచవటగదా!నినుందలప శంకరపత్ని!గణేశ్వరాంబికా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదంలో గణభంగం. "నాదు తప్పు లెంచవట గదా..." అందామా?
నమస్తే!శంకరయ్యగారు!అలాగే.
కందము:భువనేశ్వరి కరుణామయి భవబంధము సంచితములు ప్రారబ్ధములున్ లవలేశమైన బాధిం “చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ”--కటకం వేంకటరామశర్మ.
ధన్యవాదములార్యా🙏
భవ కరుణా కటాక్షము శుభంకరమౌనని నమ్మి శాంకరీ!యవిరళ భక్తియుక్తముగ నంజలొనర్చగ నెల్లవేళలన్,భవతిమి నక్రరాజి, దవ పాదపయోజము నమ్మ, హాని గూర్చవట గదా! నినుం దలఁప శంకరపత్ని! గణేశ్వరాంబికా!పాదపయోజము-పాదపద్మముభవతిమి-సంసారసగరంనక్రరాజి-మొసలి సంఘము
తవ పాదపయోజము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అంజలి+ఒనర్చగ' అన్నపుడు సంధి లేదు. "... నంజలి సేయగ.." అనవచ్చు.
భువనేశ్వరి నీ సత్కృపనవగడములవెట్టివైననంతంబగునేభవబంధంబులు బాధించవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: భవదీయ భక్తజనమును అవగడమగు క్రియలతోడ నఱిమెడి వారిన్ అవిరతము నీవు మన్నించవటగదా నిను తలచిన శంకరపత్నీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు."భక్తలోకము నవగడ.. నఱుము జనులనే యవిరతము..." అనండి.
అవనము నీతత్వమనగనవనిని రక్షించు వాడ హర!క్లేశంబుల్లవలేశమైన వేధించవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: సవురగు భక్తితో సతము చక్కగ నిన్ను నుతించు లెంకలన్ అవమతిజేసి గర్వమున నారటపెట్టి చరించు దుష్టులన్ అవిరతమీవు కన్గొనుచు నట్టి విచేతల నందరిన్ క్షమిం చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.
జవమును జీవము నీవేభవమును పోగొట్టునట్టి భగవతివీవేశివ! యఘములనే కలిగించవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ
కందంజవసత్త్వమలన్నుండగశివాని శివులను దలచని జీవుడు జర లోన విపుల భక్తి పొడగ నెంచవట గదా ,నిను దలచిన శంకర పత్నీప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
అవిరళమౌ సపర్యలను నార్తుల గాచుచు మేలుఁ గూర్చుచున్ప్రవిమలమౌ మనస్సు ననరాగముఁ బంచి వసించు చున్నచోభవమును కాచు చుందువట, వారల పైన గలట్టి ప్రేమ దాచవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా
భవుసతి! హిమగిరి నందన!భువిజన వందిత! శిఖరిజ!పూర్ణేందుముఖీ!యవహేళకులను గరుణిం చవటగదా నినుదలచిన శంకరపత్నీ!
భువనముల నేలు తల్లీ యవివేకమ్మున నొనర్ప నఘముల నిలలో రవ మైనను గోపం బుం చ వట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీఅవిరళ కార్య భారమున నక్కట మానవ జాతి మున్గెనే సువిదితమే భవన్మహిమ శోక వినాశిని మంగళప్రదా భువి నిడ మంగళమ్ములను మూరుదు వమ్మరొ నేర కుండినంజవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా
కవనము వ్రాయలేకను నకారణ రోషము గల్గినక్షమిం చవటగదానినుందలప శంకరపత్ని గణేశ్వరాంబికా భవమును నొందియుండుట ను బ్రాభవమయ్యది నీదీయే యుమా! యవకరమేదియైననిక హాస్యములాడక గావుమాననున్
కం:"శివభక్తుడ నే"నని "విష్ణువు శత్రు" వటంచు, "విష్ణుసోదరి" వని నిన్వివరముగా నెరుగనిచో“చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ”
చక్కని పూరణ. అభినందనలు.
భవమును ద్రుంచెడి దానవు!స్తవమును జేయగ నిడుముల వారింతువుగా!నవసెడి బాధల నందించవట గదా! నినుఁ దలఁచిన శంకరపత్నీ!
కవితల నల్లుచు తిట్టుచు
రిప్లయితొలగించండిభువనమున నిననవరతము పూజించెడి యా
కవులకు కోపము చూపిం
చవటగదా నిను దలచిన శంకర పత్నీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅవనిన్మానవులెప్పుడు
నవలక్షణమనఁ బరులకు నశుభమ్మెంచన్
శివ! తత్కామన మన్నిం
చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ!
చంపకమాల
తొలగించండిఅవనిని సర్వజీవులకు నమ్మవునై శివకామినీ! సదా
శివమును గూర్తువందురుగ శ్రీకరు నెంచఁగ భర్తగా మదిన్
జవమున రుక్మిణిన్ గనుమ! నమ్మిన వారలపైని జాలి దా
చవట గదా! నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా!
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏భోగి పండుగ శుభాకాంక్షలతో గురుదవులకు ధన్యవాదములు.🙏
తొలగించండికవిమిత్రులెల్లరకూ భోగిపర్వదిన శుభాకాంక్షలు 💐💐💐
'గురుదేవులకు' టైపాటు
తొలగించండిభవుని గొలుచుట మానియు
రిప్లయితొలగించండివివిధపు దుష్కర్మ ములను భీకర మతియై
తవిలి యు జేయగ మన్నిం
చవట గదా నిను దలచిన శంకర పత్నీ !
మొదటి పాదం లో భవునిన్ అని సవరణ జేయడ మైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి,ధవుడగుశంభునివర్ణన
రిప్లయితొలగించండికవులైననునిందజేయకావ్యములందున్
వివరణనీయగనెదగా
చవటగదానినుదలచినశంకరపత్నీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవరేమియొ తెలియని కవి
రిప్లయితొలగించండిచవట గదా ; నినుఁ దలఁచిన , శంకరపత్నీ
యవసరము లన్నియు దీరుట
గవి యెరుగగ నీపయిననె కవితలు వ్రాయున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "...లన్ని దీరుట" అనండి.
🙏🏽
తొలగించండిభవసతి!సతి!నగసుత!స్తుత
రిప్లయితొలగించండిభువిజన!ఘనకేశి!గౌరి!పూర్ణేందుముఖీ!
శివ!ఈశ్వరి!నేరములెం
చవటగదా!నినుఁదలచిన శంకరపత్నీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅవిరళ చిత్త శుద్ధిమెయి యార్మిలితో
రిప్లయితొలగించండిగడు భక్తి శ్రద్ధతో
సవినయమొప్ప సేవలను సన్మతి
జేసిన నీవు తప్పకన్
భువి కరుదెంచి భక్తులను బ్రోవగ
నిక్కము నీదు ప్రేమ దా
చ వట గదా నినుందలప శంకరపత్ని,
గణేశ్వరాంబికా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...యర్మిలితో...సవినయబుద్ధి..నీవు నిచ్చలున్..." అనండి. (తప్పక ద్రుతాంతం కాదు)
రిప్లయితొలగించండిభువనము లేలు జనని సా
ధువులను రక్షింపదలచి తుచ్ఛుల ఖలు ఫే
రవులందున దయ జూపిం
చవట గదా నినుఁ దలచిన శంకర పత్నీ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభువనము నేలుతల్లి గిరిపుత్రి కరాళిక నందయంతి శాం
భవి యవినీతితో చెలగు పాపులు బేలుతనంపు బుద్ధితో
జవమున వచ్చి కావుమను సాటెన గొట్టుల మాట నాలకిం
చవటగదా నినుందలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంపకమాల:
రిప్లయితొలగించండిప్రవరుని, ఫాలనేత్రుని, సురాసుర వందితు, శూలపాణినిన్
భవ భయహారినిన్ కొనగ పత్ర విసర్జితవై కఠోర దీ
క్ష వడసి నట్టి కాళికవుగా! దరిజేరగ బాధలున్ తలం
చవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా”
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా 🙏
తొలగించండిశివ!శివవల్లభా!విజయ!శీతనగేంద్రకుమారి!గౌరి!హై
రిప్లయితొలగించండిమవతి!భవాని!మంగళ!ఉమా!జగదంబ!అపర్ణ!
దుర్గ!శాం
భవి!పురుహూతి!ఈశ్వరి!శుభంబులొసంగుము,
తప్పులెం
చవటగదా!నినుందలప శంకరపత్ని!గణేశ్వరాంబికా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "నాదు తప్పు లెంచవట గదా..." అందామా?
నమస్తే!శంకరయ్యగారు!అలాగే.
తొలగించండికందము:
రిప్లయితొలగించండిభువనేశ్వరి కరుణామయి
భవబంధము సంచితములు ప్రారబ్ధములున్
లవలేశమైన బాధిం
“చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ”
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా🙏
తొలగించండిభవ కరుణా కటాక్షము శుభంకరమౌనని నమ్మి శాంకరీ!
రిప్లయితొలగించండియవిరళ భక్తియుక్తముగ నంజలొనర్చగ నెల్లవేళలన్,
భవతిమి నక్రరాజి, దవ పాదపయోజము నమ్మ, హాని గూ
ర్చవట గదా! నినుం దలఁప శంకరపత్ని! గణేశ్వరాంబికా!
పాదపయోజము-పాదపద్మము
భవతిమి-సంసారసగరం
నక్రరాజి-మొసలి సంఘము
తవ పాదపయోజము
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అంజలి+ఒనర్చగ' అన్నపుడు సంధి లేదు. "... నంజలి సేయగ.." అనవచ్చు.
భువనేశ్వరి నీ సత్కృప
రిప్లయితొలగించండినవగడములవెట్టివైననంతంబగునే
భవబంధంబులు బాధిం
చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిభవదీయ భక్తజనమును
అవగడమగు క్రియలతోడ నఱిమెడి వారిన్
అవిరతము నీవు మన్నిం
చవటగదా నిను తలచిన శంకరపత్నీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భక్తలోకము నవగడ.. నఱుము జనులనే యవిరతము..." అనండి.
అవనము నీతత్వమనగ
రిప్లయితొలగించండినవనిని రక్షించు వాడ హర!క్లేశంబుల్
లవలేశమైన వేధిం
చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిసవురగు భక్తితో సతము చక్కగ నిన్ను నుతించు లెంకలన్
అవమతిజేసి గర్వమున నారటపెట్టి చరించు దుష్టులన్
అవిరతమీవు కన్గొనుచు నట్టి విచేతల నందరిన్ క్షమిం
చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.
జవమును జీవము నీవే
రిప్లయితొలగించండిభవమును పోగొట్టునట్టి భగవతివీవే
శివ! యఘములనే కలిగిం
చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిజవసత్త్వమలన్నుండగ
శివాని శివులను దలచని జీవుడు జర లో
న విపుల భక్తి పొడగ నెం
చవట గదా ,నిను దలచిన శంకర పత్నీ
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅవిరళమౌ సపర్యలను నార్తుల గాచుచు మేలుఁ గూర్చుచున్
రిప్లయితొలగించండిప్రవిమలమౌ మనస్సు ననరాగముఁ బంచి వసించు చున్నచో
భవమును కాచు చుందువట, వారల పైన గలట్టి ప్రేమ దా
చవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభవుసతి! హిమగిరి నందన!
రిప్లయితొలగించండిభువిజన వందిత! శిఖరిజ!పూర్ణేందుముఖీ!
యవహేళకులను గరుణిం
చవటగదా నినుదలచిన శంకరపత్నీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభువనముల నేలు తల్లీ
రిప్లయితొలగించండియవివేకమ్మున నొనర్ప నఘముల నిలలో
రవ మైనను గోపం బుం
చ వట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ
అవిరళ కార్య భారమున నక్కట మానవ జాతి మున్గెనే
సువిదితమే భవన్మహిమ శోక వినాశిని మంగళప్రదా
భువి నిడ మంగళమ్ములను మూరుదు వమ్మరొ నేర కుండినం
జవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికవనము వ్రాయలేకను నకారణ రోషము గల్గినక్షమిం
రిప్లయితొలగించండిచవటగదానినుందలప శంకరపత్ని గణేశ్వరాంబికా
భవమును నొందియుండుట ను బ్రాభవమయ్యది నీదీయే యుమా!
యవకరమేదియైననిక హాస్యములాడక గావుమాననున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:"శివభక్తుడ నే"నని "వి
రిప్లయితొలగించండిష్ణువు శత్రు" వటంచు, "విష్ణుసోదరి" వని నిన్
వివరముగా నెరుగనిచో
“చవట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ”
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభవమును ద్రుంచెడి దానవు!
స్తవమును జేయగ నిడుముల వారింతువుగా!
నవసెడి బాధల నందిం
చవట గదా! నినుఁ దలఁచిన శంకరపత్నీ!