14, జనవరి 2022, శుక్రవారం

సమస్య - 3962

 15-1-2022 (శనివారం)
కవిమిత్రులారా,
మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామచంద్రుఁడు పుట్టె సంక్రాంతి నాఁడు”
(లేదా...)
“జనియించెన్ గద రామచంద్రుఁడు గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్”

46 కామెంట్‌లు:

  1. పాయసము త్రాగ దశరథ పత్ని కెవరు

    ముందుగాబుట్టె, యెపుడు డెంద మలరు

    నటుల బొమ్మలను తెలుగు‌ నాట పెట్టు

    రామచంద్రుడు పుట్టె,సంక్రాంతి నాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా సమీక్ష చూడండి.

      తొలగించండి
  2. ధర్మ రక్షణ కొఱకునై ధాత్రి యందు
    రామ చంద్రుడు బుట్టె : సంక్రాంతి నాడు
    గంగి రెద్దుల నాడింత్రు కమ్ర ముగను
    ముగ్గు లమరును ముచ్చ టై మురిప మలర

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది.
    సవితృ వంశమందు చైత్ర శుద్ధ నవమిన్
    దశరథావనీశు తనయుడుగను
    సఖియ!మున్ను//రామ చంద్రుడు పుట్టె,సం
    క్రాంతి నాడు //నీకు కలిగె సుతుఁడు.

    రిప్లయితొలగించండి
  4. మునిగెన్జీకటిభారతావనియతామున్నీరుకన్నీరునై
    చనియెన్తోషముజాతికంతకునుతాఁజచ్చెంగతేజంబునున్
    కినుకన్జూచినపౌరుషాగ్రణిగనాకీడెంచికాషాయమై
    జనియంచెన్గదరామచంద్రుడుగనన్సంక్రాంతినాడిమ్ములన్

    రిప్లయితొలగించండి
  5. ( రామనవమి నుండి సంక్రాంతికి సుమారు తొమ్మిది నెలలు)

    బిడ్డ నొసగ బోవెదవని వెజ్జు దెలిపె
    రామనవమి నాడున , నీదు లక్షణముల
    కొమరునీయ దాశరథిని గోరినంత
    రామచంద్రుఁడు పుట్టె సంక్రాంతి నాఁడు

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    వేడుకన రంగవల్లులు పేర్మివెలయు
    సంప్రదాయాన నా సతి చక్కఁదీర్చ
    ముంగిట మెరయు ముత్యాల ముగ్గులోన
    రామచంద్రుఁడు పుట్టె సంక్రాంతి నాఁడు!

    మత్తేభవిక్రీడితము
    కొనసాగింపఁగ సంప్రదాయమనుచున్ కోమళ్లు ముంగిళ్లలో
    ఘనమౌరీతిగ రంగవల్లులు దగన్ గన్విందుగా దీర్పరే
    తనరన్ నా సతి ముగ్గుఁదీర్చెనన కోదండంబుతో రేఖలన్
    జనియించెన్ గద రామచంద్రుఁడు గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

      గురుదేవులకు మరియు కవిమిత్రులందరకూ మకరసంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు 💐💐💐

      తొలగించండి

  7. చైత్ర శుద్ధ నవమి నాడు జాతి జరుపు
    రామ జన్మదినంబది రంజనమున
    నిది యెఱుంగక వాగెనో హీను డిటుల
    రామచంద్రుడు పుట్టె సంక్రాంతినాడు.

    రిప్లయితొలగించండి
  8. తునియించంగను దైత్యసంఘముల,సంతోషాబ్ధి
    తేలింపగా
    మునులన్,కారణ జన్ముడై ఖలుని నిర్మూలించగా రావణున్
    జనియించెన్ గద రామచంద్రుఁడు,గనన్ సంక్రాంతి
    నాడిమ్ములన్
    వనితా!నీకుదయించెగా సుతుఁడు నీ వంశా
    బ్ధికింజంద్రుఁడై.

    రిప్లయితొలగించండి
  9. ఇనవంశోద్భవుడై యధోక్షజుడు తానీ ధాత్రిలో మాసిగా
    ధనుజారాతి యయోధ్య పాలకుడు చైత్రంబందు కౌసల్యకున్
    జనియించెన్ గద రామచంద్రుడు, గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్
    వనితల్ ముంగిట నందమౌ పరికలన్ బ్రహ్లాదమున్ వేతురే.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. పుత్రకామేష్టియాగము ముగిసినతరి
    కోసల జనహృదయరాశి ఘోషణమున
    కోటిసూర్యప్రభలతోడ మేటివిభుడు
    రామచంద్రుఁడు పుట్టె సంక్రాంతి నాఁడు

    రిప్లయితొలగించండి
  12. మత్తేభము:
    ఇనవంశమ్మున దైత్యసంహరుడు లక్ష్మీశుండునర్ధాంశుడై
    ఘనమౌ నాల్గు గ్రహమ్ము లుచ్చ గతిలో కర్కాటకమ్మున్ శశిన్
    నొనగూడన్ శుభరాశిసంక్రమణ మహో దేదీప్యమానంబుగా
    “జనియించెన్ గద రామచంద్రుఁడు గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్”
    [మేష రాశిలో రవి, మకరరాశిలో కుజ, మీన రాశిలో శుక్ర, కర్కాటకరాశి లోగురువు ఉచ్చస్థితులలోనూ, చంద్రుడు స్వక్షేత్రమైన కర్కాటక రాశి పునర్వసు నక్షత్రములతో సంక్రమణం చెంది యున్నారు ]
    ---కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    పుత్రకామేష్టి నెపమున పుడమి జేరి
    నాది విష్ణువు దశరథునాత్మజుడుగ
    రామచంద్రుఁడు పుట్టె,సంక్రాంతి- నాఁడు
    వచ్చె కోసల ప్రజలకు పంట గనుక
    ---కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    మాపొరుగున వసించెడి మంచివారు
    దశరథుడు మఱి కౌసల్య దంపతులకు
    ముందటేడు ముచ్చటగొల్పు నందగాడు
    రామచంద్రుడు పుట్టె సంక్రాంతినాడు.

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    మనుమండౌ హరిమిత్రుడా దశరథున్ మాయూరి కౌసల్యయే
    ఘనమౌరీతిని ముందటేడు నవమిన్ కాల్ద్రొక్కె సొంపౌ నటుల్
    అనువున్ యిప్పుడు నామెకున్ విరజునిన్ యాశీస్సులన్ తీరుగా
    జనియించెన్ గద రామచంద్రుడు గనన్ సంక్రాంతినాడిమ్ములన్.

    రిప్లయితొలగించండి
  17. తేటగీతి
    చైత్ర మాసాన శుభవేళ సద్గుణాల
    రామచంద్రుడు పుట్టె ,సంక్రాంతి నాడు
    వెల్గు నాడయోధ్యన తాండవించ జనుల
    సంబరాలు జోరుగ జేసి రంత జూడ.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  18. రామ! యీమాట లేమిర రామ రామ
    రాదురా విద్య నీకింక రాదు రాదు
    మనసు నిలుపక పలికేవు మరల మరల
    "రామచంద్రుఁడు పుట్టె సంక్రాంతి నాఁడు"!

    ఘన నీలప్రభ రూపమందుచును రా
    గానంద మొప్పారగన్
    వినుతించంగ నయోధ్య యందచట సం
    ప్రీతించ కౌసల్యకున్
    జనియించెన్ గద రామచంద్రుఁడు; గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్
    మన యిండ్ల న్నిట రామమూర్తి ప్రతిమన్
    మవ్వంబుగా నిల్పిరే!

    రిప్లయితొలగించండి
  19. తే.గీ:దంపతులు భక్తి తోడ భద్రగిరి కేగి
    రామచంద్రుని జూడ వరమ్ము నిడెనొ
    రామచంద్రుడు ! పుట్టె సంక్రాంతి నాడు
    ముద్దు లొలికెడు మోముతో మొదటి బిడ్డ

    రిప్లయితొలగించండి
  20. ధర్మ రక్షణ కొఱకునై దాశరధిగ
    రామ చంద్రుడు పుట్టె, సంక్రాంతి నాడు
    క్రొత్త బట్టలు ధరియింత్రు కూర్మితోడ
    పిన్న పెద్దలు తమతమ వన్నెకొలది

    రిప్లయితొలగించండి
  21. సంతసించెను గౌసల్య సంతసించెఁ
    జక్రవర్తి భూ జను లెల్ల సంతసించి
    రమితముగ నయోధ్యాపుర మందు సుతుఁడు
    రామచంద్రుఁడు పుట్టె సంక్రాంతి నాఁడు

    [సంక్రాంతి =మంచి ప్రవేశము]


    ఇన వంశార్ణవ పూర్ణ చంద్రుఁడు వికుంఠేశుండు సంప్రీతి ధా
    త్రినిఁ గార్యార్థము సేసె సంక్రమణమున్ దివ్యంబుగా విష్ణువే
    తనయుం డయ్యె నజాత్మ సంభవునకుం దా నా యయోధ్యాపురిన్
    జనియించెన్ గద రామచంద్రుఁడు గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్

    [నాఁడు = ఆనాఁడు; సంక్రాంతి = భూ సంక్రమణము]

    రిప్లయితొలగించండి
  22. ఇనవంశంబును నుద్ధరించుటకు నాయీశుండు కౌశల్యకున్
    జనియించెన్గద రామచంద్రుడు గనన్ సంక్రాంతి నాడిమ్ములన్
    వనితల్ బెద్దలు కుఱ్ఱకారులరు యావన్మంది కొంగ్రొత్తగా
    గనిపించం ధరియింత్రు నూతనపు రాగానంద మొప్పారగన్

    రిప్లయితొలగించండి
  23. ఇన వంశాంబుధి చంద్రుడై ధరణి రక్షింపంగ సద్ధర్మమున్
    జనియించెన్ గద రామచంద్రుఁడు గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్
    మనమందా పురుషోత్తమున్నిలిపి సన్మార్గాభిసంచారులై
    తనరంగావలె ధర్మ రక్షణ మహత్కార్యార్థ దీక్షారతిన్

    రిప్లయితొలగించండి
  24. పూర్వ జన్మకృతంబగు పుణ్యఫలము
    తండ్రి యానతి మీరని తనయుడతడు
    సత్యసంధుడు, సాక్షాత్తు సద్గుణముల
    రామచంద్రుఁడు, పుట్టె సంక్రాంతి నాఁడు

    రిప్లయితొలగించండి
  25. చైత్ర శుద్ధ నవమినాడు ధాత్రియందు
    రామచంద్రుడు బుట్టె, సంక్రాంతినాడు
    మకర రాశిన జేరుచు సెకవెలుంగు
    సంబరమ్ముల నిచ్చును సర్వులకును.!!!

    రిప్లయితొలగించండి