23, జనవరి 2022, ఆదివారం

సమస్య - 3971

 24-1-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్"
(లేదా...)
"కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్"
(పెద్దాడ మల్లికార్జున రావు గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

 1. కందం
  కుక్కల మధ్యన పోరన
  కుక్కొక్కటి గెల్చితీరు గువ్వలచెన్నా!
  కుక్కయు కుక్కుటమొకటన
  కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   చక్కని పాలనా పటిమ సాగగ నెల్లరి నోట నాల్కగన్
   దక్కువ జేసివాని తమ దారిని గెల్వఁగ నిల్వముగ్గురున్
   బెక్కుగ చీలి యోట్లవియె వేడ్కగ మున్పటి వాడె నెగ్గెనే!
   గుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్!

   తొలగించండి

 2. పెక్కురట జూచు చుండగ
  కుక్కురమొకటేగుదెంచి కోడిని గాంచెన్
  ముక్కలకొరకై సాగిన
  కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్.

  రిప్లయితొలగించండి

 3. పెక్కురు వేయుచోటదియె ఫేలపు విస్తరులెల్ల యందునన్

  ముక్కలవెన్నొ యుండునని పుచ్చియె జేరె భుజింప నత్తఱిన్

  చక్కిన సంచరించు నొక జాగిలమే చను దెంచ తిండికై

  కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్.

  రిప్లయితొలగించండి
 4. ముక్కల కొఱకై చేరెను
  కుక్కయు కుక్కుట ము లు దిన గుర గుర మనుచున్ దక్కించు కొనగ పోరగ
  కుక్కుటముల సమర మందు గుక్కయె గెలిచెన్

  రిప్లయితొలగించండి
 5. కుక్కలసమరమ్మొక్కటి
  కుక్కుటములసమరమొకటి కొండొకచోటున్
  పక్కనజరిగిన కుక్కయు
  కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్

  రిప్లయితొలగించండి
 6. తేటగీతి

  కోడి కాలికి కట్టిన వాడి కత్తి
  తగిలి వేఱొక్క కోడికి తెగెను పీక
  //కుక్కుటముల సమరమందు,కుక్కయె గెలి
  చెన్//నకులముతో పోరాడి చిత్రముగను.

  రిప్లయితొలగించండి
 7. మక్కువగ దాను పెంచిన
  కుక్కురమును తనకు ప్రతిగ గొనసా గించన్
  యక్కడ సిద్ధము జేసిన
  కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్

  రిప్లయితొలగించండి
 8. ఈనాటి శంకరా భరణము వారి సమస్య

  కుక్కుటముల సమరమందు‌ కుక్కయె గెలిచెన్

  ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో  మీరెంత తింటిరో మీరెంత గొప్పవారోయని యొకపార్టి లోని‌వారు

  పలుకుచు నుండగా భయమును బడయక‌
  ముఖ్య మంత్రి యొకడు ముదము బడసె,

  మీరెంత దాచిరో మీరెంత యుత్తము
  లోయని ‌యొకపార్టి రొదను‌ చేయ

  ఖండించ కుండెగా ఘనుడైన ప్రతి పక్ష
  నేత రాష్ట్ర ములోన చేత గాక,  తగిన సమయ మిదని కేంద్రమున నేత

  తలచి యోడించ వారలన్ దమ్ము తోడ,

  *కుక్కుటముల సమరమందు కుక్కయె గెలి*

  *చెనని* ప్రజలెల్ల ముదముతో‌‌ చిందు లేసె

  రిప్లయితొలగించండి
 9. ఎక్కడి దుష్టసంస్కృతియొ? హింసను నల్వురు ప్రోత్సహించగా
  నక్కట! కోడిపందియము లందు గనన్ బలియౌను కోడియే
  వెక్కసమైన సంతసము విత్తముఁ గోరిన వారు గెల్వగన్
  కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్

  కంజర్ల రామాచార్య

  రిప్లయితొలగించండి
 10. దిక్కుల నెల్ల పర్వముల తేజము పర్వగ తెల్గునేలలన్
  కొక్కొరొ!కొక్కొరో!యనుచు కూతలుఁగూయుచు కాలు దువ్వుచున్
  కుక్కుటముల్ దలంపడగ ,కుక్క జయంబును గాంచె వింతగన్
  ఒక్కెడ చంపి సర్పమునహో!యనిమెచ్చిరి గాంచి గారడీ.

  రిప్లయితొలగించండి
 11. మిక్కుటమౌ కావరమున
  నెక్కువ తక్కువలరయక నెల్లెడ మొఱుగున్
  నిక్కంబీ సంక్రాంతిని
  కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్
  (వాచాలుఁడైన నేత సంక్రాంతి సంబరాలు)

  రిప్లయితొలగించండి
 12. కందం
  కుక్కుర పందెము లందున్
  కుక్కుర గెలుపు సహజంబగును, నీ విధమౌ
  చిక్కు బలుకు చిత్రమగును
  కుక్కుటముల సమరమందు గుక్కయె గెలిచెన్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 13. కుక్కుట మనఁ గోడి మఱియుఁ
  గుక్కుయుఁ గుక్క యనఁ గాదు కోడి కనుక నే
  రిక్కడ యనరా దివ్విధిఁ
  గుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్


  ఎక్కటి వింత యేరికిని నెవ్విధి నెమ్మదిఁ గల్గ నేర్చునో
  కుక్కుట మన్నఁ గుక్క యని కూడ నెఱుంగుమ యర్థ మింపుగాఁ
  గుక్కలు పోరఁ గాక మఱి కుక్కయె పోరున నక్క నెగ్గునే
  కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్

  రిప్లయితొలగించండి
 14. కుక్కుటములు మఱి కుక్కయు
  ముక్కలకై పోరులాడ మోముల దాడిన్
  నక్కజము గొలుప యత్తఱి
  కుక్కుటముల సమరమందు గుక్కయె గెలిచెన్

  రిప్లయితొలగించండి
 15. ముక్కను బొందగోరికను మోములు మోములు దాకునట్లుగా
  కుక్కుటముల్ దలంపడగ కుక్క జయంబును గాంచె వింతగన్
  నక్కజమాయె నయ్యదియ హారతి! చూచితె? వింతనచ్చటన్
  కుక్కబలంబు ముందటను కుక్కుట శక్తులు చాలవాయెనే

  రిప్లయితొలగించండి
 16. ముక్కల మాంసము కొరకై
  మిక్కుటముగ నచట పోరు మేటిగ సలుపన్
  టక్కున నడుమున వచ్చుచు
  కుక్కుటములసమరమందుగుక్కయెగెలిచెన్

  రిప్లయితొలగించండి