12, జనవరి 2022, బుధవారం

సమస్య - 3960

13-1-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నవరమ్మున లభించ దన్నం బయ్యో”
(లేదా...)
“అన్నవరమ్మునం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో”

27 కామెంట్‌లు:


 1. పన్నలు హీనులు దుర్నయు
  లన్నుల నవమాన పరచెడధముల కిచటన్
  చిన్నా! యాత్రాస్ధలమీ
  యన్నవరమ్మున లభించదన్నంబయ్యో.

  రిప్లయితొలగించండి
 2. చెన్నుగపంటలువేయక
  వెన్నంటినలోభముననువేగిరపడిరై
  తన్నలువదలిరిపోలమును
  అన్నవరమ్మునలభించ, దన్నంబయ్యో

  రిప్లయితొలగించండి
 3. అన్నవర క్షేత్రంబున
  మిన్నగ పెడుదురు ప్రసాదమే యుచితముగా
  నన్నము రూపంబున,న
  న్నన్న!వరమ్మున లభించదన్నంబయ్యో!

  రిప్లయితొలగించండి
 4. మిన్నక కూలినాలికిని వెళ్ళక యున్నను చెల్లునా? భువిన్
  చెన్నుగ నెవ్వరైన మరి చేరదు కూడది వళ్ళు వంచకే
  మన్నన చేయడాప్రభువు మందుల నెన్నడు, వారి కేలకున్
  అన్నవరమ్మునం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో.

  రిప్లయితొలగించండి
 5. ఎన్నికలందుననిలబడి
  అన్నవరములిచ్చె ననుచు నార్భాటంబుల్
  మిన్నంటగ జూపెనుపో
  అన్నవరమ్మున లభించ దన్నం బయ్యో

  రిప్లయితొలగించండి

 6. ఎన్నగ పుణ్యభూమియిది హీనమనస్కులు దుష్టశులురున్
  గన్నెల నెగ్గుచేయు వలకారులు శంకితవర్ణులైనవా
  రెన్ని గృహమ్ములన్ దిరిగి యెంతగ వెక్కుచు వేడనేమి య
  య్యన్నవరమ్ము నందకట యన్నము పుట్టదదేమి చోద్యమో.

  రిప్లయితొలగించండి
 7. వెన్నుడుసత్యదేవునికివేడుకమీరగపూజసేయనా
  పన్నులజిహ్వకందునుగపాకమధూకలితాన్నమేతగన్
  జన్నములెన్నిజేసిననుచిక్కదుసాధననబ్బురంబుగా
  అన్నవరమ్మనందకటయన్నముపుట్టదదేమిచోద్యమో

  రిప్లయితొలగించండి
 8. కందం
  మన్నింపుము క్రైస్తవు నే
  నెన్నడు మీదగు ప్రసాదమింతయు తిననే!
  వెన్నునికి నివేదింపక
  యన్నవరమ్మున లభించ దన్నం బయ్యో!

  ఉత్పలమాల
  అన్నపు వేళకున్ నడచి యార్తినిఁ జేరితిఁ గ్రైస్తవుండ నే
  మున్నెపుడైన మీదనెడు పూజఁ ప్రసాదము నారగింపనే
  వెన్నునికిన్ నివేదనము పెట్టని యోగిరమెంచి కోర నా
  కన్నవరమ్మునం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో!

  రిప్లయితొలగించండి
 9. ఎన్నగ సద్భక్త వరులు
  మిన్నగ నేర్పాటు జేసి మేలొనరింపన్
  మిన్నక పల్కుట మేలా
  యన్న వరమ్మున లభింపఁ దన్నం బయ్యో?!

  రిప్లయితొలగించండి
 10. కన్నుల పండుగౌనుగద!కాంచగ రత్నగిరీంద్రు క్షేత్రమున్
  తిన్నగ స్వామి దర్శనము దేవి రమావతి దర్శనంబగున్
  అన్నవరంబునంద,కట!యన్నము పుట్టదదేమిచోద్యమో
  యన్న,సమంజసంబె?సమయానికి నేగ లభించునన్నమున్.

  రిప్లయితొలగించండి
 11. అన్నవరమన్ననదియును
  నన్నిపురములట్లునొక్క యాత్రాస్థలమే
  పున్నెమునకునుచితముగా
  నన్నవరమ్మున లభించ దన్నం బయ్యో

  రిప్లయితొలగించండి
 12. అన్నవరంబనంగనది యన్నిపురంబులవంటి పట్టణం
  బెన్నగ పుణ్యతీర్థమది యెక్కుడు యాత్రికులీ పురంబుకున్
  చెన్నుగవచ్చిపోవుదురు చెప్పకతప్పదు రూక లేనిదే
  యన్నవరమ్మునం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో

  రిప్లయితొలగించండి
 13. పిన్న తనంబు నందుననె , పెద్దలు జెప్పగ వింటియుంటినే
  నన్ని విధంబు లందచటి యాలయ గొప్పను గూర్చి దెల్పగన్ ,
  కొన్ని దినంబు లచ్చటన కోవిడు యుండగ నంత మూయుటన్
  నన్నవరమ్మునం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో

  రిప్లయితొలగించండి
 14. చెన్నుగ వెళ్ళితి నచటికి ,
  కొన్ని దినంబులు మొదలుగ గోవిడు ప్రబలన్
  యన్న గృహంబులు మూయగ
  నన్నవరమ్మున లభించ దన్నం బయ్యో

  రిప్లయితొలగించండి
 15. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  మిన్నగు దైవము వెలసెను
  అన్నవరమ్మున, లభించ దన్నంబయ్యో
  దున్నెడు రైతుకు నిలలో
  పన్నుల భారము పెరగగ పంటల మీదన్.

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  తెన్నుగ నడవిని నడరెడి
  చిన్నదియౌ గ్రామమగుచు చిపిటమ్ములనే
  నెన్నుచు భుక్తిగ తిను నా
  అన్నవరమ్మున లభించ దన్నంబయ్యో!

  రిప్లయితొలగించండి
 18. కందం
  కన్నుల పండుగ విభవము
  అన్నవరమ్మున ,లభించదన్నంబయ్యో
  మిన్నగ హరి నామము నే
  సన్నుతి జేయక మనుగడ సాగించంగన్
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 19. సన్నుతిఁ జేయ నెంచుచును స్వామినిఁ జేరగఁ బూజ వేళలో
  మిన్నగ దర్శనమ్మగును మేటి ప్రసాదముఁ జిక్కు నచ్చటన్
  క్రన్నన మంచి భోజనముఁ గాంచగఁ బోయినఁ గాని వేళలో
  నన్నవరమ్మనం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో!

  రిప్లయితొలగించండి
 20. అన్నార్తుల కసరుచు వెం
  కన్నకు దగ ముడుపులిడెదరరరే విను మా
  పన్నులకొక ముద్ద నిడక
  అన్నవరమ్మున లభించ దన్నం బయ్యో

  రిప్లయితొలగించండి
 21. అన్నవరమ్మునందకట యన్నము వుట్ట దదేమి చోద్యమో
  నన్నది వట్టి మాట వినుమన్నిట దానగు సత్యదేవుడా
  పన్న శరణ్యుడై యచట భక్తుల కోర్కెలు దీర్చుచుండ లే
  దన్నది లేదు నెమ్మి పరమాత్మను నమ్మిన వారికెన్నడున్

  రిప్లయితొలగించండి
 22. ఎన్నికలందు గుప్పె దన యిచ్చకు వచ్చిన బాసలెన్నియో
  తిన్నగ దీర్చలేడకట తిమ్మిని బమ్మిని జేసి రాష్ట్రమున్
  సున్నగ మార్చెనే ప్రగతి సుంతయు లేదు భవిష్యమందునన్
  అన్న "వరమ్ము"నం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో

  రిప్లయితొలగించండి
 23. ఎన్నకుమీ డెందమ్మున
  నెన్నడు వరముల గిరముల నెందెందుఁ జనం
  గొన్నను గాని ధనమ్మున
  నన్న! వరమ్మున లభించ దన్నం బయ్యో


  అన్న మదేల సన్నని సురాన్నము మిన్నగ నందు చుండఁగాఁ
  జెన్నుగ నింటి నింటను నశేషము భక్తుల గుంపు సేర నా
  సన్నము సత్యదేవుని ప్రసాదము దక్కు నిరంతరమ్ముగా
  నన్నవరమ్మునం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో

  రిప్లయితొలగించండి
 24. మిన్నగ యాత్రా స్ధలమున
  నన్నంబును బెట్టుచుండ యందరికెపుడున్
  నన్నవరమ్మను బేరయు
  నన్నవరమ్మున లభించదన్నం బయ్యో

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. మిన్నగ నన్ని చోట్లయును మెచ్చువిధంబుగ బెట్టుచుండగా
  నన్నవర మ్మునందకట యన్నము పుట్టదదేమి చోద్యమో
  యన్నవరంపు దేవునకు నార్జిత సేవల సొమ్ములేకయా?
  యున్నను సేవజేయగను నొప్పగు వారలు లేకనా ?రమా!

  రిప్లయితొలగించండి