2-1-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్”(లేదా...)“కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే”
కందంచేకొన హంసను బోలియుశ్రీకృష్ణుని రుక్మిణి సతి శిశుపాలుఁడనెన్శోకింపక బుధులకెటులఁగాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్?
శిశుపాలుని ఆవేదన... ఉత్పలమాలచిన్నది రుక్మిణీ మణి విశిష్టతఁ బోలుచు హంసయేయనన్మన్నును దిన్న కృష్ణునటు మైకము నందున జేరినంతటన్ఖిన్నులు గాక యీ బుధులు కీర్తనలెంచుచు నాలపింపఁగన్గన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పోకిరి సొగసరి యొక్కడుచాకిరి చేసెడు మగువతొ చనువుగ మెసలెన్ తాకిన దానికి ఫలమైకాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మగువతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చాకిరి చేయు సతితోడ చనువుగ..." అనండి.
సోకునవెఱ్ఱిగగొల్లడుచేకొనెవిద్యాధరినిగజేతగతానేఆకాళికదయజూపగకాకికిహంసకునుబెండ్లికనువిందయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాగా చెప్పారు
మేకొని నల్లని పిల్లను చేకొన నాస్తులను గాంచి సిద్ధం బైనన్ వాకొనె గేలిగ నొకరుడు "కాకికి హంసకును బెండ్లి కను విందయ్యెన్ "
అన్నులమిన్నసౌబలునియన్నగబొందినసౌకుమారియాచిన్నెలవింతసోయగముజిక్కెనుగుడ్డినకితండ్రియాజ్ఞతోకన్నెగగట్టెగంతలనుకాంతయునాథునికష్టమెంచుచున్కన్నులపండువైవెడగుకాకికిహంసకుబెండ్లియయ్యెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'గుడ్డినకి'?
నతప్పుగాపడినది
శ్రీకృష్ణుడు రుక్మిణి సతిజేకొనె నని కినుకబూని చేది నృపుండౌయా కుటిలుడు పలికె నిటులకాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్.
అన్నులమిన్న రుక్మిణి సుహాసిని కృష్ణుల పెండ్లి వేడ్కలామిన్నును దాకుచుండెనని మిత్రులు పేర్కొను చుండ గాంచి యాపన్న పృథగ్జనుండు శిశు పాలుడు కోపము నందు పల్కెనే కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మణి+ఏమొ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
కందంపోకిరి నల్లని వరుడున్చేకొను కన్యా రతనము శ్వేతచ్ఛాయన్కాకికి బింబ ఫలముగాకాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
కేకికి కేకికి,కాకికి కాకికి,హంసకునుఁబెండ్లి కనువిందయ్యెన్ శ్రీకరమౌ హంసికిని,కవీ!కోకిలకుఁబికమునకు వినువీథులలోన్.
మనోహరమైన పూరణ. అభినందనలు.
అన్నము లేకపోయిన నహర్నిశముల్ తెగ త్రాగువానికిన్పున్నమ చందమామవలె మోముగలట్టి సుయోగ్య కన్యతోదిన్నగ పెండ్లజేసిరట తెల్సిన వారలు విస్తుపోవరే!కన్నులపండుగై వెడగు కాకికి హంసకు పెండ్లి జర్గినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
లోకమునందున వింతగకాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్ఆకలి బాధలు బెరుగగచూకురు బూర్తిగ దొలగెడి చోద్యము గనమే
అన్నులమిన్న మైథిలికి నందములో సరిజోడు రాముడేతిన్నగ లేని శూర్పనఖ తీరగు రాముడు నచ్చి యిచ్ఛ తోక్రన్నన బెండ్లియాడె, కల కమ్మని దైనను మాయలాడికిన్,కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే!
అన్నుల మిన్న కన్నియకు నందము చందముఁగల్గు వానితోవెన్నెల రేయిలోజరుగు పెండ్లిని గాంచితి సత్కవీశ్వరా!కన్నుల పండువై,వెడగు కాకికి హంసకుఁబెండ్లియయ్యె?నేవిన్నది కాదు వీనులను,వీక్షణ సేయగ లేదు కన్నులన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనందనలు.
ఉత్పలమాల:కన్నులులేనివాడొకడు కష్టములోర్చి గడించె విద్య తా నన్నిట మిన్నయై సహృదయాత్మకుడై వికలాంగికన్యనే యెన్నగ, వారి జంటఁగని నెల్లరు మెచ్చిరి సంబరమ్మునన్ “కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే”--కటకం వేంకటరామశర్మ.
తిన్నగ మూర్ఖునొక్కడిని తీరిచి దిద్దుచు మంత్రి రాజుతో,మన్నన చేయుమయ్య తగు మంజుల కోమలి కీడు జోడనన్కన్నుల పండువై వెడగు కాకికి, హంసకుఁ బెండ్లి యయ్యెనే,యెన్నగఁ గాళిదాసతడె యేకవి రారుగ సాటి, వానితోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "చెలువ లని రిటుల్" అనండి.
లోకోత్తముడగు యొంటరిచేకొని బెండ్లాడువేళ చెలువలనిరిటుల్శ్రీకరముగ నిచ్చట నేకాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్
వెన్నెలవెల్గుక్రొమ్మెరుగుపిన్నదిబీదకుపట్టినిచ్చెసంపన్నులబిడ్డడంచుపొరపాటయెనల్లనిమేఘుడంధుడున్విన్నునుమన్నునొక్కటయెవేధదలంచినలీలచిత్రమే*కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే*
ధన్యవాదాలు గురువు గారు
క్రొన్నన మేని సౌష్ఠవము కుల్కువయారము లింపుగూర్చగన్ చెన్నెసలారు పల్వరుస శీతనగాత్మజ యందు నొప్ప, సీ!మిన్ను శిరోజపాశమట మేల్పులితోలు త్రినేత్రు నందు, హా!కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనేకంజర్ల రామాచార్య.
లోకమునందుననెన్నడుకాకికి రాయంచ జోడి కానేరదుగాప్రాకటముగనిరుజంటలు“కాకికి, హంసకును బెండ్లి కనువిందయ్యెన్”
మన్నన జేయలే రచట భానిని మానస మెంత నొచ్చునోమిన్నగు నాస్తిపాస్తులని మేడల మిద్దెల నాశరేపుచున్అన్నుల మిన్ననేడ్వగను నందరు జేరియె కుట్ట్రపన్నగన్కన్నులపండువై వెడగు కాకికి హంసకు బెండ్లి యయ్యెనే!!
క్రన్నన పూనుచున్ శివుని కార్ముకమున్ మడియించి రాముడాయన్నులమిన్న యైన జనకాత్మజఁ గూరిమి బెండ్లి యాడగాకన్నులఁ గింకతో జయము కాంచని యీశులు పల్కిరివ్విధిన్ “కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే”
కం:ఏ కాంత నచ్చ కుండుటనేకాకిగ నున్న వీని కీ హంసశ్రీయే కడు నచ్చెగ! యీ యే కాకికి హంసకును పెండ్లి కనువిందయ్యెన్.(అతడు ఏకాకి గా ఉన్నాడు.చివరికి హంసశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు.హంసశ్రీ అనే అమ్మాయిని హంస అనటం సహజమే కదా!)
చక్కని పూరణ. అభినందనలు.
అయ్యా!ధన్యవాదం!
ఉ:కొన్ని ప్రయోగముల్ జరిపి కుక్కను,పిల్లిని గల్పి క్రొత్తగానున్న మరొక్క జీవమునె యుర్వికి జూపిరి శాస్త్రవేత్తలేకన్నుల పండువై వెడగు కాకికి హంసకు బెండ్లి యయ్యెనే!యెన్నగ నెట్లు సాధ్య మగు నీ గతి రెంటిని గల్ప సాధ్యమే ?(కుక్కని,పిల్లిని కలిపి శాస్త్రవేత్తలు మరొక జాతిని తయారు చేశారు.అది నిజమే.కానీ కాకిని,హంసని అసలు కలపటం సాధ్యమా?అని సందేహం.)
వెన్నుడు నల్లనయ్యఁజనెవేగముగైకొనఁ గన్యకామణిన్చెన్నుగ గౌరినిన్గొలిచిఁజేఱగవచ్చెను రాజహంసయైనన్నయు నడ్డుగానిలచినారడివెట్టుచు వెంబడించగన్కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనేకొరుప్రోలు రాధాకృష్ణ రావు
చీకటిని బోలు కుసుమనురాకా చంద్రుండు వంటి రాహులు తోడన్ నేకము చేయగ పెద్దలుకాకికి హంసకును బెండ్లికను విందయ్యెన్
వీఁక విహగ రాజములకుఁ గాకముతో హంస తోడ ఘనముగ ధర నాహా కుజ కాసారమ్ములఁ గాకికి హంసకును బెండ్లి కనువిం దయ్యెన్సన్నుత పండితుం డని విశారదుఁ డంచు సమస్త విద్యలం బన్నుగ రాజనందనకు వంచనఁ జేసిరి పెండ్లి యన్నులన్ మిన్నకుఁ గాళిదాసునకు మేదిని మించిన వెఱ్ఱి వానికిం గన్నుల పండువై వెడఁగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే
అన్నుల మిన్న రుక్మిణి ననంతుడు కృష్ణుడు రాక్షసంబునన్బన్నుగ దెచ్చి ద్వారకను బందుగులందరు మెచ్చ గైకొనన్కన్నుల పండువై, వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనేచిన్నతనంబయో యనుచు జింతిలె రుక్మి వివేకహీనుడై
అన్నుల మిన్నయౌ రమను యామిని బోలిన గృష్ణమూర్తికిన్ జెన్నగు రీతినిన్మను వుజేసిరి పెద్దలు వింతరీతులన్ కన్నుల పండువై వెడగు కాకికి హంసకు పెండ్లియయ్యెనే నన్నరొ వారిపెండ్లికిమఱి యయ్యలు దమ్ములు హాజరైరిసూ
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: లోకము లేలెడి విష్ణువు వీకగ లక్ష్మిని వరించి పెండిలి యాడన్ నాకసదులు మది దల్చిరి కాకికి హంసకును బెండ్లి కనువిందయెన్.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:వెన్నుడు శ్వేత వర్ణమున వెల్గెడి లక్ష్మిని తా వరించియున్చెన్నుగ ప్రేమ తోడుతను చేకొని నుల్లసమొందు చుండగాకన్నులగాంచి దేవతలు కౌతుకమొప్పగ దల్చె నీవిధిన్కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే!
చీకటిలో కనిపించనిమాకృష్ణని మెరుపుహంస మనువాడిందే !లోకులు నవ్వుచు పలికిరికాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్”
కందం
రిప్లయితొలగించండిచేకొన హంసను బోలియు
శ్రీకృష్ణుని రుక్మిణి సతి శిశుపాలుఁడనెన్
శోకింపక బుధులకెటులఁ
గాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్?
శిశుపాలుని ఆవేదన...
తొలగించండిఉత్పలమాల
చిన్నది రుక్మిణీ మణి విశిష్టతఁ బోలుచు హంసయేయనన్
మన్నును దిన్న కృష్ణునటు మైకము నందున జేరినంతటన్
ఖిన్నులు గాక యీ బుధులు కీర్తనలెంచుచు నాలపింపఁగన్
గన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపోకిరి సొగసరి యొక్కడు
రిప్లయితొలగించండిచాకిరి చేసెడు మగువతొ చనువుగ మెసలెన్
తాకిన దానికి ఫలమై
కాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మగువతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చాకిరి చేయు సతితోడ చనువుగ..." అనండి.
రిప్లయితొలగించండిసోకునవెఱ్ఱిగగొల్లడు
చేకొనెవిద్యాధరినిగజేతగతానే
ఆకాళికదయజూపగ
కాకికిహంసకునుబెండ్లికనువిందయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాగా చెప్పారు
తొలగించండిమేకొని నల్లని పిల్లను
రిప్లయితొలగించండిచేకొన నాస్తులను గాంచి సిద్ధం బైనన్
వాకొనె గేలిగ నొకరుడు
"కాకికి హంసకును బెండ్లి కను విందయ్యెన్ "
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅన్నులమిన్నసౌబలునియన్నగబొందినసౌకుమారియా
చిన్నెలవింతసోయగముజిక్కెనుగుడ్డినకితండ్రియాజ్ఞతో
కన్నెగగట్టెగంతలనుకాంతయునాథునికష్టమెంచుచున్
కన్నులపండువైవెడగుకాకికిహంసకుబెండ్లియయ్యెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గుడ్డినకి'?
నతప్పుగాపడినది
తొలగించండి
రిప్లయితొలగించండిశ్రీకృష్ణుడు రుక్మిణి సతి
జేకొనె నని కినుకబూని చేది నృపుండౌ
యా కుటిలుడు పలికె నిటుల
కాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅన్నులమిన్న రుక్మిణి సుహాసిని కృష్ణుల పెండ్లి వేడ్కలా
మిన్నును దాకుచుండెనని మిత్రులు పేర్కొను చుండ గాంచి యా
పన్న పృథగ్జనుండు శిశు పాలుడు కోపము నందు పల్కెనే
కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మణి+ఏమొ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
కందం
తొలగించండిపోకిరి నల్లని వరుడున్
చేకొను కన్యా రతనము శ్వేతచ్ఛాయన్
కాకికి బింబ ఫలముగా
కాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
కేకికి కేకికి,కాకికి
రిప్లయితొలగించండికాకికి,హంసకునుఁబెండ్లి కనువిందయ్యెన్
శ్రీకరమౌ హంసికిని,క
వీ!కోకిలకుఁబికమునకు వినువీథులలోన్.
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఅన్నము లేకపోయిన నహర్నిశ
రిప్లయితొలగించండిముల్ తెగ త్రాగువానికిన్
పున్నమ చందమామవలె మోము
గలట్టి సుయోగ్య కన్యతో
దిన్నగ పెండ్లజేసిరట తెల్సిన వారలు విస్తుపోవరే!
కన్నులపండుగై వెడగు కాకికి హంసకు పెండ్లి జర్గినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిలోకమునందున వింతగ
రిప్లయితొలగించండికాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్
ఆకలి బాధలు బెరుగగ
చూకురు బూర్తిగ దొలగెడి చోద్యము గనమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్నులమిన్న మైథిలికి నందములో సరిజోడు రాముడే
రిప్లయితొలగించండితిన్నగ లేని శూర్పనఖ తీరగు రాముడు నచ్చి యిచ్ఛ తో
క్రన్నన బెండ్లియాడె, కల కమ్మని దైనను మాయలాడికిన్,
కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్నుల మిన్న కన్నియకు నందము చందముఁగల్గు వానితో
రిప్లయితొలగించండివెన్నెల రేయిలోజరుగు పెండ్లిని గాంచితి సత్కవీశ్వరా!
కన్నుల పండువై,వెడగు కాకికి
హంసకుఁబెండ్లియయ్యె?నే
విన్నది కాదు వీనులను,వీక్షణ సేయగ లేదు కన్నులన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండికన్నులులేనివాడొకడు కష్టములోర్చి గడించె విద్య తా
నన్నిట మిన్నయై సహృదయాత్మకుడై వికలాంగికన్యనే
యెన్నగ, వారి జంటఁగని నెల్లరు మెచ్చిరి సంబరమ్మునన్
“కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే”
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితిన్నగ మూర్ఖునొక్కడిని తీరిచి దిద్దుచు మంత్రి రాజుతో,
రిప్లయితొలగించండిమన్నన చేయుమయ్య తగు మంజుల కోమలి కీడు జోడనన్
కన్నుల పండువై వెడగు కాకికి, హంసకుఁ బెండ్లి యయ్యెనే,
యెన్నగఁ గాళిదాసతడె యేకవి రారుగ సాటి, వానితోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చెలువ లని రిటుల్" అనండి.
లోకోత్తముడగు యొంటరి
తొలగించండిచేకొని బెండ్లాడువేళ చెలువలనిరిటుల్
శ్రీకరముగ నిచ్చట నే
కాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్
వెన్నెలవెల్గుక్రొమ్మెరుగుపిన్నదిబీదకుపట్టినిచ్చెసం
రిప్లయితొలగించండిపన్నులబిడ్డడంచుపొరపాటయెనల్లనిమేఘుడంధుడున్
విన్నునుమన్నునొక్కటయెవేధదలంచినలీలచిత్రమే
*కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొన్నన మేని సౌష్ఠవము కుల్కువయారము లింపుగూర్చగన్
తొలగించండిచెన్నెసలారు పల్వరుస శీతనగాత్మజ యందు నొప్ప, సీ!
మిన్ను శిరోజపాశమట మేల్పులితోలు త్రినేత్రు నందు, హా!
కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిలోకమునందుననెన్నడు
రిప్లయితొలగించండికాకికి రాయంచ జోడి కానేరదుగా
ప్రాకటముగనిరుజంటలు
“కాకికి, హంసకును బెండ్లి కనువిందయ్యెన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమన్నన జేయలే రచట భానిని మానస మెంత నొచ్చునో
రిప్లయితొలగించండిమిన్నగు నాస్తిపాస్తులని మేడల మిద్దెల నాశరేపుచున్
అన్నుల మిన్ననేడ్వగను నందరు జేరియె కుట్ట్రపన్నగన్
కన్నులపండువై వెడగు కాకికి హంసకు బెండ్లి యయ్యెనే!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రన్నన పూనుచున్ శివుని కార్ముకమున్ మడియించి రాముడా
రిప్లయితొలగించండియన్నులమిన్న యైన జనకాత్మజఁ గూరిమి బెండ్లి యాడగా
కన్నులఁ గింకతో జయము కాంచని యీశులు పల్కిరివ్విధిన్
“కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే”
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:ఏ కాంత నచ్చ కుండుట
రిప్లయితొలగించండినేకాకిగ నున్న వీని కీ హంసశ్రీ
యే కడు నచ్చెగ! యీ యే
కాకికి హంసకును పెండ్లి కనువిందయ్యెన్.
(అతడు ఏకాకి గా ఉన్నాడు.చివరికి హంసశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు.హంసశ్రీ అనే అమ్మాయిని హంస అనటం సహజమే కదా!)
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఅయ్యా!ధన్యవాదం!
తొలగించండిఉ:కొన్ని ప్రయోగముల్ జరిపి కుక్కను,పిల్లిని గల్పి క్రొత్తగా
రిప్లయితొలగించండినున్న మరొక్క జీవమునె యుర్వికి జూపిరి శాస్త్రవేత్తలే
కన్నుల పండువై వెడగు కాకికి హంసకు బెండ్లి యయ్యెనే!
యెన్నగ నెట్లు సాధ్య మగు నీ గతి రెంటిని గల్ప సాధ్యమే ?
(కుక్కని,పిల్లిని కలిపి శాస్త్రవేత్తలు మరొక జాతిని తయారు చేశారు.అది నిజమే.కానీ కాకిని,హంసని అసలు కలపటం సాధ్యమా?అని సందేహం.)
వెన్నుడు నల్లనయ్యఁజనెవేగముగైకొనఁ గన్యకామణిన్
రిప్లయితొలగించండిచెన్నుగ గౌరినిన్గొలిచిఁజేఱగవచ్చెను రాజహంసయై
నన్నయు నడ్డుగానిలచినారడివెట్టుచు వెంబడించగన్
కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
చీకటిని బోలు కుసుమను
రిప్లయితొలగించండిరాకా చంద్రుండు వంటి రాహులు తోడన్
నేకము చేయగ పెద్దలు
కాకికి హంసకును బెండ్లికను విందయ్యెన్
వీఁక విహగ రాజములకుఁ
రిప్లయితొలగించండిగాకముతో హంస తోడ ఘనముగ ధర నా
హా కుజ కాసారమ్ములఁ
గాకికి హంసకును బెండ్లి కనువిం దయ్యెన్
సన్నుత పండితుం డని విశారదుఁ డంచు సమస్త విద్యలం
బన్నుగ రాజనందనకు వంచనఁ జేసిరి పెండ్లి యన్నులన్
మిన్నకుఁ గాళిదాసునకు మేదిని మించిన వెఱ్ఱి వానికిం
గన్నుల పండువై వెడఁగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే
అన్నుల మిన్న రుక్మిణి ననంతుడు కృష్ణుడు రాక్షసంబునన్
రిప్లయితొలగించండిబన్నుగ దెచ్చి ద్వారకను బందుగులందరు మెచ్చ గైకొనన్
కన్నుల పండువై, వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే
చిన్నతనంబయో యనుచు జింతిలె రుక్మి వివేకహీనుడై
అన్నుల మిన్నయౌ రమను యామిని బోలిన గృష్ణమూర్తికిన్
రిప్లయితొలగించండిజెన్నగు రీతినిన్మను వుజేసిరి పెద్దలు వింతరీతులన్
కన్నుల పండువై వెడగు కాకికి హంసకు పెండ్లియయ్యెనే
నన్నరొ వారిపెండ్లికిమఱి యయ్యలు దమ్ములు హాజరైరిసూ
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిలోకము లేలెడి విష్ణువు
వీకగ లక్ష్మిని వరించి పెండిలి యాడన్
నాకసదులు మది దల్చిరి
కాకికి హంసకును బెండ్లి కనువిందయెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండివెన్నుడు శ్వేత వర్ణమున వెల్గెడి లక్ష్మిని తా వరించియున్
చెన్నుగ ప్రేమ తోడుతను చేకొని నుల్లసమొందు చుండగా
కన్నులగాంచి దేవతలు కౌతుకమొప్పగ దల్చె నీవిధిన్
కన్నుల పండువై వెడగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే!
చీకటిలో కనిపించని
రిప్లయితొలగించండిమాకృష్ణని మెరుపుహంస మనువాడిందే !
లోకులు నవ్వుచు పలికిరి
కాకికి హంసకును బెండ్లి కనువిందయ్యెన్”