24, జనవరి 2022, సోమవారం

సమస్య - 3972

25-1-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంభకర్ణుని కంటికి కునుకె రాదు”
(లేదా...)
“కునుకే రాదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మి రీ మాటనే”
(మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి ధన్యవాదాలతో...)

24 కామెంట్‌లు:

  1. సతము‌ నిద్ర వచ్చు చునుండు సరస గతిని

    కుంభ కర్ణుని కంటికి , కునుకె రాదు

    వనము లో సుమిత్రానంద నునకు నెపుడు

    రామ సేవను‌ చేయు తలంపు‌తోడ

    రిప్లయితొలగించండి
  2. చంపె రాముడు రణమున శరము చేత
    కుంభకర్ణుని : కంటికి కునుకె రాదు
    కష్టములు చుట్టు ముట్టిన కార ణ మున
    సగటు మనిషికి నిజముగ సర్వ వేళ

    రిప్లయితొలగించండి
  3. గురువర్యులకు నమస్సులు, నిన్నటి సమస్యకు నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    చక్కగ కోడి పందెపు విశారదునిన్ వలె తమ్ముడొడ్డగా
    నక్క యటంచు చిత్రమగు నామము తో తన కోడి నంతటన్
    కుక్క గ పేరు పెట్టుచును కూరిమి నన్న వెలార్చ పందె మా
    కుక్కుటముల్ దలంపడగ గుక్క జయంబును గాంచె వింతగన్!
    ధన్యవాదములు
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  4. నమ్మి నేతకు ఓటివ్వ నాయకునకు
    ఏమి టుద్యోగికింకను యేమి మిగిలె
    శుష్క ప్రియములు, చేతలు శూన్యమయ్యె
    సమ్మెజేయంగ సకలము సఖ్యతగను
    కుంభకర్ణుని కంటికి కునుకె రాదు!


    రిప్లయితొలగించండి

  5. సర్వకాలము నిద్రించు సాల్వుడాత
    డగ్రజుండైన రావణు డానతివ్వ
    ప్రతిఘుల దునుమాడగ రణరంగ మందు
    కుంభ కర్ణుని కంటికి కునుకె రాదు.

    రిప్లయితొలగించండి
  6. అయ్యవారలవినతులనాలకింప
    సమయమీయకమంత్రియుజాగుసేయ
    సమ్మెసైరనుమ్రోగెనాశబ్దమునకు
    కుంభకర్ణునికంటికికునుకెరాదు

    రిప్లయితొలగించండి

  7. దనుజాగ్రేసరు డైన రావణునకున్ దమ్ముండు వాడేకదా

    యనిశమ్మాతడు నిద్రలో గడిపెడిన్ యజ్ఞారి వాడెప్పుడున్

    రణరంగమ్మును జోచ్చినంతనిక పారక్యుండ్రనే త్రుంచగన్

    గునుకే రాదట కుంభకర్ణునకు, లోకుల్ నమ్మి రీ మాటనే

    రిప్లయితొలగించండి
  8. ఆటవెలది

    వాణి జిహ్వఁజేరి,వలయు నిద్రయటంచు
    పలుకఁజేయ ,వరము బ్రహ్మ యొసగె
    కనుక నెపుడు//కుంభ కర్ణుని కంటికి
    కునుకె, రాదు //మెలకువనుట వినమె.

    రిప్లయితొలగించండి
  9. ఆరు ధనువుల పొడవైన మేరువతడు
    సర్వ వేళల యందు విశ్రాంతి గాదె
    కుంభకర్ణుని కంటికి; కునుకె రాదు
    నయనముల కాతనిన్ గన భయముతోడ

    రిప్లయితొలగించండి
  10. రంభరా మన్మథుని పూశరమ్ము నమ్ము
    యంద చందాలు డెందాల క్రందుజేయు
    కలికి కులుకుచు కడగంట గాంచెనేని
    కుంభకర్ణుని కంటికి కునుకె రాదు

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    వైరి పక్షమై లోకులవంకరాక
    పూర్తినిదురించె బయటను బొసఁగలేక
    గద్దెనెక్కిన దాది బొక్కసమునింప
    కుంభకర్ణుని కంటికి కునుకె రాదు!

    మత్తేభవిక్రీడితము
    పనిలేదంచును వైరిపక్షమున నింపారంగ గుర్వెట్టియున్
    జనులన్ పాలక పక్షమే మఱువ పోనాడంగ నోడించియున్
    ఘనులంచున్ గెలిపించి గద్దెనిడ మెక్కంగన్ బ్రలోభమ్మునై
    గునుకే రాదట కుంభకర్ణునకు! లోకుల్ నమ్మి రీ మాటనే!

    రిప్లయితొలగించండి
  12. పెద్ద వానతో బయలుపై పిడుగు ల రొద
    నెగడుచున్న కూడను మొద్దు నిదుర బోవు
    కుంభకర్ణుని కంటికి , కునుకె రాదు
    రేపటి దినముననె తొలి రేయి యనుచు

    రిప్లయితొలగించండి
  13. దనుజుల్ మోదియు గ్రుచ్చి బల్లెముల నిద్రాసక్తుడైయున్న వా
    నిని లేపంగ ప్రయత్నముల్ సలుపగానే లేచి వీక్షించగా
    హనుమన్ నీలుని యంగదాదులను నయ్యాజిన్,
    మహా భీతితో
    కునుకే లేదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మిరీ మాటనే!

    రిప్లయితొలగించండి
  14. వినడే రావణు డెంత చెప్పినను సంస్ఫేటంబు వారింపగా
    ఘనుడౌ రాముని పత్ని నిచ్చి నిలుపంగావచ్చు వంశంబు, నై
    నను బోరాడెద నంచు నెంచి తుద దా నారాయణున్ దల్చుచో,
    కునుకే రాదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మి రీ మాటనే

    సంస్ఫేటము-యుద్ధము

    రిప్లయితొలగించండి
  15. రాం కిడాంబి
    అన్న వినడట మేల్గోరి యన్న మాట
    ముందు లంకకు రాబోవు ముప్పు దలచి
    రామభద్రుని తలచి విరాగి కాగ
    కుంభకర్ణుని కంటికి కునుకె రాదు

    రిప్లయితొలగించండి
  16. ధనువున్ దాల్చిన రామచంద్రుడల యుద్ధమ్మందునన్ నిల్చినన్
    ఘనమౌ వానరసేన యుత్సుకతతోఁ గ్రవ్యాదులన్ గూల్చగా
    కనుపించన్ యమధర్మరాజె యెదుటన్ గాలంపు పాశమ్ముతో
    కునుకే రాదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మి రీ మాటనే

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. కునుకు వచ్చును నిరతము గుఱకతోడ
    కుంభకర్ణుని కంటికి ,కునుకె రాదు
    పరుల కాంతల యందున భ్రమలు గలుగ
    జూడ వలయును వారిని సోదరినిగ

    రిప్లయితొలగించండి
  19. కునుకే రాదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మిరీ మాటనే
    ననఘా! యేమని జెప్పనోపుదును మాయాజాలపున్ మాటకున్
    కునుకే రాదని కుంభకర్ణునకు లోకుల్ నమ్మిరా న్యాయమే?
    కునుకే వానికి నిత్యకృత్యములు మాకుంబెట్టె పుష్పంబులన్

    రిప్లయితొలగించండి
  20. తనకున్ సాటి గణింప శత్రువొకఁడౌద్ధత్యంబునన్ నిల్వగా
    ననుమోదంబును గూర్చబోదు పరమాన్నంబైన వైరస్యమౌ
    తనివిన్ దీర్పదనంగకేళి సురకాంతావ్రాత సంసర్గమున్
    కునుకే రాదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మి రీ మాటనే

    రిప్లయితొలగించండి
  21. ముజ్జగములకు రక్షణమ్మును దలంచి
    తపమునకు నింతయిన ఫలితమ్ము నొసఁగ
    నజుఁడు వర మీయ కున్నచో నవ్విధమ్ము
    కుంభకర్ణుని కంటికి కునుకె రాదు


    నినదమ్ముల్ శ్రవణమ్ములం బఱచినన్ నిర్ఘాత తుల్యమ్ములన్
    ఘనశూలమ్ములఁ బొడ్చినం గరులఁ ద్రొక్కం జేసినన్ మేనునన్
    ఘన నిద్రా రతు లేప నెవ్వరికి రక్షఃకాంతుఁ, బ్రాప్తించినం
    గునుకే, రాదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మి రీ మాటనే

    రిప్లయితొలగించండి
  22. పురసమస్యలు పట్టని పురుషు డతడు
    నగర పాలనసేయును నామమునకు
    వాన ధాటికి పురమున వరద పొంగె
    కుంభకర్ణుని కంటికి కునుకు రాదు

    రిప్లయితొలగించండి
  23. తేటగీతి
    రణములోన వధించెను రాఘవుండు
    కుంభకర్ణుని ,కంటికి కునుకె రాదు
    వనములోసంచరించిన వారమంత
    లక్ష్మణునకు రాముని సేవ లక్ష్యమవగ.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  24. సురవరుడు గాడు నెంచంగ నరుడు గాడు
    వానరమొకటి యరుదెంచి వనముకూల్చె
    ననెడివార్తనాలించుచు నసురుడైన
    కుంభకర్ణునికంటికికునుకురాదు

    రిప్లయితొలగించండి