31-1-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఆ తిరుమంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్”(లేదా...)“ఆ తిరుమంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్”
పతిగావేంకనదలచుచునతులంబగుభక్తినతడునాహంకృతితోనుతిసేయసనియెడాలరుఆతిరుమంత్రమ్మెయుసురునాహుతిగొనియెన్డాలరుశేషాద్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "భక్తి నత డహంకారముతో" అనండి.
కమలహాసన్ గారి దశావతారము సినిమాలో శైవులు వైష్ణవులపై చేసిన ఘాతుకం నేపథ్యంలో.. కందంఘాతక శైవులు విష్ణువుఁబ్రీతిగ జపియింపఁగ హరి విగ్రహమునకున్నాతని గట్టి జలధినిడఆ తిరుమంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్!ఉత్పలమాలఆతని వింటిరా కమలహాసను పేరిట చిత్రసీమలోజోతల నందుచున్ నటన శోభిల తీసె దశావతారమున్ఘాతక శైవులాతనినిఁ గట్టుచు మూర్తికి నీట త్రోయగానా తిరుమంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
🙏🙏🙏
సాతముభక్తినివేంకననాడాలరుపేరునగలనతడేవేగన్భూతలమందునగొలువగనాతిరుమంత్రమ్మెయుసురునాహుతిగొనియెన్
శంతనుసూనుడాయెడనుసంకటమందుచునంపశయ్యపైచింతలదీర్చుశ్రీహరినిచేసెనుప్రార్ధనమిక్కుటంబుగావంతలజన్మబంధములబాయగశాంతినిగోరువాడునైఆతిరుమంత్రమొక్కటియెయాహుతిగొన్నదినిండుప్రాణమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతిగ శ్రీహరి గొలిచెడుతాత గతాయువు గతపడు తరి క్రీస్తుకు తాదూతననుచు పలికె నొకండా తిరుమంత్రమ్మె యుసురు నాహుతి గొనియెన్.
ప్రీతిని ప్రహ్లాదుండేచేతంబున స్మరణఁజేయ చేకురె ఫలితంబా,తని తండ్రికి యకటా!యాతిరు మంత్రమ్మె యుసురు నాహుతిఁగొనియెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."తండ్రికి నకటా..." అని కదా ఉండాలి!
నమస్తేశంకరయ్యగారు! తండ్రికినకటా’యనే ఉండాలిధన్యవాదములు.
ఖ్యాతి గడించినట్టి పురమందున రాముని మందిరమ్మునన్ బ్రీతిగ నర్చనల్ జరుపు విజ్ఞతగల్గిన విప్రుడొక్కడున్ వాతము తో గతించ గన వచ్చిన క్రైస్తవు డిట్లు పల్కెనే యా తిరు మంత్రమొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్.
శ్రీహరి ద్వేషి యైన హిరణ్య కశ్యపుని దండన --ఆతత భక్తి పరుండై ప్రీతిగ శ్రీహరిని గొల్చు విప్రుని గనియున్ వ్రేతము తో హింసింపగ నా తిరు మంత్రమ్మె యుసురు నాహుతి గొనియెన్
ఆ తిరుమంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్కాతరు లైన వారి గృప గావగ నెంచె డనాథనాథుఁ, బ్రఖ్యాత మతిన్ దలంచె నరకాలయ ద్వారము దప్పుకొంటకైయాతడు పూర్వజన్మమున యజ్ఞము లేమియొనర్చెనోగదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నరకాలయ మార్గము/వాసము' అనండి.
నాతి!హిరణ్యకశ్యపునినాతియుగర్భముఁదాల్చనారదుండే తిరుమంత్రముందెలిపె నెంతయొ నేర్పుగ లోని బిడ్డకున్ఆతడె విష్ణుభక్తుఁడయె,నాతని తండ్రియుఁదిట్ట దైవమున్ఆతిరు మంత్రమొక్కటియె యాహుతిఁగొన్నది నిండుప్రాణముల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తాతకు మోక్షము నొసగెనుయా తిరుమంత్రమ్మె ; యుసురు నాహుతిఁ గొనియెన్పోతును గుండమున విడువచేతబడి కొరకు సలిపెడి చేష్టల నడుమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఒసగెను+ఆ' అన్నపుడు యడాగమం రాదు. "మోక్షమ్ము నొసగె । నా తిరు.." అనండి.
🙏🏽
యాతనలు తొలగ జేయగనీ తిరుమంత్రమె శరణము నిజభక్తులకున్జాతి మత విరోధనముననా తిరుమంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్
కందంమాత కనక దుర్గ గుడినరేతిరి మంత్రముల జదివిరి దురాత్మపరుల్చైతన్యశక్తి యుతమైనా తిరుమంత్రమ్మెయుసురు నాహుతి గొనియెన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.(విజయవాడలో దుర్గాదేవి గుడిలో పదవుల కోసం క్షద్రపూజలు జేసిన వార్త ఆధారము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "గుడిని" అనండి.
ఆతత నిష్ఠనుగొని నగజాతను శ్రీగౌరినామ జపమును సలుపన్మాత కరుణ ముక్తినొసగెనా తిరుమంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్
కాతరము వోవ హనుమను బ్రీతిని వేగావుమనుచు,వీనుల విందౌ నాతని మంత్రము జదువగ నాతిరుమంత్రమ్మె యుసురు నాహుతి గొనియెన్
ఏ తఱిని దాఁచ రానివిభూ తలమునఁ గొన్ని యుండుఁ బూరుషుఁ డొక్కండే తా దాఁచఁగ నట్టిదియా తిరు మంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్భీతి యొకింత లేక యవివేకపుఁ జింతన సాహసమ్మునంజూతమె యేమి యౌనొ యని శూరత దానిని నాచరింపఁగానాతని కంతఁ బాటిలఁగ నాపద ఘోరము కన్ను మూసెనే యా తిరు మంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్ [మంత్రము = ఆలోచన ]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
స్వాతికి రోగముందరికి వాటిలకుండగ జేసెనేగదా యాతిరుమంత్రమొక్కటియె,యాహుతి గొన్నదినిండుప్రాణమున్ జాతర జేయనెంచి జన సానువు మీదకు బైర్లుగమ్మియున్ నీతరపుం జనాళికిక నెట్లుగ జెప్పగ చాలముంగదా
భూతలవాసులెల్లరకు పూర్ణ శుభంబునొసంగు మార్గమౌనా తిరుమంత్ర మొక్కటియె; యాహుతి గొన్నది నిండు ప్రాణమున్ఘాతుకమా కిరాతునపకార గుణంబది గాని గాంచినన్పాతకు జేసె నాదికవి వర్యుని తారక మంత్ర స్ఫూర్తియే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
(సవరించిన పాఠం)భూతలవాసులెల్లరకు పూర్ణ శుభంబునొసంగు మార్గమౌనా తిరుమంత్ర మొక్కటియె; యాహుతి గొన్నది నిండు ప్రాణమున్ఘాతుకమా కిరాతునపకార గుణంబది గాని గాంచినన్పాతకు జేసె నాదికవివర్యుని తారక మంత్రమే సుమా
చేతనమొప్పగా ప్రభుత చెంతకు జేరెడుడబ్బుతోడ తాభీతిని వీడి రామునకు ప్రేముడి గట్టెను గొప్ప కోవెళన్భూతల రామభక్తుడగు పూజ్యుడుపొందెను జిత్రహింసలున్ఆ తిరు మంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్
పాతకములు దహియించునుచేతమునందున జపింప శీఘ్రముగానేఘాతుకముచేయనెంచగ*ఆ తిరుమంత్రమ్మె,, యుసురు నాహుతిఁ గొనియెన్”*ఏతిరుమంత్రమీయిలనునిమ్ముగ నెప్పుడు కాచుచున్నదోనాతిరుమంత్రశక్తినిటు యాతన పెట్టెడు రీతి గూర్చగన్నాతిరువెంకటేశుడికనాగ్రహమున్ కనపర్చి నంతనే*యాతిరుమంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్”*
పతిగావేంకనదలచుచు
రిప్లయితొలగించండినతులంబగుభక్తినతడునాహంకృతితో
నుతిసేయసనియెడాలరు
ఆతిరుమంత్రమ్మెయుసురునాహుతిగొనియెన్
డాలరుశేషాద్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భక్తి నత డహంకారముతో" అనండి.
కమలహాసన్ గారి దశావతారము సినిమాలో శైవులు వైష్ణవులపై చేసిన ఘాతుకం నేపథ్యంలో..
రిప్లయితొలగించండికందం
ఘాతక శైవులు విష్ణువుఁ
బ్రీతిగ జపియింపఁగ హరి విగ్రహమునకున్
నాతని గట్టి జలధినిడ
ఆ తిరుమంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్!
ఉత్పలమాల
ఆతని వింటిరా కమలహాసను పేరిట చిత్రసీమలో
జోతల నందుచున్ నటన శోభిల తీసె దశావతారమున్
ఘాతక శైవులాతనినిఁ గట్టుచు మూర్తికి నీట త్రోయగా
నా తిరుమంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏
తొలగించండిసాతముభక్తినివేంకన
రిప్లయితొలగించండినాడాలరుపేరునగలనతడేవేగన్
భూతలమందునగొలువగ
నాతిరుమంత్రమ్మెయుసురునాహుతిగొనియెన్
శంతనుసూనుడాయెడనుసంకటమందుచునంపశయ్యపై
రిప్లయితొలగించండిచింతలదీర్చుశ్రీహరినిచేసెనుప్రార్ధనమిక్కుటంబుగా
వంతలజన్మబంధములబాయగశాంతినిగోరువాడునై
ఆతిరుమంత్రమొక్కటియెయాహుతిగొన్నదినిండుప్రాణమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రీతిగ శ్రీహరి గొలిచెడు
తాత గతాయువు గతపడు తరి క్రీస్తుకు తా
దూతననుచు పలికె నొకం
డా తిరుమంత్రమ్మె యుసురు నాహుతి గొనియెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రీతిని ప్రహ్లాదుండే
రిప్లయితొలగించండిచేతంబున స్మరణఁజేయ చేకురె ఫలితం
బా,తని తండ్రికి యకటా!
యాతిరు మంత్రమ్మె యుసురు నాహుతిఁగొనియెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తండ్రికి నకటా..." అని కదా ఉండాలి!
నమస్తేశంకరయ్యగారు! తండ్రికినకటా’యనే ఉండాలి
తొలగించండిధన్యవాదములు.
రిప్లయితొలగించండిఖ్యాతి గడించినట్టి పురమందున రాముని మందిరమ్మునన్
బ్రీతిగ నర్చనల్ జరుపు విజ్ఞతగల్గిన విప్రుడొక్కడున్
వాతము తో గతించ గన వచ్చిన క్రైస్తవు డిట్లు పల్కెనే
యా తిరు మంత్రమొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీహరి ద్వేషి యైన హిరణ్య కశ్యపుని దండన --
రిప్లయితొలగించండిఆతత భక్తి పరుండై
ప్రీతిగ శ్రీహరిని గొల్చు విప్రుని గనియున్
వ్రేతము తో హింసింపగ
నా తిరు మంత్రమ్మె యుసురు నాహుతి గొనియెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ తిరుమంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్
రిప్లయితొలగించండికాతరు లైన వారి గృప గావగ నెంచె డనాథనాథుఁ, బ్ర
ఖ్యాత మతిన్ దలంచె నరకాలయ ద్వారము దప్పుకొంటకై
యాతడు పూర్వజన్మమున యజ్ఞము లేమియొనర్చెనోగదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నరకాలయ మార్గము/వాసము' అనండి.
నాతి!హిరణ్యకశ్యపునినాతియుగర్భముఁదాల్చ
రిప్లయితొలగించండినారదుం
డే తిరుమంత్రముందెలిపె నెంతయొ నేర్పుగ లోని బిడ్డకున్
ఆతడె విష్ణుభక్తుఁడయె,నాతని తండ్రియుఁదిట్ట దైవమున్
ఆతిరు మంత్రమొక్కటియె యాహుతిఁగొన్నది నిండు
ప్రాణముల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితాతకు మోక్షము నొసగెను
రిప్లయితొలగించండియా తిరుమంత్రమ్మె ; యుసురు నాహుతిఁ గొనియెన్
పోతును గుండమున విడువ
చేతబడి కొరకు సలిపెడి చేష్టల నడుమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఒసగెను+ఆ' అన్నపుడు యడాగమం రాదు. "మోక్షమ్ము నొసగె । నా తిరు.." అనండి.
🙏🏽
తొలగించండియాతనలు తొలగ జేయగ
రిప్లయితొలగించండినీ తిరుమంత్రమె శరణము నిజభక్తులకున్
జాతి మత విరోధనమున
నా తిరుమంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిమాత కనక దుర్గ గుడిన
రేతిరి మంత్రముల జదివిరి దురాత్మపరుల్
చైతన్యశక్తి యుతమై
నా తిరుమంత్రమ్మెయుసురు నాహుతి గొనియెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
(విజయవాడలో దుర్గాదేవి గుడిలో పదవుల కోసం క్షద్రపూజలు జేసిన వార్త ఆధారము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గుడిని" అనండి.
ఆతత నిష్ఠనుగొని నగ
రిప్లయితొలగించండిజాతను శ్రీగౌరినామ జపమును సలుపన్
మాత కరుణ ముక్తినొసగె
నా తిరుమంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాతరము వోవ హనుమను
రిప్లయితొలగించండిబ్రీతిని వేగావుమనుచు,వీనుల విందౌ
నాతని మంత్రము జదువగ
నాతిరుమంత్రమ్మె యుసురు నాహుతి గొనియెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏ తఱిని దాఁచ రానివి
రిప్లయితొలగించండిభూ తలమునఁ గొన్ని యుండుఁ బూరుషుఁ డొక్కం
డే తా దాఁచఁగ నట్టిది
యా తిరు మంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్
భీతి యొకింత లేక యవివేకపుఁ జింతన సాహసమ్మునం
జూతమె యేమి యౌనొ యని శూరత దానిని నాచరింపఁగా
నాతని కంతఁ బాటిలఁగ నాపద ఘోరము కన్ను మూసెనే
యా తిరు మంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్
[మంత్రము = ఆలోచన ]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిస్వాతికి రోగముందరికి వాటిలకుండగ జేసెనేగదా
రిప్లయితొలగించండియాతిరుమంత్రమొక్కటియె,యాహుతి గొన్నదినిండుప్రాణమున్
జాతర జేయనెంచి జన సానువు మీదకు బైర్లుగమ్మియున్
నీతరపుం జనాళికిక నెట్లుగ జెప్పగ చాలముంగదా
భూతలవాసులెల్లరకు పూర్ణ శుభంబునొసంగు మార్గమౌ
రిప్లయితొలగించండినా తిరుమంత్ర మొక్కటియె; యాహుతి గొన్నది నిండు ప్రాణమున్
ఘాతుకమా కిరాతునపకార గుణంబది గాని గాంచినన్
పాతకు జేసె నాదికవి వర్యుని తారక మంత్ర స్ఫూర్తియే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి(సవరించిన పాఠం)
తొలగించండిభూతలవాసులెల్లరకు పూర్ణ శుభంబునొసంగు మార్గమౌ
నా తిరుమంత్ర మొక్కటియె; యాహుతి గొన్నది నిండు ప్రాణమున్
ఘాతుకమా కిరాతునపకార గుణంబది గాని గాంచినన్
పాతకు జేసె నాదికవివర్యుని తారక మంత్రమే సుమా
చేతనమొప్పగా ప్రభుత చెంతకు జేరెడు
రిప్లయితొలగించండిడబ్బుతోడ తా
భీతిని వీడి రామునకు ప్రేముడి గట్టెను
గొప్ప కోవెళన్
భూతల రామభక్తుడగు పూజ్యుడు
పొందెను జిత్రహింసలున్
ఆ తిరు మంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్
పాతకములు దహియించును
రిప్లయితొలగించండిచేతమునందున జపింప శీఘ్రముగానే
ఘాతుకముచేయనెంచగ
*ఆ తిరుమంత్రమ్మె,, యుసురు నాహుతిఁ గొనియెన్”*
ఏతిరుమంత్రమీయిలనునిమ్ముగ నెప్పుడు కాచుచున్నదో
నాతిరుమంత్రశక్తినిటు యాతన పెట్టెడు రీతి గూర్చగన్
నాతిరువెంకటేశుడికనాగ్రహమున్ కనపర్చి నంతనే
*యాతిరుమంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్”*