25, జూన్ 2022, శనివారం

దత్తపది - 184

26-6-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
'మబ్బు - వాన - ముసురు - వరద'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఖాండవ దహన వృత్తాంతాన్ని
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. కడుపుమబ్బుగవెలబోయెకనలుదొరకు
    విష్ణువానకుచెలికాడువిందుజేసె
    విషముసురునకుదొలగెనువేగిరముగ
    కావరదమనుడుకిరీటిఖాండవమున
    దత్తపది, మబ్బు, వాన ముసురు, వరద

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    ఖాండవవనమబ్బు విజయునండనుండ
    ననలము దహింపగర్వాన, నాపనెంచ
    మిత్రబృంధముసురు ననిమిషవిభుఁడటఁ
    దరుమ నరుఁడస్త్రములు వరదత్తమయ్యె

    రిప్లయితొలగించండి
  3. దత్తపది
    మబ్బు-వాన-ముసురు-వరద
    తేటగీతి
    జబ్బు నయమగు నారోగ్య"మబ్బు "పార్థ!
    నేను వెడలెద ఘోరదా"వాన"లముగ
    కా"వర!ద"యతో;భక్షింతు ఖాండవంబు
    ముదముతో,నంచు ననలుండు "ముసురు" కొనియె.

    రిప్లయితొలగించండి

  4. చూడుమబ్బురమిదే జుహువానమదియేను
    . కసమస వనమునే కాల్చు వేళ

    మనమున్న వృక్షంబు మంటలో కాలక
    . క్షేమంబున నిలిచె చిత్రమేను

    వాయుసఖునిమంద పాలుడు కోర మ
    . మ్ముసురు తీయక ముదము తోడ

    వదిలెనా యగ్నిదేవర దయతోనని
    . తా జెప్పె నంతట తల్లితోడ


    ఖాండవవనము దహియించు కాలమందు
    సుతుల రక్షించు టెట్లంచు శోకమందు
    తల్లి జరితతో పలికెనా తనయు డైన
    విజ్ఞుడా జరితారియేపేర్మి తోడ.

    రిప్లయితొలగించండి
  5. పార్థ! జన"మబ్బు"రపడు దా"వాన"లమిది
    సుందర"ము సురు"చిరమునానందకరము
    ఖాండవ దహనమ్మున మన యండదండ
    కీలి దే"వర ద"హియించు వీలు గూర్చు

    రిప్లయితొలగించండి
  6. త్రాగి నటువంటి నేయిజీ ర్ణమగు కొఱకు
    వెళ్ళి దావాన లముగ ను వేగముగను
    కావర దయతో నన పార్ఢు గాండి వమున
    బాణ ధాటిచే యటవిని ముసురు జేయ
    జబ్బు నయమాయి యారోగ్య మబ్బు చుండె

    రిప్లయితొలగించండి
  7. అర్జునా! చూడ నీశౌర్య మబ్బురంబు
    పరచుకొనె విపినమునదవానలంబు
    నణగె దాహముసురుచిరమైన రీతి
    వీరవరదయాగుణ ధామ విజయ! నుతులు!

    రిప్లయితొలగించండి
  8. స్వాస్థ మబ్బు నాకని యగ్ని శరణు వేడి
    ఖాండవము గాల్చ గర్వాన గనలె నజుఁడు
    ముసురు కొనియెను మంటలు ముదము తోడ
    కరి వరద సాయ మున నప్డు కాలి పోయె

    రిప్లయితొలగించండి
  9. ఖాండ(వాన) నగ్ని కండవు నీవైన
    విజయ(మబ్బు) నీకు విజయ విను(ము
    సురు)చిరాచ్ఛయశము ధరనందు నీకను
    హరికి మ్రొక్కె క్రీడి (వరద)యనుచు.

    రిప్లయితొలగించండి
  10. అర్జునును అగ్నిదేవుడు సహాయము కోరిన సందర్భం
    తనువుకృశియించగ *ముసురు* కొని యజీర్తి
    బ్రహ్మ తెలుపగ నాఖాండవ వన *మబ్బు*
    రమగు మూలికలు కలిగి శమనమిచ్చు
    గ్రోలు మని, మిత్రభా *వాన* కూర్చుమేలు
    నర *వర! ద* యతో ననినగ్నిశరణు వేడె

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    తాను వనము సురుము జేసెదయనె కీలి
    కావర దయతోయని కోర కాంక్ష దీర్చె
    విజయుడంత, మబ్బువడిన విశ్వగోప్త
    వెడలె, దావానలమణగె కడుపు నిండ.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.
    విశ్వ గోప్త -ఇంద్రుడు.

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    యజ్ఞము సురులకు ప్రియత్వమబ్బు తరిని
    కృత మగును ఘృత జుహువాన జతయు కలియ
    ఒకపరి ఘృత మిడిన యలవోక నణచ
    దవమిదియె కీలి దేవర దహన పఱచె

    (ఘృతము: నేయి; అలవోక: మాంద్యము; దవము:అడవి; జుహువానము:అగ్ని)

    రిప్లయితొలగించండి
  13. ( అగ్ని దేవుడు నరనారాయణులతో)

    ఆజ్యమరగ కుండగ రోగ ‘మబ్బు’ ట గని
    వనము దిన కోరుచుంటి ,దే’వర ! ద’ య నిడి
    తా’ము , సురు’లప తినెదిరి
    తనివి దీర్చ
    గలరె మాధ’వా ! న’రుడ ! సాకతము జూపి

    రిప్లయితొలగించండి
  14. కరి వరద దయాన్వితుఁ డయి
    కర మబ్బురము సురు చిరముగ దవానలమే
    దరికొన ఖాండవ వనమున
    సురనాథు సుతుండు వోరె సురపతి తోడన్

    రిప్లయితొలగించండి
  15. శ్వేతకి సవమగ్నికజీ
    ర్ణీతినిడ దవానలంబు రేగెను మబ్బై.
    నంతట ఖాండవ ముసురై
    నంతకిరీటి వరదులే నుసాయమిడగన్

    రిప్లయితొలగించండి
  16. భక్తవరద తనువుబాధ హెచ్చెనుచూడు
    మబ్బురమగురీతి నగ్నితోడ
    త్వరితమురగిలించుదావానలమ్మును
    నివ్వనినిదహించు నిమ్ముసురును

    రిప్లయితొలగించండి