29, జూన్ 2022, బుధవారం

సమస్య - 4121

30-6-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె"
(లేదా...)
"కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా"
(డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

 1. తేటగీతి
  ఆది భిక్షువు దర్శించి యార్తివీడి
  యన్నపూర్ణ కృపాబ్దిఁ బ్రసన్నతఁగని
  గంగమున్కఁ గవిత్వాన గానమాడఁ
  గాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె

  ఉత్పలమాల
  ఆశగ వేల యోజనములార్తిఁ బ్రయాణమొనర్చి మీదటన్
  శ్రీ శివు నాదిభిక్షువు నశేషముగన్ దరిశింపఁ జేరినన్
  నాశనహేతువై ప్రళయనాట్యము సేయు కరోన కట్టడిన్
  గాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా!

  (కవికి + ఆంక్షలు = కవికాంక్షలు)

  రిప్లయితొలగించండి
 2. విశ్వనాధ దర్శనమొక వేడుకయ్యె
  కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె
  నేడదియొక చూడదగిన నెలగ మారె
  కనిన వుసిగొల్పు కవులను కవిత వ్రాయ

  రిప్లయితొలగించండి
 3. కాంక్ష లేమిని గోరుచు గాశి కేగి
  గంగ యందున మునుగుచు గంగ పాలు
  సేయు చుందురు కోరిక ల్సిత్ర మిచట
  కాశి కేగిన కవికి గాంక్షలు సెలంగె

  రిప్లయితొలగించండి
 4. వారణాసియుగలసినవైనమందు
  గంగయందునస్నానంబుగౌరమందె
  మనసునూహలలోకంబుమరపురాదు
  కాశికేగినకవికిఁగాంక్షలుసెలంగె

  రిప్లయితొలగించండి
 5. విశ్వవిద్యాలయాన ప్రవేశమొంద
  కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె
  నన్నపూర్ణపై శివునిపై నెన్నదగిన
  కావ్య ఖండికల్ రచియించె నవ్యరీతి

  రిప్లయితొలగించండి
 6. హే శివ! భారతోర్విపయి నెల్లెడ ధర్మము నిల్వగావలెన్,
  క్లేశములన్ని వీడవలె, క్షిప్రముగా నఘమన్నిరీతులన్
  నాశనమై తొలంగవలె నాకది చాలని మ్రొక్కుచుండె నా
  కాశికిఁ బోయినట్టి కవి, కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. క్లేశము లన్నియున్వదలిఖేదముబోవగవారణాసిలో
  ఈశునిగొల్వగాత్వరనునైదునునింద్రియవాంఛలడ్డునై
  భాసురమయ్యెమానసముభావనమాత్రమునూహసేయగా
  కాశికిఁబోయినట్టికవికాంక్షలుమిక్కుటమయ్యెనక్కటా

  రిప్లయితొలగించండి
 9. ఓమ్ నమశ్శివాయ ఘనమంత్రోక్తి మహిమ
  రంగదుత్తుంగ ఫేనతరంగ గంగ
  మునిగి ,శ్రీ విశ్వనాథుని మూర్తిఁగాంచ
  కాశికేగిన కవికి కాంక్షలు సెలంగె.

  రిప్లయితొలగించండి
 10. సర్వ సంగములు వదిలి శర్వుఁ గొలువ
  కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె
  విశ్వనాథుని శరణము వేడుకొనుచు
  శతక మొక్కటి వ్రాయనీశ్వరుని పైన

  రిప్లయితొలగించండి
 11. అంతు లేని వెతలు మది నావ హింప
  తొలగ చేయమనుచు వేడ దూర మున్న
  కాశికేగిన కవికి కాంక్షలు సెలంగె
  విశ్వనాథునిపై వ్రాయు వేడ్క కలిగె.

  రిప్లయితొలగించండి
 12. కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా
  ఆశలు లేక యుండుటకు నాశను బోవుదు రెల్ల వారునున్
  నీశ! విచిత్ర మిచ్చటను నీకవి కోరెను ధాన్య సంపదన్
  లేశము కూడ లేదు మతి లీలగ మాత్రము భక్తి భావమున్

  రిప్లయితొలగించండి

 13. జాహ్నవీ నదిలోన తా స్నానమాడి
  క్షణిక భోగాల విడనాడి చంద్రిలుడగు
  కరిమెడదొరఁ గొల్చి పరమ గతిని పొంద
  కాశికేగిన కవికిఁ గాంక్షలు సెలంగె.


  కాసులె ముఖ్యమంచు ఖలు కార్యము లెన్నియొ సల్పి పాపమున్
  వాసిగ మూటగట్టితి, భవాయనిఁ మున్గుచు మోక్షగామినై
  యా సితికంఠుఁ వేడెదనటంచు మనస్సున తాను దల్చుచున్
  కాశికిఁ బోయినట్టి కవి, కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా.

  రిప్లయితొలగించండి
 14. భక్తి భావము బెంపొంది పావనంపు
  కృత్యముల నెల్ల సల్పుచు కీర్తి నంది
  సంఘ సేవకు బూనుటే చాలు ననుచు
  కాశికేగిన కవికి కాంక్ష లు సెలo గె

  రిప్లయితొలగించండి
 15. తేటగీతి
  సంస్కృతాధ్యయన మొనరించ నుచితమని
  మేఘసందేశమను కావ్యమెంచి చదువ
  కాశి విద్యాలయమదియు ఖ్యాతి కెక్క
  కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె

  రిప్లయితొలగించండి
 16. కాశికిపోవుటన్న మది కాంక్షలనెల్ల పరిత్యజించి స
  ర్వేశుని దివ్యధామమును ప్రీతిగ జేరగ నిచ్చగించుటే
  కాశిపురాధివాసుపయి కావ్యము వ్రాయు తలంపుతో మదిన్
  కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా

  రిప్లయితొలగించండి
 17. తేటగీతి
  అందమైన సుందరికై తహతహలాడి
  పరమ ఛాందస యువకవి పారవశ్య
  గమనుడై బోవ, తమిళనగరమగు శివ
  కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 18. మున్న శివ భక్తుఁ డాతండు పుణ్య తీర్థ
  దర్శనమ్మునఁ దనదు స్వాంతమ్ము నందు
  మూర సద్భక్తి ముక్కంటి పూజల పయిఁ
  *గాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె*


  కాశి వినూత నాలయము కాంతులతో మిఱుమిట్లు గొల్పఁగా
  నాశగ సౌధ రాజముల నద్భుత మండప పంక్తిఁ గాంచఁగా
  లేశముగా వెలుంగ శివలింగము బిందు వనంగ వార్ధినిం
  *గాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా*

  రిప్లయితొలగించండి
 19. కాశికేగినకవికికాంక్షలుసెలంగె
  విశ్వనాథుని పద్యాలు విశ్వమందు
  పంచ?పరమాత్మ సేవగా నెంచుటౌను
  యన్నకోరిక గలుగంగ యల్లెకవిత.

  రిప్లయితొలగించండి
 20. కాశికేగి కన్నేమూయగా దలంచి
  గంగ మునిగిడి యా దుండి గణపతి గని
  కాశి శ్రీ రాశియని మోక్షంబు కోరి
  కాశి కేగిన కవికి గాంక్షలు సెలంగె

  రిప్లయితొలగించండి
 21. దేశము నందు తీర్ధములు తీరుగ నెల్లయు గాంచ నెంచుచున్
  కాశికి బోయినట్టి కవి కాంక్షలు మిక్కుటమయ్యె నక్కటా
  పాశము త్రెంచనెంచిమది వచ్చిన యాతనికయ్యెడన్ గనన్
  నాశలు రోజురోజుకును నత్యధికంబగుచుండెవింతగా
  రిప్లయితొలగించండి
 22. అంతు లేని వెతలు మది నావ హింప
  తొలగ చేయమనుచు వేడ దూర మున్న
  కాశికేగిన కవికి కాంక్షలు సెలంగె
  విశ్వనాథునిపై వ్రాయు వేడ్క కలిగె.


  వారణాసిలో వెలసిన పరమశివుని
  కన్ను లారంగ తృప్తి గా గాంచనెంచి
  కాశి కేగిన కవికి కాంక్షలు సెలంగె
  వాసముండి క్షేత్ర కథను వ్రాయగాను

  రిప్లయితొలగించండి