7-6-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా”(లేదా...)“శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో”
కందంశంకలు వలదింక భువినిపంకజలోచనుఁడె త్రుంచ పాపము చక్రాలంకృతుఁ డయ్యె దురిత నాశంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా!ఉత్పలమాలఇంక దురాగతమ్ముల సహింపగలేమన గోవు భద్రముల్పంకజలోచనుండు భువిఁ బాటిగ ధర్మము గావ మంగళాలంకృతుడౌచు శిష్టులకు రక్షణ గూర్పగ బుట్టె! దుష్ట నాశంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
జంకక లోక క్షేమమిడు జాహ్నవి దాల్చుకపర్ధతండుగాశంకరుఁడన్నఁ, బార్థునకు సారథియే యదు నందకృష్ణుడున్అంకురమయ్యెనీతలపుఆటగ నోపరి? క్రీడనంటిరా?"శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో"
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'లోక క్షేమ' మన్నపుడు 'క' గురువై గణభంగం. 'కపర్ది+అతండు' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'తలపు+ఆటగ' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు.
sari chEsaa nanDi..thank youజంకక లోక మేలతడు జాహ్నవి దాల్చుకపర్ధి తానెగాశంకరుఁడన్నఁ, బార్థునకు సారథియే యదు నందకృష్ణుడున్అంకురమయ్యెయిట్టితలపాటగ నోపరి? క్రీడనంటిరా?శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
వంకలవాగులదిరుగుచుబింకముతోడిదనదియునుబిందువునగుచున్అంకముజేరునునంబుధిశంకరుడననెవఁడుపార్థసారథియెగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందంపంకజనాభుండు హరుని,శంకువు హరిని మదిలోన జపమున్ సలుపన్శంకలు మనకేల నుడువశంకరుడన నెవడు పార్థసారథియె కదా.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
శంక పడెదవేల యటులమంకు విడిచి నే నుడివెడు మాటను వినుమా !సంకట ముల దొల గించేశంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదాశంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తొలగించే' అనడం వ్యావహారికం. 'తొలగించెడి' అనండి.
🙏🏽
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సంకట హరణుడు వాడె శుభంకరుడాతడె విరాట్టు పరమానందుండింకను ధీవుడు భక్తవశంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
శంకలతో సతమతమయిసంకట పడుచుండ బావ చక్కనిగీతన్జంకును దూరము జేసినశంకరుడన నెవడు పార్థసారథియె శంకలతో స్వబంధువుల జంపగ పాపమటంచువ్యగ్రతన్ సంకటమందుచున్ వదలి శస్త్రములన్ రథమందుగూల నాజంకును దొల్గజేయగను చక్కని గీతను బోధజేసి యావంకను బ్రహ్మవిద్యనిల బంచుచు జీవుల నుద్ధరించగాశంకరుడన్న పార్థునకు సారథియేగద శంకయేలనో
కందములో చివరిపాదంలో పార్థసారథియెగదా అని చదువ ప్రార్ధన!
బింకముతోడవైష్ణవుౄడుపెద్దనుఁజేసెనువిష్ణుదేవునిన్శంకనులేకశంకరునిసైచెనుభక్తినిశైవుడయ్యెడన్వంకలుదీర్పదైవములువందితులాయిరియేకరూపులైశంకరుడన్నపార్థునకుసారథియేకదశంకయేలనో
వైష్ణవుడు
పంకజ నాభుని మిత్రుడు సంకటముల దుడిచి పెట్టు శక్తియు తుండున్ నంకము నిచ్చెడు, భక్తవ శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
చక్కని పూరణ. అభినందనలు.
పంకజ నాభుడు కృష్ణుడు సంకట ములు బాప గొలిచి సాగిల బడినన్ జంకును మాన్పెడు భక్త వ శంకరుడన నెవడు పార్థ సారధి యె కదా !
మంచి పూరణ. అభినందనలు.
సంకట హారియై పడతి సత్యయె వేడిన యంత వేగ మాతంకము దీర్చినట్టి యధి దైవము వాడె త్రిమూర్తి వాడె క్షేమంకరుడాతడే గదర మాధవు డాతడే జీవకోటికిన్ శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అంకిలి తొలగించు ఘనుడుపొంకించిన గీతతోడ బ్రోచెడివాడున్వేంకట పతియన భక్తవశంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
ఓంకార విశ్వరూపముపంకజనాభుండు జూప భయపడె నరుఁడేశంకయిఁకేల?దురితనా*శంకరుఁడన నెవఁడుపార్థసారథియె కదా!*పంకజనాభ!కృష్ణ!యదువల్లభ!యుద్ధముఁజేయజాల నావంకను బంధు,మిత్ర,గురు వర్గము నాకని పల్కుక్రీడియేజంకగ విశ్వరూపమును చక్రియుఁజూపడె దుర్జనాళి నా*శంకరుఁడన్నఁబార్థునకు సారథియే కద శంకయేలనో!
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
శంకవలదింక హరికినిశంకరునకుభేదమెంచ శక్యమె భక్తవశంకరుడన శంకరుడేశంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
శంకలు మానగావలయు శంభుడు, గృష్ణులు నొక్కరే సుమాసంకట ముల్ దునాతునుక సల్పెడు వారలు వేరురూపులౌశంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనోనంకము జేర్చి భక్తులను నాదరమొప్పగ రక్షసేతురే
వేంకట పతివేషముతోయంకములోనిల్చినాడునతిశయమబ్బన్నింకొక నాటకమందునశంకరుఁడననెవఁడుపార్థసారథియెకదాకొరుప్రోలు రాధాకృష్ణ రావు
బింకముబూని శాత్రవుల భీకర సంగరమందు ఢీకొనన్శంకను వీడుమో విజయ! క్షత్రియ ధర్మము నిర్వహింపుమాపంకజనాభుడేను నినుఁబాయక తోడుగనుందు శత్రు నాశంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
అంకమునందు పండుకొని యమ్మ యశోదకు దీర్చిముచ్చటన్శంకయొకింతలేక కడు చక్కగ గోవుల గాచి కానలన్సంకటముల్ ఘటిల్ల వడి సాక ప్రజాళుల దైత్యకోటి నా శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
శంకను వీడుము మనకిలసంకటములుబాపువాడుజగతినచూడన్పంకజనాభుడు భక్త వశంకరుడననెవడు పార్థసారథియెకదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'జగతిని' అనండి.
కం// కింకరుఁడు మధుప్రియుడైశంకరుఁడన నెవఁడు ? పార్థసారథియె కదా !బింకముగా బలుకుచు తానింకొక భాష్యమ్ముజెప్పె నింపుగ ప్రజకున్ !!✍️ మల్లి సిరిపురం శ్రీశైలం.
పంకజ నాభుఁడు శ్రీవత్సాంకుండు రమా ధవుఁడు మహాభారత ఘోరాంక తలమ్మునఁ బాండవ శంకరుఁ డన నెవఁడు పార్థ సారథియె కదా పంకజ గర్భ దేవ గణ వల్లభ పూజిత సర్పరాజ పర్యంకుఁడు నవ్యయుండు పరమాత్ముఁడు భక్త జనౌఘ సంత తాతంక వినాశకుండు హరి త్రాతయు రక్షిత దైత్య భీతి మచ్ఛంకరుఁ డన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పంకజనాభు డార్తజన బాంధవుడా నివిడాఘ భార నాశంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనోసంకటహారియై నిలిచి సంగరరంగమునందు తోడుగాపంకిల పాపకూపగత పాలసులన్ నశియింప జేసెగా
కందం
రిప్లయితొలగించండిశంకలు వలదింక భువిని
పంకజలోచనుఁడె త్రుంచ పాపము చక్రా
లంకృతుఁ డయ్యె దురిత నా
శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా!
ఉత్పలమాల
ఇంక దురాగతమ్ముల సహింపగలేమన గోవు భద్రముల్
పంకజలోచనుండు భువిఁ బాటిగ ధర్మము గావ మంగళా
లంకృతుడౌచు శిష్టులకు రక్షణ గూర్పగ బుట్టె! దుష్ట నా
శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిజంకక లోక క్షేమమిడు జాహ్నవి దాల్చుకపర్ధతండుగా
రిప్లయితొలగించండిశంకరుఁడన్నఁ, బార్థునకు సారథియే యదు నందకృష్ణుడున్
అంకురమయ్యెనీతలపుఆటగ నోపరి? క్రీడనంటిరా?
"శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లోక క్షేమ' మన్నపుడు 'క' గురువై గణభంగం. 'కపర్ది+అతండు' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'తలపు+ఆటగ' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు.
sari chEsaa nanDi..thank you
తొలగించండిజంకక లోక మేలతడు జాహ్నవి దాల్చుకపర్ధి తానెగా
శంకరుఁడన్నఁ, బార్థునకు సారథియే యదు నందకృష్ణుడున్
అంకురమయ్యెయిట్టితలపాటగ నోపరి? క్రీడనంటిరా?
శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
వంకలవాగులదిరుగుచు
రిప్లయితొలగించండిబింకముతోడిదనదియునుబిందువునగుచున్
అంకముజేరునునంబుధి
శంకరుడననెవఁడుపార్థసారథియెగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిపంకజనాభుండు హరుని,
శంకువు హరిని మదిలోన జపమున్ సలుపన్
శంకలు మనకేల నుడువ
శంకరుడన నెవడు పార్థసారథియె కదా.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంక పడెదవేల యటుల
రిప్లయితొలగించండిమంకు విడిచి నే నుడివెడు మాటను వినుమా !
సంకట ముల దొల గించే
శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
శంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తొలగించే' అనడం వ్యావహారికం. 'తొలగించెడి' అనండి.
🙏🏽
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసంకట హరణుడు వాడె శు
భంకరుడాతడె విరాట్టు పరమానందుం
డింకను ధీవుడు భక్తవ
శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకలతో సతమతమయి
రిప్లయితొలగించండిసంకట పడుచుండ బావ చక్కనిగీతన్
జంకును దూరము జేసిన
శంకరుడన నెవడు పార్థసారథియె
శంకలతో స్వబంధువుల జంపగ పాపమటంచు
వ్యగ్రతన్
సంకటమందుచున్ వదలి శస్త్రములన్ రథమందు
గూల నా
జంకును దొల్గజేయగను చక్కని గీతను బోధజేసి యా
వంకను బ్రహ్మవిద్యనిల బంచుచు జీవుల నుద్ధరించగా
శంకరుడన్న పార్థునకు సారథియేగద శంకయేలనో
కందములో చివరిపాదంలో పార్థసారథియెగదా అని చదువ ప్రార్ధన!
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిబింకముతోడవైష్ణవుౄడుపెద్దనుఁజేసెనువిష్ణుదేవునిన్
రిప్లయితొలగించండిశంకనులేకశంకరునిసైచెనుభక్తినిశైవుడయ్యెడన్
వంకలుదీర్పదైవములువందితులాయిరియేకరూపులై
శంకరుడన్నపార్థునకుసారథియేకదశంకయేలనో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివైష్ణవుడు
రిప్లయితొలగించండిపంకజ నాభుని మిత్రుడు
రిప్లయితొలగించండిసంకటముల దుడిచి పెట్టు శక్తియు తుండున్
నంకము నిచ్చెడు, భక్తవ
శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిపంకజ నాభుడు కృష్ణుడు
రిప్లయితొలగించండిసంకట ములు బాప గొలిచి సాగిల బడినన్
జంకును మాన్పెడు భక్త వ
శంకరుడన నెవడు పార్థ సారధి యె కదా !
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసంకట హారియై పడతి సత్యయె వేడిన యంత వేగ మా
తంకము దీర్చినట్టి యధి దైవము వాడె త్రిమూర్తి వాడె క్షే
మంకరుడాతడే గదర మాధవు డాతడే జీవకోటికిన్
శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅంకిలి తొలగించు ఘనుడు
రిప్లయితొలగించండిపొంకించిన గీతతోడ బ్రోచెడివాడున్
వేంకట పతియన భక్తవ
శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిఓంకార విశ్వరూపము
రిప్లయితొలగించండిపంకజనాభుండు జూప భయపడె నరుఁడే
శంకయిఁకేల?దురితనా
*శంకరుఁడన నెవఁడుపార్థసారథియె కదా!*
పంకజనాభ!కృష్ణ!యదువల్లభ!యుద్ధముఁజేయజాల నా
వంకను బంధు,మిత్ర,గురు వర్గము నాకని పల్కుక్రీడియే
జంకగ విశ్వరూపమును చక్రియుఁజూపడె దుర్జనాళి నా
*శంకరుఁడన్నఁబార్థునకు సారథియే కద శంకయేలనో!
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకవలదింక హరికిని
రిప్లయితొలగించండిశంకరునకుభేదమెంచ శక్యమె భక్తవ
శంకరుడన శంకరుడే
శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకలు మానగావలయు శంభుడు, గృష్ణులు నొక్కరే సుమా
రిప్లయితొలగించండిసంకట ముల్ దునాతునుక సల్పెడు వారలు వేరురూపులౌ
శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
నంకము జేర్చి భక్తులను నాదరమొప్పగ రక్షసేతురే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేంకట పతివేషముతో
రిప్లయితొలగించండియంకములోనిల్చినాడునతిశయమబ్బన్
నింకొక నాటకమందున
శంకరుఁడననెవఁడుపార్థసారథియెకదా
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
బింకముబూని శాత్రవుల భీకర సంగరమందు ఢీకొనన్
రిప్లయితొలగించండిశంకను వీడుమో విజయ! క్షత్రియ ధర్మము నిర్వహింపుమా
పంకజనాభుడేను నినుఁబాయక తోడుగనుందు శత్రు నా
శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅంకమునందు పండుకొని యమ్మ యశోదకు దీర్చిముచ్చటన్
రిప్లయితొలగించండిశంకయొకింతలేక కడు చక్కగ గోవుల గాచి కానలన్
సంకటముల్ ఘటిల్ల వడి సాక ప్రజాళుల దైత్యకోటి నా
శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిశంకను వీడుము మనకిల
రిప్లయితొలగించండిసంకటములుబాపువాడుజగతినచూడన్
పంకజనాభుడు భక్త వ
శంకరుడననెవడు పార్థసారథియెకదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జగతిని' అనండి.
కం//
రిప్లయితొలగించండికింకరుఁడు మధుప్రియుడై
శంకరుఁడన నెవఁడు ? పార్థసారథియె కదా !
బింకముగా బలుకుచు తా
నింకొక భాష్యమ్ముజెప్పె నింపుగ ప్రజకున్ !!
✍️ మల్లి సిరిపురం శ్రీశైలం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపంకజ నాభుఁడు శ్రీవ
రిప్లయితొలగించండిత్సాంకుండు రమా ధవుఁడు మహాభారత ఘో
రాంక తలమ్మునఁ బాండవ
శంకరుఁ డన నెవఁడు పార్థ సారథియె కదా
పంకజ గర్భ దేవ గణ వల్లభ పూజిత సర్పరాజ ప
ర్యంకుఁడు నవ్యయుండు పరమాత్ముఁడు భక్త జనౌఘ సంత తా
తంక వినాశకుండు హరి త్రాతయు రక్షిత దైత్య భీతి మ
చ్ఛంకరుఁ డన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిపంకజనాభు డార్తజన బాంధవుడా నివిడాఘ భార నా
రిప్లయితొలగించండిశంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో
సంకటహారియై నిలిచి సంగరరంగమునందు తోడుగా
పంకిల పాపకూపగత పాలసులన్ నశియింప జేసెగా