16, జూన్ 2022, గురువారం

సమస్య - 4110

17-6-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రమ శివపత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్”
(లేదా...)
“రమ శివపత్నియై మహిషు ప్రాణములం గొనె సంగరంబునన్”

30 కామెంట్‌లు:

 1. అమలినమూలముతానై
  సుమకోమలసొబగులన్నిశూరతనందన్
  ఉమగనుసంగరమందుప
  రమశివపత్నిగమహిషునిప్రాణములగొనెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కోమల సొబగులు' దుష్టసమాసం. "కోమల శోభలన్ని శూరత గనగా । నుమగను..." అనండి.

   తొలగించండి
 2. కందము
  ఉమ,పార్వతి,భైరవి,గౌ
  రి,మనస్విని,గిరిజ,శాంకరి,భవాని,శివా
  ని,మలయవాసిని,సతి,రు
  *ద్రమ,శివపత్నిగ మహిషుని ప్రాణములు గొనెన్.*

  రిప్లయితొలగించండి

 3. రమ యన దాక్షాయణిగద
  రమనున్ శివపత్ని యనుట రమణా! సబబే
  విమల మనస్కియై ననునా
  రమ శివపత్నిగ మహిషుని ప్రాణముల గొనెన్

  రిప్లయితొలగించండి
 4. సమసె కుపితయై దక్షుని
  కుమారిగ , దదుపరి యామెకు జనకుడయ్యెన్
  హిమవంతుడు దల్లి మనో
  రమ , శివపత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్

  రిప్లయితొలగించండి

 5. సుమగాత్రి నగజ ఘోరత
  పమొనర్చి జగమ్మునేలు ప్రాజంగము వే
  డిమికన్దొర యైనట్టి ప
  రమశివపత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్.

  రిప్లయితొలగించండి
 6. సమరాంగణమున శాంభవి
  సమధిక నైపుణ్య రీతి సల్పిన రణమున్
  సమరస్పూర్తిని బొగడ త
  రమ శివపత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్

  రిప్లయితొలగించండి
 7. అమరుల సంరక్షింపగ
  యుమ దుర్గగ నవతరించి యుద్ధతి గదురన్
  గమకించి పోరు సలిపి ప
  రమ శివపత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్

  రిప్లయితొలగించండి

 8. విమల మనస్కురాలయును భీకర యుద్ధము సాహసంబుతో
  నరియగు రాక్షసాధమునినాయువు పట్టునవేసిబాణముల్
  రమయనబార్వతీసతియు,రమ్యసులోచనిగారణంబునన్
  రమ శివపత్నియై ,మహిషు ప్రాణములంగొనె సంగరంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనస్కురాలు ఘన భీకర...' అనండి.

   తొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  దమనము జేయుచు జనతను
  ప్రమధన మొనరించి సాగు రాక్షసు నుమయే
  సమరము సల్పి వడిగల ప
  రమ శివపత్నిగ మహిషుని ప్రాణముల గొనెన్.

  దమనము జేయుచుండి జనతన్ బరిమార్చుచు ధారణమ్ములో
  నమలముగాని పద్ధతుల నాచరణమ్ము నొనర్చుచున్ సదా
  భ్రమణము సల్పు దానవుని పంతముతో నగజాత కాళి ధీ
  రమ శివపత్నియై మహిషు ప్రాణములంగొనె సంగరంబునన్.

  రిప్లయితొలగించండి
 10. ప్రవిమల యశో విభూషిత
  సుమధుర గాత్రిగ వెలసియు సురలను గావన్
  సమరము నందున నా ధీ
  రమ శివపత్నిగ మహిషుని ప్రాణములు గొ నెన్

  రిప్లయితొలగించండి
 11. కందం
  గమనించె నమ్మ దుర్మా
  ర్గముల సలిపెడి మహిషాసురాధము నంతన్
  సమరము సాగించి ,నుమ ప
  రమ శివపత్నిగ మహిషుని ప్రాణముల గొనెన్
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 12. అమలపు మానసమ్ము హరు నర్చన చేసి కరమ్ము భక్తితో
  సుమమును బోలు పోడిమిని చొక్కగజేయుచు కాలకంఠు క్షే
  మము కలిగింపగా ప్రజకు మంగళ దాయక, పూనికన్ మనో
  రమ, శివపత్నియై మహిషు ప్రాణములంగొనె సంగరంబునన్

  రిప్లయితొలగించండి
 13. రిప్లయిలు
  1. కందం
   దమనమునాపుచు జగతిని
   సమయస్ఫూర్తిని దయగన సాధుజనాళిన్
   హిమనగ సుత కరుణకు సం
   ద్రమ శివపత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్

   చంపకమాల
   దమనము నాపుచున్ జగతి ధైర్యము నింపుచు శిష్టరక్షణన్
   శమథము గూర్చు మాతగ వినాశనమెంచెడు ధూర్తుఁడంచు నా
   హిమనగ సూన గౌరి జగదీశ్వరి శ్రీకరి శీఘ్రమే గృపా
   రమ శివపత్నియై మహిషు ప్రాణములం గొనె సంగరంబునన్!

   తొలగించండి
 14. కమలాయతాక్షి మదగజ
  గమన మదిఁ దలంచి లోక కల్యాణమ్మున్
  విమల మతి యుమా దేవి ప
  రమ శివ పత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్


  సమధిక సర్వ మంగళ విశాల మృగేక్షణ దుష్ట శిక్షణా
  ర్థము కరుణార్ద్ర చిత్త ధృతి రక్త విలోచన భద్రకాళి నా
  మ మడర లోక కంటకుని మానిని పార్వతి ఫాలనేత్ర హృ
  ద్రమ శివపత్నియై మహిషు ప్రాణములం గొనె సంగరంబునన్

  రిప్లయితొలగించండి

 15. ప్రమథ గణాధి నాథుడగు పన్నగ భూషణు డగ్నివక్త్రునిన్

  కొమ నగజాతయే పతిగ గోరుచు ఘోరతపమ్ము జేయ నా

  హిమజననుగ్రహింప పరమేశ్వరు డంబరకేశునిన్ మనో

  రమ శివపత్నియై మహిషు ప్రాణములం గొనె సంగరంబునన్.

  రిప్లయితొలగించండి
 16. కమలాక్షుని యెద నమరెను
  *"రమ శివపత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్”*
  హిమవంతునిసుతయౌయుమ
  సమరమునందతిసులువుగశంకరుదయతో.


  హిమగిరినందిని యష్టభు
  జములొప్పారంగనాది శక్తిరయముగా
  నమరుల మొరలాలించిప
  రమశివపత్నిగ మహిషుని ప్రాణములు గొనెన్

  రిప్లయితొలగించండి
 17. చం:అమరుల యార్తి బాప, కుసుమాభ మృదుత్వము వీడి, రుద్రు తే
  జము దన యందె చూపుచు,ప్రజన్ గరుణించుచు, దివ్యశక్తి ద
  ర్పము వహియించి నిల్చి ,హిమపర్వతరాజవిశుద్ధవంశహృ
  ద్రమ శివపత్నియై మహిషు ప్రాణములం గొనె సంగరంబునన్*
  (ఆ హిమలయ పుత్రిక తన చల్లదనం వదలి రుద్రత్వాన్ని తానే పొంది మహిషుణ్ని సంహరించింది.ఆమె పర్వతరాజవంశహృదయం లో రమించే ప్రేమపాత్రురాలు.)

  రిప్లయితొలగించండి