1-7-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు”(లేదా...)“పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవండ్రతో”
దుషుటవైరులనట్టులఁదూలనాడిఅష్టవంకరపలుకులనాడవలయుననుచుగురుడునుజెప్పెగానైకరూపైపంతులేజెప్పెఁదప్పులపలుకుమనుచు
అంతయుమిథ్యయంచునటనందినభావనరక్తిలేకయున్సుంతయుభాషయందుఘనసూచికడిగ్రియుపట్టిగొప్పగావింతలౄజూపునేగురుడువిజ్ఞతలేకనువీరుడయ్యెనేపంతులెతప్పులంబలుకవచ్చనిఁజెప్పెనుపిల్లవండ్రతో
పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు ననెడు పలుకు విన వలసి నందు లకు పు రంద రేశ్వరి! కుత కుత లాడె మనసు పంతు లనగ నతని యిక భావ్య మగునె
పైన గలపంతులు బడికి వచ్చినపుడుపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచువాస్తవంబగు విషయము కాస్త దాచిగొప్పదైన ప్రదర్శన ముప్పతిల్లపంతులు=అధికారి
కొత్తగ బడికొచ్చినబాలగోపడనునొక బాలుడు చదువడు ఉలుకు పలుకు లేదు పంతులే చెప్పె దప్పులబలుకు మనుచుపద్యముల సవరించెద ప్రతిపదంబె
పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో వింతగ నుండె బాల !విన వీనుల కిప్పుడు పిల్ల వాండ్రతో ఁబంతులె సెప్పెనా రనుట, పాడియె చెప్పుడు మీర లందఱున్ సుంతయు బుద్ధి లేని బహు చోద్యపు మానిసి యై మెలంగు నే
ఎన్నిమారులు చెప్పిననేమి ఫలముపదములను తాను తప్పుగా బలుకుచుండవిసిగి వేసారి చివరకు వెతను చెందిపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
ఎంతటి పండితుండయిన నేమిఫలంబొనగూడు వానికిన్వింతగనెంత చెప్పినను వీసము ధారణయైన లేనిచోచింతిలి మిక్కుటంబుగను చేయునదేమియు లేక వేసటన్పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో
చదువు జెప్పుటను పరీక్ష సలుప వచ్చిపూర్వమున్న పంతులె నేర్పె మొగిగ ననబామము నణచుకొని పాత పాఠములనుపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
ప్రభువగు హిరణ్య కశ్యపున్ బలుకు మేరననిశము హరినామమ్మది యలుపులేకతలచు చుండప్రహ్లాదుని వలదనుచును పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు.ఎంతగ చెప్పినన్ వినక హీనుని భూరిని నందయంతుడే సంతతమున్ స్మరింపగని సత్వరమందున చంమార్కులన్ చెంతకు బిల్చి మాన్పవలె శ్రీహరినామమటంచు చెప్పగా పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో
తేటగీతిబడికి విద్యాధికారులు వచ్చినపుడువారి మెప్పును పొందగఁగోరి యౌర!కొంతమందిని యొప్పులు,కొంతమందిఁ*బంతులే చెప్పెఁదప్పులఁబలుకుమనుచు.*ఉత్పలమాలఅంతట పర్యవేక్షణకునై యధికారులు పాఠశాలకున్సంతసమొప్ప రాగఁగని సారెకు సారెకు కొంతమందియే*పంతులు తప్పులంబలుక వచ్చని చెప్పెను, పిల్లగాండ్రతో*నంతియెగాక కొందఱికి నాజ్ఞయిడెన్ మఱి యొప్పుఁబల్కగన్. -----------దువ్వూరి రామమూర్తి.
సవరణ:రెండవ పద్యము 4వ పాదములో "కొందఱికి నాజ్ఞనిడెన్"
ఎంతగ నేర్పునో యనుచు నెంచగ వచ్చిన పెద్దలం దరున్పొంతము లేని రీతిగనె పూర్వపు పంతులె మేలనంగనేపంతము పట్టినట్లుగనె పాతవి పాఠము లన్ని తెచ్చుచున్పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవండ్రతో
తేటగీతిగీతముల నేర్చి యదియె సంగీతమన్చుపొట్టకూటికి సరిపడ పొద్దు గడువటక్కరి తన సంగీత పాఠముల కూర్చుపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
టక్కరి తన/టక్కరితన
తప్పు లన్ని దిద్దు శిష్యులదైవ మట్లు మార్గ దర్శ న జేసెడు మాన్యు డెట్లు పంతులే చెప్పు తప్పుల బలుకు మనుచు? నెవరు నమ్మరీ మాటల నెచట నైన
తేటగీతిమగువల విషయంబందున మనువులందుప్రాణమానాది విత్తంపు భంగమందుచకిత గో, విప్ర జన్మ రక్షణములందుపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచుఉత్పలమాలఇంతులఁ గూర్చియున్, మనువులేర్పడఁ జూచెడు వేళలందుఁ బ్రాణాంతకమందు, మానమును, నార్థిక భంగము నిల్పుటందునన్చెంతకు గో పురోహితులు చేరగ భీతిని కాచుటందునన్పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో!
తేటగీతితెంపరితన మాటలుగనే తెలియ దగునుపంతులే చెప్పు దప్పులే బలుకమనుచుయనగ, పరికించ గురువులు యనగ మార్గదర్శకులు సమాజమునకు ధర్మ మరయ.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
తప్పులను నేర నింపుగ నొప్పు లెల్లఁ దెల్లము లగుఁ దత్క్షణ మిది కల్ల కాదు మాన కన్య విద్యార్థుల మాట లందుఁ బంతులే చెప్పెఁ దప్పులఁ బలుకు మనుచువింత యనంగ నేల యిది విద్యలు నేర్పెడు రీతు లందు నొక్కింత విభిన్న మార్గ మగు నెల్లరి క్రీడ యనంగ నొప్పు నిశ్చింతగఁ జక్కఁగన్ బడుల శిష్యుల నేర్పు గణింప నెంచుచుం బంతులె తప్పులం బలుక వచ్చని చెప్పెను బిల్లవాండ్రతో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఒకటవ తరగతి గదిలో నొకని లేపిపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు”*మరియొక నిలేపి సవరించుమనుచు పలుక వల్లె యనుచు చేసిరటులే వాసి గానుమూడడుగుల నొసంగి నా ముప్పు తప్పదనుచుబలిచక్రవర్తితో న నునయముగపంతులేచెప్పె తప్పులు పలుకుమనుచుకల్లలాడంగ నిప్పుడు కాదు తప్పు
దుషుటవైరులనట్టులఁదూలనాడి
రిప్లయితొలగించండిఅష్టవంకరపలుకులనాడవలయు
ననుచుగురుడునుజెప్పెగానైకరూపై
పంతులేజెప్పెఁదప్పులపలుకుమనుచు
అంతయుమిథ్యయంచునటనందినభావనరక్తిలేకయున్
రిప్లయితొలగించండిసుంతయుభాషయందుఘనసూచికడిగ్రియుపట్టిగొప్పగా
వింతలౄజూపునేగురుడువిజ్ఞతలేకనువీరుడయ్యెనే
పంతులెతప్పులంబలుకవచ్చనిఁజెప్పెనుపిల్లవండ్రతో
పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
రిప్లయితొలగించండిననెడు పలుకు విన వలసి నందు లకు పు
రంద రేశ్వరి! కుత కుత లాడె మనసు
పంతు లనగ నతని యిక భావ్య మగునె
పైన గలపంతులు బడికి వచ్చినపుడు
రిప్లయితొలగించండిపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
వాస్తవంబగు విషయము కాస్త దాచి
గొప్పదైన ప్రదర్శన ముప్పతిల్ల
పంతులు=అధికారి
కొత్తగ బడికొచ్చినబాలగోపడనునొక
రిప్లయితొలగించండిబాలుడు చదువడు ఉలుకు పలుకు లేదు
పంతులే చెప్పె దప్పులబలుకు మనుచు
పద్యముల సవరించెద ప్రతిపదంబె
పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో
రిప్లయితొలగించండివింతగ నుండె బాల !విన వీనుల కిప్పుడు పిల్ల వాండ్రతో ఁ
బంతులె సెప్పెనా రనుట, పాడియె చెప్పుడు మీర లందఱున్
సుంతయు బుద్ధి లేని బహు చోద్యపు మానిసి యై మెలంగు నే
ఎన్నిమారులు చెప్పిననేమి ఫలము
రిప్లయితొలగించండిపదములను తాను తప్పుగా బలుకుచుండ
విసిగి వేసారి చివరకు వెతను చెంది
పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
ఎంతటి పండితుండయిన నేమిఫలంబొనగూడు వానికిన్
రిప్లయితొలగించండివింతగనెంత చెప్పినను వీసము ధారణయైన లేనిచో
చింతిలి మిక్కుటంబుగను చేయునదేమియు లేక వేసటన్
పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో
చదువు జెప్పుటను పరీక్ష సలుప వచ్చి
రిప్లయితొలగించండిపూర్వమున్న పంతులె నేర్పె మొగిగ నన
బామము నణచుకొని పాత పాఠములను
పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
రిప్లయితొలగించండిప్రభువగు హిరణ్య కశ్యపున్ బలుకు మేర
ననిశము హరినామమ్మది యలుపులేక
తలచు చుండప్రహ్లాదుని వలదనుచును
పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు.
ఎంతగ చెప్పినన్ వినక హీనుని భూరిని నందయంతుడే
సంతతమున్ స్మరింపగని సత్వరమందున చంమార్కులన్
చెంతకు బిల్చి మాన్పవలె శ్రీహరినామమటంచు చెప్పగా
పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో
తేటగీతి
రిప్లయితొలగించండిబడికి విద్యాధికారులు వచ్చినపుడు
వారి మెప్పును పొందగఁగోరి యౌర!
కొంతమందిని యొప్పులు,కొంతమందిఁ
*బంతులే చెప్పెఁదప్పులఁబలుకుమనుచు.*
ఉత్పలమాల
అంతట పర్యవేక్షణకునై యధికారులు పాఠశాలకున్
సంతసమొప్ప రాగఁగని సారెకు సారెకు కొంతమందియే
*పంతులు తప్పులంబలుక వచ్చని చెప్పెను, పిల్లగాండ్రతో*
నంతియెగాక కొందఱికి నాజ్ఞయిడెన్ మఱి యొప్పుఁబల్కగన్.
-----------దువ్వూరి రామమూర్తి.
సవరణ:రెండవ పద్యము 4వ పాదములో "కొందఱికి నాజ్ఞనిడెన్"
రిప్లయితొలగించండిఎంతగ నేర్పునో యనుచు నెంచగ వచ్చిన పెద్దలం దరున్
రిప్లయితొలగించండిపొంతము లేని రీతిగనె పూర్వపు పంతులె మేలనంగనే
పంతము పట్టినట్లుగనె పాతవి పాఠము లన్ని తెచ్చుచున్
పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవండ్రతో
తేటగీతి
రిప్లయితొలగించండిగీతముల నేర్చి యదియె సంగీతమన్చు
పొట్టకూటికి సరిపడ పొద్దు గడువ
టక్కరి తన సంగీత పాఠముల కూర్చు
పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
టక్కరి తన/టక్కరితన
తొలగించండితప్పు లన్ని దిద్దు శిష్యులదైవ మట్లు
రిప్లయితొలగించండిమార్గ దర్శ న జేసెడు మాన్యు డెట్లు
పంతులే చెప్పు తప్పుల బలుకు మనుచు?
నెవరు నమ్మరీ మాటల నెచట నైన
తేటగీతి
రిప్లయితొలగించండిమగువల విషయంబందున మనువులందు
ప్రాణమానాది విత్తంపు భంగమందు
చకిత గో, విప్ర జన్మ రక్షణములందు
పంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు
ఉత్పలమాల
ఇంతులఁ గూర్చియున్, మనువులేర్పడఁ జూచెడు వేళలందుఁ బ్రా
ణాంతకమందు, మానమును, నార్థిక భంగము నిల్పుటందునన్
చెంతకు గో పురోహితులు చేరగ భీతిని కాచుటందునన్
పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో!
తేటగీతి
రిప్లయితొలగించండితెంపరితన మాటలుగనే తెలియ దగును
పంతులే చెప్పు దప్పులే బలుకమనుచు
యనగ, పరికించ గురువులు యనగ మార్గ
దర్శకులు సమాజమునకు ధర్మ మరయ.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
తప్పులను నేర నింపుగ నొప్పు లెల్లఁ
రిప్లయితొలగించండిదెల్లము లగుఁ దత్క్షణ మిది కల్ల కాదు
మాన కన్య విద్యార్థుల మాట లందుఁ
బంతులే చెప్పెఁ దప్పులఁ బలుకు మనుచు
వింత యనంగ నేల యిది విద్యలు నేర్పెడు రీతు లందు నొ
క్కింత విభిన్న మార్గ మగు నెల్లరి క్రీడ యనంగ నొప్పు ని
శ్చింతగఁ జక్కఁగన్ బడుల శిష్యుల నేర్పు గణింప నెంచుచుం
బంతులె తప్పులం బలుక వచ్చని చెప్పెను బిల్లవాండ్రతో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఒకటవ తరగతి గదిలో నొకని లేపి
తొలగించండిపంతులే చెప్పెఁ దప్పులఁ బలుకుమనుచు”*
మరియొక నిలేపి సవరించుమనుచు పలుక
వల్లె యనుచు చేసిరటులే వాసి గాను
మూడడుగుల నొసంగి నా ముప్పు తప్ప
దనుచుబలిచక్రవర్తితో న నునయముగ
పంతులేచెప్పె తప్పులు పలుకుమనుచు
కల్లలాడంగ నిప్పుడు కాదు తప్పు