8, జూన్ 2022, బుధవారం

సమస్య - 4104

9-6-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సత్స్నేహముఁ జేయ దక్కు సంకట చయముల్”
(లేదా...)
“సత్స్నేహం బొనరించ దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్”

19 కామెంట్‌లు:

  1. తేటగీతి
    క్షీరముంజేర నీరంబు క్షీరగుణమె
    యబ్బు దానికి నెంతయో యబ్బురమిదె
    సిరులు యశము//సత్స్నేహముఁజేయ దక్కు
    సంకట చయముల్//కలుగు దుస్సంగమమున.

    రిప్లయితొలగించండి
  2. సత్స్నేహంబున గావివి
    సత్స్నేహముఁ జేయ దక్కు సంకట చయముల్
    సత్స్నేహంబును జేయుము
    సత్స్నేహముజేయ కలుగు జతురత ,సుఖముల్

    రిప్లయితొలగించండి

  3. చిత్స్నిగ్ధము, సౌఖ్యములవి
    సత్స్నేహముఁ జేయ దక్కు, సంకట చయముల్
    కృత్స్నమ్ముగ పొందుదురిల
    కుత్స్నేహితులన్ గలిగిన కువలయమందున్.

    రిప్లయితొలగించండి
  4. జ్యోత్స్నల్నల్దెసలన్ వెలుంగు నమితద్యోతమ్ముగా నిచ్చలున్
    సత్స్నేహంబొనరింప, దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్
    తత్స్నేహంబును దుర్విదగ్ధ ఫణితిన్ తాత్సారమున్ సల్పుచో
    కృత్స్నంబున్ విచలంబొనర్పబడుతన్ కేండ్రించు తథ్యంబుగా

    దుర్విదగ్ధ ఫణితిన్ = అహంకార సరణిలో
    కృత్స్నము = సర్వము కేండ్రించు = ప్రిదులు, తొలగిపోవు

    రిప్లయితొలగించండి
  5. సత్స్నేహంబును గూర్చి యీవిధ ముగా సంభాష ణం బత్యాశ యే
    సత్స్నేహం బొనరించ దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్
    సత్స్నేహంబులె యిచ్చు నమ్రత నికన్ సౌఖ్యమ్ము సంప్రీతు లన్
    సత్స్నేహంబునె జేయుమా సుమ లతా! సాయుజ్య మొందంగ సూ

    రిప్లయితొలగించండి
  6. జ్యోత్స్నవలె వెలుగు గద మది
    సత్స్నేహముఁ జేయ ; దక్కు సంకట చయముల్
    సత్స్నేహము మానుకొనగ ,
    కృత్స్నము చీకటి యగుగద కేడను జేరన్

    కృత్స్నము = సర్వము

    రిప్లయితొలగించండి

  7. చిత్స్నిగ్ధంబు లభించు, సూరిగ ప్రశస్తిన్ బొందుచున్ ధాత్రిలో

    కృత్స్నంబైన యశమ్ము పొందెదరిలన్, గీర్తింతురే సజ్జనుల్

    సత్స్నేహం బొనరించ, దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్

    కుత్స్నేహంబుల జేసినన్, వలదురా కూళుండ్రతో మైత్రియే.

    రిప్లయితొలగించండి
  8. సత్స్నేహమదియకుదిరెను
    సత్స్నేహితులాసుగ్రీవుసైన్యమునరుతో
    కృత్స్నన్కష్టమునందెను
    సత్స్నేహముఁజేయదక్కుసంకటచ
    ముల్

    రిప్లయితొలగించండి
  9. సత్స్నానంబున గంగలోఁగలుషముల్ సంయోగముంజెందవే
    కృత్స్నంబున్,సిరిసంపదల్ సుగుణ సత్కీర్తుల్ లభించుంగదా
    *సత్స్నేహంబొనరించ; దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్
    సత్స్నేహంబును వీడి దుర్జనులతో సాంగత్యముంజేసిన్.*

    రిప్లయితొలగించండి
  10. సత్స్నేహంబొనరించిన
    కృత్స్నంబగు తాపములనుకేండ్రించుసదా
    కుత్స్నేహితుఁడని యెరుఁగక
    సత్స్నేహముఁ జేయ దక్కు సంకట చయముల్

    రిప్లయితొలగించండి
  11. జ్యోత్స్నామయమౌరాతిరి
    సత్స్నేహసరాగకాంక్ష సంప్రాప్తించెన్
    కృత్స్నము నిష్ఫల మాయెను
    సత్స్నేహముఁ జేయ దక్కు సంకట చయముల్

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. మృత్స్నంబే కద పాడిపంటలొసగున్ మిత్రోత్తమా! యుర్వినిన్,
    కృత్స్నంబౌను సమాజ మింక నటు శ్రీ కృష్ణార్జునా రూపమై
    సత్స్నేహం బొనరించ; దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్
    సత్స్నేహం బిడనాడ నెప్డు ధరణిన్, సత్యంబు నీవెర్గవే?

    రిప్లయితొలగించండి
  14. జ్యోత్స్న యునిండును బ్రతుకున
    *“సత్స్నేహముఁ జేయ, దక్కు సంకట చయముల్”*
    సత్స్నేహితులనువీడుచు
    కుత్స్నేహంబులనుచేయు కూళుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  15. కందం
    చిత్స్నిగ్ధంబుగఁ గర్ణుని
    కుత్స్నేహముమానుమనిన గోపాలుండున్
    మృత్స్నన్ బడె! రారాజుదె
    సత్స్నేహముఁ? జేయ దక్కు సంకట చయముల్

    శార్దూలవిక్రీడితము
    చిత్స్నిగ్ధంబుగఁ బల్కుచుంటి వినుమా శ్రేయంబుకై, ధర్మసం. ..
    పత్స్నానంబగు కర్ణ! పాండవులదౌ పక్షానజేరంగనన్
    సత్స్నాతవ్యుని జక్రి మాటవినకే చచ్చెన్! రారాజు దే
    సత్స్నేహంబొ? నరించ దక్కునిడుముల్ సత్యంబు ముమ్మాటికిన్!!

    రిప్లయితొలగించండి
  16. సత్స్నేహము చేయ వలయు
    సత్స్నేహి తు లాదు కొంద్రు సంకట మందున్
    సత్స్నేహము మంచి దెటుల
    సత్స్నేహము చేయ దక్కు సంకట చయ ముల్?

    రిప్లయితొలగించండి
  17. కందం
    తత్స్నైగ్ధ్య భావ మిత్రులు
    సత్స్నాతులయి జనె దుష్ట సహవాసముకై
    కుత్స్నేహితదుష్టులతో
    సత్స్నేహము జేయదక్కు సంకట చయముల్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  18. మృత్స్నన్ కర్షణ చేయ హాలికులకున్ మేలైన సస్యమ్మిడున్
    జోత్స్నన్ ప్రేయసి సంగడిచ్చు శుభమున్ శోభించి యక్కాంతతో
    సత్స్నేహం బొనరించ, దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్
    తత్స్నేహంబు త్యజించి సానిజతనుస్థానమ్మునాశించినన్

    రిప్లయితొలగించండి
  19. త్వత్స్నేహం బిప్పట్టునఁ
    గృత్స్నంబిఁక వీడ నొప్పుఁ బృథ్విని నిర తా
    సత్స్నిగ్ధాత్మ జనులతో
    సత్స్నేహముఁ జేయ దక్కు సంకట చయముల్

    [నిరత + అసత్ స్నిగ్ధాత్మ = నిర తాసత్స్ని గ్ధాత్మ]


    జ్యోత్స్నా సన్నిభ కాంతి మన్ముఖ! మహా చోద్యంబ యర్థం బహో
    కృత్స్నంబిక్కడ మాఱిపోవుఁ గద వీక్షింపంగ బింద్వర్ధమే
    సత్స్నేహం బొనరింప పిమ్మట నిడన్ శంకింప నిబ్భంగినిన్
    సత్స్నేహం బొనరింప దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్

    [ఒనరింప లో ప పిదప నరసున్న యున్న నిడుమలు తక్కును లేకున్న నిడుమలు దక్కును]

    రిప్లయితొలగించండి