20, జూన్ 2022, సోమవారం

సమస్య - 4113

21-6-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామా సుతుఁ జంపినావురా నిర్దయతన్”
(లేదా...)
“రామా పుత్రునిఁ జంపినావు గద నిర్దాక్షిణ్యచిత్తుండవై”

34 కామెంట్‌లు:


 1. (అర్జునుడు సైంధవుని మనసులో దూషించు సందర్భము)

  ఏమా కావర మది సం
  గ్రామమ్మున నేను లేని కాలంబందున్
  నేమము విడి బాలుని యౌ
  రా, మా సుతునిఁ జంపినావురా నిర్దయన్.

  రిప్లయితొలగించండి
 2. కురుక్షేత్ర సంగ్రామంలో రథచక్రము భూమిలో దిగబడిన వేళ యుద్దమునాపమన్న కర్ణునితో అర్జునుఁడు :

  కందం
  భూమిని దిగబడె రథమని
  నీమంబుల బల్కితె! దయ నెగడక మును నీ
  కేమాత్రము? సూతకుమా
  రా! మా సుతుఁ జంపినావురా! నిర్దయతన్

  శార్దూలవిక్రీడితము
  భూమిన్ నీ రథచక్రముల్ దిగబడన్ బోరాపగన్ గోరుచున్
  నీమంబుల్ దగ వల్లెవేయుదువె నిందింపంగ నన్, జాలి నీ
  కేమాత్రంబును తమ్మిమొగ్గరము నందేపారె రాధా కుమా
  రా! మా పుత్రునిఁ జంపినావు గద నిర్దాక్షిణ్యచిత్తుండవై

  రిప్లయితొలగించండి
 3. కామాతురతన్గనలుచు
  భీమాకృతికరుణలేకభీకరవృత్తిన్
  సోముడుతలనుగలమనో
  రామాసుతుజంపినావురానిర్దయతన్
  శివునితోపార్వతి

  రిప్లయితొలగించండి
 4. ఓమా లోకమ ! యెందుకు
  రా,మాసుతు జంపినావురా నిర్దయతన్
  నేమీ ద్రోహము జేసిరె
  యేమాయెను నీకు చెపుమ నిటులుగ జేయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మాలోకమ' అనడం వ్యావహారికం. 'నిర్దయతన్+ఏమీ' అని విసంధిగా వ్రాయరాదు.

   తొలగించండి
 5. కందము
  శ్రీమంతుని నక్షయు నౌ
  రా!మాసుతునిఁజంపినావురా!నిర్దయతన్
  సామాన్య వానరా!యని
  తామసమున రావణుండు తద్దయు వగచెన్.

  రిప్లయితొలగించండి
 6. ఓమా లోకమ యేమి దౌష్ట్యమునిటన్ నూహించ రానట్లు ,రా
  రా,మాపుత్రుని జంపినావుగద నిర్దాక్షిణ్య చిత్తుండవై
  జామాకుల్ భువి రాలు నట్లుగ ను గా సారంబు లోగ్రుంక నా
  రామం బంతయు డొల్ల వోయెను గదా రాద్ధాంత మున్ జేయగన్

  రిప్లయితొలగించండి
 7. సామాన్యంబగు వానరంబని వెసన్ సంగ్రామరంగానికిన్
  ధీమాగాఁజని యక్షయుండు నచటే నిర్మూలమై పోవ నౌ
  *రా!మాపుత్రునిఁజంపినావు గదరా !నిర్దాక్షిణ్య చిత్తుండవై*
  యో మాయాకపి! యంచు రావణుఁడు కోపోద్రిక్తుడై పోయెగా!

  రిప్లయితొలగించండి

 8. కామాంధుండగు సైంధవున్ దలచుచున్ గాండీవి తాబల్కెనే

  యేమాకావరమోయి దుర్నయుడ నీవీరీతి బాలుండపై

  నేమమ్మున్ విడి తమ్మి మొగ్గరమునన్ నీచుండవై
  యిట్లు నౌ

  రా మాపుత్రునిఁ జంపినావుగద నిర్దాక్షిణ్య చిత్తుండవై.

  రిప్లయితొలగించండి
 9. నీమము విడి యమ్మితివిగ
  నా మద్యమును , మరి దాని నాపెడు తలపే
  నీమదిన పుట్టె ! నయ్యో
  రామా ! సుతుఁ జంపినావురా నిర్దయతన్

  రిప్లయితొలగించండి
 10. ఆమూలాగ్రము ధారుణి
  పై మనుజేంద్రుల వధించు పాపివినీవే!
  తామసమూర్తీ భార్గవ
  రామా! సుతుఁ జంపినావురా నిర్దయతన్

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ,అమెరికా:

  ఏమయ్యెన్ దశరథుడా!
  క్షేమమ్మొసగు శ్రవణుండు కీడు దలచునే?
  నీమదిని పాపమమరెను
  రా! మాసుతు జంపినావురా నిర్దయతన్!

  ఏమాత్రమ్మును జాలి లేదె? శ్రవణుండేమైన కీడెంచెనే?
  క్షేమమ్మున్ కలిగించుచుండి మము సంసేవించు మాపుత్రునిన్
  నేమంబుల్ విడనాడి యోదశరధా! నీచత్వమే జూపి యౌ
  రా! మా పుత్రుని జంపినావుగద నిర్దాక్షిణ్య చిత్తుండవై.

  రిప్లయితొలగించండి
 12. పుత్ర వియోగ శోకమున శ్రవణ కుమారుని తలిదండ్రులు పుత్ర వియోగ శాపమిడుతూ దశరథునితో పలికిన పలుకులు (నా వూహకు పరిమితము) :

  మేమేమి పాపము సలుప
  మామీద విధియు పగగొని మాకొనె! తామున్
  మా మాదిరి నొత్తురది, దొ
  రా, మా సుతుఁ జంపినావురా నిర్దయతన్

  రిప్లయితొలగించండి
 13. ఏమా వేగపు చోదన
  మే మాత్రము భయము లేక నిష్టపు రీతిన్
  బెన్ ముప్పు జేసితి వి యే
  రా !మా సుతుని జంపి నావు రా నిర్దయ తన్

  రిప్లయితొలగించండి
 14. సోమమ్మున్ జని స్వర్గలోకమునఁ దా శోధించి యోడించి సు
  త్రామున్ భండనమందునన్ గరము హ్లాదమ్మున్ బ్రసాదించె నే,
  నీమంబున్ విడి యజ్ఞమున్ జెరచి దుర్నీతిన్ బ్రయత్నించి యౌ
  రా! మాపుత్రునిఁ జంపినావు గద నిర్దాక్షిణ్యచిత్తుండవై

  రిప్లయితొలగించండి
 15. కందం
  నీమము మేర సమరమున
  భీముడు కౌరవుల జంప పీడిత గాంధా
  రీ మాత వగచి యనె యే
  రా, మా సుతు జంపినావురా నిర్దయతన్
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

  రిప్లయితొలగించండి
 16. ఓ మహిష వాహన! ఘన
  శ్యామా! రమణీయ గాత్రు సదమల చిత్తుం
  గోమలుని దక్షిణ ది శా
  రామా! సుతుఁ జంపితి వవురా నిర్దయతన్


  ఏమీ దుండగ మేల వచ్చితివి నీ వెందుండి యేతెంచితే
  భీమాకారుల ఘోర రాక్షసులనుం బీడించితే కోఁతి! ‌యే
  కామం బెంచితి వియ్యశోక వని భగ్నంబేల కావించి తౌ
  రా మా పుత్రునిఁ జంపినాఁడవుర నిర్దాక్షిణ్య చిత్తుండవై

  రిప్లయితొలగించండి
 17. నా మిత్రుండవటంచునెంచియు సదా నా
  పుత్రుండు నీ పుత్రికన్
  ప్రేమించెన్ గులమున్ మతంబు గనకన్
  పెంపార సంప్రీతితో
  నీ మాత్సర్య కులంపు భేషజముచే
  నిక్కంబు వెంటాడి యౌ
  రా !మా పుత్రుని జంపినావు గద నిర్దాక్షిణ్య
  చిత్తుండవై

  రిప్లయితొలగించండి
 18. గాంధారి భీమసేనుని తో

  ఏమాత్రము చింతింపక
  భీముడుకౌరవునిజంపవిరిగినమదితో
  నేమమ్మునుమరచితివౌ
  “రా!మా సుతుఁ జంపినావురా నిర్దయతన్”


  మరొక పూరణ

  కద్రువ గరుత్మంతునితో
  పాములుసోదరులనియెడు
  ప్రేమను కనపర్చకుండ
  వీడక కసితో
  వేమరు వేడ వినక యౌ
  “రా!మా సుతుఁ జంపినావురా నిర్దయతన్”

  రిప్లయితొలగించండి