5, జూన్ 2022, ఆదివారం

సమస్య - 4101

6-6-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేలగును పిల్లలకుఁ గొన హాలహలము”
(లేదా...)
“చిన్నారుల్ ముదమంది హాలహలమున్ సేవింపగా మేలగున్”

34 కామెంట్‌లు:

  1. పౌష్టి కాహార మిడినచో బ్రగతి కెపుడు
    మేలగును పిల్లలకు,గొన హాలహలము
    దేహ మంతయు గృశియించి దినము దినము
    మృత్యు కౌగిలి గతియయి యంతమౌను

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    గోలపెట్టెడు పిల్లల గోడు వీడ
    విత్తమొసఁగుచు సాయంత్రవేళలందు
    చెత్త తిండ్లకునంపెడు చిత్తమరయ
    'మేలగును పిల్లలకుఁ గొన హాలహలము'

    మత్తేభవిక్రీడితము
    విన్నానంబును సంతుబాగుకొరకై వెచ్చింపగా నొప్పెడున్
    దున్నన్ సాకగ చెత్తవైచు పగిదిన్ దోలంగ నంౙుళ్లకై
    ఛిన్నంబయ్యెడు స్వాస్థ్యమున్ దలవకే, చింతింప మీ దృష్టిలో
    'చిన్నారుల్ ముదమంది హాలహలమున్ సేవింపగా మేలగున్!'

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    ఔర!మేక,గేదె,యావు పాలెందుకు?
    పోత పాల కంటె మాత యిడెడు
    చనుల పాలు//మేలగును పిల్లలకుఁగొన,
    హాలహలము మిగుల హాని కాదె!

    రిప్లయితొలగించండి
  4. ప్రకృతి యొసగినట్టి వివిధ పండ్ల రసము
    మేలగును పిల్లలకుఁ గొన ; హాలహలము
    నిచ్చి నట్లగు విపణుల యెడ దరకెడు
    కలుషితమగు పానీయము గైకొనంగ

    రిప్లయితొలగించండి
  5. సంప్రదాయపాకములను చవిని గొనక
    క్రొత్త రుచులను గోరగ కోర్కె తోడ
    నొసగి చెడుపుట కంటె న దొప్పు గాదె
    మే లగును పిల్లలకు గొన హాల హలము

    రిప్లయితొలగించండి
  6. వన్నెల్దగ్గకవీఁగిబోకవిషమైపాపాయికాహారమై
    చెన్నుల్మీరుచుయూరికామ్లకలనన్ఁజేయంగహానిన్గనన్
    అన్నామీరలుత్రాగరాదుగదరాహాయంచునీక్షీరమున్
    చిన్నారుల్ముదమందిహాలహలమున్సేవింపగామేలగున్

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    ఔషధమునందు మిళితమై నావుపాలు
    మేలగును పిల్లలకు గొన, హాలహలము
    శూలపాణి పానము జేసి నీలకంఠ
    నామ ధేయుడుగా కీర్తి నందె నంత.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. అన్నా! యేమని జెప్పనోపుదును నీ వన్యాయమౌరీతి గా
    చిన్నారుల్ ముదమంది హాలహలమున్ సేవింపగా మేలగున్
    నన్నన్ భావ్యమె? యెన్న డిట్లుగ నికన్ బల్కంగ బోబోకుమా
    ఛిన్నాభిన్నము లౌను బిల్లల గతుల్ శ్రేయంబు గాదేరికిన్

    రిప్లయితొలగించండి
  10. వెన్నంబాలును పెర్గు మీగడలు వేవేగన్ బలంబిచ్చు నా
    జున్నుల్ పండ్లరసమ్ములెల్ల తమితో జుఱ్ఱంగనే యిండ్లలో
    *చిన్నారుల్ ముదమంది; హాలహలమున్ సేవింపగా మేలగున్
    అన్నా!కృత్రిమమౌ పదార్థములు కన్నన్ జూడగా నేడిలన్.

    రిప్లయితొలగించండి

  11. ఓషధీ ధరుడు వచించె నువిదతోడ
    ప్రకృతి వరప్రసాదమయిన ఫలము లవియె
    మేలగును పిల్లలకు గొన, హాలహలము
    వంటి చిరుతిండ్లు తినిపింప వలదటంచు.


    ఎన్నో మారులు చెప్పినన్ వినక నీవీ రంగు ఖాద్యమ్ములే

    యన్నా తెచ్చెదవేల జాంగులవమా యాహారమే ముప్పదే

    చిన్నారుల్ ముదమంది హాలహలమున్ సేవింపగా, మేలగున్

    మున్నా మౌనులు చెప్పినట్లు ఫలముల్ భోంచేసినన్ గాదుటే.

    రిప్లయితొలగించండి
  12. శుచికరంబౌ పదార్థముల్ రుచికరముగ
    పౌష్టి కాహార విలువలు ప్రస్పురిల్ల
    మేలగును పిల్లలకుఁ గొన, హాలహలము
    బోలు శీతల పానీయ మేల నోయి

    రిప్లయితొలగించండి
  13. మురుగు కాల్వల దాపున మురిసి తినెడు
    పానిపూరీలు స్వాస్థ్యము హానిగూర్చు
    నంతకన్నను యోచింప సుంతయేని
    మేలగును పిల్లలకుఁ గొన హాలహలము

    రిప్లయితొలగించండి
  14. ఎన్నన్ వీధుల విక్రయించబడు నేడెన్నో విషాహారముల్
    తిన్నన్ స్వాస్థ్యము హానిగూర్చు నవియే తిందుర్గదా బాలకుల్
    చిన్నాభిన్న మొనర్చు దేహబలమున్ శీఘ్రంబుగా నెవ్విధిన్
    చిన్నారుల్ ముదమంది హాలహలమున్ సేవింపగా మేలగున్?

    రిప్లయితొలగించండి
  15. సమస్య :-
    “మేలగును పిల్లలకుఁ గొన హాలహలము”

    *కందం**

    గోలను జేయక మెలగుచు
    మూలన యుండు, చదరంగమును నేర్పింపన్
    మేలగును పిల్లలకుఁ గొన
    హాలహలము దాకినంత హానిని గూర్చున్

    రిప్లయితొలగించండి
  16. ఎంచి కీడును మున్ముందు నంచితముగ
    నెంచ నొప్పును మేలును మించి పిదప
    కారణం బేమి యైనను దూర ముంచ
    మే లగును బిల్లలకుఁ గొన హాలహలము


    కన్నం గొన్న విచార మందుదురు తత్కాంతా నికాయమ్ము నా
    సన్నంబైన క్షణంబ గౌరవము నాశం బౌను వంశాబ్ధికిన్,
    ఛిన్నాభిన్నము సేయ కుండ కులమున్ శీఘ్రంబ నారీ గు ణా
    చిన్నారుల్ ముద మార హాలహలమున్ సేవింపఁగా, మేలగున్
    [గుణ + అచిత్ + నారుల్ = గు ణాచిన్నారుల్; అచిత్ = అజ్ఞానము]

    రిప్లయితొలగించండి

  17. పోషకాంశము గల రాగిముద్దనుగొన
    *మేలగును పిల్లలకు,గొన హాలహలము*
    శూలియు సురవరులకెల్ల శుభము లయ్యె
    సర్వ మంగళయు మదిని సంతసించె

    రిప్లయితొలగించండి
  18. వెన్నల్ మీగడ జున్నుఁబాలు దధియున్ పేయంబు సంతృప్తిగా
    సున్నుండల్ దినుబండముల్ బలు రుచుల్ జూడంగ మేలౌ సదా
    చిన్నారుల్ ముదమంది; హాలహలమున్ సేవింపగా మేలగున్
    మిన్నాగై పసి మొగ్గలన్ చిదుము దుర్మేధుండవశ్యంబుగా

    రిప్లయితొలగించండి
  19. పంకజ బంధు వంశము నృపాలునిగా జనియించి మర్త్యుడై
    పంకజనేత్రి జానకి వివాహము నాడి, వనమ్ములందునన్
    సంకట పెట్టుచున్ బ్రజల సాగుచునున్న పలాశికోటి నా
    శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్

    రిప్లయితొలగించండి