10, జూన్ 2022, శుక్రవారం

సమస్య - 4105

11-6-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్”
(లేదా...)
“శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్”

18 కామెంట్‌లు:


 1. సంకట హారియటంచును
  పంకజ నాభుని ప్రతిమను పట్టణమందున్
  టంకమొకటిచ్చి కొంటిని
  శంకర, మూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్.

  రిప్లయితొలగించండి
 2. శంకరు లింగాకారుడు
  పంకజ నాభుని సఖుడును భక్తవరదుడున్
  శంకలు లేనివి ధంబుగ
  శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్

  రిప్లయితొలగించండి
 3. అంకిలి చెప్పకు , నేనిదె
  శంకరమూర్తిని గొలిచెద ; శ్యామలవర్ణున్
  శంక పడకుండగనె నీ
  వింక కొలువనొప్పును గద వేడుక తీరన్

  రిప్లయితొలగించండి
 4. కందం
  కింకరునై సేవించెద
  శంకర మూర్తిని, గొలిచెద శ్యామల వర్ణున్
  పంకజ నాభుని సతతము
  శంకర పూజలు సలిపెడి సమయము నందున్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 5. పంకజనాభుఁడుతానుగ
  అంకముజేరినగణపతినాశివుపుత్రున్
  బింకములేకనువేడుచు
  శంకరమూర్తినిగొలిచెదశ్యామలవర్ణునున్

  రిప్లయితొలగించండి
 6. వంకరలెన్నియున్నవరపార్వతిపుత్రుడువిష్ణురూపుడే
  సంకటమేయెడన్గలుగశాంతముతోడనుగొల్చినంతనే
  వెంకటనాథుడైవెలసివేగమెకార్యముసిద్ధినిచ్చునా
  శంకరమూర్తిఁగొల్చెదఁబ్రసన్నునిశ్యామలకోమలాంగునిన్

  రిప్లయితొలగించండి
 7. పంకజ నాభుమి త్రుడును భక్తుల కోరిక దీర్చువాడునున్
  నంకమునందు పార్వతి కియాసన మిచ్చుచు భక్తకోటికిన్
  శంకలు లేని యట్టులుగ జాలిన కోరిక లిచ్చు నాశివున్
  శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్

  రిప్లయితొలగించండి
 8. లంకాపట్టణమేగి,భ
  యంకర రావణునిఁజంపి యలరెడు రామున్
  పంకజనేత్రుని,భక్తవ
  శంకరమూర్తినిఁగొలిచెద శ్యామలవర్ణున్.

  శంకరు కార్ముకంబు భుజ శక్తినిఁద్రుంచి,వరించి సీతనే
  జంకక నేగి కానలకు జానకిఁగోల్పడి,కట్టి వారధిన్
  లంకకుఁనేగి రావణుని ప్రాణములంగొనినట్టి దైత్యనా
  శంకర మూర్తిఁగొల్చెదఁబ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్.

  రిప్లయితొలగించండి

 9. వేంకట నాథుని, దయతో
  సంకటముల ద్రుంచువాని, శర్మన్, నిరతా
  టంకహరుని, నా భవనా
  శంకర మూర్తిని, గొలిచెద శ్యామలవర్ణున్!

  రిప్లయితొలగించండి

 10. సంకటముల్ హరింపగల సవ్యుడె కేశుడు దేవదేవుడే

  తంకము దీర్చువాడె యధిదైవమటంచును నమ్ము వాడనై

  పంకజనాభ విగ్రహము పట్టణమందు క్రయించి తెచ్చితిన్

  శంకర! మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్.

  రిప్లయితొలగించండి
 11. ఓంకారప్రణవముతో
  శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్
  పంకజనాభుని గొలిచెద
  సంకటములు తొలగజేయ శ్రద్ధాళువునై

  రిప్లయితొలగించండి
 12. పంకజనాభుడు వెన్నుఁడు
  సంకటమోచకుఁడు శౌరి సర్వోపగతుం
  డంకిలిబాపఁగ భక్తవ
  శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్

  రిప్లయితొలగించండి
 13. పంకజనాభునిన్ హరిని పావనమూర్తిని భక్తవత్సలున్
  సంకటమోచకున్ వినుత సచ్చరితున్ కరుణాంతరంగు నా
  యంకిలిబాపి స్వాస్థ్యమును హర్షము గూర్చగ జేయు పాపనా
  శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్

  రిప్లయితొలగించండి
 14. కందం
  అంకితమై కుజ వెతికియు
  సంకటముల దీర్ప హనుమ సంశ్లేషమిడన్
  పంకజలోచను భక్త వ
  శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్

  ఉత్పలమాల
  అంకితమౌచు మౌని హవమద్భుతరీతినిఁ గాచి రాముడున్
  వంకను గొన్న గౌతముని భామకు పాపము బాపి, హన్మయే
  జంకక సీత జాడగనఁ జక్కగ కౌగిట జేర్చినట్టి స
  చ్ఛంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్

  రిప్లయితొలగించండి
 15. సంకట హరణుని హరుని న్
  పంకజ నాభుడు హరియని భక్తిగ సతమున్
  కొంకక తలచుచు మదిలో
  శంకర మూర్తిని గొలుతును శ్యామల వర్ణున్

  రిప్లయితొలగించండి
 16. పంకజ నాభుని శ్రీ వ
  త్సాంకుని దామోదరుని మహా పన్నగ ప
  ర్యంకుని నా నారాయణు,
  శంకర! మూర్తినిఁ గొలిచెద శ్యామలవర్ణున్


  శంక వహింప కే నెడఁద సన్నుతి సేసి భుజంగ భూషణున్
  సంకట సంచయ క్షయుని సర్వ శుభప్రదుఁ జంద్ర శేఖరున్
  శంకరి వామభాగమున శైల వరాత్మజ వెల్గు చుండఁగా
  శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల! కోమలాంగునిన్

  రిప్లయితొలగించండి
 17. పంకజ బంధు వంశము నృపాలునిగా జనియించి మర్త్యుడై
  పంకజనేత్రి జానకి వివాహము నాడి, వనమ్ములందునన్
  సంకట పెట్టుచున్ బ్రజల సాగుచునున్న పలాశికోటి నా
  శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్

  రిప్లయితొలగించండి

 18. పంకజనయనునితలచుచు
  శంకయొకింతయునులేకసతతంబిలలో
  సంకటములుడుపు భక్తవ
  *"శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్”*

  రిప్లయితొలగించండి