17, జూన్ 2022, శుక్రవారం

సమస్య - 4111

18-6-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అలిగిన పతి యుచితకార్య మరయం గలఁడే”
(లేదా...)
“అలుకం జెందినయట్టి కాంతుఁ డుచితవ్యాపారముల్ నేర్చునే”

21 కామెంట్‌లు:

 1. కందం
  చెలరేగిన పతితో సతి
  విలువల పాఠము చెలిమిన వివరించగనే
  కలవరపడి కోపముతో
  అలిగిన పతి యుచిత కార్య మరయం గలడే.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 2. తలలను జింపిరి చేసెను
  దలుపుల్ వేవిఱుగు నటుల దట్టెను మిగులన్
  వలపులు తీరక పో,పే
  రలిగిన పతి యుచిత కార్య మరయం గలడే

  రిప్లయితొలగించండి
 3. కందం
  మెలగిన షట్కర్మల సతి
  సులువుగ కార్యాల బయట చూడన్ గలుగున్
  గలతల్ రేపుచు సతియే
  యలిగిన, పతి యుచితకార్య మరయం గలఁడే?

  మత్తేభవిక్రీడితము
  సలుపన్ సేవలఁ బ్రేమతో మెలగుచున్ షట్కర్మయుక్తమ్ముగన్
  సులభమ్మౌగతిఁ జక్కఁ బెట్టు బయటన్ శోభాయమానాన కుం
  తలముల్ జారిచి క్రిందకున్ వగపుతో నట్టింట నయ్యాలి తా
  నలుకం జెందిన, నట్టి కాంతుఁ డుచితవ్యాపారముల్ నేర్చునే?

  రిప్లయితొలగించండి
 4. ೨కలతన్జెందెనుసతితో
  పలురీతులజెప్పవలసెపద్ధతితెలియన్
  ఫలితములేనిదికాగా
  అలిగినపతియుచితకార్యమరయఁగలడే

  రిప్లయితొలగించండి
 5. పిలువ దరికి రాలేదని
  యలిగిన పతి యుచితకార్య మరయం గలఁడే
  తలపడక వలపు జూపుచు
  కొలది దినములోర్చ నతని కోపము దగ్గున్

  రిప్లయితొలగించండి
 6. నెలతేనవ్యమునాగరీకతనుతానేర్వంగనిర్లక్ష్యమున్
  పలుకేనాయుధమాయెనాపతికికోపంబందుతాగ్రుంగగా
  అలుగుల్కాగనుమాటలేవదలెనేయాశల్గనన్లేకనే
  అలుకన్జెందినయట్టికాంతుడుచితవ్యాపారముల్నేర్చునే

  రిప్లయితొలగించండి
 7. కలతల కాపు ర మగుచును
  వలపులు జూపక మెలిగెడు వనిత యె సతియై
  చెలఁగిన తరి నయ్యెడ నా
  యలిగిన పతి యుచిత కార్య మరయ o గలఁడే

  రిప్లయితొలగించండి
 8. కందము
  పలుకునదేపని ఫోనున
  తిలకించును టీ.వి.లోని దృశ్యంబులనే
  పిలిచిన పలుకదు కటకట!
  *అలిగిన పతి యుచిత కార్యమరయంగలడే!*

  మత్తేభము
  తిలకించుందమి దూరదర్శినినహో!దృశ్యంబులెల్లప్పుడున్
  బలుకున్ ఫోనును వీడకే పలుమఱున్,ప్రక్కింటి సోదెమ్మ కో
  తలు కోయన్ వినుచుండి మైమఱచి బాతాఖాని సల్పంగ,పే
  *రలుకం జెందిన యట్టి కాంతుడుచిత వ్యాపారముల్ నేర్చునే.*
  ----------దువ్వూరి రామమూర్తి.

  రిప్లయితొలగించండి

 9. చెలి సహకారమ్ముండిన
  కలుగు విజయమని పలువురు కార్యార్థులిలన్
  దలతురు మరియా సతియే
  యలిగిన పతి యుచితకార్య మరయం గలఁడే.

  రిప్లయితొలగించండి

 10. నెలతల్ స్ఫూర్తి ప్రదాతలై మగనికిన్ స్నేహంబుతో సాయమున్

  పలురీతుల్ సతులందజేసినను దర్పంబందు సాగింతురే

  లలనల్ గామిడి కత్తెలై సతము కార్యంబన్న క్రేడించి తా

  మలుకంజెందిన, యట్టి కాంతుఁడుచిత వ్యాపారముల్ నేర్చునే.

  రిప్లయితొలగించండి
 11. తలలన్ జింపిరి చేసెనే గమల! చిత్తంబున్ బ్రలోపించగా
  దలుపుల్ దన్నెను వేగవం తముగ బాదాలన్ సమూలంబుగా
  వలపుల్ దీరక పోవు కారణమె యబ్బాపండు చేసెన్ సు పే
  రలుకంజెందిన యట్టి కాంతు డుచిత వ్యాపారముల్ నేర్చునే

  రిప్లయితొలగించండి
 12. అలసట నొందిన మగనికి
  నలసట తొలగంగజేసి యలరించక తా
  నలిగించుట తగదుకదా!
  అలిగిన పతి యుచితకార్య మరయం గలఁడే

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  ఎలమిని జూపుచు నిరతము
  పొలుపుగ కోరికలనెల్ల ముదమగునటులన్
  నిలిపెడి రూపసియౌ సతి
  యలిగిన, పతి యుచితకార్య మరయం గలడే?

  వలపున్ జూపుచు నిచ్చలున్ మృదువుగా భాషించుచున్ చక్కగా
  విలువన్ గూర్చెడి మంత్రణమ్మొసగుచున్ వెల్గొందు సింగారియే
  పొలుపున్ వీడి విచారమొందుచును తా పొంకమ్మె పోబుచ్చుచున్
  అలుకంజెందిన, యట్టి కాంతుడుచిత వ్యాపారముల్ నేర్చునే?

  రిప్లయితొలగించండి
 14. కలతలు కాపురమందున
  నెలతలతోనేర్పడనతి నేరుపుతోడన్
  దొలగగ యత్నించక తా
  నలిగిన పతి యుచితకార్య మరయం గలఁడే?

  రిప్లయితొలగించండి
 15. చెలువమ్మున్ గని యిచ్చతోడ పడతిన్ జేపట్ట నిల్లాలిగా
  పలురీతుల్ పొనరించి యాగడములన్ బాధించ దుర్బుద్ధితో
  తలిదండ్రుల్ కడు వేదనన్ బడయగా, దౌష్ట్యమ్ములన్ గాంచి, పే
  రలుకం జెందినయట్టి కాంతుఁ డుచితవ్యాపారముల్ నేర్చునే

  రిప్లయితొలగించండి
 16. "అలుకన్ జెందిన యట్టి కాంతు లుచితవ్యాపారముల్ నేర్తురే"అనే సమస్యని ఈ మధ్యన నేను పట్వర్ధన్ గారికి అవధానం లో ఇచ్చాను.దానిని కొంత మార్చి ఇక్కడ ఇచ్చినందుకు సంతోషం.

  రిప్లయితొలగించండి
 17. ఇలలో నింద్రియ వశుఁడై
  లలనా దేవన సురా వలయ మగ్నుఁడు భూ
  వలయమ్మును నేలెడు వాఁ
  డలిగిన పతి యుచిత కార్య మరయం గలఁడే


  లలనా రత్న నికాయ పూజలకు నర్హంబైన భార్యా మణిం
  గలలో నైనఁ బరుం దలంపనిది యౌ కాంతా మణిం గ్రూరుఁడై
  జలజాతాయత పత్ర లోచనను దా శంకించి డెందమ్ము నం
  దలుకం జెందిన యట్టి కాంతుఁ డుచిత వ్యాపారముల్ నేర్చునే

  రిప్లయితొలగించండి
 18. తలలోనాలుకవోలె దంపతులుదాత్తంబైన రీతిన్ సదా
  సలుపన్ జీవనయాత్ర వెల్లువయగున్ సంతోష సంరంభముల్
  కలతల్ కాపురమందుఁగల్గినను సంకల్పించి వారింపకన్
  అలుకం జెందినయట్టి కాంతుఁ డుచితవ్యాపారముల్ నేర్చునే

  రిప్లయితొలగించండి
 19. [

  అలసటతో నరుదెంచగ
  జలము నొసగి ప్రేమ తోడ సంగడి రాకన్
  కలహించుచు సతతము సతి
  *యలిగిన, పతి యుచితకార్య మరయం గలఁడే”*


  చెలినే గోముగ దాపునన్ వఢివడిన్ చేరంగమాటాడకన్
  తలకూడా పయికెత్తకన్ పొగరుగా తాడించ పాదమ్ములన్
  లలనన్ గాంచుచుఛీత్కరించుచును వేళాకో ళమున్చేయ గన్
  *“అలుకం జెందినయట్టి కాంతుఁ డుచితవ్యాపారముల్ నేర్చునే”*

  రిప్లయితొలగించండి
 20. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  తే.గీ.
  వాయసాసురు డులిపియై వనము నందు
  సీత ఱొమ్మును నాటుజేసి బడలించ
  బమ్మయమ్మునే పోచలో బవిరిదీర్చి
  రాముడట నేత్రమునుదీసె ప్రాంజలించ.

  రిప్లయితొలగించండి