3, జూన్ 2022, శుక్రవారం

సమస్య - 4099

4-6-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భవతి యయ్యెఁ జూపులు కలిసినంత”
(లేదా...)
“కన్నులు కన్నులున్ గలియగా సతి గర్భముఁ దాల్చె వింతగన్”

41 కామెంట్‌లు:

  1. ఎవని గలిసెనో దెలియదు కువల యాక్షి
    గర్భవతి యయ్యె,జూపులు కలిసినంత
    ప్రేమ దొంతర లుబికెను బ్రియము తోడ
    సాధ్వి సీతకు శ్రీరామ చంద్రు నకును

    రిప్లయితొలగించండి
  2. నిర్భరంబునుగాగనునెమలియంత
    గర్భకాలంబుదాపునకలసియాడె
    దర్భసూచిగకన్నులుదరికిఁజేర
    గర్భవతియయ్యెఁజూపులుకలిసినంత

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    మౌని వరమీయ కుంతికి, మహిమఁ దెలియ
    నంశుమాలిని ప్రార్థింప నతివ మురిసి
    నింగిదిగివచ్చి సద్యమె యంగనఁగొన
    గర్భవతి యయ్యెఁ జూపులు కలిసినంత

    ఉత్పలమాల
    మన్నన సేవలన్ పృథయె మౌనికి గూర్ప వరప్రసాదమై
    చిన్నది మంత్రమున్ బడసి శీఘ్రమె యెంచఁగఁ దన్మహత్తు తాఁ
    గ్రన్నన సూర్యునిన్ దలఁచ రాజిత మూర్తియె నిల్చి ముందరన్
    గన్నులు కన్నులున్ గలియగా సతి గర్భముఁ దాల్చె వింతగన్!

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    "పరిణయమయి మా యక్క*గర్భవతి యయ్యెఁ,
    జూపులు కలిసినంత*నె,సుందరుఁడగు
    ప్రియుని పెండ్లాడితిని నేను ప్రేమ మీఱ"
    ననుచు వచియించె నా శిష్యురాలొకర్తె.

    రిప్లయితొలగించండి
  5. కంటిచూపులు తూపులై వెంటపడగ
    కాము డెడదను పుట్టించు కలవరమ్ము
    వంచినతలనెత్తనిదగు మించుగంటి
    గర్భవతి యయ్యెఁ జూపులు కలిసినంత

    రిప్లయితొలగించండి

  6. చిన్నది కుంతిభోజసుత చేసిన సేవకు సంతసించి యా
    కన్నెకు తా వరమ్మొసగగా ముని బాల్యపు చేష్టతోడ ము
    వ్వన్నియ వేల్పుఁ గొల్వగనె భానుడు చెంతకు చేరునత్తరిన్
    కన్నులు కన్నులున్ గలియగా సతి గర్భము దాల్చె వింతగన్.

    రిప్లయితొలగించండి

  7. పడతి సేవల మెచ్చి దుర్వాస మునియె
    దివ్య మంత్రమొకటి యుప దేశమివ్వ
    ఖరమరీచి గోల్వగ వాని కరుణతోడ
    గర్భవతి యయ్యె జూపులు కలిసినంత.

    రిప్లయితొలగించండి
  8. మనువు జరిగిన పిదప నా మగని వలన
    గర్భ వతి యయ్యె : చూపులు కలిసి నంత
    వలపు చిగురించి యొక్కటై పరగ నెంచ
    పెండ్లి కంగీ క రించె గా పెద్ద రికము

    రిప్లయితొలగించండి
  9. మొదటి వత్సర మింకను ముగియ మునుపె
    నింపుగ హితు లందరు మెచ్చ , నిప్పుడామె
    గర్భవతి యయ్యెఁ ; జూపులు కలిసినంత
    వలచి పెండ్లి జేసుకొనిన వనిత యామె

    రిప్లయితొలగించండి
  10. మిన్నగ బ్రేమపుట్టునుగ మేదిని నేరికి నైననున్
    గన్నులు కన్నులున్ గలియగా,సతిగర్భము దాల్చె వింతగన్
    నెన్నడు లేని చిత్రమిది యెవ్వని గూడెనొ హావిధీ మఱిన్
    విన్నది లేదుగానెచట, ప్రేక్షక లోకము నవ్వబోవదే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. 'మఱిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. 'లేదుగా యెచట' అని ఉండాలి.

      తొలగించండి
  11. అన్నులమిన్నకున్ మఱియు నంగజుఁబోలిన కుఱ్ఱవానికిన్
    గ్రన్ననఁబెండ్లియయ్యె ననురాగము హెచ్చగ,నచ్చి వారికిన్
    కన్నులు కన్నులుంగలియగా;సతి గర్భముఁదాల్చె వింతగన్
    మన్నుఁదినంగ బుద్ధినిడె మందముగా నడయాడుచుండియున్.

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    పెండ్లి చూపుల తంతున పెద్ద లెదుట
    కలిసిన వధూవరుల చూపు కట్టి వేయ
    పెండ్లి యాడిరి దాంపత్య పెన్నిధి సతి
    గర్భవతి యయ్యె జూపులు కలిసి నంత.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  13. అన్నులమిన్నకుంతి మునినర్చన జేయగ చిత్తశుద్ధితో
    క్రన్నన నత్రిసూనుడిడె గాములఱే నెలుఁగిచ్చు మంత్రమున్
    చిన్నది కౌతుకమ్మునను చేసి జపమ్మును, కాంచ సూర్యునిన్
    కన్నులు కన్నులున్ గలియగా సతి గర్భముఁ దాల్చె వింతగన్

    రిప్లయితొలగించండి
  14. కద్దది, పురాతనము, నియోగమని పిలువ
    భర్త సంతాన ప్రాప్తికై పరపురుష ని
    యామకము, సినీభారత యంబిక మరి
    గర్భవతి యయ్యెఁ జూపులు కలిసినంత

    రిప్లయితొలగించండి
  15. అన్నెము పున్నెమున్ దెలియ నట్టి శకుంతల రాజు ప్రేమమున్
    మిన్నగ గాంచగా కనులు మించి మనమ్ములు రెండు దేహముల్
    చెన్నగు రీతి నొక్కటిగ చేరగ దంపతులౌచు వెల్గిరే
    కన్నులు కన్నులన్ కలియగా సతి గర్భము దాల్చె వింతగన్ !

    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  16. ఒండొరులకుఁ బులకరింప మెండుగాను
    మేను లంత నిరువు రుద్యమించి వేగ
    పెండ్లి యాడ సద్యః ప్రేమ విరియ నెదల
    గర్భవతి యయ్యెఁ జూపులు కలిసినంత


    అన్నుల మిన్న యంజన విహారము సల్ప గిరీంద్ర సానులం
    జెన్నుగ మచ్చెకంటి యట శీతల వాయువు వీచుచుండగా
    మిన్నగ రేఁగ మోహము సమీరున కామెను గౌఁగిలింపఁగాఁ
    గన్నులు కన్నులున్ గలియఁగా సతి గర్భముఁ దాల్చె వింతగన్

    రిప్లయితొలగించండి
  17. అన్నులమిన్న కన్నె పదునారు వసంతములామె యీడు తా
    కన్నది స్వప్నమందునొక కంతుని మించిన యందగాని యా
    చిన్నది నాథుడాతడనె సిగ్గులు బుగ్గల నిగ్గు నింపగన్
    కన్నులు కన్నులున్ గలియగా సతి గర్భముఁ దాల్చె వింతగన్

    రిప్లయితొలగించండి
  18. నెలఁత కన్పట్టె నెందుకో నలత చెంది
    తెలిపె చెవిలోన భర్తకు కలికి తాను
    గర్భవతి యయ్యెఁ, జూపులు కలిసినంత
    సిగ్గుమొగ్గలు తొడిగెను బుగ్గలందు

    రిప్లయితొలగించండి
  19. .మౌని దెల్పిన మంత్రము మదిని తలచ
    కాని పించెను సూర్యుడు కనులయెదుట
    మంత్రఫలమది ఫలియించ మగువ కుంతి
    గర్భవతియయ్యె చూపులు కలసి నంత

    అన్నులమిన్నయౌపడతి యత్త కుమారుని గాంచినంతనే
    నెన్నుచురూపసంపదలనిమ్ముగమెచ్చుచుపెండ్లయాడగన్
    మిన్నునుతాకినట్లుగనుమేనును,డెందెముసంతసింపగా
    కన్నులు కన్నులున్ గలియగా సతి గర్భముఁ దాల్చె వింతగన్.

    రిప్లయితొలగించండి
  20. సమస్య :-
    “గర్భవతి యయ్యెఁ జూపులు కలిసినంత”

    *తే.గీ**

    అడవినందు నేరీతిగ విడువ వలెను
    రాముని సతి మా వదిన గర్భవతి యయ్యె!
    చూపులు కలిసినంతనే జోడి యనుచు
    తలచు కొనుటయే శిక్షయా? తల్లి నీకు!
    .................✍️ చక్రి

    (ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి ప్రత్యక్ష సాక్షి లక్ష్మణుడి ఆవేదన)

    రిప్లయితొలగించండి
  21. అన్నులమిన్నయౌ రమణి యమ్ముని మంత్రము నుచ్చరింపగా
    విన్నువెలుంగు జేరె దరి విభ్రమమున్ బులకాంకితాంగియై
    కన్నులు కన్నులున్ గలియగా సతి గర్భముఁ దాల్చె వింతగన్
    పిన్నతనంబునందె గనె బిడ్డను దివ్యవరప్రభావమున్

    రిప్లయితొలగించండి