Satyendranath Bose and Einstein proposed a sub-atomic particle called Boson. When it was discovered in 2012, Stephen Hawkins, a famous Physicist, suggested that unstable Higin-Boson leaves the way open for a catastrophic cosmic wipe-out. ఇక్కడ 'మోక్షసాధనము' ఈ cosmic wipe-outను వ్యంగ్యముగా సూచిస్తుంది.
ఏనాడు దిరుగ కూడదు
రిప్లయితొలగించండిసానులతో,చెలిమి మోక్షసాధనము గదా
ఙ్ఞానము గలిగిన వారల
మానంబునుగల్గు నట్టి మహితాత్ముల యున్
రిప్లయితొలగించండిమానిని వేమనకు తెలిపె
నా నారాయణుని నామ మనవరతమ్మున్
ధ్యానము చేసిన నది విడి
సానుల చెలిమి, మోక్షసాధనము గదా!
కందం
రిప్లయితొలగించండిపూనుచు తనకై తిరిగెడు
వానిని మార్చంగ యోగి పద్యములల్లెన్
క్షోణిని విశ్వదఁ బోలిన
సానులతో చెలిమి మోక్షసాధనము గదా!
ఉత్పలమాల
మేని సుఖమ్ముకై మిగుల మెచ్చుచు చేరెడు వేమనాఖ్యునిన్
బూనుచు దిద్దగన్ భువి నపూర్వమనంగను నీతిపద్యముల్
క్షోణిని యోగిగా నుడివి కూడెను ముక్తినిఁ బోల విశ్వదన్
సానులతోడి మైత్రియె సుసాధ్యమొనర్చును మోక్షమున్ సదా!
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
సానియునీశానియనగ
రిప్లయితొలగించండిమానసమందున్దలపగమౌనియుముక్తిన్
కానగసులభముగాదెే
సానులతోచెలిమీమోక్షసాధనముగదా
మానుకొ నుట బహు యుక్తము
రిప్లయితొలగించండిసానులతో చెలిమి ; మోక్షసాధనము గదా
మానక ననునిత్యము భగ
వానుని తలపోత తోడ బ్రతుకును గడుపన్
కందం
రిప్లయితొలగించండివీనుల విందును గూర్చెడి
నానుడి, కాముకుడు గాక నైతిక పరమున్
కానగ లేడనుచు వినగ
సానులతో చెలిమి మోక్ష సాధనము గదా.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
రిప్లయితొలగించండిసానియె ముక్కెరన్ గొసర సత్వరమందగ జేయనెంచి యు
త్థానము జేరగన్ మరది తర్షణమున్ గని పల్కెనిట్టులన్
మానిని ప్రత్యగాత్మయగు మాధవ సేవనుజేయ వీడు మా
సానుల తోడి మైత్రియె, సుసాధ్యమొనర్చును మోక్షమున్ సదా!
కానగ రానిలోకమును గానగ జేయును నేరినై ననున్
రిప్లయితొలగించండిసానులతోడి మైత్రియె,సుసాధ్య మొనర్చును మోక్షమున్ సదా
ఙ్ఞానుల తోడిమై త్రియును సాధుజ నంబుల సంగమం బునున్
మానిను లన్నగారవము మాన్యత గల్గిన దప్పకుండగన్
మానవ లె నందు రార్యులు
రిప్లయితొలగించండిసానులతో చెలిమి : మోక్ష సాధనము గదా
మానక దైవము గొల్చుచు
జ్ఞానము గల్గియు మసలగ జనహిత పరులై
మానస హరణముగద దొర
రిప్లయితొలగించండిసానులతో చెలిమి, మోక్షసాధనము గదా
సానువులందున తపమే
మానస మొప్పగ సలిపిన మనుజులకెపుడున్
పూనికతో భగవానుని
రిప్లయితొలగించండిమానసమున నిల్పి భక్తి మార్గము విడకన్
మౌనులవలె వర్జించుటె
సానులతో చెలిమి, మోక్షసాధనము గదా
మౌనీశ్వరులకు,భగవ
రిప్లయితొలగించండిద్ధ్యానాసక్తులకు, యజ్ఞయాగ,తపోను
ష్ఠానులకెప్పుడు పర్వత
సానులతోఁజెలిమి మోక్షసాధనము గదా!
సాను=శిఖరము
మౌనమహింస,సత్యము,సమంచిత భక్తి విరక్తు లొప్పగా
రిప్లయితొలగించండిధ్యానతపఃక్రియాదులను తద్దయుఁజేయుచు,రామనామమున్
మానసమందు నిల్పుకొని మన్నన కెక్కిన మౌనికిన్ కుభృత్
సానులతోడి మైత్రియె సుసాధ్యమొనర్చును మోక్షమున్ సదా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమానవ జన్మకు సఫలత
రిప్లయితొలగించండిమాన మది యొనరిన బిల్వ మంగళ కథయున్
గానగ నెరుగమె యొకపరి
సానులతో చెలిమి మోక్షసాధనము గదా
పూనికతోడ నిర్జన తపోవనమందున నిర్వికల్పమౌ
రిప్లయితొలగించండిమౌనముఁ బూని యీశ్వరుని మానసమందున నిల్పి భక్తితో
ధ్యానమొనర్చు వేళ జడదారులగూడి, త్యజింప సౌఖ్మముల్,
సానులతోడి మైత్రియె, సుసాధ్యమొనర్చును మోక్షమున్ సదా
రిప్లయితొలగించండిఊనిక నొసగదు మనికిని
సానులతో చెలిమి; మోక్షసాధనము గదా
మానితమగు జీవన సం
ధానంబున విషయ బంధ తాపము వీడన్!
సాని దురాశ గాంచి విడి సర్వము వేమన మారె యోగిగా
రిప్లయితొలగించండిసానికొసంగెనెల్ల చెడి సాధకుడై జనె బుండరీకుడే
సాని విమోహమందొనరె సద్గతి తొండరడిప్పొడిన్ గనన్
సానులతోడి మైత్రియె సుసాధ్యమొనర్చును మోక్షమున్ సదా
పానాశ నాది బాధలు
రిప్లయితొలగించండిహీనమ్ములు కాఁగ నింక నిలలో నెందుం
గానక మందులు నిజమే
సానులతోఁ జెలిమి మోక్ష సాధనము గదా
మానుగఁ బ్రాణు లన్నిటను మానక విష్ణువు నిత్య ముండుటన్
వానర కిన్న రోరగ నభశ్చర నిర్జర దేవ గాయనీ
మానవ యక్ష వన్య మృగ మానుష భోజన వంశ జాతలన్
సానుల తోడి మైత్రియె సుసాధ్య మొనర్చును మోక్షమున్ సదా
[సాని = అధిపురాలు]
మానవ సర్వనాశనపు మార్గములో
రిప్లయితొలగించండిచరియింప జేయు నా
సానులతోడి మైత్రియె, సుసాధ్యమొనర్చును
మోక్షమున్ సదా
ఈ మహి సద్గురోత్తముల నెల్లపుడుం
బద సేవజేయుచున్
నీమముతోడ వారలును నేర్పెడుసూక్తుల
నాచరించినన్.
కం//
రిప్లయితొలగించండిఐనిస్టైన్-బోసులు పర
మాణువునకొకటి యుపపరమాణువుచూపన్
తాననె హాకిన్స్ ఈ బో
సానులతో చెలిమి మోక్షసాధనము గదా!
Satyendranath Bose and Einstein proposed a sub-atomic particle called Boson. When it was discovered in 2012, Stephen Hawkins, a famous Physicist, suggested that unstable Higin-Boson leaves the way open for a catastrophic cosmic wipe-out. ఇక్కడ 'మోక్షసాధనము' ఈ cosmic wipe-outను వ్యంగ్యముగా సూచిస్తుంది.
మానుగ గౌరవించుచును మాన్యుల గన్గొని చిత్తశుద్ధితో
రిప్లయితొలగించండిదీనుల కాచుచున్ సతము తీర్చుచు కోర్కెల నెల్ల వేళలన్
ధ్యానము చేయుచున్ హరిని తద్దయు భక్తిని, వీడ తుచ్ఛులౌ
సానులతోడి మైత్రియె, సుసాధ్యమొనర్చును మోక్షమున్ సదా
ధ్యానముతో త్రిమూర్తుల సదా భజియించుచు భక్తి, పేదలౌ
రిప్లయితొలగించండిమానవులన్ కనుంగొని సమాదరమున్ గడు సేవ చేయుచున్
జ్ఞానము నిచ్చి నిత్యమును కాచెడి తల్లులు ముగ్గురమ్మలన్
సానులతోడి మైత్రియె సుసాధ్యమొనర్చును మోక్షమున్ సదా