22, జూన్ 2022, బుధవారం

సమస్య - 4115

23-6-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్”
(లేదా...)
“విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్”

22 కామెంట్‌లు:

  1. కప్రా నామక పురమున
    నప్రతి హత యీర్ష్య తోడ యచ్చటి జనముల్
    విప్రుల గూరిచి యిటులనె
    విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    'చప్రము క్రిందుగ శూద్రులు',
    క్షిప్ర గతి మనువు ముగియ విశిష్టులు గోరన్
    దీప్రము సాక్షిగ జరుపగ
    విప్రులు, 'మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్'

    ఉత్పలమాల
    చప్రము వైచి బంధువుల సంతుకు పెళ్లని బిల్వ 'శూద్రులున్'
    క్షిప్రగతిన్ ముగింపగ 'విశిష్టులు' తొందరఁజేసినంతటన్
    దీప్రము సాక్షిగన్ మనువుఁ దీర్చగఁ బల్కియు వేదమంత్రముల్
    విప్రవరుల్, 'దమింగొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్'

    రిప్లయితొలగించండి
  3. అప్రకృతము కాదిది మీ
    రు ప్రోత్సాహమిడుచుండ లోకము నందున్
    సుప్రతిభ తోడ కొద్దిగ
    విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్

    సుప్రతిభ = మద్యము

    రిప్లయితొలగించండి
  4. కందం
    అప్రాశ్యులు వంశాచా
    రప్రభలను తుంగలోన రాజేయుచు, దు
    ష్టప్రకృతావళిని గలసి
    విప్రులు మాంసమ్ము గొనిరి వేడుక తోడన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  5. సుప్రజసేమముకొఱకై
    అప్రతిహతశ్రాద్ధకర్మనవధానముతో
    సప్రకటితరీతివేదసమ్మతితోడన్
    విప్రులుమాంసమ్ముగొనిరివేడుకతోడన్

    రిప్లయితొలగించండి

  6. కాప్రాలో వసియించెడు
    విప్రుల యింట పనిచేసి వెడలిన వారా
    చెప్రాసులు, కను చుండగ
    విప్రులు , మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్.

    రిప్లయితొలగించండి

  7. విప్రుల యిండ్లలో పనులు విత్తము గైకొని చేయు వారలే

    క్షిప్రముగా ముగించుకుని చెంతన యుండెడు వీధి యందునన్

    చప్రములన్ని గాంచుచు కసాయిని జేరుచు గాంచు చుండగా

    విప్రవరుల్, దమింగొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్.

    రిప్లయితొలగించండి


  8. క్షిప్రముగా గుడి కేగిరి
    “విప్రులు, మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్”
    చప్రమునందున మ్లేచ్చులు
    నప్రతిహతముగతినుటకు నానందముతో

    మరొక పూరణ

    కప్రముకల్పినట్టియిరకమ్మగ గ్రోలిరి యాలయమ్మునన్
    విప్రవరుల్ దమిం గొనిరి, వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్”
    దీప్రమునందువండుచునుతేకువతోడపటాణిసోదరుల్
    చప్రము క్రిందచేరుచునుచక్కగనెల్లరునారగించగన్

    “విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్”

    రిప్లయితొలగించండి
  9. చప్రము వేసియా స్దలము శాస్త్రపు రీతిని శుభ్రపర్చి యున్
    దీప్రపు గుండమున్ నునిచి దీటుగ మాంసము వేదప ద్ధతిన్
    క్షిప్రము హోమమై దనర శేషపు హారము నంతయున్ నికన్
    విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్

    రిప్లయితొలగించండి
  10. కందము
    ఆప్రోలఁగూరలుఁగొనిరి
    విప్రులు;మాంసమ్ముఁగొనిరి వేడుక తోడన్
    సుప్రియ! మాంసాశనులు,మ
    హాప్రియమై పోయెనంచు నంగడిలోనన్.

    ఉత్పలమాల
    సుప్రియ!యజ్ఞ యాగముల స్తోత్రమొనర్చుచు దేవకోటి క
    గ్నిప్రభలన్ హవిస్సులను నిష్ఠగ నిచ్చుచు,శాంతిఁగోరుచున్
    సుప్రజ కెల్ల;యూపమున శోభిలు మేషపవిత్రమౌ వపన్
    విప్రవరుల్ దమింగొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్.
    ---------దువ్వూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  11. ఈప్రాంతమందులేరట
    విప్రులు, మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్
    విప్రకృతులగువ్యక్తులు
    నప్రకరణ విషయముగద నాలోచింపన్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ,అమెరికా:

    క్షిప్రగతిని గనుచుండగ
    విప్రులు, మాంసమ్ము గొనిరి వేడుక తోడన్
    విప్రులు గానట్టి పరులు
    నప్రతిహతముగ చెలగుచు నాప్యాయముగా!

    క్షిప్రగతిన్ విచిత్రముగ చిత్తియె నాపుచు చూచుచుండగా
    విప్రవరుల్, దమింగొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్
    విప్రులుగానివారచట ప్రీతినిగూడుచు స్వీకరింపగన్
    చప్రము క్రింద కూర్చొనిరి సందడి జేయుచు శ్రద్ధతోడుతన్.

    రిప్లయితొలగించండి
  13. విప్రులు శాకము గొనియెడు
    సుప్రజ యని దెలియు గాదె సూరి జనుల కున్
    క్షిప్ర గతి బల్క గ నెచట
    విప్రులు మాంసమ్ము గొనిరి వేడుక తోడన్?

    రిప్లయితొలగించండి
  14. సప్రేమఁదినగ శాకము
    విప్రులు, మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్
    క్షిప్రముగనన్య కులజులు
    సుప్రజలై మసలు కొనుచు సుఖశాంతులతో

    రిప్లయితొలగించండి
  15. అప్రియమైన కృత్యముల నన్యుల సేమముఁ గోరి సల్పగన్
    సుప్రజలై పరస్పరము శోకవిదూరులుగారె నిచ్చలున్
    చప్రములో నొనర్చునొక సంబరమందున చేయ హోమమున్
    విప్రవరుల్, దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్
    క్షిప్రముగా జనంబు తమ క్షేమముఁగోరుచు నాప్రసాదమున్

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. 'విప్రో' బ్రాండున సోయా
      తో ప్రభవించగ బలముకు తోడై రుచి పెం
      చన్ ప్రియమగునని యెంచుతు
      విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్

      (soyameat నేపధ్యంలో)

      తొలగించండి
  17. అప్రియ కార్యమైన నది యందరి శూద్రుల
    కోర్కెమేరకున్
    విప్రవరుల్ దమింగొనిరి వేడ్కగ మాంసము
    శాస్త్ర పద్ధతిన్
    ఆ ప్రియ కర్మకాండనతి హర్షముతో
    నెరవేర్చి గొప్పగా
    సుప్రభరీతి బ్రాహ్మణులు సోద్యముగా
    వెలుగొందిరత్తరిన్.

    రిప్లయితొలగించండి
  18. అప్రతిమాన నైష్ఠికులు, హర్షితమానసు,లార్షకోటి, లో
    కప్రియధర్మమార్గు లొక కాలమునందు జగద్ధితైషులై
    క్షిప్రఫలప్రదాధ్వరము చేయగ బూనుచు యజ్ఞకర్మకై
    విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్

    రిప్లయితొలగించండి
  19. సుప్రజ కోసమై సలుపి స్తోమము నిష్ఠ ప్రజాళి మెచ్చగా
    క్షిప్రగతిన్ ,హవిస్సు లిడి క్షేమమిడన్ దివిజాళి, శాకముల్
    విప్రవరుల్ దమిం గొనిరి, వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్
    అప్రతిభోజ్యమంచు కడు హర్షముతోడ భుజించి రచ్చటన్

    రిప్లయితొలగించండి
  20. సుప్రాప్త శాకములతోఁ
    బ్రప్రథమమున సుర తోడఁ బండుగ దిన మం
    దా ప్రముఖు లెల్లరు విగత
    విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుక తోడన్


    సుప్రథితంబ లోకమునఁ జోద్యము కాదు తలంప రాజ భా
    ర్యా ప్రము ఖాధ్వర క్రతు చర ద్యజమాన ముఖ వ్రజమ్ముతో
    క్షిప్రమ యశ్వమేధ హవ శేఖర మందు వధించి యశ్వమున్
    విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్ర పద్ధతిన్

    [రాణి యశ్వమునుఁ గత్తితో వ్రేయ ఋత్విక్కులు గుఱ్ఱపు కొవ్వును వండ రాజు దానిని వాసన జూచును. ఇచట వారు నిజముగ మాంసము తిన్నను దినకున్నను జంపిరి కాబట్టి పొట్టనఁ బెట్టు కున్నట్టులు భావింపఁ దగును. శాస్త్ర పద్ధతిని నన్నది గమనార్హము. ఆహారార్థము పశుహింస హింస కాదని పెద్దలు చెప్పుదురు. పూర్వము విప్రులు మాంసమును దినెడి వారట. అగస్త్యుఁడు తినిన వృత్తాంతము ప్రసిద్ధమే కదా!]

    రిప్లయితొలగించండి
  21. క్షిప్రముగా గుడి కేగిరి
    “విప్రులు, మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్”
    చప్రమునందున మ్లేచ్చులు
    నప్రతిహతముగతినుటకు నానందముతో

    మరొక పూరణ

    కప్రముకల్పినట్టియిరకమ్మగ గ్రోలిరి యాలయమ్మునన్
    విప్రవరుల్ దమిం గొనిరి, వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్”
    దీప్రమునందువండుచునుతేకువతోడపటాణిసోదరుల్
    చప్రము క్రిందచేరుచునుచక్కగనెల్లరునారగించగన్

    రిప్లయితొలగించండి