11, జూన్ 2022, శనివారం

సమస్య - 4106

12-6-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము”
(లేదా...)
“కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా”

33 కామెంట్‌లు:


  1. కాళి కొండచూలి కౌశికి గాంధర్వి
    శిఖరవాసిని శివ సింహయాన
    సద్యుపాస్య సౌమ్య చలిమలచూలి శాం
    కరి పదమ్ములొసఁగు కలిమి సుఖము.

    రిప్లయితొలగించండి
  2. పద్మసంభవసిరిపావనియ. య్యెగా
    జలమునంటియున్నజలజయింట
    ఇభమునిష్టపడియెనిందిరశోభను
    కరిపదమ్ములొసగుకలిమిసుఖము

    రిప్లయితొలగించండి
  3. వీడు వాడనుచును వేరుభావ ములేక
    యంద రొక్క రె యని యాత్మ దలచి
    భక్తి తోడ గొలువ పావన మూర్తి, శాం
    కరి పదమ్ము లొసగు కలిమి సుఖము

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    దినదినము జనులకు తినుటకు సరిపడ
    భోజనమిడు జనని భూమి పైన
    కాశి యన్న పూర్ణ గనిలచె జయ శుభ
    కరి పదమ్ము లొసగు కలిమి సుఖము.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    క్షీర సాగరమున క్ష్వేళమ్ము వొంగంగ
    జగము గావ శివుఁడు సదయుఁడగుచు
    గౌరివైపుఁ జూడ గైకొనుమన్న శాం
    కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము

    మత్తేభవిక్రీడితము
    సురలున్ గూడియు రాక్షసాళి మిగులన్ క్షోభించి క్షీరోదధిన్
    గిరి కవ్వమ్ముగ రజ్జు వాసుకిగ సాగింపంగనా ద్రచ్చుటన్
    గరళమ్మూరగ భర్తఁ జూడఁ బ్రజకై కైకొమ్మనెన్ గౌరి! శాం
    కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా!

    రిప్లయితొలగించండి
  6. తొమ్మిది రకములుగ దుర్గమ్మ నూహించి
    పూజ జేయ , మాత బొమ్న నొకటి
    మొదటి దినము పొంకముగ దెచ్చు చుండ శం
    కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. హరిహరులు విరించి యాది శేషుండును
    పొగడ జేత కాని పొలుపు లమ్మ,
    సకల దేవగణము సంస్తుతి జేయు శాం
    కరి పదమ్ము లొసఁగు కలిమి, సుఖము.

    పొలుపు-అందము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
      స్తర మార్గంబునఁ దేజరిల్లు జననిన్ దత్త్వార్థ సంధాయి, దా
      హరునర్ధాంగినియౌ త్రిశక్తి యుతయౌ నంతర్గతాభాసి, *శాం*
      *కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా*

      త్రిశక్తి - ఇవి మూడు (3) విధములు, ఒక్కొకటి మరల మూడు (3) రకములు అవి - 1 ఇచ్చాది - ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, 2 ఉత్సాహాది - ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము, 3 సత్వాది - సత్వము, రజస్సు, తమస్సు

      తొలగించండి
  9. అరుసం బొందుచు నాత్మలో మిగుల యమ్మౌకాళికామాత,శాం
    కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా
    కరమున్ భక్తిని బూజసే యునెడ యక్కామాక్షి వేగంబె శ్రీ
    కరమౌ సంఘట లెన్నియోయిడుత సాకారంబుద్యోతించగా

    రిప్లయితొలగించండి
  10. కరుణాసింధుని భార్యసంకటములన్
    గష్టంబులన్ బాపు నా
    గిరిజా పుత్రిక దీన భక్తులకు నే క్లేషంబు
    రాకుండగా
    బరి రక్షించుచునుండు నెల్లపుడు దా
    బట్టింపుతోనట్టి శాం
    కరి పాదంబులు మీకు సంపదల
    సౌఖ్యంబించు పూజింపుమా!

    రిప్లయితొలగించండి


  11. గరళమ్మున్ గళమందు దాచి తలపై గంగమ్మునే దాల్చుచున్

    నిరతమ్మా యురగమ్ము భూషణముగా నొప్పారు భూరిన్ జటా

    ధరు దేహార్థము పొందినట్టి శివ యా దాక్షాయణిన్ గౌరి శాం

    కరి పాదంబులు మీకుసంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా

    రిప్లయితొలగించండి
  12. కనక దుర్గ కాళి కాత్యాయినీ పేర
    బరఁగు గౌరి మాత పాద పూజ
    సతము సల్పు నట్టి జనుల కెల్ల శాం
    కరి పదమ్ము లొసగు కలిమి సుఖము

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    గౌరి,మారి,ఖచరి కన్యాకుమారి,యీ
    శ్వరి,యచలకుమారి,గిరివిహారి,
    మహిషు గర్వహారి,మదనారినారి,శాం
    *కరి,పదమ్ములొసఁగు కలిమి సుఖము*

    మత్తేభము
    గిరిజా,గౌరి,కపాలి,కాళిక,సతీ,గీర్వాణ సంపూజితా,
    వరదా,యీశ్వరి,అన్నపూర్ణ,ఖచరీ,బర్హిధ్వజా,పార్వతీ,
    పురుహూతీ,ప్రభ,భద్రకాళి,యుమ,చాముండేశ్వరీదేవి,శాం
    కరి,పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁబూజింపుమా.

    రిప్లయితొలగించండి
  14. శివునిదేహసగము శివవల్లభ శివాని
    గౌరి కొండచూలి గట్టుపట్టి
    భద్రకాళి భవ్య భార్గవి సతి శుభం
    కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము

    రిప్లయితొలగించండి
  15. నమ్మికొలిచినంత నెమ్మిని గూర్చును
    చింతలన్నిదీర్చు సిరులనిచ్చు
    నెల్లవేళలందు నెడయకనున్న శాం
    కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము

    రిప్లయితొలగించండి
  16. శరణన్నన్ కరుణించి తీర్చు నిడుమల్ సంప్రాప్తమౌ సద్గతుల్
    గిరిరాజేంద్రునిపట్టి తానొసఁగు సంక్షేమంబు భక్తాళికిన్
    సరిలేరెవ్వరిలన్ నితాంత విలసత్సౌభాగ్యసంధాత్రి శాం
    కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా

    రిప్లయితొలగించండి
  17. గరళమ్మున్ గళమందు దాల్చి తలపై గంగమ్మునే దాచి తా

    నురగమ్మున్ సతతమ్ము భూషణముగా నొప్పారుచున్ జూటమున్

    హరిణాంకున్ ధరియించునట్టి శివ దేహార్థమ్ము గానిల్చు శాం

    కరి పాదంబులు మీకుసంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా

    (చిన్న సవరణతో)

    రిప్లయితొలగించండి
  18. శంక నెల్ల వీడి శాంత మనమ్మున
    సంతతమ్ము కొలిచి నంతఁ జాలు
    విఘ్న సంచయఘ్న విఘ్ననాయకుని శాం
    కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము


    సుర సంసేవిత దివ్య పాదములు విష్ణుద్వంద్వ పాదమ్ములున్
    సిరి నిత్యమ్మును గొల్చు పాదములు శ్రీ సీతేశు పాదమ్ములున్
    శరణార్ధివ్రజ రక్ష కాంఘ్రి యుగముల్ సంరక్షితక్షీణ వ
    త్కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యం బిచ్చుఁ బూజింపుమా

    రిప్లయితొలగించండి
  19. స్థిరమౌ చిత్తమునల్పులన్ కనుచు సంసేవించి ప్రేమమ్ముతో
    దురితమ్ముల్ బొనరించు వారల కడున్ దూరమ్ముగానుంచుచున్
    నిరతమ్మున్ మది నిల్ప నిశ్చలముగా, నృత్యప్రియున్ పత్ని శాం
    కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా

    రిప్లయితొలగించండి
  20. కోరి కొలిచి నంత కూరిమి చూపుచూ
    జనుల వగపు బాపి జవముగాను
    కరుణ చూపునట్టి కఱకంఠుని సతిశాం
    *కరి పదమ్ము లొసగు కలిమి సుఖము*


    బల్లూరి ఉమాదేవి.

    హరునర్ధాంగిని యెల్లవేళలను కాయావాచకొల్వంగతా
    కరుణన్ చూపుచుమెండుగానుమనలన్ కాపాడు చున్నట్టి యా
    గిరిపుత్రిన్ కడు భక్తి తోనిరతమున్కేలున్ మొగిడ్చంగశం
    *"కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా”*

    రిప్లయితొలగించండి