27-6-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్”(లేదా...)“విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే”
పండనికాయగవిజ్ఞతచండాడుచుతనదువిద్యసంగీతమునన్గండమునయ్యెనుబిడ్డకుపండితుడైవింతమృగముపగిదిచరించెన్
స్వాతికిరణంసినిమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పద్యమునంతరార్ధమునుభావనయందుననూహసేయకేవిద్యవితండవాదమునవీరుడుగాగనిజంబుదాచుచున్మధ్యమమార్గమెంచకనుమానవధర్మమువిస్మరించుచున్విద్యగడించిపండితుడువింతమృగంబుగసంచరించెనే
పద్యము వ్రాయు గాని పర భామల పొందును వీడకుండె దామద్యము ద్రాగి యెక్కువగ మాన్యులదిట్టుచు నుండె నిత్యమున్చోద్యము జెంది యందరును జూచుచుపల్కుచునుండిరట్టులన్'విద్య గడించి పండితుడు వింత మృగంబుగసంచరించనే!'
కందంమండిత రాజ పదవి నుద్దండునిగన్ లంకనేలు దశకంఠుఁడు గోదండపతి సతిఁ గొని నిగమపండితుఁడై వింతమృగము వగిదిఁ జరించెన్ఉత్పలమాలహృద్యమనంగ నంత్రములనింపగు వీణఁగఁ జేసి భక్తి నైవేద్యమొనర్చి శంకరుని బ్రీతి వరమ్ముల రావణుండు నిర్వద్యముగన్ వచించి కుజఁ బాధలఁ గూర్చెనె వేదయుక్తమౌవిద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే!
దండిగ చదివిన నేమిరదుండగులసగోష్టితోడ దుష్టుండగుచున్ బండడుగా మారి యతడుపండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్. విద్యలనెన్నొ నేర్చిన వివేకుడటంచు ప్రశస్తి నందినన్ మద్యము గ్రోలువారి చనుమానము తోడ సదా సురాపుడై బాధ్యతలుత్సజించి నుడుపాడ జనాళి వచించి రిట్టులన్ విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
అండ నిడుచుండి మసలెనుపండితుఁడై ; వింతమృగము పగిదిఁ జరించెన్మొండి తనమును గనబరచి , దుండగుని వలె నెలవునకు తూట్లు పొ డుచుచున్
నిండుగ శాస్త్రము నేర్చియుఖండితముగ మిత్రుని గని కావరమొప్పన్భండన మొనర్చి ద్రుపదుడుపండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: దండిగ విద్యలు నేర్చిన పండితుడై వింతమృగము పగిది జరించెన్ మెండుగ మోహము పూనగ మొండిగ దశకంఠుడిలను మూర్ఖత్వముతో! పద్యము గద్యమందు సరి పాండితితో వహిచెంది నేడిటన్చోద్యముగా పృథగ్జనుల జోడును గూడి సవిస్తరంబుగా హృద్యముగాని పద్ధతిని హేయమొసంగి నికారమెంచు దు ర్విద్య గడించి పండితుడు వింతమృగంబుగ సంచరించెనే!
మెండుగ రచనలు సేసెను పండితుడై,వింత మృగము పగిది జరించెన్ దండిగ చదువులు సదివిన పండితుడగు రావణుండు పామరుని వలెన్
కందంమొండిగ వివేక శూన్యపుపండితుడై వింతమృగము పగిది జరించెన్బండగ ముమ్మాటికిని వితండపు వాదమొనరించి తప్పు బలికినన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
హృద్యము గాగ పద్యములు హెచ్చుగ వ్రాసెడు శక్తినీయునావిద్యగడించెపండితుడు, వింతమృగంబుగ సంచరించెనేవిద్యలు చాల నేర్చిన వి వేకము లేకను సీతదె చ్చుటన్నింద్యుడు గాజగంబునను నేరము చేసెను లోకనింద్యమే
కందముపాండిత్య గర్వమున,మూర్ఖుండై దూషించుచుండు కుత్సిత,క్రూరాత్ముండే,గురువు శపించ,నపండితుఁడై వింతమృగము పగిదిఁజరించెన్.
మెండుగ విద్యలు నేర్చియు దండుగ కృత్యములు సలిపి దౌర్భా గ్యుo డై మొండిగ దిరిగెడు వాడై పండితుడై వింత మృగము పగిది జరించెన్
ఉత్పలమాలవిద్యలు నేర్చియుండి యపవిత్రపు కార్యములాచరించుచున్మద్యము,మాంసముంగొనుచు మత్తిలి పెద్దలఁదిట్టిపోయుచున్బాధ్యత లేక,విత్తసముపార్జన కక్కట! క్షుద్రదేవతా*విద్యగడించి పండితుఁడు వింతమృగంబుగ సంచరించెనే.
సేద్యము జేసి నిష్ఠగను శ్రీ ధవళాంగి యనుంగు భక్తుడైసద్యశమంది పండితుల సన్నుతి నందుచు నున్నవేళలోచోద్యముగా మనస్సునను చొప్పడు కామవికారమగ్నుడైవిద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
సద్యశ మందజేయగల శాస్త్రములున్ బహు కావ్యరాశి సంపాద్యములంచు నేర్చియును బావనతాసుఖ మందకుండ లోకద్యుతినాశకంబులగు కార్యములన్ రచియించునట్టి దుర్విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
మెండుగ రోషము మీఱఁగ భండన మొనరించు భంగి బ్రహ్మాండమ్ముల్ నిండఁగ ఘోషించుచుఁ దాఁ బండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్ఆద్యము వింత చేష్టలకు నాస ధనమ్మునఁ గారణమ్ములన్ వేద్యమ మాన వాలికి వివేకము నాశన మౌను లొంగినం జోద్యపు నమ్మకమ్ము లెదఁ జొప్పడ క్షుద్ర సు రాల్యుపాసనా విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
సద్యశమందు దేశికుని సైతము మించిన బాలగాయకున్చోద్యముగా మనంబున నసూయను బూని గురుండు నిర్దయన్విద్యనుగోరె దక్షిణగ వేదన పెంపెసగంగ ఛాత్రుకున్విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
నిండుగ మదిలో ద్రోణునిమండితముగ నిల్పి నేర్వ మార్గణ విద్యన్ఖండనమంగుళిఁ గోరుచుపండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్
మెండు నవధాన కవితలుదండిగ రాసె మహనావ ధానియె కాంక్షన్కూడగ పర భామలతోపండితుడై వింత మృగము పగిది జరించెన్
దండుగ కలిగించు పనులుమెండుగ చేయుచు సతతము మేదిని యందున్దుండగులచెలిమి చేసికుపండితుడై వింతమృగము పగిది చరించెన్.
పండనికాయగవిజ్ఞత
రిప్లయితొలగించండిచండాడుచుతనదువిద్యసంగీతమునన్
గండమునయ్యెనుబిడ్డకు
పండితుడైవింతమృగముపగిదిచరించెన్
స్వాతికిరణంసినిమా
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపద్యమునంతరార్ధమునుభావనయందుననూహసేయకే
రిప్లయితొలగించండివిద్యవితండవాదమునవీరుడుగాగనిజంబుదాచుచున్
మధ్యమమార్గమెంచకనుమానవధర్మమువిస్మరించుచున్
విద్యగడించిపండితుడువింతమృగంబుగసంచరించెనే
పద్యము వ్రాయు గాని పర భామల పొందును వీడకుండె దా
రిప్లయితొలగించండిమద్యము ద్రాగి యెక్కువగ మాన్యుల
దిట్టుచు నుండె నిత్యమున్
చోద్యము జెంది యందరును జూచుచు
పల్కుచునుండిరట్టులన్
'విద్య గడించి పండితుడు వింత మృగంబుగ
సంచరించనే!'
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిమండిత రాజ పదవి ను
ద్దండునిగన్ లంకనేలు దశకంఠుఁడు గో
దండపతి సతిఁ గొని నిగమ
పండితుఁడై వింతమృగము వగిదిఁ జరించెన్
ఉత్పలమాల
హృద్యమనంగ నంత్రములనింపగు వీణఁగఁ జేసి భక్తి నై
వేద్యమొనర్చి శంకరుని బ్రీతి వరమ్ముల రావణుండు ని
ర్వద్యముగన్ వచించి కుజఁ బాధలఁ గూర్చెనె వేదయుక్తమౌ
విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే!
రిప్లయితొలగించండిదండిగ చదివిన నేమిర
దుండగులసగోష్టితోడ దుష్టుండగుచున్
బండడుగా మారి యతడు
పండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్.
విద్యలనెన్నొ నేర్చిన వివేకుడటంచు ప్రశస్తి నందినన్
మద్యము గ్రోలువారి చనుమానము తోడ సదా సురాపుడై
బాధ్యతలుత్సజించి నుడుపాడ జనాళి వచించి రిట్టులన్
విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
అండ నిడుచుండి మసలెను
రిప్లయితొలగించండిపండితుఁడై ; వింతమృగము పగిదిఁ జరించెన్
మొండి తనమును గనబరచి ,
దుండగుని వలె నెలవునకు తూట్లు పొ డుచుచున్
నిండుగ శాస్త్రము నేర్చియు
రిప్లయితొలగించండిఖండితముగ మిత్రుని గని కావరమొప్పన్
భండన మొనర్చి ద్రుపదుడు
పండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిదండిగ విద్యలు నేర్చిన
పండితుడై వింతమృగము పగిది జరించెన్
మెండుగ మోహము పూనగ
మొండిగ దశకంఠుడిలను మూర్ఖత్వముతో!
పద్యము గద్యమందు సరి పాండితితో వహిచెంది నేడిటన్
చోద్యముగా పృథగ్జనుల జోడును గూడి సవిస్తరంబుగా
హృద్యముగాని పద్ధతిని హేయమొసంగి నికారమెంచు దు
ర్విద్య గడించి పండితుడు వింతమృగంబుగ సంచరించెనే!
మెండుగ రచనలు సేసెను
రిప్లయితొలగించండిపండితుడై,వింత మృగము పగిది జరించెన్
దండిగ చదువులు సదివిన
పండితుడగు రావణుండు పామరుని వలెన్
కందం
రిప్లయితొలగించండిమొండిగ వివేక శూన్యపు
పండితుడై వింతమృగము పగిది జరించెన్
బండగ ముమ్మాటికిని వి
తండపు వాదమొనరించి తప్పు బలికినన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహృద్యము గాగ పద్యములు హెచ్చుగ వ్రాసెడు శక్తినీయునా
రిప్లయితొలగించండివిద్యగడించెపండితుడు, వింతమృగంబుగ సంచరించెనే
విద్యలు చాల నేర్చిన వి వేకము లేకను సీతదె చ్చుటన్
నింద్యుడు గాజగంబునను నేరము చేసెను లోకనింద్యమే
కందము
రిప్లయితొలగించండిపాండిత్య గర్వమున,మూ
ర్ఖుండై దూషించుచుండు కుత్సిత,క్రూరా
త్ముండే,గురువు శపించ,న
పండితుఁడై వింతమృగము పగిదిఁజరించెన్.
మెండుగ విద్యలు నేర్చియు
రిప్లయితొలగించండిదండుగ కృత్యములు సలిపి దౌర్భా గ్యుo డై
మొండిగ దిరిగెడు వాడై
పండితుడై వింత మృగము పగిది జరించెన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండివిద్యలు నేర్చియుండి యపవిత్రపు కార్యములాచరించుచున్
మద్యము,మాంసముంగొనుచు మత్తిలి పెద్దలఁదిట్టిపోయుచున్
బాధ్యత లేక,విత్తసముపార్జన కక్కట! క్షుద్రదేవతా
*విద్యగడించి పండితుఁడు వింతమృగంబుగ సంచరించెనే.
సేద్యము జేసి నిష్ఠగను శ్రీ ధవళాంగి యనుంగు భక్తుడై
రిప్లయితొలగించండిసద్యశమంది పండితుల సన్నుతి నందుచు నున్నవేళలో
చోద్యముగా మనస్సునను చొప్పడు కామవికారమగ్నుడై
విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
సద్యశ మందజేయగల శాస్త్రములున్ బహు కావ్యరాశి సం
రిప్లయితొలగించండిపాద్యములంచు నేర్చియును బావనతాసుఖ మందకుండ లో
కద్యుతినాశకంబులగు కార్యములన్ రచియించునట్టి దు
ర్విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
మెండుగ రోషము మీఱఁగ
రిప్లయితొలగించండిభండన మొనరించు భంగి బ్రహ్మాండమ్ముల్
నిండఁగ ఘోషించుచుఁ దాఁ
బండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్
ఆద్యము వింత చేష్టలకు నాస ధనమ్మునఁ గారణమ్ములన్
వేద్యమ మాన వాలికి వివేకము నాశన మౌను లొంగినం
జోద్యపు నమ్మకమ్ము లెదఁ జొప్పడ క్షుద్ర సు రాల్యుపాసనా
విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
సద్యశమందు దేశికుని సైతము మించిన బాలగాయకున్
రిప్లయితొలగించండిచోద్యముగా మనంబున నసూయను బూని గురుండు నిర్దయన్
విద్యనుగోరె దక్షిణగ వేదన పెంపెసగంగ ఛాత్రుకున్
విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే
నిండుగ మదిలో ద్రోణుని
రిప్లయితొలగించండిమండితముగ నిల్పి నేర్వ మార్గణ విద్యన్
ఖండనమంగుళిఁ గోరుచు
పండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్
మెండు నవధాన కవితలు
రిప్లయితొలగించండిదండిగ రాసె మహనావ ధానియె కాంక్షన్
కూడగ పర భామలతో
పండితుడై వింత మృగము పగిది జరించెన్
దండుగ కలిగించు పనులు
రిప్లయితొలగించండిమెండుగ చేయుచు సతతము మేదిని యందున్
దుండగులచెలిమి చేసికు
పండితుడై వింతమృగము పగిది చరించెన్.