13, జూన్ 2022, సోమవారం

సమస్య - 4108

14-6-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే”
(లేదా...)
“కపివరు లెల్ల నేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్”

19 కామెంట్‌లు:

 1. విపినమును పాడు జేసిరి
  కపివరు లెల్లరునుఁ ; గనఁగఁ గవివరులైరే
  నిపుణత జూపుచు పిల్లలు ,
  చపలత యొకదానికొకటి సరిపడి యుండన్

  రిప్లయితొలగించండి

 2. విపరీతపు పోకడలని
  చపలురు యువకులని వారి చపలత్వము తే
  ట పరచ గని యొకడిట్లనె
  కపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే

  రిప్లయితొలగించండి
 3. కందము
  అపురూపపు మధువనమున
  విపరీతముగాను త్రాగి వేడుక మీఱన్
  కపి హనుమఁబొగడఁదొడగిరి
  *కపివరులెల్లరునుఁగనగఁగవివరులైరే!*

  రిప్లయితొలగించండి
 4. కుపితులునాయిరిజనులును
  విపులమవినయమిలవినగవేదనగలుగన్
  సఫలతగాంచగదహనము
  కపివరులెల్లరునుఁగనఁగకవివరులైరే

  రిప్లయితొలగించండి
 5. విపినము ను బోడి జేసిరి
  కపివరులెల్లరును,గనగ గవివరు లైరే
  చపలులుగా వర్తించక
  నిపుణతతో నేర్చి చదువు నిరతిని వారల్

  రిప్లయితొలగించండి
 6. కందం
  నిపుణత మదిఁదేల్చు కవిత,
  లపూర్వమన రామనామమంబుధి నడవౌ
  చు పడుకులు దేల వ్రాయఁగ
  కపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే!

  చంపకమాల
  నిపుణత దేల్చు మానసము నిర్మలమైన కవిత్వమాధురుల్,
  కుపితులు నౌచు రావణుని గూల్చగ వారధి గట్ట నంబుధిన్
  జపముగ రామ నామమును శైలములందున వ్రాసి తేల్చగన్
  కపివరు లెల్ల నేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్!

  రిప్లయితొలగించండి

 7. కపటులు గద్దెనెక్కగను కల్లలవెన్నియొ చెప్పుచున్ సదా

  సుపథము వీడు నేతలిల చోరులటంచును వారి మార్పుకై

  శపథము జేసి కైతలను సత్కృతులన్ రచి యింపగా వృషా

  కపివరులెల్లనేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్.

  రిప్లయితొలగించండి
 8. విపినము జొచ్చి యుగ్రముగ వేయివిధంబుల బాడు జేసెనే
  కపివరు లెల్ల నేఁడు ,గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్
  చపలము నొంద నేరకనుశాస్త్ర ము,ఛందము వేద మాదియున్
  నిపుణతతోడ వేగముగ నేర్చి సభాంత రసీమ మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 9. చంపకమాల
  కపి హనుమాను సీతఁగని క్రమ్మర సంద్రము దాటి వచ్చి, తా
  నపుడెరిగింపగా,మధువనంబును జొచ్చియుఁద్రాగి వారలున్
  కపివర!మారుతీ!దనుజ ఖండన! జై!యన నాతడిట్లనెన్
  *కపివరులెల్ల నేడు గనఁగాఁగవివర్యులెయైరి వింతగన్.*

  రిప్లయితొలగించండి
 10. అవధాన శిక్షణా శిబిరము నందలి విద్యార్థుల గూర్చి.

  కపటంబించుకెరుంగని
  యపగండులు నాడి పాడి యభ్యాసముతోన్
  దపియించి వధానములను,
  కపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే.

  చం.
  కపటమెఱుంగనట్టి యపగండులు మానుచు నాటపాట ల
  య్యపరిమితావధానులు, నఘౌఘ నివర్తులు భద్రకీర్తులున్
  కృపనిడి నేర్పగా వినుచు గీర్తిగడించగ, దోచె నివ్విధిన్,
  కపివరు లెల్ల నేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. కపివరుడగు హనుమంతుడు
  విపరీతపుశక్తితోడ పెకలించిన మే
  టిపరువునుగాంచి పొగడిన
  కపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే

  రిప్లయితొలగించండి
 13. విపులముగా వివరించెద
  విపినమునందున మృగముల వేడుక లెల్లన్
  నిపుణత జూపుచు కవితల
  కపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే

  రిప్లయితొలగించండి
 14. విపులముగా విశేషములు వింతలు జెప్పెద రండు రండహో
  విపినమునందు వార్షికపు వేడుకలంటిన వంబరమ్మునే
  నిపుణతజూప జంతువులనేక విధంబుల క్రీడలందునన్,
  కపివరు లెల్ల నేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్

  రిప్లయితొలగించండి
 15. నిపుణత కొరవడియును దా
  మపు రూపపు కీర్తి నొంద నారాట ముగా
  దపి యించు చు o డు నయ్యెడ
  కపి వరు లెల్లరును గనగ కవి వరులైరే !

  రిప్లయితొలగించండి
 16. కందం
  విపినమునస్వేచ్ఛ విహా
  ర పింగళములు, జలధి దరి రాముని గాంచెన్
  కపులంత జేసె భజనలు
  కపివరు లెల్లరును గనగ గవివరు లైరే.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 17. కపికి కవిగ నచ్చు కలగ
  లిపి సుందరకాండమందలి లిపిని వేయన్
  నిపుణత లోపము కలుగగ
  కపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే

  రిప్లయితొలగించండి
 18. కపి యారగింపఁ బండిన
  కపిత్థ మింపుగ సతమ్ము కవి తా నిత్య
  మ్ము పలుకుఁ గవిత్వ మలరుచుఁ
  గపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే


  కపటము పల్కుఁ దత్కవియె కానదు కోఁతి నిజమ్ము నెమ్మదిం
  దపన సెలంగఁ బండ్ల పయి దానికిఁ బ్రాసలఁ బ్రీతి వీనికిన్
  నృపవర సత్య మిప్పలుకు నేనరు దెంచితి నందుకే సుమీ
  కపివరు లెల్ల నేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్

  రిప్లయితొలగించండి
 19. విపరీతము గాదిది విను
  జపములు చేయుచు కొలిచిన చాలు నిరత మా
  కృపగల రాముని కరుణన్
  కపివరు లెల్లరును గనగ కవివరులైరే

  రిప్లయితొలగించండి