14, జూన్ 2022, మంగళవారం

న్యస్తాక్షరి - 72

15-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
సెలవుల అనంతరం ప్రారంభమైన పాఠశాలలలో
పిల్లల సందడిని వర్ణిస్తూ
ఉత్పలమాల పద్యం చెప్పండి

1వ పాదం 4వ అక్షరం 'పా'
2వ పాదం 11వ అక్షరం 'ఠ'
3వ పాదం 16వ అక్షరం 'శా'
4వ పాదం 19వ అక్షరం 'ల'

38 కామెంట్‌లు:

 1. ఉత్పలమాల
  కొమ్మల పాటలన్ జెలఁగు కోయిలలట్లుగ పాఠశాలలన్
  గమ్మనిపద్యగానములు కంఠములందున మేళమట్లు గు
  త్తమ్ముగ నున్నదున్నటులఁ దప్పక చెప్పు కుశాగ్రబుద్ధి ని
  క్కమ్ముగఁ బండువౌ బడులఁ గ్రాలుచు సందడి జేయ బాలలే!

  రిప్లయితొలగించండి
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 3. బాలలు పాఠశాలలకు బారులు దీరుచు బోయియ చ్చటన్
  ఫాలుని సంస్మరించియిక పాఠము లేవియు నేర్వబో కయున్
  జాలని కొంటె వేషముల సాటిగ నుండెడు శారదాంబతోన్
  మేలము లాడుచుండెనట మీరనిహాస్యము జేయునా బాలయే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి

 4. ఆటలపాటలన్ విడిచి యల్లరి బాలకులెల్ల కూడెడిన్
  జోటది, యొక్కరొక్కరుగ శుంఠలు పోకిరి బద్దకస్థులున్
  బూటకు లేనిపేదలును మూఢులు భూరి విశారదుండ్రు మం
  డ్రాటము తోడ జేరిరి పరాకుగ బాలలు పాఠశాలకున్.

  రిప్లయితొలగించండి
 5. ఆటలు పాటలందునను హాయిగ నాడెడి బాలబాలికల్
  వాటిక లెల్లవీడి యిక పాఠము లందున దృష్టి నిల్పుచున్
  మూటల నిండ పుత్తముల బుద్ధిగ నేర్వగ, శాస్త్రవేత్తలే
  సాటిగ రారు మాకనుచు సాగిరి ముద్దుగ పాఠశాలకున్.

  రిప్లయితొలగించండి
 6. ఆటలు (పా)టలుంజదువులన్నియు నేర్పెడు పాఠశాల క్రొం
  బాటలువేయు గాదె సహపా(ఠ)కులౌదురు మిత్రులచ్చటన్
  పాటవమబ్బునంచుఁదమ బాలలఁజేర్చ వి(శా)లదృష్టితో
  పేటల పట్టణంబులను పిల్లల సందడి హెచ్చె మే(ల)నన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   ఈరోజు కర్నూలులో చి. బోరెల్లి హర్ష అష్టావధానానికి మీరు వెళ్తున్నారా? నన్ను రమ్మన్నారు కాని అస్వస్థత కారణంగా రావడం లేదు.

   తొలగించండి
  2. నమస్తే, శంకరయ్య గారు!మీ సాహితీ సేవ అసదృశము , చాలమందికి పద్యరచనాభిలాష కలిగిస్తున్న మీయకుంఠిత దృఢ దీక్ష అనితర సాధ్యము;మీరు చెప్పిన
   అష్టావధాన కార్యక్రమముగురించి నాకు తెలియదు, నేను ప్రస్తుతము బెంగుళూరులో ఉన్నాను.మీరు త్వరగా
   అనారోగ్యము నుండి కోలుకోవాలని కోరుకొంటున్నాను.

   తొలగించండి
 7. మొన్ననె ‘పా’ఠశాలలను
  పూర్తిగ నేర్చగ బిల్లలందరువ్

  వన్నెగ నేర్చుకొందురిక
  పా’ఠము లన్నియు శ్రద్ధ జూపుచున్

  యిన్ని దినంబు లింటికెడ
  నిమ్ముగ మ్రొక్కిరి శా’రదాంబకున్ ,

  కొన్ని పవళ్ళు వెళ్ళెదరు
  కోనిడు రాదని పాఠశా’ల’ కున్

  రిప్లయితొలగించండి
 8. ఆటలు (పా)టలున్ మిగుల హాయినిగూర్చెడి మాటలేగదా
  బాటలువైచిపిల్లలకు పా(ఠ)మునేర్పును పాఠశాలలో
  చీటికి మాటికిన్ గలియ స్నేహము పెంపగు (శా)శ్వతంబుగున్
  కోటలు దాటుమాటలట కొండొక కాలము హెచ్చు గో(ల)తో

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  చెన్నుగ పాఠశాలలకు చెంగున బాలలు మోదమొందుచున్
  పన్నుగ నవ్యతన్ బఱగు పాఠములందలి జ్ఞానమెంచగా
  తిన్నగ వారికక్ష్యలకు తేకువతోడ విశాల శీలతన్
  తెన్నగు తీరు నొజ్జల నుతించుచు చేరిరి గొప్ప హేలతో!

  రిప్లయితొలగించండి
 10. ఉ.మా.
  ఆడుచు పాడుచున్గడిపి హ్లాదము నందిన బాల బాలికల్
  వాడుక దారి బట్టిరిగ పాఠము నేర్వగ సందడించుచున్
  వేడుక బంచి కన్నులకు బీఠములెక్కెడి శాస్త్రకారులై
  నేడిక గ్రీష్మ తాపమును నిల్పుచు బోయిరి పాఠశాలకై

  రిప్లయితొలగించండి
 11. బాలలు పాఠశాలలకు పర్వులు తీయచు నుల్లసిల్లుచున్
  పాలను పొట్టనిండ గొని పాఠములన్మది వల్లె వేయుచున్
  గోలగ తోటి బాలలను గూడుచు చేరి విశాలమైన వి
  ద్యాలయమందు వారి పునరాగమనంబన నెంత హేలయో.

  రిప్లయితొలగించండి
 12. చేరిరి పాఠ sa
  శాలలకు శీఘ్ర మె బాలలు విద్య నేర్వ గన్
  మేరయ లేని మోదపు తమిన్ ఠ వ మేమి నొంద రయ్యెడన్
  తోరపు శ్రద్ధ తోడుతను తూర్ణమె వార ల శాంతి వీడియు న్
  భారత పౌరులై మెలగి బాధ్యత లన్ గమనించి గ్రాలరే

  రిప్లయితొలగించండి
 13. దైవము *పా* రవశ్యమున దల్చుచు దాలిచి క్రొత్తబట్టలన్
  పావనమైన మానసము పా *ఠ* ములన్ పఠియింప నెంచుచున్
  జీవన వృద్ధి కోరుచును చేర్చగ తండ్రి వి *శా* ల చిత్తుడై
  పోవుచు నుండ్రి బాలకులు పుస్తకముల్ గొని పాఠశా *ల* కున్

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. ఉత్పలమాల
  నూతన పాఠ్య పొత్తముల నొక్కులు నొక్కుచు తృప్తి నొందుచున్
  పాత సహాయపాఠ్య సహ పాఠకులందరి పొందు కోరుచున్
  ఆతప కాలవేడి చవి హాయిగ దల్చుచు శాస్త్రపాఠముల్
  స్నాతకు లంత నేర్వ జనె సంతస మొందుచు పాఠశాలకున్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 16. పోదము పాఠశాలలకు మూఁడ విరామము లెల్ల నేటితోఁ
  బాదము లుంచఁగా బడులఁ బాఠము లన్యము లెల్ల నేర్వఁగా
  నీదు మనమ్ము లోపల జనించెనె నూత్న విశాల భావముల్
  వాదనముల్ సెలంగె ననివార్యములై కడుఁ బాఠశాలలో

  రిప్లయితొలగించండి
 17. ఆడుచు *పా* డుచున్ గడిపి యంది మనమ్ముల క్రొత్త యూహలన్
  వేడుక మిత్ర బృందములు వే *ఠ* వణించుచు నుండమోదమున్
  పాడిగ పెద్దలంపగను పాఠమునేర్వ వి *శా* ల చిత్తులై
  పోడిగ పోవుచుండిరల పుస్తకముల్ గొని పాఠశా *ల* కున్

  రిప్లయితొలగించండి
 18. వీగినపాడుకాలమునవీరులుగాగనువింతనర్తనన్
  పైగనిమిత్రబృందమునుపాఠములన్నియుగుర్తుఁజేయగా
  సాగెనుభాషణంబులవిచల్లనిభారతిశాలయందునన్
  మ్రో+ెనుఘం

  రిప్లయితొలగించండి
 19. మ్రోగెనుఘంటనాదములుమోదమునీయగబాలులీలకున్

  రిప్లయితొలగించండి
 20. 4 11 16 19 పాఠశాల
  తీరుగ పాఠముల్ బడిన దెల్పగ బాగగు గాని "నెట్టు"లో
  వారికి నేర్వ గష్ట మగు, పాఠము నేర్పగ పెద్ద వారికిన్
  తీరని బాధయౌ ,మనసు తీరగ ,నొక్క విశాల జీవిత
  మ్మారసి,యాటలన్ మురిసి రా పసి బాలలు పాఠశాల లోన్.

  రిప్లయితొలగించండి
 21. వేడుకలున్ ముగించి చదువే నిడకోరియు పాఠశాలకే
  వాడల పిల్లలందరును వచ్చిరి పుస్తక పెన్నుల సంచులన్ గొనీ
  నాడుతు నేకరూపమగు నట్టియు దుస్తులనేధరించియున్
  నేడుపుతోని కొందరును నీరస మేనిడి కొందరు చేరెనే బడి న్

  రిప్లయితొలగించండి