15, జూన్ 2022, బుధవారం

సమస్య - 4109

16-6-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తగవుల నాడంగఁ దగును తరుణులతోడన్”
(లేదా...)
“తగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్”

25 కామెంట్‌లు:

 1. కందం
  గగన కుసుమమును బోలిన
  మగువల కోర్కెల ,మగనికి మక్కువ లేకన్
  దగవన తగాద ముడిగొన
  తగవుల నాడంగ దగును తరుణుల తోడన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 2. అగపడునెన్నడుదోషిగ
  ఖగపతివాహనుడునైనకాంతలయెదుటన్
  పగవీడిసరససంగతి

  తగవులనాడంగఁదగునుతరుణులతోడన్

  రిప్లయితొలగించండి
 3. పగలును రేతిరిన్ నిజ నివాసము నందున చెంగలించుచున్
  సెగలను రేపుచుండ కడు చెన్నగు రూపము లంది మించుచున్
  రగులగ కోరికల్ మది సరాగము లాడుచు పట్టుపాన్పుపై
  తగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 4. మగడు దరికి పిలువంగనె
  నగౌరవ పరచుచు రాని యతివల గనినన్
  సగభాగమంచు దలచక
  దగవుల నాడంగఁ దగును తరుణులతోడన్

  రిప్లయితొలగించండి
 5. తగుదునని వచ్చి తీరుపు
  లగణితముగ జెప్పి తగవు లధికము జేయన్
  మగువలని జూడ కెపుడును
  దగవుల నాడంగ దగును తరుణుల తోడన్

  రిప్లయితొలగించండి
 6. నగవులమాయమాటలనునక్కనుబోలినజిత్తుజూపుచున్
  వగలనుదెచ్చుపాలిసులవంచుచుసంఘమునుద్ధరింపగా
  తగవులనాడగాదగును, తామరసాక్షులతోడనిచ్చలున్
  మగడునుమోమునవ్వులనుమౌనిగభాషణఁజేయగావలెన్

  రిప్లయితొలగించండి

 7. మగవారిని కవ్వించెడు
  వగలాడుల గాంచినంత వరుసకు బావల్
  జగడములా కాక చిలిపి
  తగవుల నాడంగఁ దగును తరుణులతోడన్.

  రిప్లయితొలగించండి
 8. తగుదును గాక యంచునిక తాలిమి లేకను దప్పు సాక్షులన్
  నగణిత మౌవిధంబుగను నాయత రీతిని జెప్పువారలన్
  మగువలె యైన నుంగనక మౌనము వీడుచు మందలించి యున్
  దగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్ .

  రిప్లయితొలగించండి
 9. ప్రగతికి బాటలు వేయుచు
  సుగతికి శ్రమియించు నట్టి శూరు o డైనన్
  వెగటుగ పలికెడు వేళన్
  దగవు ల నాడంగ దగును దరుణుల తోడన్

  రిప్లయితొలగించండి

 10. మగువలు మేలుబంతి సుకుమారులు వారలు ప్రేమపాత్రులే

  పగతురుకాదు వారు మగవారికి స్ఫూర్తి ప్రదాతలే సుమా

  నెగడును బూనువేళ తమనేమము వీడిన నేమి నర్మమున్

  దగవుల నాడగా దగును తామరసాక్షుల తోడ నిచ్చలున్.

  రిప్లయితొలగించండి
 11. తగవుల నీయగ వచ్చును
  మగనింటికి బోవునపుడు మగువలకిలలో
  బిగికౌగిట జిక్కినతరి
  తగవుల నాడంగ దగును తరుణులతోడన్

  రిప్లయితొలగించండి
 12. కందము

  వగలుంబొలయలుకలు,చిఱు
  నగవుల్,బిగి కౌగిలింత నర్మోక్తులతో
  మగవారలౌర!జిలిబిలి
  *తగవులనాడంగఁదగును తరుణులతోడన్.*

  చంపకమాల

  బిగువులు,బింకముల్,వగలు,బెట్టుసరుల్,బిగి కౌగిలింతలున్
  నగవులు,వెక్కిరింతలు,ప్రణామములుంగడు నర్మగర్భముల్
  మగటిమిఁజూపుచుంబ్రియులు మాటికి మాటికి మెత్త మెత్తగా
  *తగవుల నాడగాఁదగును తామరసాక్షులతోడ నిచ్చలున్*
  ----------దువ్వూరి రామమూర్తి.

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ,అమెరికా:

  తగులము కోపము గలిసిన
  సొగసగు రూపమ్ముతోడ సొంపగు వలపున్
  తగునటు కవ్వించ చిలిపి
  దగవుల నాడంగ దగును తరుణుల తోడన్.

  తగులముతోడ కోపమును దాల్చిన మోమునుజూపుచుండుచున్
  సొగసది జాలువాఱగను సొంపగు మాటలతోడ ప్రేమగా
  తగునటు రెచ్చగొట్టుచు సుతారముగా దరిజేర పాన్పుపై
  తగవులనాడగా తగును తామర సాక్షులతోడనిచ్చలున్.

  రిప్లయితొలగించండి
 14. తెగువగ తలపడ వోడగ
  నగుపడు నవి యొక పరి ప్రణయప్రేరితమై
  తగులంబినుమడి యగునెడ
  తగవుల నాడంగఁ దగును తరుణులతోడన్

  రిప్లయితొలగించండి
 15. మగువల మానసంబెరిగి మక్కువఁజూపుచు మచ్చరింపకన్
  తగినతెరంగు వారికి ముదంబును గూర్చి చరింప మేలగున్
  వగలను చూపికౌగిలిని వాలినవేళ సరాగ మాడుచున్
  తగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 16. జగముల చుట్టముఁదానటు
  ప్రగతినిసూచించువాడుఁ
  బరమాత్మునిగా
  సగుణంబౌరూపముతో
  తగవుల నాడంగఁ దగును తరుణులతోడన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 17. వగలనుబోవుచు మదనుని
  సెగలను రేకెత్తు వాఁడి సితములు వేయన్
  మగవారలు తగురీతిగ
  తగవుల నాడంగఁ దగును తరుణులతోడన్

  రిప్లయితొలగించండి
 18. జగమున ద్వాపరంబునను సఖ్యత గూడెను సత్యభామతో
  సుగమమువేంకటేశ్వరుడుసొమ్ముల వేటనఁగొండపైనఁదా
  జగడపు మాటలన్వినగ జానకి వీడెను రామచంద్రుడున్
  తగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 19. కందం
  చిగురాకు సోయగమ్మున
  వగలొలుకుచుఁ బతులఁ జేరి వలపులు వంచన్
  బిగి కౌగిట సరసమ్మగు
  తగవుల నాడంగఁ దగును తరుణులతోడన్

  చంపకమాల
  సగమగు భావమెంచి యుపచార ప్రవర్తన భర్త సేవలో
  వగలను జిందుచున్ వలపువాటున జిక్కియు సోయగమ్ము తా
  కగఁ పులకింతలూర బిగి కౌగి
  టఁ జేర్చి నిషీధికేళిలోఁ
  దగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 20. నగవనెడిమాటయెమరచి
  మగనినిహింసించుచెపుడు మాటలతోడన్
  జగడమునకుసిద్ధమయిన
  *“తగవుల నాడంగఁ దగును తరుణులతోడన్”*

  రిప్లయితొలగించండి
 21. ఒక వెటకారపు పూరణ
  చం:తగిలెను నాకు కర్మమున తామర,దానికి గోకుచుండగా
  నెగబడి చూతురేల?నది యెంత కుసంస్కృతియో యెరుంగరే?
  వగవగ నేను,నేను పడు బాధను గాంచుచు నవ్వు టేలనో !
  తగవుల నాడగా దగును తామర సాక్షుల తోడ నిచ్చలున్.
  (ఇక్కడ తామరస+అక్షులు అని కాక తామర+సాక్షులు అని విడగొట్టాను.తామరకి సాక్షులు,అది చూసి నవ్వే వాళ్లు అనే అర్థం లో.)

  రిప్లయితొలగించండి
 22. కం:వగ లుడిగిన కౌమారపు
  మగువల తో నెయ్య మేల? మదవతులై యిం
  పుగ దోచిన సరసత్వపు
  తగవుల నాడంగ దగును తరుణుల తోడన్.
  (పెద్ద వయస్సు స్త్రీలతో స్నేహం కంటే యువతులతో సరసపు తగవు పెట్టుకున్నా ఆనందంగానే ఉంటుందని.)

  రిప్లయితొలగించండి
 23. తగ వేటికి రే పవళులు
  మగఁడా నీ కివ్విధమ్ము మగువల తోడన్
  విగ తాన్న ముండ నెంచినఁ
  దగవుల నాడంగఁ దగును దరుణుల తోడన్


  జగతికి మూల మంగనలు శాంత మనస్కలు నోర్పు నందుఁ జూ
  డఁగ సరి భూ సతీ మణికి డయ్యరు చేతల డెంద మందుఁ జ
  క్కగఁ బడయంగ నూఱటను గౌరవ మిచ్చుచు మంచి మాటలం
  దగవుల నాడఁగాఁ దగును దామరసాక్షుల తోడ నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 24. పగలవిహెచ్చుచు నుండును
  తగవులనాడంగ,దగును తరుణుల తోడన్
  తగురీతిమాటలాడుచు
  మగనాలినిగూడిసతము మహిలో తిరుగన్

  రిప్లయితొలగించండి