12, జూన్ 2022, ఆదివారం

సమస్య - 4107

13-6-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్”
(లేదా...)
“గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా”

19 కామెంట్‌లు:

 1. కందం
  ధరణీస్థలి నే కార్యము
  నెరవేరదు చేదుఁగనక నిక్కమిదంచున్
  సురలే మథియించిన సా
  గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్!

  మత్తేభవిక్రీడితము
  ధరణిన్ జూడగ కర్మలేవియును సంధానించుచున్ సాగినన్
  నెరవేరంగను బోవు చేదుఁగనకే నిక్కంబిదన్ సామ్యమై
  సురలైనన్ దలపెట్టి త్రచ్చినను తత్సూత్రమ్ము రూపింప సా
  గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా!

  రిప్లయితొలగించండి
 2. అరయ దరమె నీ గరిమను
  దరతరములకును సరిపడు తైలపు ద్రవముల్ ,
  సిరులును గలిగినయోసా
  గరుడా నీయందు బుట్టె గరళము,సుధయున్

  రిప్లయితొలగించండి

 3. సిరులకు మూలంబనుచును
  ధరణిని నరులెల్ల సతము తలతురు నిన్నే
  వరుణాలయమగు హే సా
  గరుడా! నీయందుఁ బుట్టె గరళము సుధయున్.


  వరుణావాసము వీవు రాఘవము కూపారమ్మటంచున్ సదా

  ధరణిన్ మానవులెల్ల గొల్తురు గదా దారాదమా భక్తితో

  సిరులున్ సంపదలెన్నియో కలిగినన్ జిత్రమ్ముగా నాడు సా

  గరుడా పుట్టె విషంబునున్ సుధయు నీగర్భంబు నందున్ భళా!

  రిప్లయితొలగించండి
 4. కందము
  వర వాసుకిఁద్రాడుగ,మం
  దరమే కవ్వముగఁజేసి దైత్యామరులుం
  దరుచగనే,ఘనుఁడా!సా
  గరుడా!నీయందుఁబుట్టె గరళము సుధయున్.

  రిప్లయితొలగించండి
 5. కందం
  సురలు సురద్విషులుబ్ర
  హ్మరసముకై క్షీర సంద్ర మథనము జేయన్
  దొరలినవి గని దలచె సా
  గరుడా, నీయందు బుట్టె గరళము సుధయున్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 6. సురలునసురులునుకలసిరి
  యరయంగాతత్వమంతయానమునందున్
  సరసతజిలికిరినినుసా
  గరుడానీయందుబుట్టేగరళముసుధయున్

  రిప్లయితొలగించండి
 7. అరయన్జీవితయానమందుననుడాయంప్రాణిమోక్షంబునున్
  పరుగున్బెట్టుచునూపిరాడకనునాపన్లేకకామాదులన్
  తఱితోకన్నులువిప్పిజూడగనెనాతాపారినీవంచుసా
  గరుడాపుట్టెవిషంబునున్సుధయునీగర్భంబునన్భళా

  రిప్లయితొలగించండి
 8. అరయగ నో క్షీరపు సా
  గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్ ,
  గరళము నీశుడు గైకొన
  కరివేలుపు సుధను బంచి ఖచరులకొసగెన్

  రిప్లయితొలగించండి
 9. అరయన్ శక్యమె నీదు పుట్టుకయు, మాహాత్మ్యంబు వేయేల ,సా
  గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా
  తరముల్ దిన్నను దగ్గనా సిరుల దాదాచెన్ సునాయాసమై
  ధరణిన్ సంద్రము లెన్నియో గలవు గా దైలంబు తోగూడియున్

  రిప్లయితొలగించండి
 10. తరమే బ్రహ్మకునైన నీ ఘన మహత్త్వంబెన్న,దైత్యామరుల్
  తరుచన్ వాసుకిఁజుట్టి మందరముతో తద్ఘర్షణంబందు,సా
  *గరుడా!పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా!*
  కరి,యైరావత మప్సరాంగనలహో!కల్పద్రుమాదుల్ దగన్.

  రిప్లయితొలగించండి
 11. సురుచిర లీలన్ సంపద
  విరివిగ గర్భమునదాచి ప్రియముగ మాకున్
  వరములనిడుచుంటివి సా
  గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్

  రిప్లయితొలగించండి
 12. సిరితాబుట్టెను నీలో
  సురాసురులు నిన్నుఁ ద్రచ్చసుధను బడయగన్
  మరియును శశి పుట్టెను సా
  గరుఁడా నీయందుఁ బుట్టెగరళము సుధయున్

  రిప్లయితొలగించండి
 13. సురలున్ రక్కసులొక్కటై చిలుక నస్తోకంబుగా నిన్నుసా
  గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబు నందున్ భళా
  స్థిరమౌ కౌస్తుభ హారమున్ శశియునున్ శ్రీలక్ష్మియున్ ధేనువున్
  వరమౌ వృక్షము నశ్వమాది పలు సంభారమ్ములున్ బుట్టెగా

  రిప్లయితొలగించండి
 14. చిరకాలమ్ముమనంగ పృథ్విపయినన్ చిత్తమ్ము కాంక్షింపగా
  సురలున్ రక్కస కోటి త్రచ్చ జలధిన్ స్ఫూర్తిన్ ప్రదర్శించి మం
  దరమున్ కవ్వముగా గ్రహించి, మలఁ బద్మాక్షుండు మోయంగ సా
  గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా!

  రిప్లయితొలగించండి
 15. సురలనురులు నొక్కటి యై
  తిరముగ మ థి యింప బూనె తేకువ తోడన్
  సురు చిర లీల గ నో సా
  గరుడా ! నీ యందు బుట్టె గరళము సుధ లున్

  రిప్లయితొలగించండి
 16. అరసితివి లోక కంటకు
  నరసితి లోకోత్తరుని నిజాత్మజుఁ బౌత్రున్
  వర భూవర!నిక్కమ్ము స
  గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్


  కర మాశ్చర్యము మంచి చెడ్డ లిలలోఁ గన్పట్టుఁ బార్శ్వంబులన్
  నరుఁ డీ రెంటిని నేర కున్నఁ దగ క్షంతవ్యుండు కాదెన్నఁడున్
  ధరఁ దార్కాణము నీదు వర్తన మగుం దథ్యంబుగా క్షీర సా
  గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా

  రిప్లయితొలగించండి
 17. తరచుచు నుండగ శరధిని
  సురాసురులు వీడకనటసుధకై వడిగా
  నురగమెకవ్వమవగనో
  *"గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్”*

  రిప్లయితొలగించండి