3, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4841

4-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్”

(లేదా...)

“మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

41 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
మనసుపడి జింకఁ గోరియు
నినకులతిలకుని బనచియు నిడుమల జిక్కెన్
గొనిపో వచ్చెడు రఘురా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మత్తేభవిక్రీడితము
మనసయ్యెన్ హరిణమ్ము గాంచననుచున్ మారామునన్ గోరి తా
నినవంశోత్తము నంపి రావణుడు కీడెంచంగ మూలమ్మునై
వనిలోజిక్కితి నంచు శోకమునఁ గావన్రాగ శీఘ్రమ్ము రా
మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

BMahalakshmi చెప్పారు...

అనయముపతినేదలచుచు
తనియకమదిలోవిరహముదండిగ జేసన్
కనియెన్రూపము వరరా
మునికైధ్యానమునొనర్చె భూమి జ లంకన్

Sitharamayya Solasa చెప్పారు...

దనుజుడు లంకేశునిపై
కినుక ననుభవించి జానకి యతని నుండిన్
తనను విడిపించుమని రా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

విరించి చెప్పారు...


అనుకుడగు రావణుండట
వనమున బంధించినట్టి పాళము నందున్
పెనిమిటి యగు శ్రీ రఘు రా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్.

BMahalakshmi చెప్పారు...

ఇనవంశంబునచంద్రుజడాతడును తానిచ్చెన్కరంబామెకున్
తనువున్నిండెగజానకీసతికియానందంబుతావెన్నెలై
కనియెన్మానసదర్పణంబుననునాకాకుస్థవీరురా
మునికైధ్యానమొనర్చె సీతమదివ్యామోహంబుతోలంకలో

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

ఘన మూర్ఖుడు రావణుడును
జనకునిసుతసీతగొనియు చనియెన్ లంకన్
అనిశము మదిలో రఘు రా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

విరించి చెప్పారు...


తననాశించుచు దీవిరాయడట యుద్యానమ్ములో దాచి కా
మనుడై నీచపు మాటలన్ బలికి ధర్మద్రోహి బాధింపగా
నను గాపాడగ వేగరమ్మనుచమానస్యమ్ముతో సేక్త రా
ముని కై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ తనదుస్థితికి వగచఁగను
మనమున దుఃఖము పెరుఁగఁగ మథనపడుటయే
తన భాగ్యమాయెనని రా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

మ॥ తన దుర్భాగ్యము నెంచ భూమిజకటుల్ తాపమ్ము హెచ్చంగ నా
థుని శ్రీరాముని దైత్యునిన్ దునుమగన్ దుర్భాగ్యమున్ బాపగన్
దనధర్మమ్మని వేడఁగన్ దలచి సంత్రాణమ్ము నాంశించి రా
మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ముని వేషంబున సీతను
వనిలో రావణుడులంక వద్దకు జేర్చన్
కనులారగాంచ రఘురా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

క్షణమైనన్ రఘురామచంద్రుని వియోగంబా ధరాపుత్రికిన్
యనలంబై దహియింపజేయు నెడదన్నాభీలముం గూర్చుచున్
వనిలో మాయలఁబన్ని రావణుఁడు యావాసంబుకుం జేర్చ రా
మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
krkr చెప్పారు...

కనిఁదా దెల్పెనుస్వప్నము
సునిశిత శీలద్రిజటయెఁశోకముబాపన్,
వినిఁదాననయముశ్రీరా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్
కొరుప్రోలు రాధాకృష్ణరావు

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:తన కెగ్గు దలచు రావణు
దునుమగ రాఘవు డనుజుని తో నరుదెంచన్
గను భాగ్యము గొన పరమా
త్మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్”

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ తనదుస్థితికి వగచఁగను
మనమున దుఃఖము పెరుఁగఁగ మథనపడుటయే
తన భాగ్యమాయెనని రా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

మ॥ తన దుర్భాగ్యము నెంచ భూమిజకటుల్ తాపమ్ము హెచ్చంగ నా
థునిఁ బ్రార్థించఁగ దైత్యునిన్ దునుమగన్ దుర్భాగ్యమున్ బాపగన్
దనధర్మమ్మని వేడఁగన్ దలచి సంత్రాణమ్ము నాశించు రా
మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

శ్రీకంది శంకరయ్య గారు సూచించిన పిదప టైపాటు పునరుక్తి సరిచేసిన పద్యము

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ముని వేషంబున జానకి
దనతో గైకొని వెడలియు దనుజుడు బ o ధిం
చిన విల పించుచు దన రా
ముని కై ధ్యానము నొన ర్చె భూమిజ లంకన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అనిశమ్ము భర్తృ పద చిం
తనా విలగ్నాంతరంగ తద్దయు భీతిన్
వనజాక్షి నిజ మనోధా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్


వనమం దుండఁగ రావ ణాపహృతయై వ్యాజమ్మునన్ దుస్స్థితిన్
దనుజాధీశు పురమ్ములో నిలిచి సంతప్తాంతరంగమ్మునం
గన రాకున్నఁ గలంత రామునకునై కాకుత్స్థవంశాభిరా
మునికై ధ్యాన మొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సతికి నానందంబు...కాకుత్స్థ..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పుత్రికిన్ + అనలంబై, రావణుడు + ఆవాసంబు' అన్నపుడు యడాగమం రాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'...యశోకవనిలో' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాణమ్మునకు' అనడం సాధువు కదా... అక్కడ "రాముని బాణాహతి దాళలేక" అందామా?

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

)మ:తన కెగ్గున్ దల బెట్టు రావణుని యా దౌర్జన్యముల్ బాయ రా
ముని బాణాహతి దాళ లేక యసువుల్ పోనాడు కామాతురా
త్మునికై ధ్యానమొనర్చె సీత మది, వ్యామోహమ్ముతో లంకలో”
తనకున్ బంధము గూర్చు నాయసుర బాధల్ సైచుచున్ నిత్యమున్.
(వ్యామోహమ్ము తో అనే పదం సీతకు అన్వయించటం ఇష్టం లేక సమస్యని మూడవ పాదం లో ఉంచి ఆ వ్యమోహాన్ని రావణునికి వర్తింప జేసాను.)


Dhanikonda Ravi Prasad చెప్పారు...

అయ్యా! పద్యం మరింత మార్చి పూరించాను.దయచేసి గమనించ వలసినది.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

వనిలో జింకను కోరగ
నినవంశుండేగయతిగనేతెంచి గొనన్
అనయము తలంచుచా రా
ముని కై ధ్యానమునొ నర్చె భూమిజ లంకన్

గొనిపోవంగను నెంచుచున్ మదముతో క్రూరంపు చిత్తంబుతో
తన దౌర్భాగ్యమిదంచు దుఃఖితయునై తాపమ్ము హెచ్చంగరా
*“మునికై ధ్యానమొనర్చె సీత మదివ్యామోహమ్ముతో లంకలో”*

M.B.G.TILAK చెప్పారు...

తననా వింశతిబాహుడు
వనమున బంధించి యుంచ భామిని వగచెన్
మనసున పతిని తలచి రా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్

తననా రావణుడే యశోక వనిలో దాసీల కాపుంచుచున్
జినదానా కరుణింపుమా యనుటయే చీకాకు పుట్టించగా
మనసే రాముని పైన లగ్నమవగా మాయావినింజంపఁ రా
మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో

Surya చెప్పారు...

దనుజుండట్టుల భిక్షురూపధరుడై దంభంబునన్ దెచ్చి యా
వనమందుంచి వరించి రమ్మనుచు నిర్బంధింప లక్షింపకన్
మునివంద్యుండసురాంతకుండజితుడా మూర్ధన్యుడౌస్వామి రా
మునికై ధ్యానమొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో