11, ఆగస్టు 2024, ఆదివారం

సమస్య - 4849

12-8-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్”

(లేదా...)

“జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్”

18 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

కన్విందునుజేయునటన
తన్వంతనుపులకరింపతైతైయనగా
చిన్మయమానాట్యమునై
జిన్ సేవించిన లభించుస్థిరవాగ్ధనముల్

Sitharamayya Solasa చెప్పారు...

వాసికి నెక్కిన పెద్దలు
మీసాలను దువ్వుకొనుచు మిత్రుల తోడన్
నూసాడుచుండి తోడుగ
జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

మన్మందిరమున నిత్యము
సన్మతితో మరవకుండ సద్భావనతో
తన్మయమొప్పగ శారద
జిన్ సేవించిన లభించుస్థిరవాగ్ధనముల్

విరించి చెప్పారు...


నిన్ సంతతమ్ము సేవిం
పన్ సమయమ్మదియె లేదు భార్గవి వినవే
నిన్ సుతినిగా దలచెడి య
జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్.


నిన్ సేవింపగ వేదమంత్రములనే నేర్వంగ లేనైతి నై
నన్ సద్భక్తిని వీడలేను కదనే నన్నేవిధిన్ బ్రోతువం చున్ సందేహము వీడి చేరితిని బూజ్యుండైన యా సోమయా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్.

M.B.G.TILAK చెప్పారు...

నిన్ సేవింతురుగా భ
క్తిన్ సాధింపగ సుళువని తిరుమలరాయా
నన్ సాకుమెపుడు బాలా
జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ నిన్ సేవించెదను మనము
నన్ సర్వము నీదయయని నమ్ముచుఁ బూత్కా
రిన్ సవినయముగ నని జా
జిన్ సేవించిన లభించు వాగర్థముల్

శా॥ నిన్ సత్యంబుగ మానసంబునను వాణీనిల్పి మోదమ్ముతో
డన్ సర్వమ్మిల నీ కటాక్షమనిఁ బాటల్ పద్వముల్ గూర్చి కా
నన్ సౌజన్వముతోడ దాసుఁడని సన్మానించి యాచించి జా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగార్థముల్

M.B.G.TILAK చెప్పారు...

నిన్ సృష్టించెను సర్వతోముఖుడు తానే పద్మ సంజాతమై
నన్ సృష్టించినవానిఁ గొల్తు నెపుడున్ నన్ గాచి దీవించమం
చున్ సప్తాత్ముని వేడుకొన్న శుభముల్ సొంపారు చుండున్ సరో
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కన్ సన్నల మెలఁగి గురుల
కున్ సత మింపుగ సభక్తిఁ గొలుచుచు సంప్రీ
తిన్ సద యాత్ము ధరాభో
జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్


పెన్ సేవా రత మానసమ్ములను నా వీణా లసద్ధస్త దే
విన్ సేవించిన భక్తి తత్పరతలన్ విద్వన్మహాచార్య కో
టిన్ సేవించిన సంతతమ్ము పరిపాటిన్ సత్య ధర్మాధ్వ రా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

నిన్ సేవింతును భక్తిన్
నన్ సర్వేశ దయ జూపి నళిన దళా క్షా
చెన్ సాగిలు చును బాలా
జిన్ సేవించిన లభించు స్థి ర వా గ్ధ న ముల్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:నన్ సేవించగ నేలర?
నిన్ సాహిత్యమ్మునందు నిల్పెద లే! నా
కున్ సఖుడౌ నీతని పే
జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్
(నన్ను సేవిస్తా వెందుకు? నా మిత్రు డైన ఇతని పేజ్ ఫాలో అవ్వు.వాగర్ధాలు బాగా తెలుస్తాయి.)

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నిన్ సర్వంబుగ నిశ్చలాత్మమెయి నేనీ ధ్యానమందున్ సదా
నిన్ సర్వేశ్వరుఁగా భజించి కొలుతున్ నీపాదపద్మంబులన్
నన్ సన్మార్గమునందు బోవు సరళిన్ నడ్పంగదే! సోమయా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:"నన్ సేవించిన కైత నేర్పెద" ననంగా నెవ్వడో యట్టి వా
నిన్ సర్వజ్ఞుడటంచు నెంచకుసుమా శ్రద్ధన్ మహా భారత
మ్మున్ సాహిత్యము నందు నిల్పి సతతమ్మున్ వంద్యుడౌ సోమయా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నన్ సద్భక్తునిగన్ బూ
జన్ సల్పనొసంగమంచు చదువులకై వా
ణిన్ సతతము నేత్ర సరో
జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్

శార్దూలవిక్రీడితము
నన్ సద్భక్తునిగన్ దలంచి కనవే దాక్ష్యిణ్య! నిత్యంబు పూ
జన్ సల్పంగ సనాతనీ! జనని! భాషాలక్ష్మి! తేజస్వి! వీ
డన్ సత్యంబుగ నీ పదమ్ములని మాటల్ గూర్చఁగన్ దృక్సరో
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్!

Surya చెప్పారు...

నన్ సేవింపుమటంచు రాజులిడు గాన్కల్ శ్రీల నాకాంక్ష లే
కన్ సర్వాత్మకుడీశ్వరుండఖిలలోకారాధ్యుడై వెల్గు వా
నిన్ సేవించుటె నిత్యకృత్యమగునా నిష్కాముడౌ సోమయా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సరోజిని శబ్దము ద్వితీయా విభక్తిలో సరోజినిని / సరోజినిన్. సరోజిని లోని సహజమైన ని లోని యి కారమునకు లోపము రాదు. ఉ కార మున్న లోపమగును.
సరోజిన్ - బ్రహ్మను నను నర్థమున వాడ వచ్చును. సరోజి యనఁగా బ్రహ్మ.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

నిన్ సేవింతుసతతమిల
నిన్ సన్నుతిజేతువిడక నీరజనాభా
నీసములెవ్వరు పద రా
జివ్ సేవించిన లభించు స్థిర వాగ్ధనముల్


డా బల్లూరి ఉమాదేవి

నిన్ సేవింతు మనంబునందు విడకన్ నేనెల్లకాలంబునన్
నన్ సాధించక కావుమయ్య వడిగా సాకేతవాసా మనం
బున్ సంతోషము తోడ నింపు మికనేపూజింతునీపాదరా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.