1, మార్చి 2025, శనివారం

సమస్య - 5049

2-3-2025 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకంబా నిన్నుఁ గొలువ శుభములు గలుగున్”
(లేదా...)
“శునకంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్”

17 కామెంట్‌లు:

  1. త్రినయన పరిగృహ్య!జగ
    జ్జనని! విశాలాక్షి!శక్తి!శాంభవి!నగనం
    దిని! మలయవాసిని! గణే
    శునకంబా! నిన్నుఁ గొలువ శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జననంబున్ సఫలంబు జేసెదవుగా శర్వాణి నీవెన్నడున్
      మనసారా జనులెల్లఁ గొల్తురుకదా మాతంగి నిన్నేసదా
      కనుమమ్మా మము సంప్రసాదమలరన్ గ్రౌంచారికిన్ శ్రీగణే
      శునకంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్

      తొలగించండి
  2. మనమున నిలిపియు భక్తి గ
    నను దినమును జప మొ నర్తు మమ్మ భవానీ
    జననీ సతి వి క దా యీ
    శునక o బా నిన్ను గొలువ శుభ ములు గల్గున్

    రిప్లయితొలగించండి
  3. మనుజుని నేస్తుడ వనెదరు
    దినము నిశీథముల నడుమ తేడా లేకన్
    ననిశము దొంగల బట్టెడు
    శునకంబా ! నిన్నుఁ గొలువ శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  4. మనుజుల కన్నను నీవే
    యనయము వినయమునుఁజూపి యభిమానముతో
    కనుగొని యుండెడు జీవివి
    శునకంబా నిన్నుఁ గొలువ శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  5. అనయంబున్ యజమాని శ్రేయమును నీవత్యంత ప్రాధాన్యతన్
    ఘనమౌ రీతిగ జూపి గాచెదవు నీకన్నన్ ప్రశస్తమ్ముగా
    మనుజాళిన్ తలగాచువారలెవరే మాన్యమ్ముగా నీభువిన్
    శునకంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. కం॥ మనమన నిలుపుచు భక్తినిఁ
      దనరుచు శాంభవిని వేడఁ దత్పరుఁడగుచున్
      గనమా సౌభాగ్యము దా
      శునకంబా నిన్నుఁ గొలువ శుభములు గలుగున్

      మ॥ కనఁగా నాద్యను సర్వదా మనమునన్ గాంక్షా ఫలాపేక్షతో
      వినయమ్మున్ గని భక్తి భావమున సంప్రీతిన్ బ్రవర్తిల్లుచున్
      జనుచున్ సన్నుతి సేయఁగన్ దగు జనుల్ సౌభాగ్య మొప్పంగ దా
      శునకంబా నిను గొల్చినన్ శుభము లసోక్తంబుగా దక్కెడిన్

      అంబ ఆద్య పార్వతి

      తొలగించండి
    2. దాశుడు భృత్యుడు (నిఘంటువు సహాయమండి)

      మరొక పూరణ అండి

      మ॥ వినుమా సంతతి సంపదల్ ఘనముగా విత్తంబు నార్జించఁగన్
      బనులన్ బొందఁగ దేశ దేశముల సంభావించి యెచ్చోటికై
      నను చాగంగను దల్లిదండ్రులను సన్మానించి రక్షించెడిన్
      శునకంబా నిను గొల్చినవ్ శుభము లసోక్తంబుగా దక్కెడిన్

      లేకుంటే వృద్ధాశ్రమములే గతి.

      తొలగించండి
  7. ఘనమౌ క్షీర సముద్రరాజ తనయా!కంజాత నేత్రీ!రమా!
    ధనలక్ష్మీ! జయలక్ష్మి! దేవి! శుభ విద్యాలక్ష్మి! శ్రీలక్ష్మి!పా
    వనలక్ష్మీ!హరివల్లభా!కమల! శ్రీవత్సాంకకాంతా!రతీ
    శునకంబా! నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్!!

    రిప్లయితొలగించండి
  8. జననీ నీవె హిమాద్రిరాజసుతగా జన్మించి దివ్యాంశవై
    మనమందన్య విచారముల్ విడచి ప్రేమన్ భక్తి నీమంబులన్
    ఘనమౌ సేవను గొల్చి గెల్చి సగ భాగంబైతివాహా మహే
    శున కంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్

    రిప్లయితొలగించండి
  9. కనగానచ్చటభైరవుండుఁగొలువైకాపాడు చుండెన్గదా
    ఘనవిశ్వాసమువారణాశిననుశీఘ్రంబౌను వానిన్గనన్
    జనుమావేగముఁగాలఁగాలుకడకున్సాన్నిధ్యమున్గోరుచున్
    శునకంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  10. సమస్య:
    శునకంబా నిను గొల్చినవ్ శుభము లసోక్తంబుగా దక్కెడిన్


    మననంబే కద నీదునామము సరౌ మార్గంబునే నెంచగన్
    వినయంబున్నిను చేరినాను మరి నీవేదిక్కనే కాశిలో
    కనరావా జననీ పదంబు బడితిన్కావంగ నీవేను, యీ
    శున, కంబా నిను గొల్చినన్, శుభములస్తోకంబుగా దక్కెడిన్

    రిప్లయితొలగించండి
  11. మనుజేంద్రున కొసఁగితివి సు
    రనాథు దర్శనము వేగ రాగముఁ జూపన్
    ఘను ధర్మజు వెంటఁ జనిన
    శునకంబా నిన్నుఁ గొలువ శుభములు గలుగున్


    వనజాక్షుండు కుమారుఁడై వటువు సంభావించి సేవించెనే
    నిను నో కశ్యప మౌని పుంగవు సతీ నీ సాటి వా రుందురే
    తనరన్ భక్తి మనమ్ము నందు జననీ దాక్షాయణీ నిర్జరే
    శున కంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్

    రిప్లయితొలగించండి
  12. కం:కనకపు సింహాసనమున
    నిను గూర్చొన జేసినారు ని న్నెరుగని మా
    మనుజులు,విజ్ఞుల కెటులన్
    శునకంబా నిన్నుఁ గొలువ శుభములు గలుగున్”?

    రిప్లయితొలగించండి
  13. మ:నిను విశ్వాసపు చిహ్నమం చెరిగియో,నీ రక్షణాశక్తి హె
    చ్చనియో,మా ఘన మైన బ్యాంకునకు చిహ్నం బయ్యె నీ బొమ్మ ని
    ర్ధనునౌ నాకు ధనమ్ములున్ పదవులున్ దక్కెన్ గదా బ్యాంకునన్
    శునకంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్
    (సిండికేట్ బ్యాంకు కి చిహ్నం కుక్క.ఆ బ్యాంకు ఉద్యోగి బ్యాంకు పట్ల కృతజ్ఞత తో కుక్కని స్మరించకుండా ఉండలేడు కదా!కుక్క విశ్వాసం కలది కనుక,రక్షణ ఇచ్చేది కనుక అది బ్యాంకుకి గుర్తు ఐ ఉండ వచ్చు.)



    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మనమున నిన్నే తలచుచు
    ననయము పూజలను సలిపి యానందముతో
    జననీ!మ్రొక్కెదను గణే
    శున కంబా!నిన్ను గొలువ శుభములు
    గలుగున్.

    రిప్లయితొలగించండి