శా:నే నీ ఛందమునన్ వసించు నవధానిన్ గాని, నా పాండితిన్ గానన్ లోకులు మెచ్చరయ్యె తపమున్ గావించినన్ వాణి కై, యీ నా తమ్ముడు నిన్ను బట్టి సినిమా నేలున్ గదా!మందు సీ సా!నిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్! (నేను అవధాని గా వాణి ని గూర్చి తపస్సు చేస్తూ ఛందస్సు లోనే బతికినా నా కవనం లోకు లందరికీ నచ్చుతుందా?ఓ మందు సీసా! నా తమ్ముడు నిన్ను పట్టుకొని సినిమా సాహిత్యాన్ని ఏలుతున్నాడు కదా!)
(3)కం:ఆ నదిలో ఛందమ్మును, నా నాయిక నడక లోని యార్ద్రత,కవిలో నానాటి వ్యథల కిన్నెర సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్ (విశ్వనాథ వారి కిన్నెరసాని ఊరకే చదివితే చాలదు.ఆ నది నడక లోని ఛందస్సు,ఆ కథనాయిక లోని ఆర్ద్రత, ఆ కవి లోని వ్యథ అనే కొలతలతో చూస్తేనే ఆ గేయాల రసమయత్వం తెలుస్తుంది.)
కందం
రిప్లయితొలగించండితానుగ సృష్టించి, సతిగ
మానితు రాలంచు గొనియు మన్ననలందెన్
వాణిఁ బలుకుఁ జెలి నలువకు
సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్
శార్దూలవిక్రీడితము
తానౌచున్ జగమందు సృష్టివెలయన్ దన్మూలమై బ్రహ్మయే
వీణాపాణి సృజించి మెచ్చిసతిగన్ వేదాగ్రణిన్ జేసియున్
రాణింపన్ రసనాగ్రమందునిలుపన్! ప్రార్థించుచున్ నల్వకున్
సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్!
రిప్లయితొలగించండిమానస మందున నిన్నే
నే నిలిపి కొలిచెదనయ్య నిటలాక్షుండా
హే నభవుడ కాశీ వా
సా! నిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్.
తానే విద్యల నిచ్చు తల్లియును చైతన్యమ్ము కేమూలమై
జ్ఞానమ్మిచ్చునటంచు నచ్చికన విజ్ఞానార్థులై లోకులే
వీణాపాణి పదమ్ము వీడరుకదా! విశ్వాత్ముడౌ బ్రహ్మకున్
సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్.
ఏనాడయిన దమిగ నీ
రిప్లయితొలగించండిమానసమందు తెలచితివ మాటలబోటిన్ ?
ఫానలు వలదు నలువ దొర
సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్
పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
రిప్లయితొలగించండిలానిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీ నాళీ కజుడా విధాత లపనన్ చిందాడు చుండేడి యా
సానిన్ గొల్చిన వాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్
నీనామంబులు భక్తితో నుడుగుచున్ నిత్యంబు ధామంబునన్
తొలగించండినానా రీతుల పూజలన్ సలుపుదున్ నవ్యంబులౌ పూలతో
దీనున్ నన్నిక కావుమా కరుణతో దేవేశ కైలాస వా
సా!నిన్ గొల్చిన వాని కబ్బును గదా
సాహిత్య సామ్రాజ్యముల్
జ్ఞానమసంపూర్ణమయిన
రిప్లయితొలగించండిసానిన్ గొల్చిన లభించు సంతసమిలలో
వాణీ నిను కైతల దొర
సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్
స్థానంబయ్యెను నీకు సప్త గిరులే సౌందర్య చిహ్నంబులై
నేనే ప్రోచెదనంచు తెల్పునుగదా నీ హస్తమే నిత్యమున్
జ్ఞానాపేక్షను నాకొసంగితివయా నాదైవమా శ్రీనివా
సా! నిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్
కం॥ వైనముఁ గాంచుచు నేర్వఁగ
రిప్లయితొలగించండిధ్యానము వీడకఁ బడయఁగఁ దత్పరుఁడౌచున్
మానక నరుగుచు విద్యల
సానిన్ గొల్చిన లభించు సాహిత్య నిధుల్
శా॥ వైనంబెంచుచు నట్లు విజ్ఞుఁడుగ నుద్భాసిల్లగన్ ధాత్రినిన్
ధ్యానంబుంచుచు సాధనమ్ముఁ గని సంధానించు నాసక్తితోఁ
దానేపారుచు శ్రద్ధ వీడకను విద్యాబుద్ధులందొప్పెడిన్
సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్
వైనము ఉపాయము సాని అధిపురాలు
కం:వానికి,వీనికి మ్రొక్కిన
రిప్లయితొలగించండినే నాకు లభించు నేమి ఈ కవితల్ వా
ణీ!నే వాక్కులతో,మన
సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్”
(మనసా,వాచా )
శా:నే నీ ఛందమునన్ వసించు నవధానిన్ గాని, నా పాండితిన్
రిప్లయితొలగించండిగానన్ లోకులు మెచ్చరయ్యె తపమున్ గావించినన్ వాణి కై,
యీ నా తమ్ముడు నిన్ను బట్టి సినిమా నేలున్ గదా!మందు సీ
సా!నిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్!
(నేను అవధాని గా వాణి ని గూర్చి తపస్సు చేస్తూ ఛందస్సు లోనే బతికినా నా కవనం లోకు లందరికీ నచ్చుతుందా?ఓ మందు సీసా! నా తమ్ముడు నిన్ను పట్టుకొని సినిమా సాహిత్యాన్ని ఏలుతున్నాడు కదా!)
నీ నామము నా మదిలో
రిప్లయితొలగించండిమానితముగ నిల్పినాను మాటలబోటీ!
వాణిన్ కమలాసను దొర
సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్
నీనామమ్మును నిల్పి నెమ్మనమునన్ నీయందు సద్భక్తితో
రిప్లయితొలగించండివాణీ! సల్పఁగ పద్యపూరణములన్ వాక్సిద్ధి నేగోరితిన్
నేనెన్నండును నిన్నుఁగొల్చెద మదిన్ నీమంబుగా మాత! బా
సా! నిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్
బాస=సరస్వతి
(3)కం:ఆ నదిలో ఛందమ్మును,
రిప్లయితొలగించండినా నాయిక నడక లోని యార్ద్రత,కవిలో
నానాటి వ్యథల కిన్నెర
సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్
(విశ్వనాథ వారి కిన్నెరసాని ఊరకే చదివితే చాలదు.ఆ నది నడక లోని ఛందస్సు,ఆ కథనాయిక లోని ఆర్ద్రత, ఆ కవి లోని వ్యథ అనే కొలతలతో చూస్తేనే ఆ గేయాల రసమయత్వం తెలుస్తుంది.)
గాన మొ నర్చు చు వేడుచు
రిప్లయితొలగించండికానుక ముడుపుల నొసంగి కరుణా మయు ని న్
మానక నో తిరుమల వా
సా! నిన్ గొ ల్చి న లభించు సాహిత్య నిధు ల్
మానసమున నిల్పుచు నను
రిప్లయితొలగించండిమానము నూన కిసుమంత మనుజు లనిశమున్
మానితముగఁ జదువుల దొర
సానిన్గొల్చిన లభించు సాహిత్య నిధుల్
గానవ్రాత విపంచి హస్త విధిహృత్కాంతా లసత్ఫల్య పా
ణీ నాళీక సపుస్త కాక్ష కర దేవీ నీల సారంగ వే
ణీ నీరేజ దళాక్షి చారుముఖి వాణీ సర్వ విద్యా సర
స్సా నిన్గొల్చిన వాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్
కం॥
రిప్లయితొలగించండివాణీ వీణాపాణీ,
జ్ఞానాబ్జాక్షీ ,నలినజు సనుపపు రాణీ,
పోనొత్తక మనసా వచ
సా, నిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య: సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యము
రిప్లయితొలగించండిపూరణా నేపధ్యం: స్మృజనా శక్తి సన్నగిల్లినప్పుడు, విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తే సాహితీ సంపద తప్పక కలుగుతుంది.
శార్దూల విక్రీడితము.
రానీ కష్టములేను మానసమునన్ రాకుండగన్ కల్పనన్
పోనీ సుందరపూహలీడ మదినన్ పోరాడినన్ ఓడగన్
కానీ తప్పక దక్కుగాను కవనా కైవల్యమంటూ భరో
సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ధ్యానము చేయగ నిత్యము
జ్ఞానమ్మును గూర్చుచుండు చదువుల తల్లీ!
వీణాపాణిని నలువకు
సానిన్ గొల్చిన లభించు సాహిత్య నిధుల్.
సమస్య:
రిప్లయితొలగించండిసానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్
శార్దూలము:
మేనున్నిండుగ భూషణాదు లొసగన్, మేలౌ ప్రియంబీయునా
తానే కోరక నీయదే కవన మందారాలు, పాండిత్యమున్
కానేకాదుగ వాణి యార్ద్రతను లేకన్, పల్కుపూబోడి, యా
సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్
(సాని = అధిపురాలు, రాణి}
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆననమందున బ్రహ్మకు
రిప్లయితొలగించండితానుజనించిసతియైన తల్లిని విడకన్
మానసమునదలచినలువ
*"సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్”*
జ్ఞానమ్మున్ సతతం బొసంగుచును తా సంతోషమున్ కూర్చుచున్
గానమ్మైననుకావ్యమైననునిలన్ కాలాను కూలంబుగా
ధ్యానంబందుననిల్చుచున్ సతమువిద్యాసంపదల్గూర్చు శ్రీ
*“సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్”*