కం:"లోకము దానయ్య" యనుచు నీ కాగిత మిచ్చి తాత నే వ్రాయు మననన్ "నా కక్షరములు రా"వని లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్ (తాత పేరు లోకం దానయ్య. అతన్ని సంతకం చెయ్యమని కాగితం ఇస్తే అక్షరాలు సరిగా రాక"ల" కి ఏత్వం,"ద" కి కొమ్ము ఇస్తాడు.)
శా:"మాకున్,నాన్నకు నేమి దక్కు?" ననుచున్ మాటాడ నే నెన్నడున్, మా కా చింతయె లేదు, లొభి యగు లే మా తాత ! దానమ్ముగా రూకన్ గూడ నొసంగ డయ్య,యెవడో రోగమ్ము తో నప్పనన్ లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్” (మా తాత పరమ లోభి. ఎవరికీ దానం చెయ్యడు.ఎవడి కైనా రోగం వచ్చి అప్పు అదిగినా ఇవ్వడు. కాబట్టి మా నాన్నకి మాకు ఆస్తి మిగలదేమో! అనే రంథి లేదు.)
శా: "మా కీ గ్రామము నందె బ్యాంకు పడె లే!మా కిచ్చులే యప్పు"లం చే కొంచెమ్మును నాశ లేదు కద! మే మే యప్పులన్ గోరినన్ మాకున్ జెప్పు నిబంధనల్ వరుసగా,మా బ్యాంకు మేనేజరే లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్” (మా ఊళ్లో బ్యాంకు పడింది కదా!అప్పు లిస్తా రనుకుంటే ఆ మేనేజర్ అనే దాత వంద రూల్స్ చెప్పి అప్పు లేదు పొమ్మంటా డని గ్రామస్తుడి బాధ. నేనూ బ్యాంకు మేనేజర్నే లెండి. )
కందం
రిప్లయితొలగించండిశ్రీకృష్ణునకిడె దానము
నాకర్ణుడు చావఁబోవు నాఖరుఘడియన్
జేకుఱఁగ కొరత లేదన
లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్
శార్దూలవిక్రీడితము
ఆ కర్ణుండనిఁ గూలెడున్ ఘడియ, నందాశించి దానంబునే
శ్రీకృష్ణుండడుగన్ ముదంబునిడె నిశ్చింతన్ విశేషంబుగన్!
జేకూరంగను లేదనన్ గొరతనే జిహ్వన్ విలాసంబుగన్
లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్!
రిప్లయితొలగించండినీకిట్లు చెప్పినది కన
పోకిరి వాడేను బంక ముచ్చని యనరే
లాకేత్వము ద కు కొమ్మన
లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్?
నీ కీ మాటను చెప్పుచుంటి వినుమా నెయ్యమ్ము వే నీవటం
చే కాలంబున గాని యాశ్రితుడు దేహీ యంచు తా నడ్గ గా
నాకాశమ్మది క్రుంగ నేమి విను మీయన్ లేననే మాటకున్
లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్.
నాకే నన్నియు నిడుమన
రిప్లయితొలగించండినోకర పుట్టించు నటుల నుండుట జేతన్
కాకును దెలుపుట గొరకై
లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్
ప్రాకటమై దానగుణము
రిప్లయితొలగించండిలాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్
లోకేశుండరుదెంచినఁ
లేకుండునెపుడు కొఱంత లేదని దెలుపున్
లోకేశుండరుదెంచ దానమొసగన్ లోపంబు రానిచ్చునా
నీకిత్తున్ గొనిపొమ్మటంచు మదిలో నేర్పాటు సేయుంగదా
లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్
లేకుండెన్నడుఁ దానమీయ కొరతే లేదంచు ఘోషించుచున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీకున్ జెప్పెద నొక్కమాట వినుమా నెయ్యంబుతో మిత్రమా
రిప్లయితొలగించండిశ్రీ కృష్ణుండు స్వయంబుగన్ రవిజునున్ చేజాచ విత్తంబుకై
నీకున్ నివ్వగఁ నాకడన్ కొరత లేనేలేదనన్ చక్కగన్
లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్
ఒకే కాలము నందున
రిప్లయితొలగించండిమాకొస గు మటంచు పెక్కు మంది గ రాగా
నేక సమ యాన వారికి
లా కే త్వము దాకు కొమ్ములను దాత యిడు న్
కం॥ సాకైత్వము నిడ సరసుఁడు
రిప్లయితొలగించండికాకేత్వము ళాకు గుడియుఁ గాముకుఁ డొసఁగెన్
రాకైత్వమున రసికుఁడగు
లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్
శా॥ కాకేత్వమ్మును ళాకొసంగ గుడియున్ గామమ్ము వర్ధిల్లెడున్
రాకైత్వమ్మును తాకు కొమ్ము నిడగన్ రైతందురే యెల్లరున్
మాకౌత్వమ్మును నా కొసంగ గుడినే మౌనిన్ గనంగన్ దగున్
లాకేత్వమ్మును దాకు కొమ్మునిడు హేలన్ దాత యెల్లప్పుడున్
దాత లేదు అనకూడదు కనుక వ్యంగ్యమనుకుంటానండి
కందము: సై అంటే సరసుడు, కామునకు కేళి, రై ధనము రసికతకు కావాలండి
శార్దూలము: కేళి కామము, రైతు, మౌని
పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
కం:"లోకము దానయ్య" యనుచు
రిప్లయితొలగించండినీ కాగిత మిచ్చి తాత నే వ్రాయు మననన్
"నా కక్షరములు రా"వని
లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్
(తాత పేరు లోకం దానయ్య. అతన్ని సంతకం చెయ్యమని కాగితం ఇస్తే అక్షరాలు సరిగా రాక"ల" కి ఏత్వం,"ద" కి కొమ్ము ఇస్తాడు.)
శా:"మాకున్,నాన్నకు నేమి దక్కు?" ననుచున్ మాటాడ నే నెన్నడున్,
రిప్లయితొలగించండిమా కా చింతయె లేదు, లొభి యగు లే మా తాత ! దానమ్ముగా
రూకన్ గూడ నొసంగ డయ్య,యెవడో రోగమ్ము తో నప్పనన్
లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్”
(మా తాత పరమ లోభి. ఎవరికీ దానం చెయ్యడు.ఎవడి కైనా రోగం వచ్చి అప్పు అదిగినా ఇవ్వడు. కాబట్టి మా నాన్నకి మాకు ఆస్తి మిగలదేమో! అనే రంథి లేదు.)
శా: "మా కీ గ్రామము నందె బ్యాంకు పడె లే!మా కిచ్చులే యప్పు"లం
రిప్లయితొలగించండిచే కొంచెమ్మును నాశ లేదు కద! మే మే యప్పులన్ గోరినన్
మాకున్ జెప్పు నిబంధనల్ వరుసగా,మా బ్యాంకు మేనేజరే
లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్”
(మా ఊళ్లో బ్యాంకు పడింది కదా!అప్పు లిస్తా రనుకుంటే ఆ మేనేజర్ అనే దాత వంద రూల్స్ చెప్పి అప్పు లేదు పొమ్మంటా డని గ్రామస్తుడి బాధ. నేనూ బ్యాంకు మేనేజర్నే లెండి. )
రూకలొసంగును బీదకు
రిప్లయితొలగించండిలోకము లేకమ్మయినను రోయకనెపుఁడున్
వీఁకగ 'లేద' ను మాటకు
లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్
కం॥
రిప్లయితొలగించండిమా కొటికను గుడిఁగట్టగ
మూకగ మాబోటివారు మునసబుఁజూడన్,
జోకగు మాటైననిడక
లాకేత్వముదాకుకొమ్ములను దాత యిడున్!!
జోక: యుక్తము
నా పూరణను సవరించాను
తొలగించండికం:
మా కొటికను గుడిఁగట్టగ
మూకగ దాతంచునెంచి మునసబుఁజూడన్
జోకగు మాటైననిడక
లాకేత్వము దాకు కొమ్ములను దాత యిడున్
రూకల్ పేదలకిచ్చు దానముగ నాలోచింపకన్ బాత్రతన్
రిప్లయితొలగించండిలోకంబుల్తలకిందులైన నెపుఁడున్ లుబ్ధత్వముం జూపకన్
వీకన్ 'లేద' ను మాటకెన్నడును తావీయంగ వాంఛించకన్
లాకేత్వమ్మును దాకు కొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
లేకియె చెప్పును సతతము
లాకేత్వము దాకు కొమ్ములను; దాత యిడున్
ఆకలిగొన్న మనుజులకు
నాకాంక్షల మేర తగిన యాహారంబున్.