శా;ఆద్యంతమ్ములు లేని తత్త్వమును యోగాభ్యాసి తానౌచు సం వేద్యుండైన వశిష్ఠు శిష్యు డయి సేవించెన్ గదా రాము డే ఆద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె, నా శాంతమున్ విద్యన్ జూపుము రా! కుమార యదియే విజ్ఞాన మందించెడిన్. (రాముడు హరి అవతారం కనుక ఆద్యంతాలు లేని వాడే. ఆ రాముడు వశిష్టుని వద్ద నేర్చిన విద్యయే యోగ వాశిష్టము. ఆశాంతమున్ అనే పదాన్ని ఆ శాంతమున్ అని విడగొట్టాను. )
రిప్లయితొలగించండివేద్యుడు సాందీపని దరి
విద్యను నేర్వంగ జేరి వృషనాషుండే
విద్యాకరి నచ్చోటను
ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్.
*(శిశువు = శిష్యుడు)*
హృద్యంబేను పురాణ గాథలనుచున్ హేరాళ మాలించితిన్
విద్యా వేత్తలు చెప్పు గాథలవి యుద్వేలమ్ము గా వింటి నో
విద్యావంతుని గా ప్రసిద్ధులిపుడావేదించుమా యెప్పుడా
నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'అచ్చోటను ఆద్యంత...' అని విసంధిగా వ్రాయరాదు.
ఉద్యతి దుష్టుల దునుమగ
రిప్లయితొలగించండిచోద్యముగ ఖయిదున గంసు సోదరి కమరన్
హృద్యమగు రీతి నామోను
ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రీతి నామెను ఆద్యంత...' అని విసంధిగా వ్రాయరాదు.
🙏
తొలగించండిసద్యశమొందిన బలినే
రిప్లయితొలగించండిచోద్యంబన మూడడుగులు చొక్కిలె వటువే
హృద్యంబైన విధంబున
నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
ఆద్యంతమ్మొక చిత్రమైన తమితో నాలింతురీ ఘట్టమే
చోద్యంబైన పురాణగాథఁ బలినే చొక్కింప భావించుచున్
విద్యాలంకృత శోభితుండు వటువాపేక్షించి మూడడ్గులం
దాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి-
రిప్లయితొలగించండిచోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
తొలగించండిhttps://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఆద్యుడు గా సృష్టి కి నా
రిప్లయితొలగించండిమో ద్యపు స్థితు ల నొ న రించి పో షించు చు దా
చోద్య ము గా నన సూ య కు
నా ద్యంత రహితు డొ క శిశు వై య ర్చి o చె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిద్యా బుద్ధులు నేర్చినాడు మునులౌ విద్వాంసులే నేర్పగన్
రిప్లయితొలగించండిసద్యో జాతుని చాపమున్ విరిచెఁతా సంకల్ప మాత్రంబునన్
చోద్యంబౌ విధి పెద్దలన్ గురువులన్ శుద్దాత్ము డారాముడున్
ఆద్యంతంబులు లేని వాడు శిశువై యర్చించె నాశాంతమున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"శుద్ధాత్ము డా రాముడే యాద్యంతంబులు.." అనండి.
ధన్యవాదములు గురువుగారికి 🙏🙏
తొలగించండిహృద్యము కృష్ణుని లీలలు
రిప్లయితొలగించండివిద్యార్థిగ జేరి గురుని వేదన దీర్చెన్
విద్యార్జనయను మిషతో
నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహృద్యంబౌ పరమాత్ము లీలలు గనన్ కృష్ణావతారంబునన్
రిప్లయితొలగించండివిద్యాభ్యాసము నేర్పినట్టి గురువున్ విద్యార్థియై భక్తితో
సద్యస్స్ఫూర్తిగ గొల్చి సేవనములన్ సంతుష్టునింజేసి తా
నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువుగారికి🙏🙏
తొలగించండికందం
రిప్లయితొలగించండివద్యమన జగన్మాతయె
సద్యస్ఫూర్తి భువిపైన జన్మించమనన్
చోద్యమ్ముగ కమలాక్షుడు
నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
శార్దూలవిక్రీడితము
వద్యమ్మైనది ధర్మ రక్షయని పన్పంగన్ జగన్మాతయే
సద్యస్ఫూర్తిని ధాత్రిపైన హరియే జన్మించె లీలాత్ముఁడై
చోద్యమ్ముల్ బహు చూపి గోకులమునన్ జోరుండుగన్ బ్రహ్మమై
యాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికందంలో "జన్మించుమనన్... కమలాక్షుం డాద్యంత..." అనండి.
వృత్తంలో "చోద్యంబుల్ గడు జూపి..." అనండి.
🙏ధన్యోస్మి గురుదేవా 🙏సవరించిన పూరణలు పరిశీలింప ప్రార్థన:
తొలగించండికందం
వద్యమన జగన్మాతయె
సద్యస్ఫూర్తి భువిపైన జన్మించుమనన్
చోద్యమ్ముగ కమలాక్షుం
డాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
శార్దూలవిక్రీడితము
వద్యమ్మైనది ధర్మ రక్షయని పన్పంగన్ జగన్మాతయే
సద్యస్ఫూర్తిని ధాత్రిపైన హరియే జన్మించె లీలాత్ముఁడై
చోద్యంబుల్ గడు చూపి గోకులమునన్ జోరుండుగన్ బ్రహ్మమై
యాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
శా॥ విద్యాహీనులు కల్లలన్ బలుకరే వేవేలుగాఁ గూర్చుచున్
రిప్లయితొలగించండివిద్యావంతుని వోలెఁ దెల్పె నొకఁడీ విశ్వమ్ములో సృష్టికిన్
జోద్యమ్మందున విస్తృతమ్ముగ నహో శోధించుచున్ గాంచితే
ఆద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:విద్యా హీనను,మమకా
రిప్లయితొలగించండిరాద్యాశ్రితనున్ యశోద నమ్మ యని తపో
విద్యాద్యతీతు డౌ హరి,
ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
శా;ఆద్యంతమ్ములు లేని తత్త్వమును యోగాభ్యాసి తానౌచు సం
రిప్లయితొలగించండివేద్యుండైన వశిష్ఠు శిష్యు డయి సేవించెన్ గదా రాము డే
ఆద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె, నా శాంతమున్
విద్యన్ జూపుము రా! కుమార యదియే విజ్ఞాన మందించెడిన్.
(రాముడు హరి అవతారం కనుక ఆద్యంతాలు లేని వాడే. ఆ రాముడు వశిష్టుని వద్ద నేర్చిన విద్యయే యోగ వాశిష్టము. ఆశాంతమున్ అనే పదాన్ని ఆ శాంతమున్ అని విడగొట్టాను. )
విద్యాలంకృతు డెప్పుడు
రిప్లయితొలగించండినాద్యంతరహితు; డొక శిశువై యర్చించెన్
విద్యాదేవిన్ శ్రుతి సం
వేద్యంబుగ జ్ఞానమంద వినయము తోడన్!
విద్యావంతుల కెల్లం
రిప్లయితొలగించండిజోద్యం బే మున్న దిందు సుస్పష్టముగా
వేద్యం బనసూయా సతి
నాద్యంత రహితుఁ డొక శిశువై యర్చించెన్
ఉద్యత్పాద పయోరుహుండు నవనోద్యోగుండు నీలాంగక
ప్రద్యోతుండు వటచ్ఛదమ్ము పయిఁ బారావార మం దుండి లో
కాద్యంతమ్మున మూరి విష్ణువు నిజాస్యాంగుష్ఠుఁడై ప్రీతిమై
యాద్యంతంబులు లేని వాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పద్యమ్ముల నవలీలగ
హృద్యముగా నొక వధాని హితముగ చెప్పన్
చోద్యముగ నడిగె పృచ్ఛకు
డాద్యంత రహితుడొక శిశువై యర్చించెన్.