28, జనవరి 2023, శనివారం

సమస్య - 4221

29-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాడ నేర్పుమనుచు పాము లడిగె"
(లేదా...)
"పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ఆర్. కళ్యాణి గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. కుటము పయిన పికము కూయుచు నుండగ
    జెట్టు దిగువ నున్న చిట్ట లోని
    సర్ప ములు వి ని కడు సంతస మొంది
    పాడ నేర్పుమనుచు పాము లడిగె

    రిప్లయితొలగించండి
  2. పెద్ద పాము కడకు వెడలియు దమ యొక్క
    సందియములు దెల్పి సాయ మడిగె
    శత్రు తతుల నుండి సంతాన ములను గా
    పాడ నేర్పు మనుచు పాము లడి గె

    రిప్లయితొలగించండి

  3. మమ్ము గాంచినంత మనుజులు భీతిల్లి
    చంప బూను చుండ్రి చంద్రధరుడ
    నరులు ప్రేమతోడ ధరలోన మమ్ము కా
    పాడ నేర్పుమనుచు పాము లడిగె.


    ఓటుల బొంది గెల్చుచు మహోన్నత స్థానము పొందు మంత్రులే
    చాటున నుండి విజ్ఞులిల సాయము జేయుచు నుండగా భువిన్
    మేటిగ పాలనమ్మునకు మేలగు సూచనలడ్గుటన్ గనన్
    పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్.

    రిప్లయితొలగించండి
  4. వసుధపై వసించు ప్రాణులనెల్ల కా
    పాడ నేర్పు మనుచు పాము లడిగె
    కాటు వైచి నపుడు కాలము చెల్లక
    సేద దీరు నటుల చేయ మనుచు

    రిప్లయితొలగించండి
  5. పాటవమొప్పు గానమును పాపలు పాములు జంతుజాలముల్
    గాటపు నర్మిలిన్ వినుటకై వివశత్వము నొందురీ భువిన్
    దీటుగ నామనిన్ పికము తీయగ సల్పగ కూజితమ్ములన్
    పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్

    రిప్లయితొలగించండి
  6. శిశువు పశువు పాము శిరసులనూపవె
    పాటవినగనెపుడు పరవశించి
    కోకిలమ్మ సేయు కూజితమ్మునువిని
    పాడ నేర్పుమనుచు పాము లడిగె

    రిప్లయితొలగించండి
  7. నేర్పకుండ నెట్లు నేర్తుము మేమాడఁ
    జూడ నెంచి తేని యాడ మేము
    బూర నూదుచుండి మూరుచు రేపు మా
    పాడ నేర్పు మనుచుఁ బాము లడిగె

    [రేపుమాపు + ఆడ= రేపు మాపాడ]

    వీటను చూచి నట్టి వగు వింతల నక్కట యేమి చెప్పుదుం
    దూటులు లేని యత్తెలివి దోరము సెల్గఁగఁ జుట్టలై చనం
    మేటివి కొన్ని బాము లవి మీఱఁగఁ బాములు గోయిలమ్మలుం
    బాటలు పాడ నేర్పుమని పాములు వేడెను గోయిలమ్మలన్

    రిప్లయితొలగించండి
  8. మునుల యాశ్రమమున ముదముతో మృగరాశి
    కలసి గడుపు తరిని కాల మచట.
    వేడ్క తోడనన్ని వేళల యందున
    పాడ నేర్పమనుచు పాము లడిగె

    రిప్లయితొలగించండి
  9. మరొక పూరణ
    పాలు పుట్టలోన భక్తితో పోసినా.
    పసుపుకుంకుమాది వస్తువులవి
    పరిసరముల నెల్ల పాడుకానీక కా
    పాడ నేర్పు మనుచు పాము లడిగె

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:కాళియునకు జేయ కన్నయ్య గర్వభం
    గమ్ము వాని సతు లహమ్ము విడిరి
    నీదు లీల లెల్ల నినదింపగా గృష్ణ
    పాడ నేర్పు మనుచు పాము లడిగె

    రిప్లయితొలగించండి
  11. ఉ:ధాటిని జూపి కృష్ణు డతి దర్పము జూపెడు కాళియాహికిన్
    జేటు నొనర్ప భార్యలును జేసిరి కృష్ణునకున్ బ్రణామముల్
    "పాటలు పాడ నేర్పు మని పాములు వేడెను కోయిలమ్మలన్
    దీటుగ జేసి నీ మహిమ దెల్పెడు రీతి" నటంచు నమ్రతన్.

    రిప్లయితొలగించండి
  12. పాములు విష్ణుమూర్తితో...

    "ఇట్టి నరులు మమ్ము వేణుగానము చేత
    వశము చేసు కొండ్రు పద్మనాభ!
    వారి వశము చేయు దారిచూపుమనుచు "
    పాడ నేర్పుమనుచు పాము లడిగె

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    మా యులూచి వలచి మహితాత్ము నర్జునున్
    స్వాగతించమనెను సవ్యసాచిఁ
    గోయిలమ్మలార కులుకులమరె మాకు
    పాడ నేర్పుమనుచు పాము లడిగె

    ఉత్పలమాల
    నీటగు వాని నర్జునుని నీరజనేత్ర యులూచి ప్రేమతోఁ
    బాటలగంధి తా వలచి స్వాగతమీయమటంచుఁ గోరెనే
    సాటియె రారు మాకెవరు చక్కని నాట్యములాడ పాడగన్
    పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్!

    రిప్లయితొలగించండి
  14. ఆటవెలది
    మా యులూచి వలచి మహితాత్ము నర్జునున్
    స్వాగతించమనెను సవ్యసాచిఁ
    గోయిలమ్మలార కులుకులమరె మాకు
    పాడ నేర్పుమనుచు పాము లడిగె

    ఉత్పలమాల
    నీటగు వాని నర్జునుని నీరజనేత్ర యులూచి ప్రేమతోఁ
    బాటలగంధి తా వలచి స్వాగతమీయమటంచుఁ గోరెనే
    సాటియె రారు మాకెవరు చక్కని నాట్యములాడ వేడ్కగన్
    పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్!

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.

    పాటలన్న ప్రీతి పాములనెడు వాన్కి
    యుత్సుకతను జూపి యొక్క గురువు
    చెంతకేగి తాను చేతులు జోడించి
    పాడ నేర్పుమనుచు పాము లడిగె.

    రిప్లయితొలగించండి

  16. జనులు మమ్ము గాంచి చంపగా జూతురు
    మాకు రక్ష ణేది? మహినియందు
    మందరమణి నీవు మమ్ములమేము కా
    పాడ నేర్పుమనుచు పాములడిగె

    రిప్లయితొలగించండి