12-1-2023 (గురువారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును” (లేదా...) “బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్” (ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)
రాజకీయ నాయకుడు తన పక్కవానితో ఉ. ఏలుట రానివాని గని రేడుగ చేసిన పాప కర్మమో హేలగవాడునిట్ల కడు హీనపు వాక్కులు పల్కు చుండె "నీ బాలురు జ్ఞానులైన మన వాక్కులనెవ్వడు లెక్క చేయ? డీ బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్”
క్రీడలందున నిపుణత చూడవచ్చు నలుపు నొందక పోటీని గెలువ వచ్చు గుట్టు కనుగొన ప్రత్యర్థి జట్టు లోని శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును
బాలలలోనిపాటవము ప్రస్ఫుటమవ్వగ నిర్వహింతురే మేలగు రీతినాటలను మేటిగ శిక్షణ నొందకుండినన్ చాలును స్పర్ధకై నిలుచు సత్తువ లేని విదేశమందునన్ బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్
కాంచ దేశ మనిన మట్టి కాదు దేశ మన్న మనుజ వరు లగుదు రెన్నఁ డేని ధీనిదు లడరు చుండ నదీన విగత శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును
బాలు రనంగ నేల పరిపాలిత దేశము నందుఁ బెద్దలున్ వాలి సశాస్త్రవిద్యలను బండిత సంచయ మాన్యవిద్యలన్ మే లొనఁగూడఁ బౌరుల కమేయము నిత్య మశాస్త్ర విద్యలన్ బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతం బగున్
పేలవ మౌనుగా నికను భీకర మౌవిధ మొందు రీతిగా బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి ,మహోన్నతంబగున్ బాలురు బాగుగాఁజదివి భారత మాతకు సేవఁజేయనౌ బాలనఁజక్కజేయునెడ భారతదేశపు కీర్తి పుంజముల్
తేటగీతి
రిప్లయితొలగించండివజ్రశుంఠలకైనను వాగ్వధూటి
పలుకుసోయగమందించి పటిమఁగూర్చు
కాళిదాసాదుల సరళి జ్ఞానమందు
శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును
ఉత్పలమాల
కాళియె జాలిఁజూపగనె జ్ఞానమునిండియు కాళిదాసదే
మేలుగ పాండితిన్ బడసి మేటి కవీశ్వరుఁడయ్యె! దైవమే
లీలలు జూపినంతనిలఁ బ్రేరణ భాగ్యమునందనొప్పరే
బాలురు శుంఠలైన యెడ? భారత కీర్తి మహోన్నతంబగున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబ్రాహ్మి కరుణయే గలిగిన భక్తవరులు
మూర్ఖులైనను ప్రాజ్ఞులై పుడమినందు
అడరుచుండెడి వేళలో నట్టి జ్ఞాన
శుంఠలవలన దేశమ్ము శోభగనును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాణి కృప జేత లభియించు ప్రజ్ఞ చేత
రిప్లయితొలగించండికాళి దాసు రచించె ను గావ్య ములను
పెక్కు సత్కార ముల బొంది నిక్కి నట్టి
శుంఠ ల వలన దేశమ్ము శోభ గనును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాజకీయ నాయకుడు తన పక్కవానితో
రిప్లయితొలగించండిఉ.
ఏలుట రానివాని గని రేడుగ చేసిన పాప కర్మమో
హేలగవాడునిట్ల కడు హీనపు వాక్కులు పల్కు చుండె "నీ
బాలురు జ్ఞానులైన మన వాక్కులనెవ్వడు లెక్క చేయ? డీ
బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. "ఏలుట రానివాని గని యేలిక జేసిన..." అంటే సరి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమేలగు భక్తినిన్ సతము మెల్పుగ శారద సేవజేయుచున్
వాలకమైన మాటలను బ్రాహ్మి కటాక్షముతో గడించునౌ
బేలలు దేవి లీలలకు విందువులై విలసిల్లునట్టి యా
బాలురు శుంఠలైన యెడ? భారత కీర్తి మహోన్నతంబగున్!
రిప్లయితొలగించండిమద్యమును ధనమును పంచు మందు లిలను
పాలకులయినచో దేశ ప్రగతి నిలుచు
శుంఠల వలన, దేశమ్ము శోభఁ గనును
పాత్రతెఱగి యోటును వేయు ప్రాజ్ఞులున్న.
బాలల విద్యయన్నదది పట్టని మూర్ఖులు స్వార్థచిత్తులే
పాలకు లైన దేశమది భాసుర మానము కాదు దేశమున్
బాలురు శుంఠలైన, యెడ భారత కీర్తి మహోన్నతంబగున్
బాలల సద్గుణమ్ముగల పౌరులుగాను దిద్ది తీర్చినన్.
రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు రాలిపోవు
రిప్లయితొలగించండిశుంఠల వలన ; దేశమ్ము శోభఁ గనును
యన్య నాడులకు వెడలి యచట వారు
కనబరచిన సమర్థత గరిమ వలన
మేలగు పాఠశాల రహి మెల్లగ నాశన మౌనుదప్పకన్
రిప్లయితొలగించండిబాలురు శుంఠలైన యెడ ; భారత కీర్తి మహోన్నతంబగున్
నాలుగు నాళ్ళ లోపలనె నాడును వీడుచు వెళ్ళిపోవగన్
మేలిమి నైపుణిన్ జనులు మెచ్చెడి రీతిగ చూపినంతనే
క్రీడలందున నిపుణత చూడవచ్చు
రిప్లయితొలగించండినలుపు నొందక పోటీని గెలువ వచ్చు
గుట్టు కనుగొన ప్రత్యర్థి జట్టు లోని
శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును
బాలలలోనిపాటవము ప్రస్ఫుటమవ్వగ నిర్వహింతురే
మేలగు రీతినాటలను మేటిగ శిక్షణ నొందకుండినన్
చాలును స్పర్ధకై నిలుచు సత్తువ లేని విదేశమందునన్
బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్
వాలము లేని వానరులు బాలురు మ్రొగ్గిడు శుష్కముల్ దెసన్
రిప్లయితొలగించండిపాలనఁ జేయబూనుటన బాపనసాంఘిక శక్తులెల్లడల్
మూలము నాశనంబరచి మూర్ఖులఁ జేయ తదీయ భావనల్
బాలురు శుంఠలైనయెడ భారతకీర్తి మహోన్నతంబగున్
చివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా
కాలము యాంత్రికంబునయి కష్టముబెట్టక మీటనొక్కుటల్
రిప్లయితొలగించండివేళయుపాళయుల్మఱచి వెక్కస మందక వేగమందుచున్
వీలుగ హస్తభూషణము వెంటనె వాడుచు లెక్కసేసెడిన్
బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
బాలురు భావిపౌరులను భావన గల్గి నిరంతరంబు నా
రిప్లయితొలగించండిబాలుర మేలుగూర్చునగు, భారతి యున్నతిఁ గోలుపోవుఁగా
బాలురు శుంఠలైన యెడ, భారత కీర్తి మహోన్నతంబగున్
హేలగ బాలబాలికల నేమఱకన్ తగు బాళిఁ జూపుచో
కాంచ దేశ మనిన మట్టి కాదు దేశ
రిప్లయితొలగించండిమన్న మనుజ వరు లగుదు రెన్నఁ డేని
ధీనిదు లడరు చుండ నదీన విగత
శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును
బాలు రనంగ నేల పరిపాలిత దేశము నందుఁ బెద్దలున్
వాలి సశాస్త్రవిద్యలను బండిత సంచయ మాన్యవిద్యలన్
మే లొనఁగూడఁ బౌరుల కమేయము నిత్య మశాస్త్ర విద్యలన్
బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతం బగున్
ఉ.
రిప్లయితొలగించండికాలము వేదదైన్యమగు కాంక్షగ నొందెను బ్రహ్మ సమ్మతిన్
సోలెను దేవతా గణము జొచ్చెను పాపము హోమహీనమున్
*బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్*
మూలము దుర్గముండనుచు మ్రొక్కె హిమాలయ పర్వతాగ్రణిన్.
......
దుర్గమాసురుణ్ణి చంపిన ఆ దేవిని దుర్గగా, శతాక్షీ దేవిగా, శాకంభరిగా వ్యవహరిస్తూ, ఆమెను ఆరాధించి..... దేవతలు, వేదవిప్రులు యథావిధిగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ, ప్రశాంతంగా జీవయాత్ర సాగిస్తూ....
తేటగీతి.
రిప్లయితొలగించండిపరమ మూర్ఖుడు కాళిదాసు రహి కలుగ
శ్యామలాదేవి కృపన మహా కవీశ్వ
రుడయి పొందె శాశ్వత కీర్తి,రూఢి యిదియె
శుంఠల వలన దేశమ్ము శోభ గనును.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
శ్రీల చెలంగు భారతము సిద్ధిలునెట్లు నజాగరూకతన్
రిప్లయితొలగించండిబాలురు శుంఠలైన యెడ, భారత కీర్తి మహోన్నతంబగున్
బాలురు మేలుగా జదివి పండితులై జని విశ్వమందు స
చ్ఛీలము సత్ప్రవర్తనమె సేమము గూర్చునటంచు జాటినన్
భావిభారత పౌరులు బాలలెల్ల
రిప్లయితొలగించండిదేశమేరీతి వర్ధిల్లుఁ దిరములేని
శుంఠల వలన? దేశమ్ము శోభఁ గనును
వారు విజ్ఞానవంతులై వరలునపుడు.
దేశ మభివృద్ధి నొందదు తెలివి లేని
రిప్లయితొలగించండిశుంఠల వలన దేశము శోభగనును
నీతివంతుడై సాగెడు నేత వలన
నట్టి నేతల పాలన మవసరమ్ము.
మేలగు విద్యనేర్వకను మేలము లాడ కలుంగుహాని యా
*“బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్
తూలక మాటలన్ సతము తోషము తోడను బాల బాలికల్
చాలిన యంత విజ్ఞతను చక్కగ పొందుచు సాగుచుండినన్
నీచ స్దితికి దిగఁజారు నిజముగాను
రిప్లయితొలగించండిశుంఠల వలన దేశమ్ము ,శోభఁ గనును
సత్కవి వరేణ్యుల కవితా సౌరభముల
వలన కావ్యకన్యకలిల బహువి ధముల
పేలవ మౌనుగా నికను భీకర మౌవిధ మొందు రీతిగా
రిప్లయితొలగించండిబాలురు శుంఠలైన యెడ భారత కీర్తి ,మహోన్నతంబగున్
బాలురు బాగుగాఁజదివి భారత మాతకు సేవఁజేయనౌ
బాలనఁజక్కజేయునెడ భారతదేశపు కీర్తి పుంజముల్