8, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4303

9-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కురుకులమున రాఘవుండు కోరి జనించెన్”
(లేదా...)
“కురువంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో అ.స.నా.రె. గారి సమస్య)

34 కామెంట్‌లు:


  1. అరయంగ నాది మధ్యాం
    తరహితుడైనట్టి వాడు ధర్మమ్మును తా
    పరిరక్షింపగ ధరణిని
    కురుకులమున రాఘవుండు కోరి జనించెన్.

    (కురు= చిన్న)

    రిప్లయితొలగించండి
  2. పరమోదాత్తుడు ధర్మనందనుడు సుప్రఖ్యాత
    రాజన్యుడున్
    కురువంశంబున బుట్టి కీర్తి బడిసెన్, కోదండ
    రాముడంహో
    ధరలో ఖ్యాతి వహించినట్టి మిగులన్
    ధన్యాత్ముడున్ వీరుడున్
    వర వీరా రఘువంశసంభవుడు తా
    బ్రాశస్త్యమున్ బొందిడిన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    ధరణిని ఇతిహాసమ్ములఁ
    బరికింపగఁ దెలియు ధర్మపరిరక్షణకై
    భరతమున ధర్మజుఁడొకఁడు
    కురుకులమున, రాఘవుండు కోరి జనించెన్

    మత్తేభవిక్రీడితము
    ధరణిన్ గాంచగ నైతిహాసముల సద్ధర్మమ్ము రక్షింపగన్
    బురుషోత్తమ్ముడు మార్గదర్శకుఁడనన్ బూజ్యుండునై ధర్మవా
    క్పరిపాలుండు యుధిష్టరుండనుసరింపంగన్ విశిష్టంబుగన్
    గురువంశంబునఁ, బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.

      సవరింపబడిన వృత్తము

      మత్తేభవిక్రీడితము
      ధరణిన్ గాంచగ నైతిహాసముల సద్ధర్మమ్ము రక్షింపగన్
      బురుషాధిక్యుడు మార్గదర్శకుఁడనన్ బూజ్యుండునై ధర్మవా
      క్పరిపాలుండు యుధిష్టరుండనుసరింపంగన్ విశిష్టంబుగన్
      గురువంశంబునఁ, బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో!

      తొలగించండి
  4. గరితకు నూర్గురు పుట్టిరి
    కురుకులమున ; రాఘవుండు కోరి జనించెన్
    మరుజన్మలోన వృష్ణిగ
    మరకటమగు జాంబవంతు మనసును దీర్చన్

    రిప్లయితొలగించండి

  5. పరమాత్ముండు సమస్తలోకములనే పాలించు భాస్వంతు డీ
    ధరణిన్ ధర్మము నిల్ప బంక్తిరథు నందంతుండుగా ధాత్రిలో
    నరుడై పుట్టెను సూర్యవంశమున శ్రీనాథుండె తా త్రేతలో
    కురువంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో.

    రిప్లయితొలగించండి
  6. పరిపరి విధముల చెలరే
    గు రాక్షసుల పరిహరింప గోరినవాడై
    స్థిరచిత్తంబు యశము చే
    కురు కులమున రాఘవుండు కోరి జనించెన్

    రిప్లయితొలగించండి
  7. కందం.
    అరివీరభయంకరులున్
    చరిత్ర గల్గిన ఘనతర సత్య పురుషులున్
    పరిపాలకులున్ గల పె
    క్కురు కులమున ,రాఘవుండు కోరి జనించెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  8. పరిరక్షింపఁగ సుజనుల
    ధరలో రక్కసులదునిమి ధర్మముఁ గావన్
    గురుతరమౌ బాధ్యత చే
    కురుకులమున రాఘవుండు కోరి జనించెన్

    రిప్లయితొలగించండి
  9. కాదు .వర వీర+ ఆ రఘువంశసంభవుడు దోషమున్నచో తెలియ జేయ మనవి

    రిప్లయితొలగించండి
  10. ధరణిన్ రాక్షసజాలముల్ చెలగుచున్ దౌష్ట్యమ్ములన్ జేయ ఖే
    చర సంఘమ్ములు వేడ కావుమనుచున్ స్థాపింప శాంతమ్మిలన్
    వర పుత్రుండయి సార్వభౌమునకు సౌభాగ్యమ్ముగా ప్రీతి చే
    కురు వంశమ్మున పుట్టి కీర్తి పడసెన్ కోదండ రాముండహో
    అసనారె

    రిప్లయితొలగించండి
  11. ధర ధర్మజు డు జనించెను
    కురు కులమున : రాఘవుo డు గోరి జనించె న్
    పరి రక్షింప గ ధర్మము
    పరి మార్చియు దనుజ తతుల పంతము తోడన్

    రిప్లయితొలగించండి
  12. ధరలో ధర్మవిఘాతకారులగుచున్ దౌర్జన్యముల్ సల్పుచున్
    సురలన్ మౌనివరేణ్య బృందముల సంక్షోభించు దుర్మార్గపుం
    టరులౌ రక్కసి మూకలన్ చెనటులన్ హారంబునన్ ద్రుంచ జే
    కురువంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో

    రిప్లయితొలగించండి
  13. ధర కీయఁగ నానంద మ
    సుర నాథుని రావణుని యసువులు హరింపన్
    సుర లెల్లరు మ్రొక్కం దన
    కురు కులమున రాఘవుండు కోరి జనించెన్

    [తనకు +ఉరు కులమున = తన కురు కులమున]

    కురుసైన్యమ్మును రూపుమాపె వెసఁ దా ఘోరాజి నుగ్రుండు సం
    గర విద్యానిపుణుండు శత్రుకరికిం గంఠీరవుం డిద్ధరన్
    నర నారాయణులన్ నరుండును బృ థానందుండు పెన్వింటినిం
    గురు వంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెం గోదండ రాముం డహో

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిరతము ధర్మము చలుపుచు
    పురువడితో జనులకెల్ల మోదము నిడుచున్
    కెరలిన శ్రేష్ఠులుగల పె
    క్కురు కులమున రాఘవుండు కోరి జనించెన్.

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిరతమ్మెంతయు ధర్మమున్ నిలుపుచున్ నెయ్యమ్ముతో నందరిన్
    పరిరక్షించుచు రాజ్యమున్ విధముగా పాలించుచున్ లెస్సయౌ
    సరణిన్ ప్రఖ్య గడించినట్టి ఘనులౌ సామ్రాట్టులన్ గూడు పె
    క్కురు వంశంబున బుట్టి కీర్తి బడసెం గోదండరాముండహో!

    రిప్లయితొలగించండి
  16. అరయంగా నినవంశమున్నతిలె పర్యాప్తంబుగా నెందరో
    వర ధర్మాత్ములు కార్యసాధకులనేకానేకు లొప్పారగా
    పరమోత్కృష్ట పరంపరానుగత సద్భావైక సంసిద్ధి జే
    కురువంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో

    రిప్లయితొలగించండి
  17. సురనదిసుతుడేపుట్టెను
    కురుకులమున,రాఘవుండు కోరిజనించెన్
    సురవరులకోర్కెమేరకు
    ధరలోదనుజులను చంపదశరథ సుతుడై

    రిప్లయితొలగించండి