25, జనవరి 2023, బుధవారం

సమస్య - 4218

26-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నులున్నవంచుఁ గలఁత యేల”
(లేదా...)
“కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ గనంగఁ జాలవా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో దాసరి చంద్రయ్య గారి సమస్య)

19 కామెంట్‌లు:

 1. ఎన్నడు లేని చింత జను లెల్లరకున్
  బొడసూపె నిప్పుడున్
  పన్నులు వెర్గె, జేయుటకు పాపము
  లేవు పరిశ్రమంబులున్
  చిన్నవి యెల్ల మూతబడె చేతికి వచ్చెను చిప్ప జూడుమీ
  కన్నులు గల్గినం గలత గాంచుట యేల
  కనంగ నెర్గవా

  రిప్లయితొలగించండి

 2. నంది నెక్కి తిరుగు నాగభూషణుడంచు
  గరళ కంఠుడంచు చెఱుచు నేల
  శాశ్వతుడతగాడు సర్వకరుడు మూడు
  కన్నులున్నవంచుఁ గలఁత యేల?

  రిప్లయితొలగించండి
 3. ఆటవెలది
  నీలికండ్ల బాల నిండు జవ్వనొకతె
  పూర్ణ చంద్ర బింబ ముఖము గల్గి
  కాంతు లీను మేని గలిగియుండగ మెల్ల
  కన్ను లున్న వంచు కలత యేల!
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 4. శిలలపై శిల్పాలు చెక్కినారూ....

  ఆటవెలది
  శిలల శిల్పములవి సృష్టికే యందాలు
  నెలత! నాదు కనులు నీవిగఁ గను
  మనెడు నే పతినన మహిఁ గన లేనట్టి
  కన్నులున్నవంచుఁ గలఁత యేల?

  ఉత్పలమాల
  అన్నులమిన్నలై శిలలు నద్భుత రీతిని నాట్యమాడుచున్
  వన్నెలఁ గూర్చ సృష్టికవి నా కనులన్నవి నీవిగాఁ గనన్
  తిన్నగ చూపెదన్ సఖియ! త్రిప్పుచు హంపిని, దృష్టి లేనివై
  కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ, గనంగఁ జాలవా!

  రిప్లయితొలగించండి
 5. రెండు కన్నులున్న మెండు ౘూఁడనువుగ
  ౘూఁడ నెమలి సౌరు చోద్యమౌను
  ప్రీతిగూర్చు విప్పి పింఛము, పెక్కులు
  కన్నులున్న వంౘుఁ గలఁత యేల

  చివుకుల అచ్యుత దేవరాయలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కన్నులు లేకయున్ ౙరుగు కార్యముఁ ౙూఁడదగున్ మతిన్ కడున్
   కన్నులుఁ గల్గియున్ కనగఁ కాంక్ష జనింపదు ౘూఁడ ఘోరముల్
   కన్నులు గల్గి యర్జనుడు కన్నులఁ ౙూఁడక పోయె సత్యమున్
   కన్నులు గల్గీనం గలఁతఁ గాంౘుట యేలఁ గనంగఁ ౙాలవా

   చివుకుల అచ్యుత దేవరాయలు

   తొలగించండి

 6. పన్నగ భూషణుండనుచు పాంశుధరుండని గేలి సేతువే
  యెన్నతరమ్మె నీకు పరమేశుని లీలలు, విశ్వనాథునిన్
  మిన్నగ కొల్తురే సురలు మేచక గ్రీవుడటంచు నీవు ము
  కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ ? గనంగఁ జాలవా.

  రిప్లయితొలగించండి
 7. ధర్మ మాచ రించి తత్త్వంబు దెలిసియు
  మంచి చెడుల నెంచు మానవుండు
  తప్పు లేని యెడల ధైర్యంబు తో. డేగ
  కన్ను లున్న వంచు గలత యేల?

  రిప్లయితొలగించండి
 8. అన్నులమిన్న! సోయగములల్లన నొల్కు మరాళ గామినీ!
  చెన్నుగ నీసఖుండు దరిజేరఁగ నీ ప్రమదావనమ్మునన్
  క్రన్నన వేచియుండె తమకమ్మెసగన్ మది భాసమానమౌ
  కన్నులు గల్గినం గలఁతగాంచుట యేలఁ గనంగఁ జాలవా

  రిప్లయితొలగించండి
 9. ఇస్తువు పయి కిస్తి నెంచు యధిపతుల
  కన్నులున్నవంచుఁ గలఁత యేల
  భాజనముగ నీయ వలయు దాని
  నొసగి
  నెవ్వ నెంచ కుండ నిదుర పొమ్ము

  రిప్లయితొలగించండి
 10. నీచ కీచకునికి నిరతము నీపైన
  కన్నులున్నవంచుఁ గలఁత యేల
  నిన్ను కోరుకొన్న నేనుపేక్షింతునా
  మట్టుబెట్టెదనిక గుట్టు చెడక

  కిన్నెరకంఠి!మానవతి! కీచకనీచున కింక నీపయిన్
  కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ గనంగఁ జాలవా
  నన్ను నిరంతరమ్ము నిను నాకనులందున నిల్పుకొంటి నీ
  దన్నుగ నిల్చియుంటిగద తప్పక నీచుని మట్టుబెట్టెదన్

  రిప్లయితొలగించండి
 11. నేటి వారి కింపు నిన్నటి వారికి
  సొం పొసంగదే ధరింపు మీవు
  సుందరతర మయినఁ జొక్కాయ కింతలు
  కన్ను లున్న వంచుఁ గలఁత యేల

  [కన్నులు = రంధ్రములు]

  క్రన్నన నింటివాఁడ వికఁ గమ్ము ప్రయత్నము లింకఁ జేయుమా
  మిన్నగ జాగు సేయకుమ మిత్రుఁడ నే వచియించు చుంటినే
  సన్న శరీర సుందరులు చక్కఁగ నొక్కరినిన్ వరింప నీ
  కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ గనంగఁ జాలవా

  [నీకు + అన్నులు = నీ కన్నులు]

  రిప్లయితొలగించండి
 12. మురిసిపోవలయును పుడమి యందు
  వెల్లివిరిసినట్టివింతలుగని
  *“కన్నులున్నవంచుఁ గలఁత యేల”*
  భావి యందు కలుగు బాధలెంచి


  అంధుడగుటకన్న నతిచిన్నవౌ మెల్ల.
  కన్నులున్నవనుచుకలతయేల.
  దైవమిచ్చినదిదెతనకనుచునుమది.
  నెంచి బ్రతుకు వలయు నెప్పుడీవు

  రిప్లయితొలగించండి
 13. ఆ.వె:మూడు కనుల వాని మోహింతు వేమని
  యనిన విప్రు తోడ ననెను గౌరి
  మూడు లోకములకు మూల మాతడు,మూడు
  కన్ను లున్న వంచు గలత యేల
  (శివుని గూర్చి తపస్సు చేస్తున్న పార్వతిని పరీక్షించటానికి శివుడు విప్రవేషం లో వచ్చి ఆమెని ఆక్షేపించినట్లు శ్రీనాథుడు ఒక కల్పన చేశాడు.)

  రిప్లయితొలగించండి
 14. ఉ:కన్నులు కల్గు నెల్లరకు కల్కలు వచ్చుట సాజమే కదా
  యెన్నడొ యొక్క మారు!మరి యేల భయం మ్మిదె యౌషధమ్ము నీ
  కన్నులు కల్గినన్ గలత గాంచుట యేల ?కనంగ జాలవా
  తిన్నగ దీని వాడగనె తీరగ బాధలు రేపు ప్రొద్దుటన్.
  (కన్నులు కల్గినన్ అంటే కండ్ల కలక రావటం అనే అర్థం లో వాడాను.)

  రిప్లయితొలగించండి
 15. కన్నులున్నవంచుఁ గలఁత యేలనొబాల!
  కన్ను లేని యెడల కాన నగునె
  యీచరాచరభువి యెవరికైన నరయ?
  కన్నులుండు నెడల కాననగును

  రిప్లయితొలగించండి
 16. కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ గనంగఁ జాలవా
  కన్నులె మిన్న యన్నిటిని గంటెను మానవు లెల్ల వారికిం
  గన్నులు లేనిచోఁగనము గైటభ మర్దను దివ్య రూపమున్
  గన్నులు లేనివారకట కానగలేరు సమీప దృశ్యమున్

  రిప్లయితొలగించండి
 17. వేయికనులవేల్పు వివరించగాలేడు
  వగలరాణి మేని సొగసులెల్ల
  కరువుతీరచూడ కనులార నొకరెండు
  కన్నులున్నవంచుఁ గలఁత యేల

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.

  దృష్టి లేని జనులఁ దృష్టి యందిడుకొని
  మనము వారికన్న ఘనుల మనుచు
  ముదము పొందకుండ మూర్ఖమతిని, మెల్ల
  కన్ను లున్నవంచుఁ గలత యేల?

  రిప్లయితొలగించండి