31, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4224

 1-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె”
(లేదా...)
“రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ అష్టావధానంలో ఆదూరి ఫణీంద్ర రావు గారి సమస్య)

30 కామెంట్‌లు:

  1. తేటగీతి
    శివధనువు నెత్తి సీతమ్మఁ జేగొనఁగనె
    విష్ణుధనువెత్తు మనినిల్పి విర్రవీగ
    వినయమొప్పగ దాల్చియు విల్లు, పరశు
    రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      భామను బొంద నీశు విలు భల్లన దాల్చిన నుత్తరక్షణం
      బా ముని గాంచి వీరుడవె? యాగుము వైష్ణవ విల్లు నెత్తి నీ
      స్థామ నిరూపణంబొదవ సాగెద నంచన పర్శుపాణియౌ
      రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్

      తొలగించండి

    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. విన్ను మూలదేవర విల్లు విరిచి శివుని
    పరిభ వించినదెవ్వడీ వసుధ యందు
    ననుచు నాగ్రహించినయట్టి ఘనుడు పరశు
    రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె.

    రిప్లయితొలగించండి
  3. రాముడు శైవచాపమును రాజసమొప్పగ నెక్కుపెట్టగన్
    భూమిజ పెండ్లియాడినది పోఁడిమి మీరఁగ రామ చంద్రునిన్
    తామసమొంది కేశవుని ధన్వును దెచ్చిన పర్శుపాణియౌ
    రాముని గర్వభంగమును రాముడొనర్చెను దీమసమ్ముగన్
    (పర్శుపాణి= పరశును ధరించినవాడు)

    రిప్లయితొలగించండి
  4. శివుని విల్లు విరిచి కోప వివశుడైన
    జామదగ్ని యెదుటనిల్చె జంకు లేక
    విష్ణు ధనువు సయిత మెక్కుపెట్టిపరశు
    రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భామిని సీతనే తనదు భార్యగ భావన సేయనెంచుచున్
      శ్యామల వర్ణశోభితుడు జాబిలితాలుపు కాలపృష్ఠమున్
      రాముడు త్రుంచగా పరశురాముని కోపము ప్రజ్వలించ నా
      రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. హరుని చాపము ద్రుంచియు నా ఢ్యు డైన
    జానకీ రాము కెదురేగి చాటు మనుచు
    విష్ణు చాప మొసఁగఁ నెక్కు పెట్టి పరశు
    రాము గర్వ భంగ మొనర్చి రాము డల రె

    రిప్లయితొలగించండి

  6. కాముని బూదిసేసిన భగఘ్నుని చాపము నెత్తి ద్రుంచుచున్
    సోముని మొక్కబుచ్చిన ద్విజుండెవడైన నేమి వాని యా
    యామని గూల్చ వచ్చిన మహాత్ముడెయౌ జమ దగ్ని పుత్రుడా
    రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  7. శివుని ధనువు విరిచెనని చిఱ్ఱు మనుచు
    పణముగ దన వింటి శరము వదలు మనగ
    సుళువుగ విడచి జమదగ్ని సుతుడు పరశు
    రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె

    రిప్లయితొలగించండి
  8. హరుని విల్లును భేదించి హరుసమొదవ
    జేసె సీతకు రాముడు, చిర్నగవున
    విష్ణుచాపము చేబూని వేగ పరశు
    రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె

    రిప్లయితొలగించండి
  9. పిలిచిన దరికి రాకున్న నలిగి కరము
    నాఁగలిని లాఁగి చెంతకు రేఁగి యంత
    నయ్యమునకు నదీ మణి కట్లు రామ
    రామ! గర్వభంగ మొనర్చి రాముఁ డలరె

    భీమపు విష్ణు కార్ముకము ప్రీతి గ్రహించి మునీంద్రు నుండి సూ
    చీముఖ మెక్కిడంగ నతి చిత్రము భార్గవు శక్తి డుల్లఁగా
    సోమ నిభాననుండు రణ శూరుఁడు వచ్చిన జామదగ్ను నా
    రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్

    రిప్లయితొలగించండి
  10. మరొక పూరణ

    ఆమునివెంటసాగుచును నంతము చేయుచు తాట కాదులన్
    కామినిశాపమున్ ఉడిపి కాంతగ మార్చి త్రిశూలి విల్లుతా
    నామునియాజ్ఞచేవిరిచినాలిగసీతనుగొంచునధ్వమున్
    *“రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్

    రిప్లయితొలగించండి
  11. సోముని విల్లు ద్రుంచి యుపశోభ నయోద్యకు పోవుచుండగా
    భీమ స్వరూపమున్ నృపుల భీతిలచేసిన మౌని చేరువై
    తామరసాక్షు విల్లునిడి తాల్చుమనంగను, పర్శుపాణియౌ
    రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్

    రిప్లయితొలగించండి
  12. శివ ధనుస్సును విరచియు శీలవతిని
    జానకిని దనజారి చేగొనె సమ్ముదమున
    గాంచి దూషించుచున్న యా ఘనుడు పరశు
    రామ గర్వభంగమొనర్చి రాము డలరె

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.

    శివుని విల్లు విరిచెనట నెవడు వాడ
    టంచు సభలోని కేతెంచి యాగ్రహమున
    విష్ణువుని విల్లు దీనిని విరువ గలవ?
    యనగ దానిని చేకొని నంత పరశు
    రామ గర్వభంగ మొనర్చి రాముడలరె.

    రిప్లయితొలగించండి
  14. ఉ.

    నేమమె కార్తవీర్యునకు నిశ్చయ మృత్యువు వైరశుద్ధిగన్
    సీమ మహేంద్ర పర్వతముఁ జింత, తెగెన్ శివచాప మెట్టులన్
    వాముని దత్త భక్తుడగు బ్రాహ్మణ వీరుడు జామదగ్నియౌ
    *“రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్”*

    రిప్లయితొలగించండి