19, జనవరి 2023, గురువారం

సమస్య - 4212

20-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్”
(లేదా...)
“కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్”
(గరికిపాటి వారికి ధన్యవాదాలతో...)

33 కామెంట్‌లు:


  1. లోకుల యెదలో నిలుచుటె
    తేకువ సత్కవికి కాదె స్థిరమై నిలుచున్
    గాకవులీ భువినెంతగ
    కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్?

    రిప్లయితొలగించండి
  2. ఏకార్యంబందైనను
    నాకేమిటి దీనిజేయ నయమగు ననుచున్
    నాకార్యాధ్యక్షుని కడ
    కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్

    రిప్లయితొలగించండి
  3. కందం
    లోకులు మెచ్చెడు నటనన్
    గైకాల నవరసములను కాకలన్ దీరన్
    జేకూరెనె పద్మశ్రీల్?
    కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్!

    శార్దూలవిక్రీడితము
    లోకుల్ మెచ్చెడు దీరునన్నటులుఁ గారో? సత్యనారాయణుల్
    కాకల్దీరి రసంబునేదయిన ప్రఖ్యాతిన్ గడింపంగ! చె
    ప్మా! కైకాలకు నందెనే ప్రభుత పద్మాలేవియున్? నేర్పుతో
    కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. వ్యావహారిక 'చెప్మా' తొలగించి సవరించిన వృత్తము.

      శార్దూలవిక్రీడితము
      లోకుల్ మెచ్చెడు దీరునన్నటులుఁ గారో? సత్యనారాయణుల్
      కాకల్దీరి రసంబునేదయిన ప్రఖ్యాతిన్ గడింపంగ! రా
      మా! కైకాలకు నందెనే ప్రభుత పద్మాలేవియున్? నేర్పుతో
      కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్!

      తొలగించండి
  4. మేకొని కీర్తిని బడయగ
    తాకట్టును బెట్టి యాత్మ దైన్యము నొందన్
    తోకాడించు చు దిరుగుచు
    కాకా పట్టిననె వచ్చు గాన్కల్ బిరు దుల్

    రిప్లయితొలగించండి
  5. మిత్రుడు ఇంకొక మిత్రునితో..

    ఏకాగ్రంబుగ నీదురంగమును ప్రేమింపంగనే యొప్పగున్
    రాకెట్లుండును సత్పురస్కృతి కళారంగమ్ములోమేటికిన్
    రాకాచంద్రునివోలె వెల్గవలె శాస్త్రంబులో‌ నేర్పునిన్
    కాకా! పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్

    కాకా = మిత్రునికి సంబోధన

    రిప్లయితొలగించండి

  6. బాకాలూదెడు వందిమాగదులనే భట్రాజులన్ నిత్యమున్
    బైకంబిచ్చి నుతింపజేసుకొను డంబాచారులే పెర్గగన్
    సాకారంబిక కాదు సజ్జనులకున్ సమ్మానముల్, నేతలన్
    కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్.

    రిప్లయితొలగించండి
  7. ఏకార్యమునందైనను
    చేకూరును యశము ఘన విజేతలకెపుడున్
    లోకుల మూర్ఖపు తలపుల్
    కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్

    రిప్లయితొలగించండి
  8. శార్దూలము.
    ఈ కాలంబున మారు రీతి గనగానేకాగ్రచిత్తంబుతో
    సాకార్యంబులనంది యూరకొనగన్ సన్మానముల్ దక్కునా?
    లోకాన్నేలెడివారి పంచ గొలువై రూకల్ సమర్పించుచున్
    *గాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్!*

    రిప్లయితొలగించండి
  9. లోకులెపుఁడు పలుగాకులు
    చీకాకొనరింత్రు గేలి చేయుచు, ప్రతిభన్
    జేకురు నవజితి నందురు
    కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్

    రిప్లయితొలగించండి
  10. ఈ కలఁత నింక వీడుమ
    నీ కగును శుభము లచిరము నెమ్మి వహింపన్
    వే కని త్యజింపుమీ చీ
    కా కా పట్టి ననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్

    [చీకాకు +ఆ పట్టిన్ = చీకా కా పట్టిన్; పట్టి = బిడ్డ]

    ఏ కావ్యంబున కెట్టి యాదరణమో యెవ్వం డెఱుంగున్ ధరన్
    వైకల్యమ్మును జెంద నేల మదినిం బాండిత్యమే చాలునే
    యా కల్యాణపు రాజ యోగ మది నిండై, యేల కాకమ్ము నా
    కా కా, పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్

    [కా కా = కాకి యఱపు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      నాఁ / గా కా యని చిన్న సవరణము.

      తొలగించండి
  11. లోకుల్ కాకులు కావుకావుమనుచున్ లోపంబులే యెంచుచున్
    సాకల్యంబుగ ప్రజ్ఞగాంచకను వాచాలత్వముం జూపుచున్
    చీకాకున్గలిగింప బూనుకొని విశ్లేషింతురీ తీరుగన్
    కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్

    రిప్లయితొలగించండి
  12. కందం.
    లోకులు పలుకాకుల నన్
    కాకలు దీరిన మనుజుల గరిమను నెగయున్
    లోకువ జేయుచు నుడివిరి
    కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  13. నీకొక విషయముఁ జెప్పుదు
    నాకీయుమ యొక్క ఘడియ నాయుడు వర్యా!
    యీకాలపు నైజము విను
    కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్

    రిప్లయితొలగించండి
  14. ఈకాలమ్మునచూడగ
    కాకాపట్టిననెవచ్చుకాన్కల్ బిరుదుల్
    కేకలు వైచిన రావను
    లోకులపలుకులెకదాశిరోధార్యమ్ముల్

    మరొక పూరణ

    శ్రీకారమ్మునుచుట్టుచున్ సతతమున్చే కొమ్మటంచెప్పు డున్
    శ్రీకాంతున్ మదిలో స్మరించుచునుతా శీఘ్రమ్ముగానిత్యమున్
    “కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్”
    స్వీకారమ్మునుచేయగన్ విడకనా విష్ణుండెదీవించుగా


    రిప్లయితొలగించండి
  15. ఈకాలంపు మహాత్మ్యమే యిది గదాయేదేని గోరంగనౌ
    కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్
    నాకీ సంగతిఁజెప్పె మామనుమఁడే నమ్మంగ శక్యమ్ము నే?
    రూకల్ గూడను నీయ గావలె నహా రోగమ్ము రాకుండునే?

    రిప్లయితొలగించండి