18-1-2023 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వారధినిం గట్టలేదు వానరు లెవరున్”(లేదా...)“వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై”(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో పిలకా శాంతమ్ము గారి సమస్య)
శ్రీరాముని కార్యమనుచుతారిష తీరమ్ము జేరి దానిని దాటన్ ధీరుని యనుమతి లేనిదె వారధినిం గట్టలేదు వానరు లెవరున్. (ధీరుడు= సముద్రుడు)
నీరధి దాటి పోవలయు నీరజ లోచని సీతయున్న యాదూరపు లంక జేరుటకు దోర్బల శూరులు వానరావళుల్ధీరత వీడ నీలుడును దెల్పెనుపాయమువారుసైతమేవారధి గట్టలేదు గద వానురులెవ్వరు రామభృత్యులై
దారుణమౌ వరంబులను దానుగఁ గోరఁగఁ గైక, తండ్రి నోరారఁగఁ జెప్పలేని స్థితి నారసి రాముఁ డరణ్య మేగఁగాఁగోరి ప్రయాణమై సతినిఁ గూడి యయోధ్యను వీడు నాటికిన్వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై.
పారావారము మీరగశ్రీరాముని లంక కడకు చేర్చుట కొరకేవేరే కార్యము కొరకున్వారధినిం గట్టలేదు వానరు లెవరున్
దారుణ రీతి రావణుడు దాచెను సీతను లంకలోపలన్వీరుడు రాముడే కదలి వేగిరపాటున లంకదాపుకున్జేరుట సాధ్యమౌనటుల చేసిరి వేరొక కారణంబుతోవారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
కందంధారుణి సుతఁ సీతఁబడయనా రాముని నామ మహిమ నబ్ధిన్ దేల్చన్దారిగ రాళ్లమరినవనవారధినిం గట్టలేదు వానరు లెవరున్! ఉత్పలమాలధారుణి పుత్రి సీతఁ బతి దాశరథిన్ మురిపింప జేర్చగన్మారెను రామనామ మహిమన్ శిలలెల్లను దేలి నబ్ధిపైదారిగ, రామమూర్తి పదదాసులు పూనికలేని వారలైవారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
భారతదేశ జనాభాకోరికపయి లంక కేగు కొరకై నాడున్బోరన సాగర మందునవారధినిం గట్టలేదు వానరు లెవరున్
దారను బంధిసేసెనని దానవు దునుమ వానరాళితో చేరెను సంద్రతీరమట శ్రీరఘు రాముని కాంచినంతనే ధీరుడుపాయమొక్కటిని తెల్పెను తానెఱ గించకున్నచో వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై.
శ్రీరాముడు లంక కరయచేరియు గడలికి ని కట్టె సేతువు భక్తిన్వారలు స్వార్థ ము కొఱకైవారధి నిం గట్ట లేదు వానరు లెవరున్
రావణుడు సాగరం మీద వస్తున్న వానర సేనను చూసి...ఉ.నేరము సల్పిరావణుడు నేర్పుగ చూసెను వారి రాశిపైవారిధి పైన దాశరధి వానరసేనను కూడి సాగగాచేరెడి దృశ్యమున్గనుచు చింతను బొందెను వాడునివ్విధిన్“వారధిఁ గట్టలేదు గద ! వానరు లెవ్వరు రామభృత్యులై”??
భారత దేశమందు గల వర్తక శ్రేణుల కోరికపైన లంక జను కోసము నాటిది నంబు లందునన్బోరున సంద్రమందు దిగి మూకగ నేర్పడి యంత పెద్దదౌవారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
కందంధారుణి తనయను వెదకుచుధీరునిగాకపివరుండు తేజమలరగన్నీరధినిదాటు సమయము వారధినిం గట్టలేదు వానరులెవరున్! ఉత్పలమాలవారిజనేత్రి సీతఁగన వానరయోధుడు వాయుపుత్రు డౌధీరముతోడ బంతముగ దేజము నిండిన మానసంబునన్నీరధి దాటువేళలను నింగిని బోవుచు రామబాణమై,వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
ధారుణిపుత్రినిన్వెదుక దాశరథిన్ భజియించి ప్రేమతోధీరము చూపుచున్హనుమ తేజము నిండిన మానసంబునన్నీరధి దాటువేళలను నింగిని బోవుచు రామబాణమై,వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
వారిధి దాటి లంకఁ జన వారధిఁ గట్టఁగ రామచంద్రునిన్పేరు లిఖింపగండ శిల బెండుగఁ దేలెను నీరమందునన్ధీరుడు కౌశలేయు నభిధేయము ఱాళ్ళనుఁ దేల్చకుండనావారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
నీరధి దాటఁగరాముడువారధి నిర్మించినారు వానరు లెల్లన్శ్రీరాముని కడఁక వినావారధినిం గట్టలేదు వానరు లెవరున్
కందంవారలు వానర మూకగకారణ జన్ములు వివరము కనుగొన,భక్తిన్చేరిరి ధర్మ రక్షణ కైవారధినిం గట్ట లేదు వానరులెవరున్ ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
ఆ రాముని మాహాత్మ్యము నీరధి కరుణామహిమము నెగడఁగఁ బారా వారమునఁ గల్గె వంతెన వారధినిం గట్ట లేదు వానరు లెవరున్దారుణ రీతి రక్కసుఁడు ధర్మము వీడి హరింప సీతకై పోరునఁ జంప రావణుని మూరుచు నంతియ కాని దుర్మతిం గోరుచు భోగ భాగ్యములు కొల్లలు లంకను నాక్రమింపఁగా వారధిఁ గట్ట లేదు గద వానరు లెవ్వరు రామ భృత్యులై
క్రొవ్విడి వెంకట రాజారావు: ధీరుడు రాముడు, సీతయు కూరిమి నిడు భ్రాతతోడ గొప్పగ నడవిన్ దోరుచు నుండెడి వేళను వారధినిం గట్టలేదు వానరులెవరున్. ధీరుడునైన దాశరథి, ధీమతియై పొనరారు సీతనున్ పేరిమికాడు లక్ష్మణుని ప్రేమగ జూచుచు కాననమ్మునన్ సౌరునుగూడి సౌఖ్యముగ సాగుచునుండిన కాలమందునన్ వారధి గట్టలేదు గద వానరులెవ్వరు రామ భృత్యులై.
ఉ.ధీరుడు భీమ విక్రముడు దేవతలెల్ల ప్రశంసచేయగావారిధి దాటి దేవకులవైరుల దండును దున్మి, శౌర్యమేపారగ చేసె దుష్కరము, పావని వారిధి దాటునాటికిన్వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై”
వారధి గూరిచి యిటులనె వారధినిం గట్టలేదు వానరు లెవరున్ బారుగ ఱాళ్ళను బేర్చుచు వారధినింగట్టిరార్య! వానరు లేగద
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై వారధిఁగట్టఁబూనుచును వానరు లందఱు ఱాళ్ళు మోసిరే నేరక యిట్టులా డఁగను నీతియె చెప్పుము పద్మ నాభుఁడా! వారలు రామ భృత్యులయి వార్ధికి వారధి గట్టిర య్యెడన్
మరొక పూరణభారతి నిల్చియున్న పుర వాసర క్షేత్రపు చెంతనున్న యిందూరు జనాళికయ్యదియె దుర్భర మయ్యెను దర్శనానికై చేరెడు మార్గ మధ్యమున శేవలినీ ప్రవహించు దానిపై వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై.
శ్రీరాముని దయ లేకనువారధినిం గట్టలేరు వానరు లెవరున్శ్రీరామాయని వ్రాసినయారాళ్ళను వేయవార్ది యయ్యెను జలధిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
: కారణ జన్ముడౌ హరిని కన్గొని కానన మందు, తల్చుచున్ వారక రామనామము, శుభమ్ముల గూర్చునటంచు నెంచుచున్ తీరగు భక్తి, మానసము తీవ్ర తరమ్మగు దీక్ష లేనిచో వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
రిప్లయితొలగించండిశ్రీరాముని కార్యమనుచు
తారిష తీరమ్ము జేరి దానిని దాటన్
ధీరుని యనుమతి లేనిదె
వారధినిం గట్టలేదు వానరు లెవరున్.
(ధీరుడు= సముద్రుడు)
నీరధి దాటి పోవలయు నీరజ లోచని సీతయున్న యా
రిప్లయితొలగించండిదూరపు లంక జేరుటకు దోర్బల శూరులు
వానరావళుల్
ధీరత వీడ నీలుడును దెల్పెనుపాయము
వారుసైతమే
వారధి గట్టలేదు గద వానురులెవ్వరు రామభృత్యులై
దారుణమౌ వరంబులను దానుగఁ గోరఁగఁ గైక, తండ్రి నో
రిప్లయితొలగించండిరారఁగఁ జెప్పలేని స్థితి నారసి రాముఁ డరణ్య మేగఁగాఁ
గోరి ప్రయాణమై సతినిఁ గూడి యయోధ్యను వీడు నాటికిన్
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై.
పారావారము మీరగ
రిప్లయితొలగించండిశ్రీరాముని లంక కడకు చేర్చుట కొరకే
వేరే కార్యము కొరకున్
వారధినిం గట్టలేదు వానరు లెవరున్
దారుణ రీతి రావణుడు దాచెను సీతను లంకలోపలన్
తొలగించండివీరుడు రాముడే కదలి వేగిరపాటున లంకదాపుకున్
జేరుట సాధ్యమౌనటుల చేసిరి వేరొక కారణంబుతో
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
కందం
రిప్లయితొలగించండిధారుణి సుతఁ సీతఁబడయ
నా రాముని నామ మహిమ నబ్ధిన్ దేల్చన్
దారిగ రాళ్లమరినవన
వారధినిం గట్టలేదు వానరు లెవరున్!
ఉత్పలమాల
ధారుణి పుత్రి సీతఁ బతి దాశరథిన్ మురిపింప జేర్చగన్
మారెను రామనామ మహిమన్ శిలలెల్లను దేలి నబ్ధిపై
దారిగ, రామమూర్తి పదదాసులు పూనికలేని వారలై
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
భారతదేశ జనాభా
రిప్లయితొలగించండికోరికపయి లంక కేగు కొరకై నాడున్
బోరన సాగర మందున
వారధినిం గట్టలేదు వానరు లెవరున్
రిప్లయితొలగించండిదారను బంధిసేసెనని దానవు దునుమ వానరాళితో
చేరెను సంద్రతీరమట శ్రీరఘు రాముని కాంచినంతనే
ధీరుడుపాయమొక్కటిని తెల్పెను తానెఱ గించకున్నచో
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై.
శ్రీరాముడు లంక కరయ
రిప్లయితొలగించండిచేరియు గడలికి ని కట్టె సేతువు భక్తిన్
వారలు స్వార్థ ము కొఱకై
వారధి నిం గట్ట లేదు వానరు లెవరున్
రావణుడు సాగరం మీద వస్తున్న వానర సేనను చూసి...
రిప్లయితొలగించండిఉ.
నేరము సల్పిరావణుడు నేర్పుగ చూసెను వారి రాశిపై
వారిధి పైన దాశరధి వానరసేనను కూడి సాగగా
చేరెడి దృశ్యమున్గనుచు చింతను బొందెను వాడునివ్విధిన్
“వారధిఁ గట్టలేదు గద ! వానరు లెవ్వరు రామభృత్యులై”??
భారత దేశమందు గల వర్తక శ్రేణుల
రిప్లయితొలగించండికోరికపైన లంక జను కోసము నాటిది నంబు లందునన్
బోరున సంద్రమందు దిగి మూకగ నేర్పడి యంత పెద్దదౌ
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
కందం
రిప్లయితొలగించండిధారుణి తనయను వెదకుచు
ధీరునిగాకపివరుండు తేజమలరగన్
నీరధినిదాటు సమయము
వారధినిం గట్టలేదు వానరులెవరున్!
ఉత్పలమాల
వారిజనేత్రి సీతఁగన వానరయోధుడు వాయుపుత్రు డౌ
ధీరముతోడ బంతముగ దేజము నిండిన మానసంబునన్
నీరధి దాటువేళలను నింగిని బోవుచు రామబాణమై,
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
ధారుణిపుత్రినిన్వెదుక దాశరథిన్ భజియించి ప్రేమతో
తొలగించండిధీరము చూపుచున్హనుమ తేజము నిండిన మానసంబునన్
నీరధి దాటువేళలను నింగిని బోవుచు రామబాణమై,
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
వారిధి దాటి లంకఁ జన వారధిఁ గట్టఁగ రామచంద్రునిన్
రిప్లయితొలగించండిపేరు లిఖింపగండ శిల బెండుగఁ దేలెను నీరమందునన్
ధీరుడు కౌశలేయు నభిధేయము ఱాళ్ళనుఁ దేల్చకుండనా
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
నీరధి దాటఁగరాముడు
రిప్లయితొలగించండివారధి నిర్మించినారు వానరు లెల్లన్
శ్రీరాముని కడఁక వినా
వారధినిం గట్టలేదు వానరు లెవరున్
కందం
రిప్లయితొలగించండివారలు వానర మూకగ
కారణ జన్ములు వివరము కనుగొన,భక్తిన్
చేరిరి ధర్మ రక్షణ కై
వారధినిం గట్ట లేదు వానరులెవరున్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
ఆ రాముని మాహాత్మ్యము
రిప్లయితొలగించండినీరధి కరుణామహిమము నెగడఁగఁ బారా
వారమునఁ గల్గె వంతెన
వారధినిం గట్ట లేదు వానరు లెవరున్
దారుణ రీతి రక్కసుఁడు ధర్మము వీడి హరింప సీతకై
పోరునఁ జంప రావణుని మూరుచు నంతియ కాని దుర్మతిం
గోరుచు భోగ భాగ్యములు కొల్లలు లంకను నాక్రమింపఁగా
వారధిఁ గట్ట లేదు గద వానరు లెవ్వరు రామ భృత్యులై
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధీరుడు రాముడు, సీతయు
కూరిమి నిడు భ్రాతతోడ గొప్పగ నడవిన్
దోరుచు నుండెడి వేళను
వారధినిం గట్టలేదు వానరులెవరున్.
ధీరుడునైన దాశరథి, ధీమతియై పొనరారు సీతనున్
పేరిమికాడు లక్ష్మణుని ప్రేమగ జూచుచు కాననమ్మునన్
సౌరునుగూడి సౌఖ్యముగ సాగుచునుండిన కాలమందునన్
వారధి గట్టలేదు గద వానరులెవ్వరు రామ భృత్యులై.
ఉ.
రిప్లయితొలగించండిధీరుడు భీమ విక్రముడు దేవతలెల్ల ప్రశంసచేయగా
వారిధి దాటి దేవకులవైరుల దండును దున్మి, శౌర్యమే
పారగ చేసె దుష్కరము, పావని వారిధి దాటునాటికిన్
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై”
వారధి గూరిచి యిటులనె
రిప్లయితొలగించండివారధినిం గట్టలేదు వానరు లెవరున్
బారుగ ఱాళ్ళను బేర్చుచు
వారధినింగట్టిరార్య! వానరు లేగద
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై
రిప్లయితొలగించండివారధిఁగట్టఁబూనుచును వానరు లందఱు ఱాళ్ళు మోసిరే
నేరక యిట్టులా డఁగను నీతియె చెప్పుము పద్మ నాభుఁడా!
వారలు రామ భృత్యులయి వార్ధికి వారధి గట్టిర య్యెడన్
రిప్లయితొలగించండిమరొక పూరణ
భారతి నిల్చియున్న పుర వాసర క్షేత్రపు చెంతనున్న యిం
దూరు జనాళికయ్యదియె దుర్భర మయ్యెను దర్శనానికై
చేరెడు మార్గ మధ్యమున శేవలినీ ప్రవహించు దానిపై
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై.
శ్రీరాముని దయ లేకను
రిప్లయితొలగించండివారధినిం గట్టలేరు వానరు లెవరున్
శ్రీరామాయని వ్రాసిన
యారాళ్ళను వేయవార్ది యయ్యెను జలధిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి: కారణ జన్ముడౌ హరిని కన్గొని కానన మందు, తల్చుచున్
రిప్లయితొలగించండివారక రామనామము, శుభమ్ముల గూర్చునటంచు నెంచుచున్
తీరగు భక్తి, మానసము తీవ్ర తరమ్మగు దీక్ష లేనిచో
వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై