9, జనవరి 2023, సోమవారం

సమస్య - 4304

10-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సద్దు సేయదు పికము వసంతమందు”
(లేదా...)
“సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మాచవోలు శ్రీధరరావు గారి సమస్య)

31 కామెంట్‌లు:

  1. ఎచట నుండునో మరి యన్య ఋతువు లందు
    సద్దు సేయదు పికము ; వసంతమందు
    గళము విప్పి వీనుల విందు గలుగ జేయు
    మావి చిగురు భుజించిన మత్తుతోడ

    రిప్లయితొలగించండి
  2. హద్దు మీరిన కారు చిచ్చది యంత కంతకు పెర్గియున్
    జిద్దుతోడను గాల్చివేసెను జేను మొత్తము
    నిర్దయన్
    సుద్ది సెప్పుట మానవేసెను శోకమందున మున్గి తా
    సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యంతకంతకు హెచ్చినన్... మానివేసెను" అనండి. 'జిద్దు' అన్యదేశ్యం.

      తొలగించండి
  3. ప్రహ్లాదుడు -- హిరణ్య కశ్యపుడు
    తే. గీ.
    భక్తి రసమున మున్గిన బాలకునికి
    తండ్రి తననామధేయంబు తలప మనగ
    తలప నేర్చునె? యెట్లన్న ఇలను"కాకి
    సద్దు, సేయదు పికము వసంతమందు"

    రిప్లయితొలగించండి

  4. సమయమిదియె కాదన్న విషయమెఱుంగ
    వేల? సంగీత సాధన పేరు తోడ
    రాగములవేల వలదంటి రాత్రి వేళ
    సద్దు సేయదు పికము వసంతమందు.


    హద్దులన్నవి దాటబోకుడి ఆలకింపుడు నానుడుల్
    పెద్దలెల్లరు నిద్రబోయిరి, వేళగాదిది పాటకున్
    వద్దువద్దని చెప్పుచుంటిని బాలకావిను శార్వరిన్
    సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్.

    రిప్లయితొలగించండి
  5. అన్ని ఋతువుల యందున నణగి యుండి
    సద్దు సేయదు పికము : వసంత మందు
    మావి చిగురులు మెక్కియు మత్తు తోడ
    కూయ మొదలిడు కోకిల కోర్కె మీర

    రిప్లయితొలగించండి
  6. సుద్దు లేవియు లెక్క చేయక శుంఠులైన ప్రజాళియున్
    హద్దు మీరిన కశ్మలమ్ముల హాని గూర్చగ గాలికిన్
    ముద్దులొల్కు స్వరమ్ము బొంగురు పోవనాగ్రహ మందుచున్
    సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్

    రిప్లయితొలగించండి
  7. మొద్దు నిద్దుర పోవుచున్నది పొద్దు మీరుచు నుండియున్
    సద్దు సేయదు కోకిలమ్మ ; వసంతకాలము వచ్చినన్
    హద్దు మీరుచు కూయునె ప్పుడు
    నన్ని వేళల ముద్దుగన్
    కొద్ది కొద్దిగ మావి చెట్టులకున్న పల్లవ మెక్కుచున్

    రిప్లయితొలగించండి
  8. సరస సంగీత నిర్జర జలధి లోన
    దేశ జనులనెపుడు ముంచి తేల్చిన 'లత'
    భరత గానకోకిల చేరె పరమపదము
    సద్దు సేయదు పికము వసంతమందు

    రిప్లయితొలగించండి
  9. సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
    మొద్దు నిద్దురపోయెనామరి మూగనోమును పట్టెనా?
    హద్దుఁ గానక పాదపమ్ముల నంతమొందగ జేసినన్
    క్రుద్ధమొందిన కోకిలమ్మకు గొంతు విస్వరమొందెనా?

    రిప్లయితొలగించండి
  10. వనములన్నియు క్రమముగా హననమొంద
    మచ్చుకైనను గానక పచ్చదనము
    నంతుతెలియని నైరాశ్య మావరించి
    సద్దు సేయదు పికము వసంతమందు

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    సృష్టి పులకింప మావిళ్ల చిగురులలమి
    హరితవర్ణంపు వస్త్రాల మురిసినటుల
    మేలమూదగ నొగరుల మెసవకుండ
    సద్దు సేయదు పికము వసంతమందు

    మత్తకోకిల
    సిద్ధమైనవి లేచిగుర్లన సృష్టి ముచ్టట గొల్పగన్
    ముద్దులొల్కెడు మావిపిందెలుఁ బుల్కరింతలు రేపఁగన్
    హద్దులేదన నా యొగర్లను నార్తిమీరగ మెక్కకే
    సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్

    రిప్లయితొలగించండి
  12. హద్దులేని యపేక్ష తోడుత నార్జనమ్మును పెంచగా
    ముద్దుసేయు వనమ్ములన్నియు మూర్ఖులైప్రజ కూల్చగా
    శుద్ధిలేని రసాయనమ్ములు చొప్పడంగ దళమ్ములన్
    సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మలిన వాతావరణమున వెలసినట్టి
    కలుషమంటిన దళములు కతికియుండి
    గళముచెడి మాటరాకుండు కాలమందు
    సద్దుచేయదు పికము వసంతమందు.

    సుద్దివిడ్చిన కశ్మలంబగు చూషకమ్మును బీల్చియున్
    నిద్దమౌనగు పాటపాడెడి నేర్పుగూడిన కంఠమే
    గద్దరింపుగ మారిపోవగ కక్కసమ్మును జెందుచున్
    సద్దుచేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్.

    రిప్లయితొలగించండి
  14. గురువు గారు ధన్యవాదాలు మీ సూచనకు. సవరించి పంపినాను

    రిప్లయితొలగించండి
  15. తీయ తీయని చందపుఁ దీరు నుండ
    మానసం బలరు పగిది మ్రాను లందుఁ
    బాడు రాగము సుద్దులు గూడి నట్టి
    సద్దు సేయదు పికము వసంత మందు

    నిద్దురం బెను తిండిఁ గోరెడు నిత్య కాములఁ గాంచి యె
    ప్పొద్దు వోలుచు వారిఁ దాఁ దలపోయకే నిజ ధర్మముం
    దద్ద మామిడి పల్లవమ్ము సతమ్ము మెక్కి పరుండి యే
    సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్

    రిప్లయితొలగించండి
  16. వద్దు వేరు వరంబు మేలని భర్త యెంతగ వేడినన్
    గద్దెపై సుతు గాంచ గానల కంపె రాముని కైకయే
    హద్దెరుంగని దుఃఖమందె జనాళి లోకము చీకటై
    సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్

    రిప్లయితొలగించండి
  17. నిద్రపోవగ నెంచుచు నెమ్మదిగను
    సద్దుచేయదు పికము వసంతమందు
    మావిచిగురునుతినుచుతా మత్తుతోడ
    కమ్మనైన పాటలుపాడు గళమునెత్తి

    మరొక పూరణ

    స్వార్థ చింతన మూనుచు జవము గాను
    మామిడి తరువులనుగొట్ట మానవాళి
    చెట్టుకొమ్మపై నించుక చివురులేక
    సద్దు చేయదు పికము వసంతమందు

    రిప్లయితొలగించండి
  18. హద్దుమీరుతరంగముల్మరియండజంబులఁ జంపగా
    ముద్దుముద్దుగముచ్చటించుచుమూడుఁబొద్దులుసాగుచున్
    మొద్దునిద్దురవీడకన్సహజాతముల్దెగగోయగా
    సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి