28-1-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్"(లేదా...)"కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో"(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో కలికిరి గురుదేవ్ గారి సమస్య)
మాత తెలిపిన వరునిపయిలోతుగ యోచన సలుపగ రోగము రాగాయాతనపడి మందో మాకో తినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేత ల లో మంచి తనముదాతగ ధర్మాత్ము డగుచు దయ గలవాడైఖాతరు జేయక రూపముకోతిని బెండ్లాడె గోరె కోమలి యిచ్చ న్
రెండవ పాదంలో చివర వానిన్ అని సవరణ చేయడమైనది
ఉ.భీతిలె రావణాసురుడు బెట్టున వాలి యధీనమున్ గతిన్ ద్యోతము లేక చంపెనట దుందుభిఁ గొండబిలంబునందునన్జాతిని నెంచరాదు వనజాక్షికి బీరము తార మెచ్చగా*కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో.*
భ్రాతలు సూచించు వరునిమూతి పలురకముల వంపు బోయిన కూడన్వేతనము మెండని దలచికోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
నాతికి నచ్చని పెండ్లియుచేతురుయని పస్తులుండె జీవిచ్ఛవమైభీతిలి చెల్లి పలికె "అక్కో"!తినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. *చేతురు + అని' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
నాతికి నచ్చని పెండ్లియుచేతురనుచు పస్తులుండె జీవిచ్ఛవమైభీతిలి చెల్లి పలికె "అక్కో"!తినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్సరిచేసాను గురువుగారు
చేతలలో కొంటె తననుభీతియె లేనిపనుల గని పెద్దలెల్లరున్ బ్రీతిగ కపియని యనెడా కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్. భీతియె లేని చేష్టలవి చెప్పిన మానడంచు నాచేతల గాంచినంతను విచిత్రపు ధోరిణి యంచు నింటిలో తాతయు తల్లిదండ్రులు లతామృగ మంచు వచించు నట్టియా కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.వృత్తం మొదటిపాదంలో గణభంగాన్ని సవరించండి.
భ్రాతలు పెండ్లి జేయుటకు వానిని సూచన జేయ నాతనిన్మూతిని యెంచ వంకరలుబోయున రీతిని గాంచి యుండగన్వేతన మెక్కువే యనుచుపేర్కొని నంతనె వేగిరంబుగన్కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మూతిని + ఎంచ' అన్నపుడు యడాగమం రాదు. 'వంకరలు వోయిన' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'జాతిని బుట్టిన' అనండి.
కోతుల జాతిని బుట్టిననాతి యొకబలిమికాని నభిమానించెన్బ్రీతిని సుగ్రీవుండనుకోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
కందంకోతలు గోయుచు పెక్కుగయాతన బెట్టఁ, దెలివైన నత్త కొడుకుతోచేతులు గలుపుచుఁ, బాయుచుకోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్ఉత్పలమాలకోతలు గోయుచున్ వెనుక కొంగును లాగుచు పోకిరీ యనన్యాతనఁ బెట్ట, విజ్ఞతల నత్త కుమారుని నీడు జోడనన్జేతులు గల్పుచున్, జివర చేరిచి యా శుభలేఖ నాపుచున్గోఁతినిఁ, బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
_/\_ ధన్యోస్మి గురుదేవా ! _/\_
ఏ తీరునఁ జూచెదు వారీతిని వీక్షింపు మంచుఁ బ్రేమ సెలంగన్ నాతి రుమయె సుగ్రీవునిఁ గోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్నాతియె మించుఁ బాటలను నాట్యము నందము నందుఁ జక్కఁగా నాతఁడు మించు శిల్పముల నందము లొల్కెడు రీతిఁ జెక్కఁగాఁ బ్రీతినిఁ గోఁతి పిల్లి యని పిల్చుచుఁ బెర్గఁగ నొక్కరొక్కరిం గోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందర నారి యిచ్ఛతో
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
చేతుల కుంగరమ్ములును సేవక బృందము కోట్ల యాస్తియున్శీతలమందిరమ్ముగల శ్రీకరుడైనను రూపమందునన్కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతోభ్రాతి ధనమ్ముపైగలిగి భావనచేయక నందచందముల్
సమస్య లో పెండ్లాడ "గోరె" అన్నాక "ఇచ్ఛన్" అనేది పునరుక్తి గా ఉంది.కోరటం అన్నా ఇచ్ఛ అన్నా ఒకటే కదా! అక్కడ మరొక పదం వేస్తే బాగుండేది.
ఇచ్ఛన్ బదులు ప్రీతిన్ అంటే సరి!
🙏ok sir !
మాతా మహుడొసగినచా కోఁతినిఁ, బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్. జీతము మెండుగ గలదని మాతాపితలొప్పినట్టిమంగళరూపున్
మరొక పూరణత్రేతా యుగమున తారయుకోతిని పెండ్లాడ గోరె గోమలి యిచ్ఛన్చేతంబొప్పగవాలికిజోతలిడుచునతడతులిత శూరుడటంచున్
శీతలమందిరవాసినిభూతలమందున కుబేరుఁబోలు ధనాఢ్యున్భ్రాతిగ రూపమునందునకోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
మాత తెలిపిన వరునిపయి
రిప్లయితొలగించండిలోతుగ యోచన సలుపగ రోగము రాగా
యాతనపడి మందో మా
కో తినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేత ల లో మంచి తనము
రిప్లయితొలగించండిదాతగ ధర్మాత్ము డగుచు దయ గలవాడై
ఖాతరు జేయక రూపము
కోతిని బెండ్లాడె గోరె కోమలి యిచ్చ న్
రెండవ పాదంలో చివర వానిన్ అని సవరణ చేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిభీతిలె రావణాసురుడు బెట్టున వాలి యధీనమున్ గతిన్
ద్యోతము లేక చంపెనట దుందుభిఁ గొండబిలంబునందునన్
జాతిని నెంచరాదు వనజాక్షికి బీరము తార మెచ్చగా
*కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో.*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభ్రాతలు సూచించు వరుని
రిప్లయితొలగించండిమూతి పలురకముల వంపు బోయిన కూడన్
వేతనము మెండని దలచి
కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాతికి నచ్చని పెండ్లియు
రిప్లయితొలగించండిచేతురుయని పస్తులుండె జీవిచ్ఛవమై
భీతిలి చెల్లి పలికె "అ
క్కో"!తినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*చేతురు + అని' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
నాతికి నచ్చని పెండ్లియు
తొలగించండిచేతురనుచు పస్తులుండె జీవిచ్ఛవమై
భీతిలి చెల్లి పలికె "అ
క్కో"!తినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
సరిచేసాను గురువుగారు
రిప్లయితొలగించండిచేతలలో కొంటె తనను
భీతియె లేనిపనుల గని పెద్దలెల్లరున్
బ్రీతిగ కపియని యనెడా
కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్.
భీతియె లేని చేష్టలవి చెప్పిన మానడంచు నా
చేతల గాంచినంతను విచిత్రపు ధోరిణి యంచు నింటిలో
తాతయు తల్లిదండ్రులు లతామృగ మంచు వచించు నట్టియా
కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివృత్తం మొదటిపాదంలో గణభంగాన్ని సవరించండి.
భ్రాతలు పెండ్లి జేయుటకు
రిప్లయితొలగించండివానిని సూచన జేయ నాతనిన్
మూతిని యెంచ వంకరలు
బోయున రీతిని గాంచి యుండగన్
వేతన మెక్కువే యనుచు
పేర్కొని నంతనె వేగిరంబుగన్
కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మూతిని + ఎంచ' అన్నపుడు యడాగమం రాదు. 'వంకరలు వోయిన' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జాతిని బుట్టిన' అనండి.
కోతుల జాతిని బుట్టిన
తొలగించండినాతి యొకబలిమికాని నభిమానించెన్
బ్రీతిని సుగ్రీవుండను
కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
కందం
రిప్లయితొలగించండికోతలు గోయుచు పెక్కుగ
యాతన బెట్టఁ, దెలివైన నత్త కొడుకుతో
చేతులు గలుపుచుఁ, బాయుచు
కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
ఉత్పలమాల
కోతలు గోయుచున్ వెనుక కొంగును లాగుచు పోకిరీ యనన్
యాతనఁ బెట్ట, విజ్ఞతల నత్త కుమారుని నీడు జోడనన్
జేతులు గల్పుచున్, జివర చేరిచి యా శుభలేఖ నాపుచున్
గోఁతినిఁ, బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి_/\_ ధన్యోస్మి గురుదేవా ! _/\_
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏ తీరునఁ జూచెదు వా
తొలగించండిరీతిని వీక్షింపు మంచుఁ బ్రేమ సెలంగన్
నాతి రుమయె సుగ్రీవునిఁ
గోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
నాతియె మించుఁ బాటలను నాట్యము నందము నందుఁ జక్కఁగా
నాతఁడు మించు శిల్పముల నందము లొల్కెడు రీతిఁ జెక్కఁగాఁ
బ్రీతినిఁ గోఁతి పిల్లి యని పిల్చుచుఁ బెర్గఁగ నొక్కరొక్కరిం
గోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందర నారి యిచ్ఛతో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిచేతుల కుంగరమ్ములును సేవక బృందము కోట్ల యాస్తియున్
రిప్లయితొలగించండిశీతలమందిరమ్ముగల శ్రీకరుడైనను రూపమందునన్
కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో
భ్రాతి ధనమ్ముపైగలిగి భావనచేయక నందచందముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య లో పెండ్లాడ "గోరె" అన్నాక "ఇచ్ఛన్" అనేది పునరుక్తి గా ఉంది.కోరటం అన్నా ఇచ్ఛ అన్నా ఒకటే కదా! అక్కడ మరొక పదం వేస్తే బాగుండేది.
రిప్లయితొలగించండిఇచ్ఛన్ బదులు ప్రీతిన్ అంటే సరి!
తొలగించండి🙏ok sir !
తొలగించండిమాతా మహుడొసగినచా
రిప్లయితొలగించండికోఁతినిఁ, బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్.
జీతము మెండుగ గలదని
మాతాపితలొప్పినట్టిమంగళరూపున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరొక పూరణ
రిప్లయితొలగించండిత్రేతా యుగమున తారయు
కోతిని పెండ్లాడ గోరె గోమలి యిచ్ఛన్
చేతంబొప్పగవాలికి
జోతలిడుచునతడతులిత శూరుడటంచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశీతలమందిరవాసిని
రిప్లయితొలగించండిభూతలమందున కుబేరుఁబోలు ధనాఢ్యున్
భ్రాతిగ రూపమునందున
కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి