19-1-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు”(లేదా...)“రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే”
మండోదరి తో రావణాసురుడు:ఉత్పలమాలసేమము గూర్చు వాడనుచు శ్రీరఘురాముని మెత్తురే సఖీ!కోమలినిచ్చి నే శరణు గోర శుభమ్మని బోధఁ జేతువే?భామను బొందెడున్ గతన వానరమూకను సాయమందెడున్రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె? నమ్ము టొప్పునే?
మండోదరి తో రావణాసురుడు:తేటగీతిశరణువేడుచు జానకిన్ స్వామికొసఁగవంశనాశనమాగునన్ బలుకులేల?పత్ని రక్షించుకోలేని వ్యర్థుడతఁడురామ పదధూళి తలవ్రాత లేమి మార్చు?
దొంగ మునిని ప్రశ్నిస్తున్న ప్రజలు..ఉ.నీమము లేనిజీవనము,నింతుల తోడ నసభ్య చేస్ట లున్క్షేమము గూర్చునంచు దన సేవకు లందరికిచ్చె ధూళినిన్కామ కలాపముల్ సలుపు ఖర్పరు బుద్ధి నెరుంగు నాడు,ఔ రా!ముని !పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే??
రాముని గూర్చి గొప్పగ సురారికి నాకునుజెప్పుటొప్పునేదామము వీడి కాననపు దారుల వెంబడిదిర్గువాడు నానామము రావణుండని వినన్ భయమొందునట్టి యారాముని పాద ధూలి తల వ్రాతలు మార్చునె నమ్ము టొప్పునే
రావణుడశోక వనమేగి రమణి సితతో పలికెనిట్లు పాషాణమే పడతిగమారెనందువా? యెంతటి మాయమాటరామ పదధూళి తలవ్రాత లేమి మార్చు? కాముకుడై చరించెడు మఖద్విషుడా వనమేగి యచ్చటన్ గోమలి జానకిన్ గనుచు క్రూరుడు పంక్తి ముఖుండు పల్కెనే భామగ మారెనాయతని పాదము సోకగ పారటీరమే రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె? నమ్ము టొప్పునే?
తొలగ జేసెను శాపము తూర్ణముగనురామ పద ధూళి : :. తలవ్రాత లేమి మార్చుచదువు లీనాడటంచును చతురు లనగనిజము నిజమంచు ఘోషింత్రు నేటి వారు
గౌతముడహల్యను శపించె కర్కశముగరామ పాదధూళి వలన రాయి మారెనారిగా మునిశాపమె కారణమ్ము రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు
మట్టి బాటన నడువగ మనుజుడెంతప్రవరుడైన , దుమ్ము యెగసి పడగ , నయ్యొరామ ! పదధూళి తలవ్రాత లేమి మార్చుననెదవు ! క నుల వెంబడి యంబువగును
రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె నమ్ము టొప్పునే?దీమసమిచ్చునట్టియభిధేయము రామునదీ జగంబునందామహనీయు పాదరజ మింతిగ రూపమునిచ్చె ఱాతికిన్రాముని సచ్చరిత్రమిల రమ్యపథంబును జూపు నమ్మినన్
3వపాదం ప్రారంభంలో 'దీమహనీయుఁ' గా చదువ గోర్తాను
తేటగీతి.కర్మ ఫలము దాటంగ శక్యంబు గాదు రామ పదధూళి తలవ్రాత లేమి మార్చుయనుచు ప్రవచన కారుడు వినగ చెప్పెసత్య మిదియేయనుచు నమ్మి జనులు వెడలె.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
ధీమహితుండు వాఁడనుచు దేవతలందరి రాజటంచు నీవే మది నమ్మి లంపటుఁడు, వేయికనుల్ గలవాఁడు, దొంగయైనీమముఁ దప్పి క్రుమ్మరెడు నీచునిఁ గొల్చుట పాడి యౌనె సుత్రాముని పాదధూళి తలవ్రాతల మార్చునే? నమ్ముటొప్పునే?
👌🏽🙏🏻
రామ చరితము చూపును రమ్యపథముముక్తిధామము భవబంధ మోచకమ్మురామ పదధూళి తల వ్రాత లేమి మార్చునన్న మీమాంస విడనాడుడన్నలార
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పలుకు లింపుగ ధర్మమ్ము లొలుకు చుండు చేత లవియెల్లఁ బరికింప రోఁత లగును సాధువు లనంగఁ జెలరేఁగు చపల హృదుల రామ! పదధూళి తలవ్రాత లేమి మార్చుకామ పరీత మానసులు కాలిడఁ గల్గునె పాల నార్థమై భూమిని శాంతిసౌఖ్యములు పూరుషు లుందురె చింత లేక ధాత్రీ మనుజాధినేతల ప్రవృత్తుల నేరమె స్వార్థ చింతనోత్క్రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె నమ్ము టొప్పునే [చింతనా + ఉత్క్రాముని = చింతనోత్క్రాముని]
రామ పదధూళి తలవ్రాత లేమి మార్చుమార్చు తలవ్రాత తప్పక రామునిపద ధూళి సందియము వలదు ధూపదీప ములను ,నైవేద్య మిచ్చిన ముదమంది యాయు రారోగ్య సంపద లీయు మనకు
రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే రాముని పాదధూ ళియెగద ఱాతిని నాతిగ మార్చె వెంటనేరాముని పాదరే ణువులు రక్తిని శీర్షము నందు వేయుచో సేమము గల్గు నెల్లరకు శ్రీలును గల్గును దప్పకుండగన్
మార్చెకాననహల్యనుమానినిగను*“రామ పదధూళి: తలవ్రాత లేమి మార్చు”*స్వార్థ పరులైననేతలపలుకు ప్రజనుతీపిమాటలటంచును తెలియుడయ్య మరొక పూరణ*"రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే”*నీమహి యంద టంచునిటు నిందను వేయుచు పల్క పాడియేతామునుకానలందునను దండన చేయుచు తాటకా దులన్రాముడుసాగువేళలటరాయిగనున్నయహల్యె సాక్షిగా
సోముని భక్తితోడుతను స్తోత్రము జేసి వరమ్ము లందితేనీమనుజాధముల్ కతన నే మరణమ్మును పొంద శక్యమాఆముని మ్రుచ్చులే యటుల నందురు వింతగు మాటలన్ని యారాముని పాదధూళి తల వ్రాతల మార్చునె? నమ్ము టొప్పునే?
మండోదరి తో రావణాసురుడు:
రిప్లయితొలగించండిఉత్పలమాల
సేమము గూర్చు వాడనుచు శ్రీరఘురాముని మెత్తురే సఖీ!
కోమలినిచ్చి నే శరణు గోర శుభమ్మని బోధఁ జేతువే?
భామను బొందెడున్ గతన వానరమూకను సాయమందెడున్
రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె? నమ్ము టొప్పునే?
మండోదరి తో రావణాసురుడు:
తొలగించండితేటగీతి
శరణువేడుచు జానకిన్ స్వామికొసఁగ
వంశనాశనమాగునన్ బలుకులేల?
పత్ని రక్షించుకోలేని వ్యర్థుడతఁడు
రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు?
దొంగ మునిని ప్రశ్నిస్తున్న ప్రజలు..
రిప్లయితొలగించండిఉ.
నీమము లేనిజీవనము,నింతుల తోడ నసభ్య చేస్ట లున్
క్షేమము గూర్చునంచు దన సేవకు లందరికిచ్చె ధూళినిన్
కామ కలాపముల్ సలుపు ఖర్పరు బుద్ధి నెరుంగు నాడు,ఔ
రా!ముని !పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే??
రాముని గూర్చి గొప్పగ సురారికి నాకును
రిప్లయితొలగించండిజెప్పుటొప్పునే
దామము వీడి కాననపు దారుల వెంబడి
దిర్గువాడు నా
నామము రావణుండని వినన్ భయ
మొందునట్టి యా
రాముని పాద ధూలి తల వ్రాతలు
మార్చునె నమ్ము టొప్పునే
రిప్లయితొలగించండిరావణుడశోక వనమేగి రమణి సిత
తో పలికెనిట్లు పాషాణమే పడతిగ
మారెనందువా? యెంతటి మాయమాట
రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు?
కాముకుడై చరించెడు మఖద్విషుడా వనమేగి యచ్చటన్
గోమలి జానకిన్ గనుచు క్రూరుడు పంక్తి ముఖుండు పల్కెనే
భామగ మారెనాయతని పాదము సోకగ పారటీరమే
రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె? నమ్ము టొప్పునే?
తొలగ జేసెను శాపము తూర్ణముగను
రిప్లయితొలగించండిరామ పద ధూళి : :. తలవ్రాత లేమి మార్చు
చదువు లీనాడటంచును చతురు లనగ
నిజము నిజమంచు ఘోషింత్రు నేటి వారు
గౌతముడహల్యను శపించె కర్కశముగ
రిప్లయితొలగించండిరామ పాదధూళి వలన రాయి మారె
నారిగా మునిశాపమె కారణమ్ము
రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు
మట్టి బాటన నడువగ మనుజుడెంత
రిప్లయితొలగించండిప్రవరుడైన , దుమ్ము యెగసి పడగ , నయ్యొ
రామ ! పదధూళి తలవ్రాత లేమి మార్చు
ననెదవు ! క నుల వెంబడి యంబువగును
రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె నమ్ము టొప్పునే?
రిప్లయితొలగించండిదీమసమిచ్చునట్టియభిధేయము రామునదీ జగంబునం
దామహనీయు పాదరజ మింతిగ రూపమునిచ్చె ఱాతికిన్
రాముని సచ్చరిత్రమిల రమ్యపథంబును జూపు నమ్మినన్
3వపాదం ప్రారంభంలో 'దీమహనీయుఁ' గా చదువ గోర్తాను
తొలగించండితేటగీతి.
రిప్లయితొలగించండికర్మ ఫలము దాటంగ శక్యంబు గాదు
రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు
యనుచు ప్రవచన కారుడు వినగ చెప్పె
సత్య మిదియేయనుచు నమ్మి జనులు వెడలె.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
ధీమహితుండు వాఁడనుచు దేవతలందరి రాజటంచు నీ
రిప్లయితొలగించండివే మది నమ్మి లంపటుఁడు, వేయికనుల్ గలవాఁడు, దొంగయై
నీమముఁ దప్పి క్రుమ్మరెడు నీచునిఁ గొల్చుట పాడి యౌనె సు
త్రాముని పాదధూళి తలవ్రాతల మార్చునే? నమ్ముటొప్పునే?
👌🏽🙏🏻
తొలగించండిరామ చరితము చూపును రమ్యపథము
రిప్లయితొలగించండిముక్తిధామము భవబంధ మోచకమ్ము
రామ పదధూళి తల వ్రాత లేమి మార్చు
నన్న మీమాంస విడనాడుడన్నలార
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపలుకు లింపుగ ధర్మమ్ము లొలుకు చుండు
తొలగించండిచేత లవియెల్లఁ బరికింప రోఁత లగును
సాధువు లనంగఁ జెలరేఁగు చపల హృదుల
రామ! పదధూళి తలవ్రాత లేమి మార్చు
కామ పరీత మానసులు కాలిడఁ గల్గునె పాల నార్థమై
భూమిని శాంతిసౌఖ్యములు పూరుషు లుందురె చింత లేక ధా
త్రీ మనుజాధినేతల ప్రవృత్తుల నేరమె స్వార్థ చింతనో
త్క్రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె నమ్ము టొప్పునే
[చింతనా + ఉత్క్రాముని = చింతనోత్క్రాముని]
రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు
రిప్లయితొలగించండిమార్చు తలవ్రాత తప్పక రామునిపద
ధూళి సందియము వలదు ధూపదీప
ములను ,నైవేద్య మిచ్చిన ముదమంది
యాయు రారోగ్య సంపద లీయు మనకు
రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే
రిప్లయితొలగించండిరాముని పాదధూ ళియెగద ఱాతిని నాతిగ మార్చె వెంటనే
రాముని పాదరే ణువులు రక్తిని శీర్షము నందు వేయుచో
సేమము గల్గు నెల్లరకు శ్రీలును గల్గును దప్పకుండగన్
రిప్లయితొలగించండిమార్చెకాననహల్యనుమానినిగను
*“రామ పదధూళి: తలవ్రాత లేమి మార్చు”*
స్వార్థ పరులైననేతలపలుకు ప్రజను
తీపిమాటలటంచును తెలియుడయ్య
మరొక పూరణ
*"రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే”*
నీమహి యంద టంచునిటు నిందను వేయుచు పల్క పాడియే
తామునుకానలందునను దండన చేయుచు తాటకా దులన్
రాముడుసాగువేళలటరాయిగనున్నయహల్యె సాక్షిగా
సోముని భక్తితోడుతను స్తోత్రము జేసి వరమ్ము లందితే
రిప్లయితొలగించండినీమనుజాధముల్ కతన నే మరణమ్మును పొంద శక్యమా
ఆముని మ్రుచ్చులే యటుల నందురు వింతగు మాటలన్ని యా
రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె? నమ్ము టొప్పునే?