3, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4298

4-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్”
(లేదా...)
“కర్ణుఁడు లోభియై మసలె క్ష్మాపతులందున భీరువాతఁడే”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ఆకెళ్ళ బాలభాను గారి సమస్య)

28 కామెంట్‌లు:


  1. స్వర్ణము నిచ్చు నృపాలుని
    వర్ణించిన యని తలంచి బట్రాజట తా
    వర్ణించెను మీ ముందా
    కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్.

    రిప్లయితొలగించండి

  2. వర్ణన చేయనా విరటు వారసు డుత్తరుఁ గూర్చి, కొంత యా
    కర్ణితమయ్యె నాకనుచు కయ్యము నాడదలంచి వచ్చినన్
    శీర్ణమనస్కుడై రణము జేయక పారెనటంచు పల్కెనా
    కర్ణుడు, లోభియై మసలె క్ష్మాపతులందున భీరువాతఁడే.

    రిప్లయితొలగించండి
  3. తూర్ణముగ వచించె నిటుల
    “కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్”
    నిర్ణీతిగ దీని జూచిన
    పూర్ణము గ నొక య వివేకి పోకడ యిదియే

    రిప్లయితొలగించండి
  4. కర్ణుని దానము శౌర్యము
    వర్ణన చేయంగ గురువు వటువిట్లనియెన్
    కర్ణాకర్ణిగ వింటిని
    కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్

    రిప్లయితొలగించండి
  5. కర్ణుని సాటి వీరుడును కర్ణుని మించిన దానశీలి, సం
    పూర్ణ దయార్ద్రచిత్తుఁడును భూతలమందున లేడటంచు తా
    వర్ణన చేయ దేశికుఁడు పాలసుఁడౌ వటువిట్లు తాననెన్
    కర్ణుఁడు లోభియై మసలె క్ష్మాపతులందున భీరువాతఁడే

    రిప్లయితొలగించండి
  6. పూర్ణ మెఱిఁగి యింద్రుని నిజ
    గర్ణ సుకుండలము లొసఁగి కలనున సమయన్
    నిర్ణయ మివ్విధిఁ దగునే
    గర్ణుఁడు భీరు వతి లోభి క్ష్మాపతు లందున్

    చూర్ణము సేయువాఁడ రిపు శూరుల నాజిని వేసి నారి నా
    కర్ణము లాగి నే శర నికాయము నం చని కౌరవేద్ధ సే
    నార్ణవ మగ్నుఁ డుత్తరుఁడె యారయ జిష్ణుఁడు స్యంద నాఖ్య నౌ
    కర్ణుఁడు లోభియై మసలె క్ష్మాపతు లందున భీరు వాతఁడే

    [యుద్ధ మొసఁగుటలో లోభియై]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. [స్యందనాఖ్య నౌకర్ణుఁడు = రథ మను నౌక చుక్కాను ధరించిన వాఁడు, బృహన్నల; జిష్ణుఁడు =అర్జునుఁడు]

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  7. నిర్ణయము గైకొనె నొకఁడు
    కర్ణుని వేషమును దాల్చ గాంచి వచింపన్
    వర్ణిoప గ. వాని గుణ ము
    కర్ణుడు భీరు వతి లోభి. క్ష్మా పతు లందున్

    రిప్లయితొలగించండి
  8. కందం
    అర్ణవసమ బలునిన్ సౌ
    వర్ణ కవచదాత యైన పాండవ వశమై
    వర్ణించెడు శల్యోక్తుల
    కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్!

    ఉత్పలమాల
    కర్ణకఠోర వాక్కులను గందరగోళమొనర్చె వేదిపై
    శీర్ణము సేసె పట్టణ ప్రసిద్ధుల ప్రేక్క్షకవాటి, దానశీ
    లార్ణవు ధీరునిన్, ప్రవచనంబున మార్చగ నీదు నేస్తుఁడున్
    కర్ణుఁడు లోభియై మసలె! క్ష్మాపతులందున భీరువాతఁడే?

    రిప్లయితొలగించండి
  9. డా బల్లూరి ఉమాదేవి

    కర్ణపు కుండలమ్ములవి. కాంతులు నీనుచు నుండ పుట్టెనీ
    కర్ణుడు పుట్టె కుంతికట ఖాతిని పోందెనుదానశీలిగా
    కర్ణుడు,లోభియై మసలె క్ష్మాపతులందున భీరువాతడే
    శీర్ణము చేయనెంచుచును జీవమె పోయె నురాజరాజు కున్




    రిప్లయితొలగించండి
  10. కందం.
    కర్ణాట దేశమందున
    కర్ణాకర్ణి విని యొకడు కథ భారతమున్
    కర్ణకఠోరముగ నుడివె
    కర్ణుడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  11. పూర్ణమసుండొసంగె వరపుత్రుని గుంతికి నాతఁడెవ్వడో
    కర్ణ సఖుండు మత్సరుఁడు కౌరవనాథుఁడు మెల్గెనెట్టులన్
    కర్ణుని వైరి సారథిగ కయ్యము నుత్తరుఁడెట్లొనర్చెనో
    కర్ణుఁడు, లోభియై మసలె, క్ష్మాపతులందున భీరువాతఁడే

    రిప్లయితొలగించండి
  12. కర్ణుని గూరిచి యిటులన
    కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్
    గర్ణకఠోరమ యాయెను
    గర్ణుఁడు సరితూగునార్య!కవ్వడి కెపుడున్

    రిప్లయితొలగించండి