2, జనవరి 2023, సోమవారం

సమస్య - 4297

3-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తనువు శాశ్వతము సుకీర్తి గన క్షణికము”
(లేదా...)
“కలకాలంబు శరీరముండును తటిత్కల్పంబు సత్కీర్తియే”

22 కామెంట్‌లు:


  1. స్వార్థము విడనాడి సతము పరుల మేలు
    గోరవలె బుద్భుదమె గదా క్షోణి యందు
    తనువు, శాశ్వతము సుకీర్తి గన, క్షణికము
    యౌవనమని యెఱుంగరే యల్పులిలను.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    జలగ వలెఁ బీల్చ పరులను జాలిలేక
    కర్కశుడనుచు నిందింత్రుఁ గాదె జనులు
    బ్రతుకు మూణ్ణాల్ల ముచ్చట రాలుననఁగ
    తనువు, శాశ్వతము సుకీర్తి, గన క్షణికము

    మత్తేభవిక్రీడితము
    జలగన్ బోలుచు బీలుచన్ బరుల నీచమ్మౌను లోకాన ని
    న్నిలవేల్పందురు తోటివారలకు నీవెంతేన్ సహాయమ్మిడన్
    నిలుచున్ నీ తదనంతరంబుఁ దలవన్ నీపేరు శేషంబనన్
    కలకాలంబు, శరీరముండును తటిత్కల్పంబు, సత్కీర్తియే!

    రిప్లయితొలగించండి
  3. జనన మందిన ప్రతి జీవి చచ్చు ననుచు
    తెలిసి యున్నట్టి మానవుల్. తలతు రెట్లు
    తనువు శాశ్వ తము సుకీ ర్తి గన క్షణిక ము లన్న మాటల సత్యము లందురు గద!

    రిప్లయితొలగించండి
  4. పుట్టినప్పటినుండి నా పొందు యయిన
    తనువు శాశ్వతము ; సుకీర్తి గన క్షణికము ,
    తలపులీరీతి గొనసాగు దరచుగాను
    దేహముపయిన నుండిన తీపియేమొ

    రిప్లయితొలగించండి

  5. అలనాడెప్పుడొ చెప్పిరే బుధులు మోక్షార్థుండు నిర్భాగ్యునా
    కలినేతీర్చి పరోపకారమను సత్కార్యమ్ము నే సల్పుమా
    కలకాలంబు, శరీరముండు తటిత్కల్పంబు, సత్కీర్తియే
    నిబుచున్ శాశ్వతమౌచు నీయిలనిదే నిక్కంబు నాలింపుమా!

    రిప్లయితొలగించండి
  6. సత్పథంబున పయనించి సత్యనిష్ఠ
    నాయుధమ్ముగా నిల్పుమున్నంతవరకు
    తనువు, శాశ్వతము సుకీర్తి, గన క్షణికము
    భోగ భాగ్యముల్ సుఖములు పుడమియందు

    రిప్లయితొలగించండి
  7. కలికాలంబున జీవకోటి వసుధన్ కామాది షట్కంబులన్
    వలలో చిక్కి నితాంతమైన భ్రమలో వర్తింత్రు వ్యర్ధంబుగా
    కలకాలంబు, శరీరముండును తటిత్కల్పంబు, సత్కీర్తియే
    నిలుచున్ చంద్రుడు చుక్కలున్నదనుకన్ నిక్కంబుగా నీభువిన్

    రిప్లయితొలగించండి
  8. కీర్తి నింపునె యుదరమ్ము నార్తి తీర్చి
    మాన్య! యున్నంత వఱకైన మానకుండ
    వీఁకఁ బోషింపు మింపుగ లేక యున్నఁ
    దనువు శాశ్వతము సుకీర్తి గన క్షణికము

    ఇలలో నొక్క దురాకృతమ్మున యశం బెల్లన్ నశించుం ద్రుటిం
    గల కాలం బన స్వప్న మెంతవఱకుం గన్పించు నా కాలమే
    లలితం బివ్విధిఁ జింత సేయ నరుఁ డుల్లం బందు నిక్కం బగుం
    గల కాలంబు శరీర ముండును దటిత్కల్పంబు సత్కీర్తియే

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి.
    తరచి జూడగ పంచభూతాత్మకమ్ము
    తనువు,శాశ్వతము సుకీర్తి,గన క్షణికము
    జీవితము ,హరి సేవలు తోవ జూపు
    జనన మరణ చక్రముల సంచార మాప.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  10. కలికాలంబిది తారుమారగు కుతర్కంబే మహద్వాణియై
    కొలువైరజ్ఞులె భాష్యకారులకటా కూపస్థమండూకముల్
    దలపంగా దగదిట్టి బోధనల వ్యర్థాన్వీక్ష గానెట్టులన్
    కలకాలంబు శరీరముండును తటిత్కల్పంబు సత్కీర్తియే

    రిప్లయితొలగించండి