20, జనవరి 2023, శుక్రవారం

సమస్య - 4213


21-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్”
(లేదా...)
“కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

38 కామెంట్‌లు:


  1. ఉ: ఎక్కడి యూరు మీయది ?యివెక్కడియెండలు ?తిండికూడ నే
    మెక్కగ లేక యుంటినిక మీ గృహ సీమకు దండమయ్య  నే
    నెక్కెద రైలుబండి వడినేగెద నీవును నన్నుగూడి రా....
    కుక్కను తాళలేననుచు యుగ్మళి పోయెను పుట్టినింటికిన్
    (ఇది నా అవధానం లో శ్రీ సత్యనారాయణ రెడ్డి గా రిచ్చిన సమస్య )



    రిప్లయితొలగించండి

  2. మిక్కిలి యెండలు గలవని
    పిక్కబెదరుచుంటినేను వేసవి యందున్
    ముక్కు బెదరెనని గేస్తున
    కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్.

    రిప్లయితొలగించండి
  3. మిక్కిలి త్రాగుచున్ సతము మేనును
    మర్చియు దిర్గు వానితో
    తిక్కగ మాటలాడుచును దేపకు తేపకు
    వాదులాడు పెం
    పెక్కిన క్రోధియౌ తనదు పెన్మిటి యర్పు
    సహించలేక యా
    కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్

    రిప్లయితొలగించండి
  4. దక్కెను భార్య యటంచును
    నిక్కుచు నను బెండ్లి యాడి నెగడి తివి కదా
    సృక్కితి నే బోయద నని
    "కుక్క ను సహియింప ననుచు యుగ్మలి పలికెన్ "

    రిప్లయితొలగించండి

  5. పెక్కుగ నెండలున్నవిట వేసవి యింకను చేరకుండనే
    ముక్కు స్రవించుచున్నదది బుక్కము నానుడు లాలకించు నే
    నిక్కడ నుండుటన్నదది యెంతటి కష్టమొ యడ్డుచెప్ప బో
    కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్.

    రిప్లయితొలగించండి
  6. కం:గ్రక్కున గౌగిలి జేర్చగ
    ప్రక్కన నున్న పతి యిష్ట పడ వేసవి లో
    ప్రక్కకు దొలగుము దరి రా
    కుక్కను సహియించ నంచు నుగ్మలి పలికెన్

    రిప్లయితొలగించండి
  7. ప్రక్కనగల పురము పయిన
    మక్కువ తోడ తమ నాట్యమండలి చేరన్
    నక్కడ నాట్యము సలుపుట
    కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్

    రిప్లయితొలగించండి
  8. మిక్కుటమగు నాతపమున
    కుక్కిరి బిక్కిరిగ తాపముత్కటమాయెన్
    సొక్కితి సోలితి నేనిం
    కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్

    రిప్లయితొలగించండి
  9. చక్కని విద్యుచ్ఛక్తికి
    గ్రక్కున గలుగంగ నంతరాయము చెమటల్
    మిక్కుటమై గాలిమొనయ
    కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్

    రిప్లయితొలగించండి
  10. మిక్కుటమైన తాపనము మేదినిఁ గమ్మిన నిండు వేసవిన్
    సొక్కితి సోలితిన్ తనువు శోషిలె వాయువు స్తంభనమ్ముతో
    నుక్కిరిబిక్కిరైతినిట నుత్కటమై చెలరేగె తాపమిం
    కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "మేదినిఁ గ్రమ్మిన" టైపాటు.

      తొలగించండి
  11. యెక్కడి కైనను బోదము
    స్రుక్కిన యది సాలు నింక సుందర తనువే
    పొక్కెను వెక్కసముగ నా
    కుక్కను సహియింప ననుచు నుగ్మలి పలికెన్

    [నాకు +ఉక్కను =నా కుక్కను]

    తిక్క సెలంగఁగా నపర దిక్కుల నున్న జనాలిఁ గాంచఁగా
    నెక్కటి వింత మచ్చునకు నిట్టివి భారత మందుఁ గాంతుమే
    పెక్కురు బోధ సేసినను బెన్మిటి మారక యున్న నింటి బొ
    గ్గుక్కను సైప లే ననుచు నుగ్మలి చేరెను బుట్టి నింటికిన్

    [బొగ్గు +ఉక్కను = బొగ్గుక్కను]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      (క్రింద అంత వివరంగా వ్రాసి కందాన్ని యడాగమంతో ప్రారంభించారెందుకు?)

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      యుగ్మలి శబ్దములో మునిఁగి. తమ తప్పులు తముకుఁ గనిపించ వందురు. దాని కిదే తార్కాణ మండి. ముద్రా దోషము.

      తొలగించండి
  12. 17 యకారంబును వు వూ వొ వో లును దెలుఁగుమాటలకు మొదట లేవు
    ఎవఁడు, ఎక్కడ, ఏమి, ఏల, ఉండ, ఊరు, ఒకడు, ఓడ, హరియతఁడు, నిద్రవోయె నిట్టిచోట్ల సంధి వశంబున వచ్చిన యకార వకారంబులుగాని పూర్వసిద్ధంబులు గావు. వోఢృ వోఢవ్య శబ్దములు దప్ప సంస్కృత సమంబులందు సహితము వు వూ వొ వో వర్ణాదులగు శబ్దంబులు లేవని యెఱుంగునది. ఉదకము, ఊర్మిక, ఓదనము.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదలి'ని 'ఒదలి' అనరాదు. "కౌగిలి విడి" అనండి.

      తొలగించండి
    2. చక్కని చుక్కను వల్లభు
      డుక్కిరి బిక్కిరి సలుపగ నొక్క ఉదుటనన్
      గ్రక్కున కౌగిలి విడి నిం
      కుక్కను సహియింప ననుచు యుగ్మలి బలికెన్
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటరు.
      ధన్యవాదాలు గురువుగారు.

      తొలగించండి
  14. కందం
    అక్కున జేరి సరసమున
    జిక్క చెమటఁ జింద మగడ! శ్రీగంధముగన్
    లెక్కించితె! గాలికుదర
    కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్

    ఉత్పలమాల
    అక్కున జేరుచున్ సరసమాడుచు నీ బిగి కౌగిలింతలో
    మక్కువఁ దీర్చుకొందువయ మానక చెమ్మట గంధమంచు నీ
    పక్కను జేర శీతలపు వాయువు వీచెడు మేటి కూర్పు లే
    కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్

    రిప్లయితొలగించండి
  15. మిక్కుటమవగా నెండయు
    నుక్కిరిబిక్కిరియగుచునునూర్పులు విడువన్
    ప్రక్కల గనిగాలియ రా
    *“కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్”*
    [మరొక పూరణ

    మక్కువతోడ వచ్చితిని మానస మందున తల్చి గొప్పగన్
    దక్కుసుఖంబులిచ్చటనుదండిగయంచునుపల్లెవీడుచున్
    ఎక్కడిపట్నవాసమిదిఎక్కిన మేడనుపిల్లగాలిలే
    *కుక్కను సైప లేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్”*

    రిప్లయితొలగించండి
  16. జక్కవగొంగయే తనకు చక్కని భర్తగ దక్కెనంచు దా
    మిక్కిలి సంతసంబటుల మెక్కొనగా జనె మెట్టినింటికిన్
    మిక్కుటమైన యెండలట మే గమలించగ బిక్కజిక్కెనిం
    కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ఎక్కువ మద్యమున్గొనుచు నిట్టును నట్టును దూలుచుండుచున్
    గక్కులు గక్కుచున్మిగుల గంపర మొందగఁదిర్గుచుండుచున్
    నిక్కడ దూలు నామగడు యెక్కడి న్యాయము?చాలు నింక యీ
    కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్

    రిప్లయితొలగించండి
  19. మిక్కుటమౌ యెండల కా
    ప్రక్కన చల్లని విహార ప్రాంతము లేకన్
    సృక్కుచు సోలుచు నట దన
    కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్

    రిప్లయితొలగించండి