21, జనవరి 2023, శనివారం

సమస్య - 4214

22-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆఁకలి యని కేక లిడఁగ రోఁకలి నిడె”
(లేదా...)
“ఆఁకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను రోఁకలిన్ కటా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో రంగరాజు పద్మజ గారి సమస్య)

25 కామెంట్‌లు:

  1. కసిడి దినముల నుండియు గాతి దినక
    యాకలి యని కేక లిడఁగ ; రోఁకలి నిడె
    వెలది , తండులముల దోడ , పిండి జేసి
    దినుసులను వండి యాకలి దీర్చగోరి

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. తేటగీతి
      తల్లి చుక్కాకు పచ్చడి దంచుచుండ
      నాగలేనమ్ము నేనంచు నరుగుదెంచి
      దుహిత యన్నము దిననెంచి తొందరించి
      యాకలి యనికేకలిడగ రోకలినిడె!

      ఉత్పలమాల
      ఆకుల వడ్డనంబిడగ నన్నము నొక్కటె సిద్ధమయ్యె చు
      క్కాకును దెచ్చి పచ్చడిగ నందున నంజగ దంచు చుండగన్
      నాకిక వల్ల కాదనుచు నందన పర్గులఁ దొందరింపుతో
      నాఁకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను రోఁకలిన్ కటా!

      (ఎంత తొందరగా పచ్చడి దంచుకొని తింటావో తినమని బిడ్డకు రోకలి నొసంగెనని అన్వయం)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. ఆఁకలి యని కేక లిడఁగ రోఁకలి నిడె
    వడ్లు దంచిన బియ్యము వచ్చు ననుచు
    దంచి యిచ్చిన బియ్యము తాను వండి
    మాకు వడ్డించె సత్వర మన్నపూర్ణ

    రిప్లయితొలగించండి
  4. చీకటి యావరించినది జీవిత మందున
    లేదు కాంతియున్
    ఆకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను
    రోకలిన్ కటా!
    మేకొని వడ్లు దంచుమని మీరిన దు:ఖము
    తోడ బిడ్డకున్
    ఈ కడగండ్లు పేదలకు నెప్పుడు దప్పవు
    భారతావనిన్.

    రిప్లయితొలగించండి
  5. అమ్మ నే తాళ లేనని సొమ్మసిల్లి
    యాకలి యని కేక లిడగరోకలి నిడె
    తల్లి దంచంగ రోటి లో నుల్లి వేiసి
    పచ్చడి ని చేయ గను బూనె బాలుని కని

    రిప్లయితొలగించండి
  6. ఆఁకొనినట్టి బిడ్డడికి
    నచ్చటనేమియు కానరావు తా
    జేకొని భోజనమ్మిడను
    చిక్కులజిక్కిన యింట జూడగన్
    శాకముగూడ లేదనుచు
    ౘాల మనంబున చింతజేయ నా
    కాఁకలి యంచు కేకలిడ
    నమ్మ యొసంగెనురో! కలిన్ కటా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రోఁకలి'లోని అరసున్నను ఏం చేద్దాం?

      తొలగించండి
  7. శ్రీకర! శ్రీనివాస! గుడిసెన్ బ్రతు కీడ్చుచు నుంటిమిత్తరిన్,
    వేకువ నిద్రలేచితిని విద్యగడింపగ వేళయయ్యె, నే
    రూకయు లేదు నా కిడగ, లోకమెఱుంగని బాలు నౌటచే
    యాఁకలి యంచు కేకలిడ, నమ్మ యొసంగెనురో! కలిన్ కటా!.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రోఁకలి'లోని అరసున్న ఎటు పోయింది?

      తొలగించండి
  8. భార్య గయ్యాళిదైనను బాధ యెంతో
    చెప్ప వశమది కాదందు చెలియలార
    ధత్రమందున్న వడ్లను దంచమంచు
    నాకలి యని కేక లిడఁగ రోఁకలి నిడె.


    నాకుడు చెప్పుచుండె తన నాయన తోడ వ్యళీక మందునన్
    మేకలగాయ బోయితిని మెండగు నెండన తిర్గి వచ్చితిన్
    ప్రాకటమైన చల్దియది పాసినదంచును పస్తునుంటి నే
    నాఁకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను రోఁ! కలిన్ కటా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'రోఁకలి'లోని అరసున్నను విస్మరించారు.

      తొలగించండి
  9. రూకలులేని పేదలకు లోకమునందున నన్ని కష్టముల్
    మూకలుగా చెలంగియనుమోదమునున్ హరియించు చుండు నే
    నాకలికోర్వలేక కడుపారగ గ్రోలగ గంజి నీటికై
    ఆఁకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను రోఁకలిన్ కటా

    రిప్లయితొలగించండి
  10. అన్నమునకుఁ గా దిది సమయమ్ము గాన
    నఱవ కుండఁ దినుండని యందఱకును
    బంచదారతోఁ జేసిన పాటవంపు
    టాఁకలి యని కేక లిడఁగ రోఁకలి నిడె

    ఆఁకలి మాట దేవుఁడు నిజాత్మనెఱుంగుఁ జెలంగెఁ గష్టమే
    వీఁకను దంచు మంచును వివేకము తోడుత నెల్ల నూకలం
    గూఁకలు సైపఁ జాలక స కోపము దా విన నన్య రీతిగా
    నాఁకలి యంచు కేక లిడ నమ్మ యొసంగెను రోఁకలిం గటా

    రిప్లయితొలగించండి
  11. ఆకలెరింగి బిడ్డ కడుపార భుజింపగ నున్నదంతయున్
    మూకొనకొక్క ముద్దయును మోదముగా నిడి తృప్తినొందునే
    లేకిగ బల్కరాదిటు లరిష్టపు మాటలు కట్టిపెట్టుమె
    ప్డాకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను రోఁకలిన్ కటా

    రిప్లయితొలగించండి
  12. తనయులేడ్చుచు తపనతో దరికిచేరి
    నాకలియనికేకలిడగ రోకలినిడె
    త్వరితగతినమీరలు వడ్లుదంచినంత
    వండి వార్చెదమీకనె వడిగనమ్మ

    రిప్లయితొలగించండి