14, జనవరి 2023, శనివారం

దత్తపది - 192

15-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
'కల - తల - వల- వెల'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
సంక్రాంతి సంబరాలపై
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. తే.గీ. స*కల* ధాన్యముల్ నిండి కర్షకులు మురియ
    *తల*పులందునఁ గొంగ్రొత్త కలలు మెరియ
    *వల*సినంత సంతృప్తి సంబర మొసంగ
    పిల్లలం గూడి జంట కో*వెల*కుఁ జనియె.

    రిప్లయితొలగించండి

  2. కలకంఠుల ముగ్గులవియె
    వెలయించెను మానసముల, వినిపించెనటన్
    వలమురి తాలుపు నామము
    తలచుచు తిరుగాడెడి హరిదాసుల పాటల్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    అల్లుళ్ల రాకల ముదము,
    కోళ్లకు పందెములు, పంటకోతల సిరి, గొ
    బ్బిళ్ల వలచు ముగ్గుల జవ
    రాళ్లును సంక్రాంతి సంబరాలుగ వెలయున్

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి.
    స కల పంటల సారము సందడించ
    విం తల వి జూపు వృషభమ్ములంత వెలుగ
    కో వెల లన సందడిజేసి కూడిరంత
    జనులు సంక్రాంతి సంబురాలన వల గొని
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.
    వలగొనుట-ప్రదక్షణ

    రిప్లయితొలగించండి
  5. కం.
    *కల*తల బాపెడి పండుగ
    *తల*పించును కర్షకునికి ధాన్యపురాశుల్,
    *వల*చిన సంబరమంతయు
    *వెల*యును సంక్రాంతి నాడు వేడుక తోడన్

    రిప్లయితొలగించండి
  6. సకల జనులెల్ల బాల్గొని సంబరమున
    తలచి వేసిన ముగ్గుల విలసి తముగ
    ముంగిటను వెలయును గదా మురిప మలర
    క్రొత్త జంటల వలపుల కూర్మి మించు

    రిప్లయితొలగించండి
  7. పండుగదినము కోవెల ప్రాంగణమున
    జేరి యుండి , తలచితిని జియ్య నర్చ
    జేయ , దానికి వలయు రసీదు కొరకు
    చేతిని గల రూకల నిడ సిద్థి జరిగె

    రిప్లయితొలగించండి
  8. తే. గీ.

    కోవెలను జేరగ వలపు, క్రోధి బయట,
    కలతలను రేచు సంక్రాంతిఁ గయ్య మంచు
    కోడి పందెముఁ గలకల కూతలుండు
    వెలయు నూతన వస్త్రముల్ వేడి తలపు.

    రిప్లయితొలగించండి
  9. స"కల" బంధువుల నడుమ సంబరమ్ము
    వెలువరించెడు "తల"పుల కలకలమ్ము
    "వల"సిన విషయ చర్చల పరవశమున
    శాంతి సౌఖ్యమ్ము "వెల"యు సంక్రాంతి వేళ

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల:
    చిలు*కల*కొల్కి వేకువనె చేరెను ముంగిట ముగ్గులేయగన్
    *వల*చినవాని శ్రేయమును వావిరిగా మదినెంచి ప్రేమతో
    *తల*పులలోన నుల్లసము తద్దయు నిండఁగ పర్వమందు కో
    *వెల*కడకేగి పూజలను వేడుకగా నొనరించె భక్తితో

    రిప్లయితొలగించండి
  11. కలఁతలు దీర్చి ప్రజకు భూ
    తలమున భాస్కర వలయము తద్ద శుభమ్ముల్
    వెలయం జేయును గిరణా
    వలితో సంక్రాంతి మకర పదసంప్రాప్తిన్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కలతలు మాపుజేయుచును కర్షకులింటను పంటధాన్యముల్
    వెలయగనుండు నీదినము ప్రీతినిగూర్చి సుఖమ్ములిచ్చుచున్
    తలపులలోన నవ్యమగు తత్త్వములొందగజేసి నెల్లెడల్
    వలపుల బంధముల్ నిలుపు పండుగ, పొంగటి పండుగేకదా!

    రిప్లయితొలగించండి
  13. డా. బల్లూరి ఉమాదేవి

    గాదె లెల్ల నిండ *కల*త లెల్లయు తీర
    ధనము చేతికందె *తల*చి నంత
    కో*వెల*దరిచేరి కొబ్బరి కాయను
    కొట్ట*వల*యునంచు కోరె మదిని


    డా బల్లూరి ఉమాదేవి
    మరొక పూరణ
    స*కల* శుభములొసగు సంక్రాంతి యరుదెంచ
    *తల*చినపనులయ్యె త్వరితగతిన
    *వల*సినట్టివెల్ల వాసిగా కొనితెచ్చి
    వేడ్కతోసలిపిరి *వెల*దులింట

    రిప్లయితొలగించండి
  14. కలకల లాడుచు పల్లెల
    తలచుచు సంక్రాంతి లక్ష్మి తద్దయు లలితో
    వెలయ గృహమ్ములు పంటల
    వలయు నపూపముల గొనుచు వఱలుదురు ప్రజల్

    రిప్లయితొలగించండి
  15. మరొక పూరణ

    నెల*తల*ముగ్గులన్గనగ నెమ్మిని నచ్చెరు వందుచున్జనుల్
    *వెల*వెలబోయెతారలనవిస్మయమూనుచువేగపల్కుచున్
    *కల*రుకళాభిమూర్తులనికాంతలనెల్ల నుతించు చుండగా
    *వల*యముగానుతిర్గుచును వాసిగపాడిరి గొబ్బి పాటలన్









    రిప్లయితొలగించండి