7, జనవరి 2023, శనివారం

సమస్య - 4302

8-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్”
(లేదా...)
“అన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ముద్దు రాజయ్య గారి సమస్య)

44 కామెంట్‌లు:

 1. కందం
  ఎన్నియు రుక్మిణి కృష్ణుని
  మన్ననఁ గమలాక్షుఁజేరి మందిరము కడన్
  గ్రన్నన సోదరుఁడల వ
  ద్దన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   ఎన్నియు బాపనిన్ బనిపి యిష్టము జూపుచు కృష్ణమూర్తిపై
   మన్నన మందిరమ్ముకడ మానిని నందెద రాక్షసమ్మునన్
   గ్రన్నన రమ్మనన్ గదలి రాగనె, రుక్మిణి సోదరుండు వ
   ద్దన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 2. ఎన్నగ సద్గుణ శీలుడు
  కన్నడ దేశస్థుడైన కరుణామయుడం
  చన్నలిరువురెంతగ వ
  ద్దన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్.

  రిప్లయితొలగించండి

 3. కున్నె యటంచు స్తన్యమిడు కోమలి పూతన గూల్చె శార్వరుల్
  వెన్నను దొంగిలించె నలివేణుల చేలములన్ హరించెనా
  కన్నడు దుర్విదగ్దుడని కాంతకు జెప్పుచునన్న రుక్మి వ
  ద్దన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్.

  రిప్లయితొలగించండి
 4. గ్రన్నన శివ ధనువు వి ఱ చ
  మన్నన తో గాంచి సీత మరులును గొనుచున్
  జెన్నగు వలపు న నా రా
  మన్నను బెండ్లాడె నతివ యందరు మెచ్చ న్

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మిన్నగు గుణములు కలిగియు
  మన్ననతో సాటివారి మనసులు దోచే
  తెన్నును గూడెడి యా పె
  ద్దన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 6. కొన్ని నెలవులందు నెఱిగ
  మన్నన నొందె దన మేనమామను పతిగన్
  నెన్నగ , గాన తన జనని
  యన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పతిగా నెన్నగ" అనండి. తల్లికి అన్న అంటే వయోవ్యత్యాసం ఎక్కువగా ఉంటుందేమో?

   తొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మిన్నగు శీలమున్ గలిగి మెల్పగు పోడిమితో వెలుంగుచున్
  మన్ననగూర్చుచున్ పరుల మానసముల్ నలరించుచుండునౌ
  తెన్నునుగూడు విశ్రుతుడు తీరున దోరెడి యున్నతుండు పె
  ద్దన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మానసముల్ + అలరించు' అన్నపుడు నుగాగమం రాదు.

   తొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   కందంలో 'అన్నులమిన్నయె జానకి...' అనండి.
   వృత్తంలో 'విలసిల్లువాడు నాపన్నుల... యజ్ఞరక్షకై పెన్నిధి...' అనండి. (రక్షణా పెన్నిది... దుష్టసమాసం)

   తొలగించండి
  3. సవరణలతో...


   అన్నుల మిన్నయె జానకి
   కన్నుల ముందఱ నిలిచిన కమలాక్షుని కన్
   గొన్నది పరవశయై రా
   మన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

   అన్నుల మిన్నకున్ దగిన యందము తోవిలసిల్లు వాడు నా
   పన్నులఁ గాచి వారలకు బాసటయై ఘన యజ్ఞరక్షకై
   పెన్నిధియైనవాడు రఘు వీరుడు లక్ష్మణ సోదరుండు రా
   మన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

   తొలగించండి
 9. అన్నులమిన్న రుక్మిణి మురారిని బ్రీతి వరించి భక్తితో
  బన్నుగ లోదలంపు దెలుపన్ దగ బంపగ బ్రాహ్మణోత్తమున్
  విన్నపమెంచి మాధవుడు వేగమె చేకొనినంత యన్న కా
  దన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 10. కన్నుల పండువ ౘూఁడను
  అన్నున రుక్మిణి గ్రహించి హరి కుడిచేతిన్
  వెన్నడికొను సోదరుడు వ
  ద్దన్నను బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

  చివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. 'వెన్నడికొను' ? సవరించండి.

   తొలగించండి
 11. క్రన్నన నీశుని చాపము
  చెన్నుగ సంధించి విరిచి సీతమ్మ మదిన్
  మిన్నగ దోచిన రఘురా
  మన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 12. వెన్నుని రూపుతోడుతను వేడుకఁ గూర్చుచు చెంగలించుచున్
  మన్నన జేసి యొజ్జను నుమాపతి విల్లును పట్టి యెత్తగా
  క్రన్నన భేదిలన్ ధనువు, కాంచుచు మోదముతోడ మించి రా
  మన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 13. కం.
  దన్నును విల్లును విరిచిన
  పున్నమి చందురునిబోలు పురుషోత్తమునిన్
  మన్నన సేయగ నా రా
  *మన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్*

  ఉ.మా.
  వెన్నెలరేని తీరుగను వెల్గుల బంచెడి రామచంద్రుడే
  దన్నును జూపి విల్లుగొని తత్క్షణమందున నెక్కుపెట్టగన్,
  మన్ననసేయ డెందమున,మాలను వేయుచు బ్రీతినొంది, రా
  *మన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్*

  రిప్లయితొలగించండి
 14. మన్నించి తరళ లోచన
  తన్ను వరించె నని పద్మ దళ నిభ నయనుం
  గ్రన్నన వరించి నెచ్చెలి
  యన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

  కన్నల కింపు గొల్ప జనకప్రభు ముద్దుల పట్టి దేవతా
  సన్నిచయంబు డెందముల సంతస మంద నభస్స్థలమ్ములో
  నన్నుల మిన్న సీత వనజాయత పత్ర నిభాక్షి వీరు రా
  మన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 15. క్రన్నన శైవచాపమును రాఘవుఁడెక్కిడ బోవునంతలో,
  యన్నులమిన్న మైథిలికి హ్లాదమెసంగగ, భంగమొందగన్
  బన్నుగ మాలచేతగొని పావని యుల్లము పల్లవించ రా
  మన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "... నంతలో నన్నులమిన్న" అనండి.

   తొలగించండి
 16. మన్నన బొందినట్టి ఘన మాన్యులు రాజులు
  చూచుచండగా
  చెన్నుడు గార్ముకంబు విరచెన్నవలీల
  సభాముఖంబునన్
  కన్నియ యందెగత్తె కలకంఠి మహీసుత
  గాంచి శ్రేష్ఠ రా
  మన్నను బెండ్లి యాడె సుగుణాంబుది
  బంధువులెల్ల మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 17. కం:అన్నగరమ్మున నాయకు
  డన్న ,ధనికు డన్న గాని యామె జనకుడే
  యన్న యహము నొందక మా 
  యన్నను   బెండ్లాడె నతివ  యందరు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 18. జన్నము గాచి గాధి సుతు సంతస మందగ జేసి మౌనిచే
  సన్నుతులందుచున్ శిలను చానగ దీర్చియు నీశు జాపమున్
  జెన్నుగ ద్రుంచ సీత యట చిన్మయుడా యవతారమూర్తి రా
  మన్నను బెండ్లి యాడెను సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చగన్!

  రిప్లయితొలగించండి
 19. ఉ:"అన్న పురోహితుండు,మరి యాస్తి యొకింతయు గూడ బెట్ట లే"
  దన్నను,"వేదవిద్య తన యాస్తి" యటన్నను,"భక్తపాలకుం
  డ న్నరసింహుడే తమకు నండ" యటంచు ధనము లేని రా
  మన్నను బెండ్లి యాడె సుగుణాంబుధి బంధువు లెల్ల మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 20. చెన్నగు నీశుని ధనువును
  గ్రన్నన సంధించి విఱువ కనుగొని యంతన్
  చెన్నుగ నుండిన యారా
  మన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 21. డా బల్లూరి ఉమాదేవి
  పిన్నతనమునుండివినుచు
  కన్నని కథలను వలచెను గాఢముగాతా
  నన్నయుయా కృష్ణునికా
  దన్నను బెండ్లాడె నతివ యందురు మెచ్చన్


  రిప్లయితొలగించండి
 22. చెన్నగు రూపుతోడ విల సిల్లెడు వాడును నీలదేహుడున్
  క్రన్నన నీశుచాపమును ఖండనఁజేయుటఁగాంచి మోదయై
  మిన్నగు శౌర్యవంతుఁడును మృత్యువు బారిని రక్షఁజేయు రా
  మన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి