13, జనవరి 2023, శుక్రవారం

న్యస్తాక్షరి - 77

14-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
భోగిమంటను గురించి ఉత్పలమాల వ్రాయండి
1వ పాదం 1వ అక్షరం 'భో'
2వ పాదం 2వ అక్షరం 'గి'
3వ పాదం 10వ అక్షరం 'మం'
4వ పాదం 17వ అక్షరం 'ట'

33 కామెంట్‌లు:

 1. "భో"గముయన్న తల్చినను మోక్షమె, బాగుగ పూర్వజన్మలో
  దా"గి"న కర్మశేషముల దగ్ధము చేసేడి జ్ఞానజ్యోతియై
  మాగిన పాత వస్తువుల "మం"చిగ దగ్ధము చేతుమిందులో
  భోగియె జ్ఞాన సంపదను పొందుట కౌనగు నా"ట"పట్టుగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భోగము + అన్న' అన్నపుడు యడాగమం రాదు. "భోగమటంచు దల్చినను" అనవచ్చు. 'జ్ఞానజ్యోతి' అన్నపుడు 'న' గురువై గణభంగం. "జ్ఞానతేజమై" అనవచ్చు.

   తొలగించండి
  2. "భో"గమటంచు తల్చినను మోక్షమె, బాగుగ పూర్వజన్మలో
   దా"గి"న కర్మశేషముల దగ్ధము చేసేడి జ్ఞానతేజమై
   మాగిన పాత వస్తువుల "మం"చిగ దగ్ధము చేతుమిందులో
   భోగియె జ్ఞాన సంపదను పొందుట కౌనగు నా"ట"పట్టుగా

   సరిచేశాను గురువుగారు 🙏 తెలియజేసి నందుకు ధన్యవాదములు గురువుగారు

   తొలగించండి
 2. గురుదేవులకు కవిమిత్రలందరికీ భోగిపర్వదిన శుభాకాంక్షలతో....

  ఉత్పలమాల
  భోగికి పంటలున్ గృహపు ముచ్చట దీరగ నింప ధాన్యమున్
  దాగిన చింతలన్ రగులు దారువు జ్వాలల గాల్చు పర్వమిం
  పౌగద! భావి జీవితము మంటల వెల్గులనూహలద్దుచున్
  స్వాగత మంచు సంక్రమణ భానుని మ్రొక్కరె మింటగాంచుచున్

  రిప్లయితొలగించండి

 3. భోగి యనంగ సంక్రమణ ముందటి రోజది వేడ్కతో జనుల్
  బేగిన నిద్రలేచి తమ వేశ్మము నందున మూలనుండెడిన్
  మాగుపదార్థరాసులను మంటల కర్పణ జేసి కాల్చుచున్
  రాగుని స్వాగతింత్రు మకరమ్మును జేరగ నాటపాటతో.

  రిప్లయితొలగించండి
 4. భోగ విలాస పర్వమని పొంగులు వారెడు సంబరమ్ము తో
  భోగి దినమ్ము వచ్చె నని మోదముతో దమ యింటి ముంగిటన్
  మాగియు కుళ్ళి పోయినవి మంటలలో మసి చేయ బూని యున్
  పోగులు జేసి కాల్చియును బూడిద సేయఁగ నుత్స హించ రే!

  రిప్లయితొలగించండి
 5. నాలుగవ పాదం చివర బూడిద సేయఁగ మంట వేయరే అని సవరణ చేయడమైనది

  రిప్లయితొలగించండి
 6. భోగము భాగ్యమున్ గలుగు ముచ్చట తీరుట సాధ్యమౌగదా
  భోగికి చూడనౌను సరి పోడిమి నిచ్చెడు రంగవల్లులన్
  మా గృహవీధిలో రగులు మంటల వెచ్చని సౌఖ్యమందుచున్
  రాగము లాలపింతురు విరామము నొందుచు తేటతెల్గులో

  రిప్లయితొలగించండి
 7. ‘భో’ గము నిచ్చి పాతవగు పూర్వులు వాడిన బల్లల న్నిటిన్
  వీ’గి’నకాళ్ళతోడగల పీటను
  ముక్కలు చేసి వా టినిన్
  మాగుడు వారిన ట్టిదగు ‘మం’చము
  బాగుగ నున్నదై ననున్
  వేగమె వాటి నన్నిటిని వేసెద
  పండుగ మం’ట’లందునన్

  రిప్లయితొలగించండి
 8. భోగి మహోన్నతమ్ముగను భోగ కరమ్మని యెంచి నెమ్మదిన్
  దాఁగిన కట్టె లన్నిటినిఁ దద్ద రగిల్చి జయింత్రు శీతలం
  బాగక విష్ణుచిత్తజ సమంచిత చిత్త వరించి విష్ణునిం
  దూఁగుచు భర్తృ వక్షమునఁ దుష్టిఁ జెలంగుచు నుంట వింటిమే

  రిప్లయితొలగించండి
 9. భోగి సుపర్వమందు పెనుపొందును గావుత భోగభాగ్యముల్
  లోగిలులందు ముగ్గుల విలోకము గూర్చు మనోవికాసమున్
  మైగలులట్లు కూడలుల మంటలు వేయుచు కోడెకాండ్రు సం
  వేగమునొందుచున్సలుపు వేడుక కన్నులపంటయే యగున్
  (మైగలి=శూరుడు)

  రిప్లయితొలగించండి
 10. ఉత్పలమాల.
  భోగికి పూర్వపాపములు పోవగ భావన జేత దల్చుచున్
  మాగిలి గడ్డి కుప్పవడ మంచిగ కాల్చుచు,కాగు నీళ్ళ తో
  మాగుడు తానముల్ సలిపి మంగళ దాయక దేవతాస్తుతుల్
  బాగుగ పాడి మొక్కెదరు భాస్కర దేవుని మింట చూచుచున్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 11. భోగవిరాజిత ప్రభల
  ముంగిళులందున రంగవల్లికల్
  భోగి శుభప్రదంబనుచు
  పొంగలి జేయుదు రీ దినమ్మునన్
  మాగని క్రొత్తబియ్యమును
  మంచిగ నర్సెలు సక్కినాలతో
  రాగిలు ధాన్యరాసులును
  రైతుల పాలిటి వాటమౌ నహో!


  వాటము=భాగము, వెలుగు

  రిప్లయితొలగించండి
 12. భోగి దినమ్ములో నెదను పుణ్యము గోరుచు భక్తి తోడుతన్
  భోగి ని పేరుగా నిడుచు, పొంచిన కామము క్రోధ లోభముల్
  మా గమనమ్మెదుర్కొనక మంటల వేసి దహింపఁజేయగా
  వేగ మనమ్మునన్ దలచి ప్రీతి భజించెడి బాట సాగెదన్!

  రిప్లయితొలగించండి
 13. ఉ. భోగి కి మంటలెత్తినవి భోగి ని నాల్కల జూపి యాడగా
  రాగిల జేయదే యికను రాగల కాలము మానసమ్ములన్
  మాగిన వృద్ధులందరును మంటల ముందర వెచ్చగాగుచో
  నాగడె భీష్ముడింతకును నారవి మారెడు పూటకోసమై.
  కడయింటి కృష్ణమూర్తి..గోవా. 14-1-23

  రిప్లయితొలగించండి
 14. భోగియు, కర్మయోగియును, భూమిజనాళికి దోచుదైవమౌ
  రాగిలు సూర్యు దేవుడొగి ప్రాగ్దిశ నం దుదయించువేళలో
  మైగొని యడ్డగించునని మంచుతెఱల్; గొని కట్టె,కొమ్మలన్
  వేగమె కర్షకోత్తములు వేసిరి శోభగ మంటలత్తరిన్

  రిప్లయితొలగించండి
 15. భోగము భాగ్యముల్ బడసి భూమి జనాళి ప్రమోదమందగా
  భోగి శుభంబుగా నమరె ముంగిట రంగుల రంగవల్లులన్
  మాగిలి పైరులన్ సిరుల మంజుల మంగళ తోరణంబులన్
  స్వాగత హేలగా మకర సంక్రమణంబున నాట పాటలన్

  రిప్లయితొలగించండి